మధ్య పశ్చిమం లో వేదాంతం
స్వామి వివేకానంద 1893 ప్రపంచ మతసమ్మేళనం లో పాల్గొని ప్రసంగించాక ,భారత దేశానికి స్వాతంత్ర్యం సాధించాలన్న రాజకీయ భావం బలపడింది .అప్పటికే దేశం బ్రిటిష్ వారి సేవలో రెండు శతాబ్దాలు పైగా గడిపింది .తన మూల సిద్ధాంతాలను ఆదర్శాలను మర్చే పోయింది.సుదీర్ఘ నిద్రలో జోగింది .తన దారి మర్చే పోయింది భారత దేశం . ఈ పరిస్థితిలో దేశానికి కావలసింది ముఖ్యంగా ఆత్మ గౌరవం దాన్ని నిలబెట్టుకొనే నమ్మకం .కనుక తన సత్యమార్గాన్ని వెతుక్కున్నది .నవీన, విభిన్నమైన ప్రపంచం లో ఉండాలనుకొన్నది .చికాగోలో వివేకానందుని విజయం ,పశ్చిమ దేశాలపై ఆయన ప్రభావంతో భారత దేశం లో రాజకీయ,సామాజిక, సాంస్కృతిక, ఆధ్యాత్మిక గమ్య స్థానాన్ని మలుపు తిప్పింది .ఒకేఒక్క ప్రసంగం తో లక్షలాది మందిని ప్రభావితం చేసిన స్వామి ఆదర్శమూర్తిగా భాసించి ,మనదేశం లో జాతీయ ఐక్యతకు ,జాతి గర్వానికి ,జాతీయ అస్తిత్వానికినూతన ఆశల పునాదులేర్పడ్డాయి.మతాల పార్లమెంట్ లో వివేకానందుడు చేసిన ప్రసంగం ఒక్కటి చాలు కర్తవ్య పరాయణత్వానికి అని దేశీయులు భావించారు .ఇంకా ఏఇతరమైన ప్రభావం అక్కర్లేదనిపించింది .ఈ భావం గుండెల నిండా నింపుకొని పశ్చిమంలో ఆయన విజయం సాధించి ఇండియాకు 1897లో తిరిగి వచ్చినప్పుడు అపూర్వ స్వాగతం లక్షలాది జనులు నిండు హృదయం తో పలికి తమ ఆదర్శ మూర్తి ఆయనే అని చాటుకొన్నారు .
పశ్చిమ దేశాలు భారతీయ మతసామరస్యానికి ,ఓర్మికి గొప్ప వేదికలుగా వివేకానందునికి ఉపయోగ పడ్డాయి .సద్వినియోగం చేసుకొన్నాడాయన.ముఖ్యంగా అమెరికా ఈ భావ వ్యాప్తికి ,వాటిని రూపకల్పనకు సారవంతమైన భూమి అయింది .ఇండియాలో ఆయన అనుచరులు ,రామకృష్ణా మిషన్ ఆధ్యాత్మిక సేవలు, మానవసేవలతో మార్గ దర్శకమై ముందు నిలిచాయి .అయితే పశ్చిమ దేశాలలో ఆయన అనుచరులు ఏవిధంగా ముందుకు ఆయన భావదారతో సాగిందీ స్పష్టమైన సమాచారం లేదు .ము౦దునిలబడిన మహితాత్ములు ఎవరు ,కార్యభారం మోసింది ఎవరు అనేది ప్రశ్నార్ధకం . .పూర్తిశక్తి సామర్ధ్యాలతో అమెరికాలోని మధ్య పశ్చిమ –మిడ్ వెస్ట్ లో ఆ పని ప్రారంభమైంది .ఆయన అమెరికా చికాగో లో ఉంటూ ,డెస్ మోనిస్,విస్కాన్సిస్ ,మెంఫిస్ మొదలైన మధ్య పశ్చిమ సిటీలలో పర్యటించి జనాలలో ఉత్తేజం కల్గించాడు . అయన ప్రబోధం ఈ ప్రాంతాలను దాటి అమెరికా గుండె లాంటి ప్రాంతాలలో మారుమోగి సత్తా చాటింది .అమెరికా తూర్పు ప్రాంతాలైన న్యూయార్క్ ,బోస్టన్ లతోపాటు పశ్చిమ తీరం .లూసియానా ,ఫ్రాన్సిస్కోలలో కూడా భారతీయ ఆధ్యాత్మిక ,ఆదర్శాలుకొత్త సవాళ్ళను విసిరాయి.పశ్చిమ తీరంలో మాత్రం భారతీయ వేదా౦తభావనల సంస్కృతి విస్త్రుతమైనది .మధ్య పశ్చిమం లో మాత్రం ప్రజలు వాళ్లకు ప్రీతికరమైనదీ,తెలిసిన దానికి మాత్రమె కట్టుబడి ఉంటారు .అందుకని మిడ్ వెస్ట్ లోస్వామీజీ సందేశ ప్రభావం ,కార్యక్రమాలు ఏమిటో పూర్తిగా అర్ధం చేసుకోవాలి .సెయింట్ లూయిస్ ,ఇండియానా పోలిస్ ,సిన్సినాటి ,క్లీవ్ లాండ్ ,లూ యిస్ విల్ నగరాలుస్వామీజీ వీటిని సందర్శించిన ఆధారాలు లేకపోయినా , ఆయన సందేశాలతో బాగా ప్రభావితమైనాయి.
సశేషం