శ్రీ వేదాంతం పార్వతీశం రచించిన ‘’ధూర్జటి కలాపం ‘’తెలుగు విశ్వవిద్యాలయం 1996లో ప్రచురించింది .వెల-24రూపాయలు .దీనికి ముందుమాట రాసిన తెలుగు విశ్వ విద్యాలయం ఉపాధ్యక్షులు ఆచార్య నాయని కృష్ణ కుమారి గారు ‘’కూచిపూడి నృత్య సంబంధమైన శాస్త్ర ప్రాయోగిక విషయాలలో సమర్ధులైన శ్రీ వేదాంతం పార్వతీశం ‘’ధూర్జటి కలాపం ‘’రాశారు .నాట్య ద్వాదశ అంగాలను కరణ సమాహారం తో జాతి అన్వయం తోపూరించారు ‘’అన్నారు .
పార్వతేశం గీతపద్యం లో ‘’శ్రీసతీ లాస్య గౌరవ శ్రీల జూసి –తనకు తానై యుప్పొంగి తాండవించు –శివుడుమా పతినటరాజు సిద్ధ మూర్తి –ఇచ్చుగావుత సిరులను యిపుడు నెపుడు ‘’,’’శ్రీ మదాంధ్ర లలితకళా చిద్విలాస –భాస భూసుర నికర నివాస లలిత ప్రమోద హాస-రామలింగేశ రామేశ శ్రీ మహేశ ‘’,కుచేల బుధ సంసేవ్యం –బాలా త్రిపుర సున్దరీ౦ –నమామి నృత్య వారాశీం-కూచిపూడి నివాసినీం ‘’,’’శ్రీ సిద్ధేంద్ర యోగి సంసేవ్యం –భామాకలాప నాయక౦ –నమామి రాజగోపాలం –కూచిపూడి నివాసినీం ‘’అంటూ కూచి పూడి క్షేత్రాన్నీ , భామకలాప నాయకులను ప్రస్తుతించి తర్వాత వినాయక, భారతి ,కవితా ,నృత్య గురువులను స్మరించి ,అమ్మానాన్నలకు నమస్కరించి గురువైన పెద్దన్న నాగ లక్ష్మీ నరసింహుని స్మరి౦చి ,పినతాత పౌత్రుడు, దర్శకుడు వేదాంతం రాఘవయ్యను గుర్తు చేసుకొని తర్వాత –‘’నాదు వంశజులెల్ల నాట్యము నను,జ్యోతిషంబునవాదమిచ్చి –శూలినైనను,నటు తమ్మి చూలినైన –మేలమాడుచు మెప్పించు మేటి మగలు ‘’అని చాటి ,తాను కలం పట్టి కావ్యాను శీలనంగా గద్యపద్యాలు సుకవులు మెచ్చగా రాస్తాననీ ,హలం పట్టుకొంటే మాగాణ౦ లో లో రత్నాల వరిపంట పండించాగలనని ,చలమూని చదువులన్నీ శిక్షిస్తాననీ ,’’తలపూని కవ్వింతుతకిట తై-దికటతైఅని నాట్యలక్ష్మిని కవ్విస్తాననీ ,నాట్య శ్రీని చేతిలో తాళాలతో నాట్య మాడిస్తాననీ ,’’కళను పార్వతీశుడ వేదాంత వంశజుడను ‘’ అని తనను పరిచయం చేసుకొన్నాడు .రామలింగేశ ,రాజగోపాలురు తండ్రులు బాలమ్మ అమ్మ లాలించి నృత్యకలాపం నేర్పింది పెద్దన ,పోతన తనకు ఆదర్శం ‘’క్షేత్రయ్య మా బావ –సిద్దేంద్రుడు గురుడు ‘’,లీలాశుకుడుమామ .మేళ కర్తలను సృష్టించి నేర్పుతున్నాడు .గొల్లభామాకలాపం కూచిపూడి సంపుటీ నృత్యనాటికలు చక్కదిద్దాడు .నృత్య వాచస్పతి అని బిరుదు పొందాడు .చింతామణి యక్షగానం స్వంత రచన .నాట్యహేల, రసలీల,లవకుశ ,హరిశ్చంద్ర ,సిద్ధేంద్ర మొదలైన కృతులు,పగటి వేషాలు,శారదారాశాడు .నృత్య తరంగిణి ,లవకుశానృత్యాలు లాక్షణికంగా కూర్చాడు.గొల్లకలాపాలలో గోగోపికల్ ఫేరణీ రసాల విరిసి మురిసింది .బాలమురళి ఆశీర్వదించారు .ఆరుద్ర మురిసి హృదార్ద్రు డయ్యాడు .మేళకర్తల రచన తితిదే ముద్రించింది .’’వేములవాడ భీమకవి మా పెద్ద తాత –దండి శ్రీనాధ చౌడప్ప తరతరమని –చెళ్ళపిళ్ళ ,దివాకర్ల ‘’చెప్పమన్నారట .కష్టార్జితమే మనుగడ .’’ధూర్జటి కలాపమ్ము –నృత్యకావ్యము పేరణీ నేర్పు దవిలి –మేళకర్తల లక్ష్యాల సమ్మేళ పరచి ‘’వ్రాస్తున్నాను కనుక వాణి దీవెనలు ఇమ్మని కోరాడు .ఎన్నాళ్ళ కోరికో ఇప్పుడు తీరిందట .
