త్రికోటీశ్వర చరిత్ర -4
సాలంకయ్యచివరి కధ
రోజూ కూతురుకోసం వెదకటం వలనసాలంకయ్య తన సంగాతిజంగామముని చెప్పలేక పోయాడు .ఒక రోజు బ్రహ్మ శిఉకొంతున్నాను శిఖరం ఎక్కి అక్కడ గుహలో ఆనంద వల్లి వెంట వచ్చిన యతీన్ద్రుడైన జ౦గమ శివుడు కనిపించగా ఆయనే ‘’మీ ఇంట్లో నేను ఆతిధ్యం పొందాను .తర్వాత రుద్రా శిఖరానికి వచ్చి మీ అమ్మాయికి దర్శనమిచ్చి ఆమె వ్రతం పూర్తీ చేయించాను .నేను శివుడను ఆమె నాలో ఐక్యమైంది .నేను ఇక్కడే ఉండిపోవాలని అనుకొంటున్నాను కనుక నువ్వు ఈ గుహపై ఒక గుడికట్టి త్రికోటీశ్వర లింగం ప్రతిష్టించి,పూజిస్తూ శివరాత్రి నాడు ఓంకార నదిలో స్నానం చేసి ,నాకు అభిషేకం పూజాదులు చేసి ,ఉపవాసం జాగరణ చేసి ,ప్రభలు కట్టించి ,వీరంగాది వాద్యాలతో ఉత్సవాలు,దాన ధర్మాలు చేసి ,మర్నాడు అన్నదానం చేయి .శివైక్యం చెందుతావు ‘’అని చెప్పాడు .ముందుగా గొల్లభామ ను దర్శించి తర్వాత నా దర్శనం చేయాలి ఇదీ నియమం.గొల్లభామకు గుదికటి ఆమె విగ్రహం ప్రతిష్టించి నిత్య పూజ జరిపించు ‘’అని ఆనతిచ్చాడు .అలాగే చేస్తానని చెప్పి తనకు శివైక్య సంధాన స్థితి బోధించమని కోరగా అనుగ్రహించి అంతర్ధానమయ్యాడు .
సాలంకయ్య శివానుగ్రంతో త్రికోతీశ్వరస్వామికి గొల్లభామకు గుడులు కట్టించి ప్రతిష్టించి ,వారి మహిమలు బోధిస్తూ శివరాత్రి ప్రభలు కట్టించి ఆనందం గా ఉత్సవాలు జరిపిస్తూ కొండకు వెలుగు తెచ్చాడు .పూజా కాలం లో ఆయనకు సిద్ధుల దర్శనమయ్యేది .ఇంట చేసి శివుడికి కల్యాణం లేకపోవటం ఏమిటని.కొతీశ్వరాలయానికి ఒక కోవెల కట్టించి అందులో పార్వతీ దేవి ప్రతిష్టించా లని అనుకోగానే అశరీర వాణి’’ఇది బ్రాహ్మ చారి దక్షిణా మూర్తి క్షేత్రం .కల్యాణం పనికి రాదు ‘’అని చెప్పగా సరే అని ,మళ్ళీ పార్వతి విగ్రహం చేక్కిస్తే ,అది అకస్మాత్తుగా మాయమైంది .విరక్తుడై దేహ త్యాగం చెంది శివైక్యం చెందాడు .సాల౦కుడు ప్రతిష్టించిన శాలంకాయ లింగమే ఇప్పుడు త్రికోతీశ్వరుగా పూజల౦దు కొంటోంది.ఆయన తమ్ములు ముగ్గురు బ్రహ్మ విష్ణు మహేశ్వర లింగాలుగా వెలిశారు .అందుకని ఈ క్షేత్ర పంచ బ్రహ్మ స్థానం అయింది .ఇక్కడికి త్రిమూర్తులు ,అష్ట దిక్పాలకులు సమస్త దేవతలు వచ్చి స్వామి దర్శనం చేసుకొని ,పూజించి దేవోత్సవం చేసి వెడతారు .శ్రావణం లో రుద్రా శిఖర౦ ,కార్తీకం లో విష్ణు శిఖర౦ ,మాఘం లో బ్రహ్మ శిఖర౦ పై నిల్చి అర్చించి అన్నదానం చేస్తే మోక్షమే .
