పడమట లంక రామ స్తవం -3(చివరి భాగం )
9-శ్రీ నోరి హనుమత్సాస్త్రి –గుంటూరు
‘’జడమతి తోడ సోమకుడు చయ్యన వేదములన్ హరించి ,తా –జడనిధి యందు దాగగను జూడ నెరి౦గియు మత్స్య రూపమై
కడువడి రాక్షసున్ దునిమి గ్రక్కునదెచ్చితివీవే వేదముల్ –పడమట ‘’
10-బ్రహ్మశ్రీ నెమ్మలూరి రామమూర్తి –అమృతలూరు
‘’సుడి వడు గాలి చందమున సృక్కుచు నీ భువి భువి యందు మోహపుల్ – మడుగున మున్గితెప్పరిలు మార్గము దోచదు,నీ దయారసం –
బడిగితి యుద్ధరింతువను నాశను దేవర నీదు చిత్తమో-పడమట ‘’
‘’జడధి తనూజ ,యాసిరియే,జానకి ,లక్ష్మణుండాదిశేషు వౌ –కడు బలశాలు రాక పులెకా?సురలీ భువి నుద్ధరింప నా
యెడ జనుదెంచితయ్య ,జగదీశ్వర నీ వన విష్ణువౌదువో –పడమట ‘’
11-బ్రహ్మశ్రీ జి .సుబ్బరాయ –నెల్లూరు
‘’నుడువక నీ చరిత్రమును వీనుల విందుగ విన్న ,నట్టెయిం-పడరగనీదు పేరు మనసార భజించిన ,నీ సురూపమున్
గడుకొని కన్నులార బొడగన్న నఘంబులు వాయకున్నెయో-పడమట ‘’
‘’జలజ భవాండ భాండముల జయ్యన కల్పన సేసి ,వాని బెం-పడరగ జేయుచున్ దుదకు నన్నియు నెట్టులో రూపుమాపగా
దొడగుట కేమి కారణమొ తోచదు చిత్రమునీదు చర్యలో –పడమట ‘’
12-బ్రహ్మశ్రీ వి .లక్షమ్య్య –నెల్లూరు
‘’కొడుకులపైన వత్సలత కూర్మియు ,బేర్మియు జూపు చుండి యా –కొడుకుల తప్పులన్నియును గూడ క్షమియించు గాదెతండ్రి ,నీ
కొడుకునెయైన నాకు గలకోరికలిచ్చి క్షమింప వేల యో-పడమట ‘’
‘’పడమట లంకలో వెలసి భక్తుల నేలుచు దుష్ట సంతతిన్ –మడియగ జేయు చుందువట మాపును రేపును ,నీదు నామమున్
విడువక సంస్మరించినను వీడవె దుఃఖము లెట్టివైన యో –పడమట ‘’
13-బ్రహశ్రీ కాకటూరురామనాథ –నెల్లూరు
‘’కడగి మహాశు పద్యముల గట్టిగ భూప సభా౦తరమ్మునన్ –నుడువక నశక్తుడన్ బుధజనుల్ ధర మెచ్చగగావ్యభావముల్
వడిగని చెప్పలేనకటపాండితి చాలమి ,నెందు బోదునో –పడమట ‘’
‘’వెడద శిరమ్ముపై నొక పెద్ద నగమ్ము భరింప వాయుపు – త్రుడనొ,మహాశుగప్రగతి దూలగ వాలినో గాక నీకు నే
దడయకసాపడన్దనుజు తమ్ముడ నౌదునొనిన్ను జేరగా –పడమట ‘’
14-శతావధాని బ్రహ్మశ్రీ దీపాల పిచ్చయ్య శాస్త్రి –నెల్లూరు
‘’కడుభరమైన కొండలుదకమ్మున దేలు ప్లవంగ మాత్రుడున్ –జడనిధి దాటు బల్వలము చాయ నమేయ మహత్వ మొప్పగా
బొడవడచున్నిశాచర సమూహము ,,నీ కృపసుంత యున్నచో –పడమటలంక రామ ,నను బాలన సేయవెజానకీ పతీ
