శాంతి వైపు లోతైన అన్వేషణ -2
నిజంగా మన సంస్కృతి భయపడి ,ఆకాలాన్ని అసహ్యించుకొని దాన్ని , ,దానితాత్కాలిక కారాగారాన్ని పేల్చి వెయ్యాలని అనిపిస్తుంది .అది ఆ జైలును ఆపరిసరాలు జీవులే నే కాదు బయట ఉన్న ప్రపంచ ప్రదేశమంతా ద్వంస౦ చేస్తుంది .ఆ జైలులో ఉన్నబందీలు తప్పించుకొనే ఉపాయం, బయట పడేవారు లెక్కించదగిన సంఖ్యలో నే ఉంటారు .సర్వ నాశనం తెలిపేది ఏమిటి అంటే దాని లోపల అంతరాంతరాలలో ఉన్న కోరిక కాలాన్ని మళ్ళీ మళ్ళీ పుట్టకుండా సంహరించటం .అదే విజయం అనుకోవటం .అంతులేని మానవ హననం చేయటంలో అసహనం, అలసిపోవటం ,ఇన్సూరెన్స్ పాలిసీకి చావు దెబ్బ కొట్టటం కనిపిస్తుంది .ఆ క్రూర హేయ భయంకర జంతు ధోరణి తో ఇక లాంటి ఘోరకాలం సమాప్తి అవాలనే .ఇదిశత్రువు చచ్చాడని సైనికుడు బాయ్ నెట్ తిరగేయటం లాంటిది .ఇది అత్యంత శాడిజం మరియు నెక్రోఫిలియా అంటే శవంతో సెక్స్ జరపటం లాంటిది .
అసలే మనం అడుగున ఉన్నసంస్కృతి అంచుపైన ఉన్నాం ..హీరోషీమా దుర్ఘటన తర్వాత ఆ అంచుమీద నుంచి జారిపడిపోయాం .మిల్లి సెకండ్ లో అతి తక్కువకాలంలో జరిగిన ఘోరం అది .మానవ చరిత్రలో సంధికాలంలో జరిగిన మహా ఘోర విపత్తు ఆటం బాంబు విస్ఫోటనం
బెర్గ్ సన్ పండితుడు చెప్పినట్లు ఇదికాలం యొక్క ప్రాదేశీకరణ (స్పేషియలైజేషన్ ఆఫ్ టైం)సరిహద్దులు దాటేసింది .కాలక్రమానుసార లెక్కలు (క్రానలాజికల్ మెజర్ మెంట్స్ ) ఒకస్థిరమైన కదలని స్థితి పై ఆచ్చాదన (సూపర్ ఇంపోజిషన్ ).ఫొటోగ్రాఫిక్ చిత్రాలలా కదలనిదే .ఇదే కాలం ముక్కలు (బిట్స్ ఆఫ్ టైం).ఇదే తిరస్కరింపబడిన కాలం .దాని ముక్కలే అవి .కాలం పై ఆచ్చాదింపబడిన అనంత మైన తునకలు స్పేస్ ను బంధిస్తున్నాయి .
అన్ని దేశాల సంస్కృతిపై ప్రభావం చూపిన సర్వనాశనం(ఓమ్నిసైడ్)ఖచ్చితంగా సాంస్కృతిక పరంగా కాలం పై ప్రత్యెక ప్రకటన చేసింది .అదే ఒకే ఒక సంస్కృతి మిగిలిన సంస్కృతులపై విజయం సాదించటం అన్నమాట .ఇది ఖచ్చితం గా నిరంకుశత్వానికి దారి తీస్తుంది .ప్రపంచ వ్యాప్త ప్రజలు చాలామందికి మృత్యు కాలం (డెడ్ టైం) గురించి అవగాహన లేదు .అసలు జీవించిన కాలానికీ, దీనికీ తేడా ఏమిటో కూడా అర్ధం చేసుకోరు .నాన్ జూడియో క్రిస్టియన్ కాస్మాలజి (విశ్వ శాస్త్రం)కు ప్రారంభ ,సమాప్త ,సరళ రేఖాత్మక సాధారణ బంధాల (చైన్స్)అవగాహన లేదు .వాటిపురాణాలు కర్మకాండలు గొప్ప కాలపు రూపాలకే పరిమితం .
ఈ నాటికీ ‘’హిబా కుషా’’ జనం ‘’క్రిస్టియన్ బాంబ్ ‘’అనే అంటారు.కారణం ఈ బాంబ్ ఆలోచన జూడియో క్రిస్టియన్ ఆలోచనా సరళి విధానమే అంటారు .బాంబ్ తయారీ ,పరీక్ష ,ప్రయోగం అన్నీ క్రైస్తవ విలువలను ఉద్ధరించటానికే అని ఆపాదిస్తారు.క్రిస్టియన్ టైం హీరో షీమా ప్రేలుడు పదార్ధం పై ఆవిష్కరింప బడింది .
హిబా కుషా అయిన,హీరోషీమాకు దగ్గరలో ఉన్న క్రిస్టియన్ ప్రీస్ట్ ఒకాయన బాంబు పేలినప్పుడు తన గోడ గడియారం ఆగిపోయిందని చెప్పాడు .ఆ మూగ నిశ్చేతన గడియారం అక్కడ జరిగిన ఘోర విపత్తును సింబలైజ్ చేస్తోంది.అంటే ప్రతీకాత్మకంగా నిలిచింది .కనుక హిబా కుషా లకు పాతటైం అప్పుడే ఆగిపోయింది .వాళ్ళకే కాదు ప్రపంచ వ్యాప్త ప్రజానీకానికి కూడా ‘’వరల్డ్ టైం’’అప్పుడే అంటే బాంబ్ ప్రేలిన 6-8-1945 న సమాప్తి అయిందన్నమాట.హీరో షీమా చరిత్ర గర్భస్త సంఘటన గా మారింది .ఇప్పుడు మనమంతా దానికి బయట లేక పశ్చిమ చారిత్రికప్రక్రియకు అంచనా వేయబడిన (ప్రోజేక్టేడ్) స్థితిలో ఉన్నాం .అంటే నిజంగా మనం అలౌకిక క్రియ అనంతర పరిస్థితి (పోస్ట్ అపోకలిప్టిక్ సిచుఏషన్) లో ఉన్నామన్నమాట.ఇది ప్రి అపోకోలిప్టిక్ (అలౌకిక క్రియ పూర్వం )కంటే భిన్నమైనది అని గ్రహించాలి .
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -1-10-21-ఉయ్యూరు