’పడమట లంక రామ స్తవం
అనే ఈ పద్యకావ్యాన్ని షోడశ కవులు కలిసికట్టుగా రాయగా ,గుంటూరు చంద్రికా ముద్రాక్షర శాలలో 1917లో నాళ్ళ చెరువు రంగారావు గారిచే ప్రచురింపబడింది .ఈ పుస్తకంలవలన లభించే ద్రవ్యాన్ని పడమటలంక ధర్మ వైద్య శాలకు వినియోగిస్తామని ,ఇందులో సాధకులకోసం ఒక ఆశ్రమాన్ని నిర్మిచామనీ మనవి మాటలలో ప్రకాశకులు తెలియ జేశారు కానీ పుస్తకం వెల ఎంతో తెలుపలేదు .
‘’అందమైన ప్రకృతికి ఫల వృక్ష సమితికి ,పుష్పలతలకు ఈ చిన్న గ్రామం పడమట లంక నిలయం .ప్రకృతికి బంగారు బిడ్డ .ఈ గ్రామం లో క్షత్రియ దంపతులు అవనిగడ్డ వల్లభ రాయలు ,మహాలక్ష్మమ్మ పుణ్య దంపతులకు సంపన్నులైన అయిదుగురు పుత్రులు .వీరందరూ కలిసి ఆ గ్రామం లో శ్రీ కోదండ రామాలయం ,దానికి అనుబంధంగా బాటసారులకు ఉపయోగపడే సత్రం నిర్మించిన వదాన్యులు .వీరిలో వైద్య విద్య లో అనుభవమున్న తృతీయ సోదరులు శ్రీ బసవయ్యగారు ధర్మ వైద్య శాల స్థాపించి ,అందులోనే ఒక వెయ్యి రూపాయల విలువగల పుస్తకాలతో గ్రంథాలయం నెలకొల్పారు .ఈమొత్తం కార్య రూపం చెందటానికి శ్రీ సీతారామ అవధూత గారు ముఖ్య కారకులు ,ప్రేరకులు .జ్యేష్ట సోదరుడు రామాలయ నిర్వహణ చూస్తారు .ఈయన విద్యాలయ ,పుస్తకాలయ నిర్వహణ బాధ్యత వహిస్తారు
పడమట లంక ప్రకృతి రామణీయకతకు అక్కడి పవిత్ర రామాలయానికి పులకిత గాత్రుడైన సత్కవివిధేయుడు శ్రీ నాళ్ళ చెఱువు రంగారావు గారికి ఒక రోజు స్వామిని దర్శించినపుడు ‘’’’పడమట లంక రామనను బాలన సేయవే జానకీ పతీ ‘’అనే పద్య పాదం అకస్మాత్తుగా స్ఫురించి ,ఆత్మ సంతృప్తితో ఆ మకుటం తో పద్యాలు రాయాలని సంకల్పించి రాయటం మొదలు పెట్టారు .కానీ తనకే ఎందుకో నచ్చక పెద్దలైన కవులను దర్శించి వినిపించి వారి మెప్పు పొంది ,వారితోనూ పద్యాలు రాయించి ప్రచురించారు .ఈ కవి రాసిన మొదటి పద్యం ఉత్పలమాలిక –
‘’శ్రీ కవితాలతోపవన సీమల కేగి తదీయ పాలకా ,నీకము గోరంగసుమము లిచ్చిరి ,తత్సుమముల్ భవత్పద –
శ్రీ కమలార్పణ౦బు నొనరించితి దీనుడనయ్య నన్ గృపో-ద్రేకముతోడ బ్రోవవలయు దిక్కేవ్వరి౦క ను జానకీ పతీ ‘’
తర్వాత కవుల పద్యాలలో మచ్చుకి ఒకటీ రెండూ చూద్దాం
1-శ్రీ గొట్టుముక్కల రమాకాంతాచార్య కవి-గుంటూరు
‘’దుడుకు దన౦బుగాక ,మది దోపదొకో ప్రణవంబు తోడ ని౦ –పడరిసమస్త వేదముల యాదిని నంతమున్ గరంబు వె
ల్గెడిహరినామ మొండేయని లేదిక నెవ్వరికట్టి కీర్తి యో
పడమట లంక రామ ,ఆలన సేయవే జానకీ పతీ ‘’
మరో పద్యరాజం
‘’అడుగ ద్రిలోక సేవయ భవదాకృతి చూపు మటంచు వైభవ౦ –బడుగ ద్రిపాద్విభూతియు నక్కరలేదు భవత్పదంబులే
నడిగెదదల్లి స్తన్యమె గదా పసికూనల కాస గొల్పెడిన్’’
2-శతావధానులు శ్రీ శేషాద్రి రమణకవులు –గంపలగూడెం ఆస్థానకవీశ్వరులు
‘’నడి చెడు వేళ,మంజుకలనాద వనప్రియ గీతిముల్ చెవిన్ –బడు సమయాన ,నంగనల వాలిక చూపులు కౌతుకమ్మొన
ర్చెడి తరి యుష్మదీయ పదసేవనమున్ బొనరింప జేసి శ్రీ – పడమట లంక రామ ,ఆలన సేయవే జానకీ పతీ ‘’
మరో పద్యం
‘’కడలి పయిన్ సమగ్ర సితకాండ పరంపర నింప వింటి నె-క్కిడి,మరి యంతలోన బరికీర్ణ దయామయ దృగ్రుచిచ్ఛటల్
జడ నిధిపైన నింప నిను కాంతుడ వందునో ,గోపి యందునో ?”’
సశేషం
మహర్నవమి శుభాకాంక్షలతో
మీ- గబ్బిట దుర్గాప్రసాద్ -14-10-21-ఉయ్యూరు
—
గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://sarasabharativuyyuru.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com
Telugu Wikipedia : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
Gabbita Durga Prasad
Rtd. head Master Sivalayam Street
Vuyyuru 521165 Krishan District
Andhra Pradesh
India
Cell : 9989066375
8520805566
Land Line : 08676-232797
Virus-free. www.avast.com |
—
You received this message because you are subscribed to the Google Groups “సరసభారతి సాహితీ బంధు” group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to sahitibandhu+unsubscribe@googlegroups.com.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/sahitibandhu/CAJfQ0z-ESkVsjGhGuwKmBiVryOZrwPGoxVbxqBBc7DAckoB-yg%40mail.gmail.co