‘’వడివడి దానముల్సలిపి వారును వీరును తన్ను మెచ్చుకో –గుడువగబెట్టి కొందరికి ,కుల్కుట ముక్తికి మార్గమా?మదిన్
సడలగనీక నీ భజన సారెకు జేయుటమార్గమా ? యాహో –పడమట ‘’
15-బ్రహ్మశ్రీ బలిజేపల్లి లక్ష్మీ కాంత కవి –గుంటూరు
‘’పుడమిని మానవుండ నయి పుట్టి గడించిన దేమి నీవు పే-రడవుల సంచలించు నపుడందొక బోయతనై పులుంగు నై
కడకొక క్రోతి నై నిను దగన్ భజియింప గ నోచనైతినో-పడమట ‘’
‘’విడివడి ఘోరపాప పదవీ మద విభ్రమ లాలసుండనై-చెడితి మహాపచారములు జేసితి,ముందటికేమి దుర్గతిన్
బడయుదునో ,భయంపడివిపన్నుడనీదరి జేరినాడనో – పడమట ‘’
’16-శ్రీ బొగ్గవరం శ్రీరామ శర్మ –నరసరావుపేట
‘’ఎడతెగకుండరాత్రి బవలెప్పుడు నిన్,దనకంతరాత్మగా –నడుగడుగందు తత్వమసి యంచును లక్షలు గోట్ల సార్లు లో
బడని మనస్సమాధి నిను బాయక చింతిలు వాడె నీ వగున్ –పడమట ‘’
‘’గడియకు నూరుపద్యములు గల్పన జేతురదేమి ప్రజ్ఞయో-నుడివినవన్ని యక్కరలునోట వచించిన సాధ్యమో౦కృతిన్
బొడమె దదర మేనిని బొందితి దీనిని దెల్పరేకవుల్ – పడమటలంక రామ ,నను బాలన సేయవెజానకీ పతీ ‘’
సాధారణంగా ఇద్దరుకవులు జంటకవిత్వం చెప్పటం రాయటం చూశాం .గోలుసుకథ,గొలుసు నవల పేరిట నలుగురైదుగురు రచయితలూ రాసిన దాఖలాలున్నాయి .కానీ ఒకే మకుటం పై 16మంది లబ్ధ ప్రతిష్టులైన మహా ఆవులు అన్డునాకొందరు శతావధానులూ కలిసి అరుదైన ఈ పద్యకావ్యాన్ని రాసి రికార్డ్ సృష్టించారు .అందులో ప్రాస అక్షరం ‘’డ ‘’ఉండటం క్లిష్టం .అయినా లెక్క చేయకుండా అందరుకవులు తమ ప్రతిభా విశేషాలు ప్రదర్శించి ఆత్మ నివేదనగా ఆ తారకరామునికి పద్య ‘’చంపకాల ‘’తో ‘’మాల’’ అల్లి కంఠ సీమను అలంకరించి వింత సొబగుచేకూర్చి ధన్యులయ్యారు .’’నాళ్ళ చెరువు’’ వారి మనసు చెరువు పద్యాలతో పొంగి పొరలింది .వారి కోరిక తీరింది .షోడశ కవి చంద్రుల షోడషోప చార పూజగా అతి పవిత్రంగా విరాజిల్లింది’’ పడమటలంక రామ స్తవం .
బహుశా ఈ కావ్యం గురించి కూడా మనవారికెవరికీ పట్టినట్లు లేదు .ఎవరూ దీన్ని ప్రస్తావించినట్లు కనిపించదు . అరుదైన ఈ కావ్యాన్ని పరిచయం చేసే అరుదైన అదృష్టం నాకు దక్కినందుకు మహదానందంగా ఉంది .
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -16-10-21-ఉయ్యూరు