సరసభారతి –సాహిత్య సాంస్కృతిక సంస్థ –ఉయ్యూరు
‘’అక్షరం లోక రక్షకం ‘’
సరస భారతి 160 వ కార్యక్రమంగా శ్రీకోటగురువరేణ్యుల స్మారక నగదు పురస్కార ప్రదానం
సాహితీ బంధువులకు శుభకామనలు ,నవరాత్రి దసరా శుభా కాంక్షలు
సరస భారతి 160వ కార్యక్రమంగా 2021లో ఇంటర్ పాసై ,ఎంసెట్ లో అత్యధిక మార్కులు పొందిన పేద ప్రతిభగల బ్రాహ్మణ విద్యార్ధికి , విద్యార్ధినికి మా గురువరేణ్యులు కీ .శే .బ్రహ్మశ్రీ కోట సూర్య నారాయణ శాస్త్రి ,శ్రీమతి సీతమ్మ దంపతుల స్మారక నగదు పురస్కార౦ నవరాత్రులలో మూలా నక్షత్రం శ్రీ సరస్వతీ పూజ నాడు 12-10-21 మంగళ వారం సాయంత్రం 6గం లకు శ్రీ సువర్చలా౦జనేయ స్వామి దేవాలయంలో మా గురుపుత్రులు శ్రీ కోట సోదరులచేతులమీదుగా అందజేయ బడుతుంది .సాహిత్య ,విద్యాభిమానులు పాల్గొని జయప్రదం చేయ ప్రార్ధన .
కార్య క్రమం -12-10-21 మంగళ వారం సాయంత్రం -6గం
సభాధ్యక్షులు –శ్రీ గబ్బిట దుర్గాప్రసాద్ –సరసభారతి అధ్యక్షులు
సభ ప్రారంభకులు –శ్రీమతి జోశ్యుల శ్యామలా దేవి –సరసభారతి గౌరవాధ్యక్షులు
ఆత్మీయ అతిధులు -పురస్కార ప్రదాతలు శ్రీ కోట గురుపుత్రులు ,శ్రీ కోట సోదరులు – శ్రీ కోట చంద్రశేఖర శాస్త్రి గారు ,శ్రీ కోట గాయత్రీ ప్రసాద్ గారు ,శ్రీ కోట రామకృష్ణగారు ,శ్రీకోట సీతారామాంజనేయులు గారు .
కార్యక్రమ వివరం
శ్రీ కోట గురువరేణ్యుల చిత్ర పటానికి పుష్పమాలాలంకరణం
1- శ్రీ కోట గురువరేణ్యులు కీ .శే .శ్రీ కోట సూర్య నారాయణ శాస్త్రి గారి స్మారక ప్రోత్సాహక నగదు పురస్కార ప్రదానం
ఉయ్యూరు సక్సెస్ కాలేజీ లో చదివి 2021 పబ్లిక్ పరీక్షలో ఇంటర్ 955మార్కులతో ఉత్తీర్ణత సాధించి ,ఎం .సెట్ లో 62.1 మార్కులు సాధించిన –చిర౦జీవి బేతనభొట్ల సూర్య నారాయణమూర్తి కి రూ-10,000(పది వేల రూపాయలు )
2-కీ శే .శ్రీమతి కోట సీతమ్మ గారి స్మారక ప్రోత్సాహక నగదు పురస్కార ప్రదానం
ఉయ్యూరు నారాయణ కాలేజిలో 2021 పబ్లిక్ పరీక్షలో ఇంటర్ 933మార్కులతో ఉత్తీర్ణత సాధించి ,ఎం .సెట్ లో 46.3 మార్కులు సాధించిన
కుమారి గబ్బిట రమ్య కు రూ-10,000(పది వేల రూపాయలు )
సరస భారతి శ్రీ ప్లవ ఉగాది పురస్కార ప్రదానం
పురస్కార గ్రహీతలు –
1-శ్రీ గాదిరాజు రంగరాజు –ప్రముఖ కవి విశ్లేషకులు –ఉండి(ప .గో. జి. )
2-శ్రీ ‘’హాస్యదండి’’భట్ల దత్తాత్రేయ శర్మ –తెలుగుపండిట్ ,కవి, విమర్శకులు తెలుగు భాషా సాంస్కృతిక సమాఖ్య కోశాధికారి ,హాస్యలహరి కార్యదర్శి ,ప్రముఖ కవి విమర్శకులు ,సంస్కృతాంధ్ర సాహిత్య ప్రజ్ఞానిది స్వర్గీయ శ్రీ కె. వై .ఎల్ .ఎన్.కళాపీఠం స౦స్థాపకులు –మచిలీ పట్నం
3-శ్రీ ధూళిపాళ రామ భద్ర ప్రసాద్ –తెలుగు భాషా వికాస సమితి సమన్వయ కర్త –గుడివాడ
4-శ్రీ పంతుల వెంకటేశ్వరరావు –తెలుగు పండిట్, కవి,రచయిత విమర్శకులు ,శారదా సమితి స్థాపకులు –విజయవాడ
5-శ్రీమతి కోనేరు కల్పన-ప్రముఖ కవి ,రచయిత్రి ,విశిష్ట సాహితీ సేవాకర్త –విజయవాడ
6-శ్రీ జమ్మలమడక శ్రీనివాస్ –అసిస్టెంట్ సెక్రెటరి –లాండ్ డిపార్ట్ మెంట్ –విజయవాడ
7-శ్రీ వీరమాచనేని బాల గంగాధర రావు –సరసభారతి సాంకేతిక నిపుణులు –ఉయ్యూరు
8- శ్రీ ఉసిరిక రంగ ప్రసాద్ – బోధనా, నిర్వహణ నిపుణులు –ఉయ్యూరు
9-శ్రీ రాపాక సురేష్ – బోధనా ,నిర్వహణ నిపుణులు –ఉయ్యూరు
కార్య క్రమ నిర్వహణ –శ్రీ మతి మాదిరాజు శివలక్ష్మి –సరసభారతి కార్య దర్శి
నవరాత్రి దసరా శుభా కాంక్షలతో
జోశ్యుల శ్యామలాదేవి మాదిరాజు శివ లక్ష్మి గబ్బిట వెంకట రమణ
గౌరవాధ్యక్షులు కార్య దర్శి కోశాధికారి
గబ్బిట దుర్గా ప్రసాద్ –సరసభారతి అధ్యక్షులు
2-10-21-ఉయ్యూరు
ఇదే ఆహ్వానంగా భావించి పురస్కార గ్రహీతలు ,అతిధులు విచ్చేసి జయప్రదం చేయ ప్రార్ధన .
తెలుగులో మాట్లాడటం మన జన్మ హక్కు