శాంతి వైపు లోతైన అన్వేషణ -3(చివరి భాగం )
‘’ఆలోచించరానిదాన్ని ఆలోచించటం ‘’(థింకింగ్ అబౌట్ అన్ ధింకబుల్)అనేది భవిష్యత్ సంఘటన గురించి ఏర్పడినమాట .భవిష్యత్ సంఘటన అంటే జరగటానికి అవకాశం ఉన్నా ,అది ఊహా జనితమైనదే అని భావం .అదిమాత్రం వర్తమాన విషయంపై ఫోకస్ అయి ఉండాలి .వ్యక్తి సమష్టి తో ప్రపంచవ్యాప్తంగా కలిసిపోవటం .కనుక మైక్రో గ్లోబల్ ,మైక్రో ఇండి విడ్యువల్ గా దాన్ని ఎదుర్కోవాల్సిందే .అంటే ప్రపంచం సమాప్తికాకముందే టైం సమాప్తమవటమా ?అసలు విషయం తెలిసి మనం పరిష్కారం చేయగలమా ?దీనికి రెండురకాల అవగాహనలు కన్పిస్తున్నాయి .ఒకటి అటామిస్ట్ సేపరేటిష్ట్.మరోటి ఇంటిగ్రేటడ్ హోలిస్టిక్.అంటే అనువాద వేర్పాటు వాది ,స౦పూర్ణ మైన సమగ్రమైన కలయిక వాది .స్తూలంగా మనం మెటాఫిజికల్ వర్ణ వ్యవస్థ వైపుకో ,లేక మొత్తం ప్రపంచానికి దూరంగా ఉండటమో నిర్ణయించుకోవాలి .లేక మనం మన ప్రత్యెక పర్యావరణం లో చెట్టు ,పుట్టా డాల్ఫిన్ ,కొండ లా ఉండిపోవటమా?
ప్రస్తుత పారిశ్రామిక ప్రపంచం లో కాలం ఒకే రకంగా ఉంది .కొందరు కాలం సమాప్తమై పోతోంది అన్నభావనలో ,కొందరు ప్రస్తుతం అన్న భావనలో ఉన్నారు .జేనేసిస్ అపోకలిప్టిక్ టైం లైన్ తో బంధింప బడ్డా౦ .ఈ కాలానికి మొదలు, తుదీ లేనేలేవు .ప్రపంచ ప్రసిద్ధ ఫిలాసఫర్ శ్రీ జిడ్డు కృష్ణమూర్తి జనం తో మాట్లాడుతూ ఎండింగ్గ్ ఆఫ్ టైం ను అనుభవిస్తారు .అంటే మనమనుకొనే కాలపు ఆలోచనకాక విముక్తమైన ఆలోచనలతో అని అర్ధం .ఆయన భావనలలోఒకటి ప్రేమ శాంతి లకు కారణం ఉండదు .రెండు వ్యక్తియే ప్రపంచం .
కాలాతీత మైన అత్యున్నత విలువలను కాపాడు కొన్నమనం కాల హననం అర్ధంచేసుకోలెం .ఈ కాల బంధ ప్రపంచంలో వాటికి ఎప్పుడూ విలువ ఉండనే ఉంటుంది .స్పినోజా ,ఫ్యూయర్ బాచ్ ఇద్దరూ ఆధ్యాత్మిక వేత్తలుగా గుర్తింపు పొందారు .16వ శతాబ్ది ఫిలాసఫర్ ,వైద్యుడు పారసేల్సాస్ ‘’కరేస్పా౦డేన్స్ ‘’ను గుర్తించాడు .దీన్నిబట్టి ప్రతి వ్యక్తీ ఒక చిన్న ప్రపంచమే .అతడు అన్నికాలాలలో మానవాళి సమస్తానికి ప్రతినిధి .అతడు ప్రపంచ ‘’సమకాలీకరణం ‘’(సింక్రానిసిటి)ని ప్రవేశ పెట్టి తన ‘’యాన్ అక్యూజల్ కనెక్టింగ్ రిన్సిపల్’’వ్యాసం రాశాడు .
