స్వర సంధానం తో హాస్యం
స్వరం లో మార్పునే స్వర సంధానం అంటారు .ఇదికూడా ఉచ్చారణ వికృతే.దీనితో హాస్యం పుడుతుందని మునిమాణిక్యం ఉవాచ .ఒకసారి మాస్టారు స్వామి శివ శంకర స్వామిని ‘’అనుష్టుప్ ‘’నడక ఎలా ఉంటుంది అని అడిగితె –ఒక కాని ఒకే కాని ,రెండు కానులు అర్ధణా ,మూడుకానులు ముక్కానీ ,నాలుగు కానులు ఒక అణా’’అనే వాక్యాలను అనుష్టుప్ లాగా చదివి నడక ఎలా ఉంటుందో బోధించారట .పూర్వం కృష్ణమాచారి అనే ఆయన మహా వక్తగా ఉంటూ దేశమంతా తిరిగి ఉపన్యాసాలిచ్చాడు .ఆయన ఇంగ్లీష్ వాక్యాలను వేద రుక్కులు లాగా ఉదాత్త అనుదాత్తాలతో చదువుతూ ఉంటె తమాషాగా ఉంటూ నవ్వు పుట్టి౦చెవి అని మునిమాణిక్య వచనం .ఉదాహరణకు –‘’Oh 1what a heart I must have to contemplate without emotion that elevation and that fall ‘’
అట్లాగే ‘’మై మదర్ కేము హియర్ .షి ఈజ్ నాట్హాపీ .షి ఈజ్ ఇల్లు .మరోటి ‘’వాటూ?ట్రెయిన్ ఇంకా నాట్ కమ్మా ?లేటా?హౌ మచ్చూ ‘’?’’యు ఆర్ గోయింగా రైటో ‘’.
తెలుగు పద్యాన్ని సంస్కృతం లోగా ఉచ్చరిస్తే రమణీయంగా ఉంటూ నవ్వు తెప్పిస్తుంది అన్నారు మాస్టారు .చదివే వాడికి సంస్కృతం చదివే నేర్పు ఉంటేనే రాణిస్తుంది .లేకపోతె బెడిసి కొడుతుంది .ఉదాహరణ –‘’దొంగల్లారా భ్రమలు పడితే పేదవాళ్ళం గదట్రా – కుండా మండా పగలగొడితే కనుక్కోలెం గదర్రా’’.’’మరోతి’’-‘’అనవేమ మహీ పాలా చూపులున్ గడు లెస్సలున్ –యుద్దమందు మహా శూర్లూ ,శహ బాసునే భలే ముండాధియో యోనః ప్రచోదయాత్ ‘’అని ఒక కవి రాశాడని మేష్టారు ఉవాచ .
ఊత పద ప్రయోగ హాస్యం
ఊతం అంటే నేయ బడింది అని అర్ధం అన్నారు మునిమాణిక్యం ..బట్టలు నేసేప్పుడు దారం మాటిమాటికీ వచ్చినట్లు ,కొందరు మాట్లాడుతుంటే ఒక రకమైన పదం పదేపదే వస్తుంది హాస్యం పుట్టిస్తుంది .ఊత పద ప్రయోగం వలన హాస్యం పుట్టటానికి సంకులం, భిభీషికం ,అతి వచనం అనే మూడు పద్ధతులున్నాయన్నారు మాష్టారు .
సంకులం –ముందు ,వెనుకల విరుద్ధమైన వాక్యాన్ని సంకుల వాక్యం అంటారు .ఇది శబ్దాశ్రయ హాస్యమే అన్నారు మాస్టారు .ఉదాహరణ-‘’నేనూ –నిన్నసాయంత్రం ఐ మీన్ అంటే ఇవాళ పొద్దున్న మీ ఇంటికి వస్తే ,నువ్వు లేవు ‘’.అలాగే ‘’పాపం వాడు చనిపోయాడు –అంటే ఇంకాచావలేదనుకో .అందుకు సిద్ధంగా ఉన్నాడు ‘’.మరోటి –‘’ఆయన ఏక పత్నీ వ్రతుడే .కాకపోతే ఎవరైనా ఆడాళ్ళు కంటబడితే తినేట్లు చూస్తాడు .అంతమాత్రాన అతని శీలాన్ని శంకి౦చ నక్కరలేదు ‘’.
భిభీషికం-ఇందులో మాటలు సంభాషణ లోనే రాణిస్తాయి,గ్రంథస్తమైతే సొంపుఉండదు అంటారు మాస్టారు..ఇదొక భాషణావిశేషం అనుకోవచ్చు అన్నారు మాస్టారు .ఉదాహరణ –కొంపలంటుకు పోయాయి .వాడు నిన్నసాయంత్రం ఊరెళ్ళాడు’’ .ఇంతకీ అర్ధం ఏమిటి అంటే ‘’నవ్వులాటకు భయ పెట్టటం ‘’అన్నారు మునిమాణిక్యం .
అతి వచనం –తె లంగాణా వారు దీన్ని ఎక్కువగా వాడుతారు ప్రతి వాక్యం చివరా ‘’వింటిరా?’’అంటారు .ఉదాహరణ –‘’ఆంద్ర సారస్వత పరిషత్ వారు వింటిరా –ఈ సంవత్సరం వింటిరా-కార్తీక మాసం లోనే విశారద పరీక్షలు జరుపుతున్నారు –వింటిరా ‘’మొదటి సారి మనం వింటే నవ్వు రాక చస్తుందా .వింటిరా అన్నప్పుడల్లా ‘’వినలేదు ‘’అంటారు కొంటె కుర్రోళ్ళు .పగోజి వారు ‘’బోధ పళ్ళే’’అంటారు .’నమ్ము నమ్మకపో వాడు పొద్దునే వెళ్ళాడు ‘’’’నేను చెప్పలా ‘’?చంపావు పో ‘’,మరిగంటే’’వగైరాలు ఎన్నైనా చెప్పచ్చు .ఊత పదాలను ఒక రమణీయ ఊపుతో అంటేనే హాస్యం పేలుతుంది .ఈ ఊత పద ప్రయోగం వల్లమధురత్వ ,రసవత్వ,రమణీయత్వాలు కలుగుతాయని,ఇది తెలిసిన వాడికి హాస్య సామ్రాజ్య పట్టాభిషేకం జరుగుతుందని మాష్టారు మరీ మరీ డష్టర్ బోర్డు మీద గట్టిగా కొట్టి చెప్పారు .
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -7-11-21-ఉయ్యూరు