కోటప్ప కొండ తిరునాళ్ళ ప్రభలు
మన దేశం లో ఈశ్వరార్చన లో ప్రభలు ,అమ్మవారి పూజలో కుంకుమ బండ్లు కట్టటం మొదటి నుంచీ ఉంది కారణం పెద్దగా ఎవరికీ తెలీదు . వెదురు కృష్ణుడికి ఇష్టం ,పూజనీయం కనుక దానికి వస్త్రాలతో లింగాకారం గా మార్చి సేవిస్తే మంచిది అని శివ పురాణం లో ఉంది .ఇది నిజమే అని ఆరాధ్యులు ఒప్పుకొన్నారు.తూర్పు దేశాలలో శివుడికి ప్రభ ను వాహనం గా చేసి ,దానిపై అనేక దేవతా విగ్రహాలనుపెట్టి ఊరేగించటం ఉందట .దక్షయజ్న వినాశనం లో శివుని వీరభద్రావతారం భయంకర ఆయుధాలతో ఘంటా నినాదంతో ఘోరమైన అరుపులతో వెలువడిన కారణంగా ,దానికి ప్రత్యామ్నాయంగా ప్రభలు నిర్మించి రౌద్ర రసప్రధాన వాయిద్యాలహోరుతో ఖడ్గాలు బల్లాలు ఆయుధాలతో సేవిస్తారని కొందరు అంటారు ఇందులో దేనికీ ఆధారాలు లేవు ఊహమాత్రమే .ఏది ఏమైనా కోటప్ప కొండ తిరునాళ్ళకు ప్రభలు కట్టటం సాలంకయ్య తో ప్రారంభమైంది
ఓంకార నది
ఓంకార నది అనే ఓగేరునరసరావు పెట్ చేజెర్ల కపోతేశ్వరాలయం ప్రక్కనుంచి ప్రవహించి ,కోటీశ్వరుని కొండ దగ్గరగా ప్రవహించి సముద్రం లో కలుస్తుంది .
కపోతేశ్వరాలయం
శిబి చక్రవర్తి పావురం డేగ ల ఆహారం గా తన శరీరం లో మాంసాన్ని ఖండించుకొని ,చివరకు శివైక్యం చెంది కపోతెశ్వరుడుగా వెలశాడు ఆయనను అర్చిన్చాతానికి సిద్ధ సాధ్య దేవా గంధరావాదులు మునులు వచ్చి ఓంకారం తో దిక్కులు ఆరు మొగెట్లు అభిషేకం చేస్తే ఆ నీరంతాలింగం కింద భూమిలో ఇంకి ఓంకార నదిగా ప్రవహించింది .ఈ లింగం ఎవరూ ప్రాతిష్టించినట్లుకాక స్వయమా పుట్టినట్లు ఉంటుంది దేహమ్మంతా గాయాలున్నట్లు గుంటలు గుంటలుగా లింగం ఉంటుంది .లింగం పైన రెండు బిలాలున్నాయి .ఒకదానిలో బిందెడు నీళ్ళు పోస్తే కాని నిండదు అంటే అంతలోతుగా ఉంటుంది .రెండవ రంధ్రం లో ఎన్ని నీళ్ళు పోసినా నిండనే నిండదు .చిన్న రంధ్రం లోని అభిషేకజాలం తెల్లారేసరికి చెడు వాసన వస్తుంది అందుకని శుభ్రం చేసి కడుగుతారు . ఒకసారి కొందరు బ్రాహ్మణులు ఈ వింత కనిపెట్టాలని నీళ్ళు పోయిస్తే ,బిలం నుంచి పొగ మంటలు రాగా ప్రయత్నం విరమించారట .
శిబి చక్రవర్తి కపోతేశ్వర లింగంగా మారటం