సమకాలీనికరణం కోట్లాది జననాన్ని కలుపుతోంది .అది వ్యక్తిజీవితం లో సమగ్రభాగం అయింది .ఈ భావన వ్యాపిస్తే ఈస్ట్ ,వెస్ట్ భావం ,కోల్డ్ వార్ భయం తగ్గిపోతాయి .మతాన్ని గూర్చికాక కాలం గురించే విలియంజేమ్స్ ఈ శతాబ్ది ప్రారంభం లో చెప్పాడు .రెండు ప్రపంచ యుద్ధాల తర్వాత ఆక్స్ఫర్డ్ యూని వర్సిటి లో అలిస్టర్ హార్డీ పాజిటివిజం వ్యాప్తికి ఒక రిసెర్చ్ సెంటర్ ఏర్పాటు చేశాడు. అదే ఇప్పుడు ‘’అలిస్టర్ హార్డీ రిసెర్చ్ సెంటర్ ‘’గా పిలువబడుతోంది .
ఆల్డస్ హక్స్లీ కూడా రాజకీయ సిద్ధాంతాలు ‘’శాశ్వత ఫిలాసఫీ ‘’ల నుంచే వస్తున్నాయన్నాడు .దీనివలన ఓర్పు ,అహింస పెరిగాయన్నాడు .ఇవి మెటాఫిజికల్ విముక్తి నుంచి ఏర్పడినవే .ఈనాడు మానవుడు అన్నిటినీ లోతుగా అధ్యయనంచేసి నిర్ణయం తీసుకొనే పద్ధతిలోకి వచ్చాడు ,రావాలి కూడా .కాలాతీతవిలువలు వాటి అనుభవాలు మనిషి జీవితంలో భాగాలైనాయి .అందుకే ఫ్యూయర్ బాచ్ ‘’రాజకీయం భవిష్యత్తు యొక్క మతం ‘’(పోలిటిక్స్ యీజ్ ది రెలీజియన్ ఆఫ్ ది ఫ్యూచర్ ‘’అన్నాడు .
పాశ్చాత్య ప్రసిద్ధ ఫిలాసఫర్ స్పైనోజా ‘’ప్రపంచం శాశ్వతత్వం రూపు దాలుస్తోంది ‘’అన్నాడు (అండర్ ది ఫారం ఆఫ్ ఎటేర్నిటి).ఆయనే శాంతికి రెండు గొప్ప నిర్వచనాలు చెప్పాడు .ఒకటి ‘’శాంతి అంటే యుద్ధంలేక పోవటం కాదు ‘’అది గుండె లోతులలో పుట్టిన శక్తి వంతమైన ధర్మ౦ ‘’.ఈ ప్రపంచం నిత్యమైనది ,పవిత్రమైనది అని భావించేవాడు చక్కగా ప్రేరణ పొంది ఈవిశ్వం బాగుకోసం అడుగులు కదుపుతాడు .అప్పుడు అతడిమనసులో క్షణంలో లక్షో వంతు కాలంకూడా వినాశనాన్ని గురించి ఆలోచించడు .
కనుక శాశ్వత విలువలను ఆధారంగా ప్రపంచ శాంతి సాధించాలి .దీనికి అహింస ఒక్కటే శరణ్యం .వర్తమానం సమాప్తం అవుతుందని కొందరు అనుకొంటారు .వాళ్ళే తర్వాత పెరుగుతారు .ఫ్యూయర్ బాచ్ అన్నట్లు ‘’మనం సంపూర్ణ వినాశన౦ అంచున ఉన్నప్పుడు చరిత్ర మనకు బోధ గురువుగా మారుతుంది .అది మళ్ళీ సర్వ శక్తి సమర్ధమై ఉవ్వెత్తున పైకి లేఛి నిలబడుతుంది .కొత్తది కావాలి అనుకొంటే అనతికాలం లోనే సాధించి చూపిస్తుంది ‘’.
ఆధారం-1986జనవరి ‘’దర్శన ఇంటర్నేషనల్ క్వార్టర్లి ‘’లో జాన్ ఫ్రాన్సిస్ ఫిప్స్ రాసిన ‘’టువర్డ్స్ ఎ డీపర్ ఫిలాసఫీ ఆఫ్ పీస్ ‘’ వ్యాసం .
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -3-10-21-ఉయ్యూరు