హాస్యం ఎలాపుట్టి౦చచ్చు
స్పూనరిజం
ఒకడు ఒక అధికారిని కలవాలని వెళ్లి గేటు మూసిఉంటే తీస్తుంటే ఆయనబయటికి వస్తే కంగారుగా ‘’ఐ తీస్ ది గేట్ సర్ .ఇటీజ్ మూస్’’అన్నాడు .ఇలాంటిమాటల్ని ఇంగ్లీష్ లో ‘’స్పూనరిజం ‘’అంటారు అంటే అస్తవ్యస్త పద ప్రయోగం –దీనికి ఇంగ్లీష్ లో నిర్వచనం –‘’A twist of transposing of words or syllables is called ‘’spoonerism ‘’.it derives from from Spooner ,an absent minded British professor ,who during talk at a women’s college meant to speak of weary benches that confronted him .Instead he said ‘’I address this audience of weary wenches ‘’.
అలాగే ఆశ్వానికి బదులు ‘’గుశ్వం ‘’అనటం ,వచ్చిన గుర్రం చచ్చింది అనటానికి బదులు చచ్చిన గుర్రం వచ్చింది అనటం కూడా .కారెంపూడి సూరయ్యను సూరం పూడి కారేయ్య అనటం ,అక్కినేని రామారావు నందమూరి నాగేశ్వరరావు ,రేలంగి రమణారెడ్డి ,కస్తూరి బ్రహ్మానందం అనటం కూడా స్పూనరిజమే .ఒకసారి బందర్లో స్థానం నరసింహారావు గారి నాటక ప్రదర్శన అయిన మర్నాడు పేపరులో ‘’స్థానం వారు వరలక్ష్మిని స్వయంగా నాటకానికిఆహ్వాని౦చారు ‘’అనటానికి బదులు ‘’వరలక్ష్మి ని ‘’నాకటానికి’’’’ ఆహ్వానించారు అని పడిందని మునిమాణిక్యమే ఉవాచ .నందిగామలో అయ్యదేవర కాళేశ్వరరావు గారు వెయ్యి మంది ఉన్న సభలో ‘’ప్రసవించారు ‘’అని పత్రికలో పడితే నవ్వక చస్తారా జనం .కృష్ణాపత్రిక ముట్నూరు కృష్ణారావు గారి చేతుల్లో ఉన్నకాలం లో శతావధాని చెళ్ళపిళ్ళ వెంకట శాస్త్రి గారు బందరు వచ్చి ఉపన్యాసం ఇస్తే దాన్ని కవర్ చేస్తూ కృష్ణాపత్రికలో ముట్నూరు వారే వ్యాసం రాస్తే ,శీర్షిక ‘’శవావధాని చెళ్ళపిళ్ళ వారి ఉపన్యాసం ‘’అని అచ్చు అయిందట .శాస్త్రిగారితో పాటు రాసిన అప౦తులు గారూ నవ్వు ఆపుకోలేకపోయారని ముని మాణిక్యం గారే రాశారు .ఈ రకమైన స్పూన రిజానికి ‘’ముద్రారాక్షసం ‘’అని పేరు పెట్టారు భావరాజు నరసింహారావు గారు .
మేలప్రాపిజం
ఒకమాట అనాలనుకొని దానిస్వరూపస్వభావాలు,వర్ణక్రమాలు తెలీక,సరైన మాటనే మాట్లాడుతున్నానుకొని లేక భ్రమపడి ఆపదానికి భ్రష్టరూపమో దగ్గరైనదో వాడితే మేలప్రాపిజం అంటారని ముని మాణిక్యం వారి నిర్వచనం .శుద్ధ వైదికులు ఒక్కోసారి ‘’ప్రాయశ్చిత్వం ‘’ ప్రాయశ్చిత్తం అనటానికి బదులుగాఅంటారు . .అలాగే ఒక సారి పట్టాభి సీతారామయ్య గారి చిత్ర పటాన్ని ఆవిష్కరిస్తూ ఆవిష్కర్త ‘’పటాన్ని బహిష్కరిస్తున్నాను ‘’అన్నాడని మునిమాణిక్యమే సెలవిచ్చారు .అల్లాగే ‘’జలుబు విశేషించింది అనటానికి జలుబు వికసించింది అనటం ,రసభస్మం అనటానికి బదులు భసరస్మం’’అనటం . మునిమాణిక్యం గారి సన్మాన సభలో ఒకాయన మాట్లాడుతూ ‘’కీర్తి శేషులు మునిమాణిక్యం మాస్టారిగురించి మాట్లాడుతున్నందుకు గర్వంగా ఉంది అన్నాడని వేదికమీదే ఉన్న మునిమాణిక్యం గారు నవ్వుతూచేప్పినమాటే .
కొన్ని పద్యాలలో వాక్యాలుదేనికది అర్ధ వంతంగానే ఉన్నా అన్నీ కలిపితే ఏ అర్ధమూ రాదు .ఉదాహరణకు –కాకికేమి తెలుసు సైకోఅనాలిసిస్ –ఆటవెలది ద్విపదకత్తగారు –అయిదు నాలుగు మూడు ఆముక్తమాల్యద –విశ్వదాభిరామ వినురవేమ ‘’దేనినో హేళన చేస్తున్నట్లు స్పురించి నవ్వు తొణికిసలాడుతుంది .అలాగే –‘’ఇస్పేటు జాకీలం –ఎగరేసిన బాకీలం –మృత్యువు సినిమాలో మూడు భాషల టాకీలం ,-భగవంతుని టోపీలం –కవిత్రయపు కాపీలం ‘’ఇందులో అర్ధమేమిటో కవికే తెలియాలి .మరో రసగులిక –గుడుగుడు గుంజాలం –రెక్కల మంచాలం –మృత్యువుఇనప్పెట్టెలో జర్మన్ సిల్వర్ కంచాలం –భగవంతుని పొరబాట్లం –పొగలు గ్రక్కే సిగరెట్లం –కట్టెఉల్లిపాయలం –కొండలమధ్యలోయలం –భగవంతుని కోతులం –పలకరాని బూతులం ‘’
మునిమాణిక్యం మాస్టారికి కృతజ్ఞతలతో
సశేషం
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -29-10-21-ఉయ్యూరు