తర్వాత కూచిపూడి మేళకర్తలు వినియోగాలు వివరించి ,నాట్య ద్వాదశ అంగాలు చెప్పి ,పీఠిక 1వ మేళకర్త బ్రహ్మా తాళం ,ఆతర్వాత వరుసగా రెండవ కర్త కౌతుకం ,కూటమానం,కైయడు,తురుఫు ,,కళాసిక,,,ప్రచుర వసర ,,శబ్దం మరాళకరకట్టు చాళీయంచారమానం ఆర్దీ మోహన ,,నత్రం గురించి విపులంగా రాశాడు .ఆతర్వాత చతుర్దశ మేళకర్త జ్యోతిర్లింగ కరణావతారాలు ,పతాక వందనం హంసధ్వని గురించి రాశాడు .
బహుశా కూచి పూడి నాట్యం పై ఇలాంటికలాపం రావటం అరుదైన విషయం ఎంతో సాహిత్య ,సంగీత నాట్య పరిజ్ఞానం ఉంటేనే ఈరచన చేయగలరు. అలాంటి లక్షణాలన్నీ పుష్కలంగా ఉన్న పుంభావ సరస్వతి నట ధూర్జటి కనుకనే శ్రీ వేదాంతం పార్వతీశం ఇంత అద్భుత శాస్త్రగ్రంద రచన చేసి మెప్పుపొండాడు .
.వేదాంతం పార్వతీశం 1920, సెప్టెంబరు 24వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూచిపూడి గ్రామంలో పుణ్యవతమ్మ, వెంకటసుబ్బయ్య దంపతులకు జన్మించాడు. ఇతడు చింతా వెంకటరామయ్య, వేదాంతం రామకృష్ణయ్య, వేదాంతం రాఘవయ్యల వద్ద కూచిపూడి యక్షగానాలను నేర్చుకున్నాడు. యేలేశ్వరపు సీతారామాంజనేయులు వద్ద సంగీతాన్ని అభ్యసించాడు. ఇతడు ఢిల్లీ, జయపూర్లలో జరిగిన కాంగ్రెస్ మహాసభలలో తన నృత్యప్రదర్శన ఇచ్చాడు.
ఇతడు ఎరుక, అర్ధనారీశ్వరుడు, దక్షయజ్ఞం, ప్రవరాఖ్య, పేరణి శంకరప్ప, దాదీనమ్మ, శివమోహినులు మొదలైన కూచిపూడి నృత్యరూపకాలను రచించి వాటికి నృత్యాన్ని సమకూర్చి తన శిష్యులచే నటింపజేశాడు. ఇంకా ఇతడు తిల్లానాలు, జావళీలు ఎన్నో రచించాడు. నాట్యకళ మాసపత్రికలో నృత్యానికి సంబంధించి అనేక రచనలు చేశాడు. సిద్ధేంద్రయోగి భామాకలాపం, ప్రహ్లాద నాటకం, కూచిపూడి నాట్యదర్పణం,[2] కూచిపూడి మేళకర్తలు, గొల్లకలాపం, నృత్య తరంగిణి, ధూర్జటి కలాపం వంటి గ్రంథాలను ప్రచురించాడు. ఇంకా చింతామణి, ఉషాపరిణయం,హరిశ్చంద్ర, పగటివేషాలు, నాట్యమేళా, రాసలీల, జముకుల గేయాలు వంటి అముద్రిత రచనలు కూడా ఉన్నాయి.
ఇతడు 1952లో బందా కనకలింగేశ్వరరావుతో కలిసి కూచిపూడిలో సిద్ధేంద్ర కళాక్షేత్రాన్ని స్థాపించాడు. ఈ సంస్థ ఆరంభం నుండి దానిలో పనిచేసి దానికి ప్రిన్సిపాల్‌గా పదవీవిరమణ చేశాడు.[3] 1954లో కూచిపూడి పతాకాన్ని ఆవిష్కరించాడు.
ఇతని శిష్యులలో పసుమర్తి రామలింగశాస్త్రి, వేదాంతం రత్తయ్య శర్మ, వేదాంతం రాధేశ్యాం, పసుమర్తి కేశవప్రసాద్, చింతా సీతారామాంజనేయులు, యేలేశ్వరపు నాగేశ్వర శర్మ, చింతా రామము, భాగవతుల మోహన్ రావు మొదలైనవారు ఉన్నారు.
కేంద్ర సంగీత నాటక అకాడమీ 1994లో ఇతనికి కూచిపూడి నాట్యంలో అవార్డును ప్రకటించింది.
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -7-11-21-ఉయ్యూరు – .