తమిళ తాత ఉ.వే.స్వామినాథయ్యర్-3
పట్టీశ్వరం లో ఉండగానే తమ తలిదండ్రులు ఉండే కొత్తూరు వెళ్ళాడు స్వామినథయ్యర్ .జ్వరం వచ్చి చాలా వారాలు ఉండిపోయాడక్కడ .ఆరోగ్యం కుదిరాక గురుపూజ సందర్భంగా పిళ్ళై గారు వస్తారని తిరువాడుదురై వెళ్ళాడు .ఈమఠ స్థాపకులు శ్రీ నమశ్శివాయ మూర్తి ఆరాధన పుష్యమాసం లో జరిగే గొప్ప ఉత్సవం .ఆ ఉత్సవ రోజుల్లో పాటకచేరీలు ,కావ్య పఠనాలు ,సంస్కృత పండితుల విద్వద్గోష్టులు ,ఉత్సవ వేడుకలు జరుగుతాయి .అక్కడికి వచ్చిన వారందరికీ ఉచిత భోజనం సమకూరుస్తారు .అయ్యర్ పిళ్ళైగారిని కలుసుకొన్నాడు .గురు బహు ముఖ ప్రజ్ఞను ఇక్కడ చూశాడు .ఆశుకవిత్వం లో పిళ్ళై దిట్ట .వచ్చిన వారు విశాల భవనం లో ఉన్న దేశికర్ ని దర్శించి పద్యాలు చెప్పి బహుమతులు పుచ్చుకొని వెళ్ళేవారు .ఈ పద్యాలన్నీ పిళ్ళై గారివే .మర్నాడు పిళ్ళై దేశికర్ ను కలువగా ‘’రాత్రి మీకు నిద్ర లేనట్లుందే ‘’అని చిరునవ్వుతోఅడగగా ఈయనా మందహాసం చేశాడు కొన్ని రోజులు మాయూరం లో గడిపి ఇంటికి వెళ్ళిపోయాడు పిళ్ళై .బండిలోప్రయాణం చేస్తూ ‘’అంబర్ పురాణం ‘’చెప్పాడు .ఆగతుకుల రోడ్డులో బండీ అటూ ఇటూ ఊగుతూ వెడుతుంటే అయ్యర్ ఆయన చెప్పినవన్నీ రాసేవాడు.ఉదాత్త కవితా ధార పిళ్ళై నోటి నుండి జాలువారేది. పరవశుడయ్యేవాడు అయ్యర్ .
తిరువడు దూరు లో తరగతుల్ని రెండు భాగాలు చేయాలనుకొన్నారు .అయ్యర్ ను కొత్త వాళ్ళలో కూర్చో పెట్టాలా ,పాతవారితోనా అనే సమస్య వచ్చింది .చివరికి అయ్యరే రెండు తరగతులకు తాను హాజరౌతానని చెప్పి సమస్యను తీర్చాడు .కనుక ఊపిరాడనంత పని .కానీ రెండు రకాల లాభం పొందాడు .గురువు పద్యాలను రాగయుక్తంగా పాడి విపించే బాధ్యతఆయనమీదే వేసుకొన్నాడు .
గురు చరణ సన్నిధి
స్వామినాథయ్యర్ రాసిన ‘’మీనాక్షి సుందరం పిళ్ళై జీవిత చరిత్ర ‘’ఒక మాన్యుమెంట్ .ఆనాటి ముచ్చటను అయ్యర్ మధురంగా వర్ణించాడు . .ఒకనాటి రాత్రి అయ్యర్ మఠం లో భోజనం చేసి అందరికంటే ముందే లేచి వెళ్ళాడు అక్కడి నియమాలకు విరుద్ధంగా .వీధి అరుగుమీద పడుకొన్న పిళ్ళై శిష్యుడిని చూసి భోజనం చేశావా అని అడుగ్గా గురువుగారికి శిష్యుడిపై ఉన్న అభిమానం చూసి మిగిలినవారు ఆశ్చర్యపోయారు . ఈ ఊరిలోనే అయ్యర్ మహాగాయకుడు మహా మదురై వైద్యనాథయ్యర్ ను కలుసుకొన్నాడు .దేశికర్ కోరికపై ఆయన చాలా కీర్తనలు రసవత్తరంగా పాడాడు.అయ్యర్ దివ్యానుభూతి పొందాడు.తన అన్నగారు రాసిన శైవ కావ్యం పెరియ పురాణం ఆధారంగా ఒక యక్షగానం రచించాడు వైద్యనాథయ్యర్ .వీటినీ ,పిళ్ళై గీతాలను ఆనాడు పాడాడు .గురువు గారి గీతాలలో ఉన్న అందచందాలకు శిష్యుడు అయ్యర్ ముగ్ధుడయ్యాడు .
పిళ్ళై మాయూరం లో ఉన్నప్పుడు తిరుప్పేరుండు రైకి చెందిన సుబ్రహ్మణ్య తమ్బిరాన్ ,ఆక్షేత్ర స్థల పురాణం రాయి౦చా లనుకొని తగినవాడు పిళ్ళై అని గ్రహించిదేశికర్ ను తన తరఫున అడగమనగా ఆయన అయ్యర్ ను మాయూరం పంపగా ,పిళ్ళై ఆనందభరితుడై వినాయకునిపై ఆశువుగా –‘’వెన్నెల వలెభాసి౦ చెడు పెన్నెరులవి-నాయకుని స్మరించుచు జీవనమ్ము గడుపు ‘’అనే పద్యం చెప్పాడు .గురుశిష్యులు తిరువాడు దురు వెళ్లగా ,అయ్యర్ కు 1872లో మశూచికం పోసింది .అప్పుడాయన పెరియ పురాణం అధ్యయనం చేస్తున్నాడు .గురువుశిష్యుని కంటికి రెప్పలా కాపాడు కొన్నాడు .తర్వాత తలుపులు మూసిన పల్లకిలో అయ్యర్ ను సూర్యమూలై కి పంపగా తండ్రీ తాత జాగ్రత్తగా చూసుకొన్నారు .
1873లో కుంభ కోణం లో మహాపుష్కరాలు (మహా మాక౦ )రాగా ,సుబ్రహ్మణ్య దేశికర్ శిష్యులతో అక్కడికి చేరాడు .శైవులకు ఈ పుష్కరాలు మహా పవిత్రమైనవి .పాల్గొనక లేకపోయినందుకు అయ్యర్ బాధపడ్డాడు .ఆరోగ్యంకుదిరాక మళ్ళీ తిరువాడు దురై వెళ్ళాడు .కుంభ కోణం లో త్యాగ రాజ చెట్టి ఇదివరకు అయ్యర్ కలవటం ,అక్కడ బోధిస్తావా అని అడగటం సరే ననటం మనకు తెలిసిందే .అక్కడ అప్పు శాస్త్రిగారు ఒక కొత్త పాశాల పెడుతున్నారనీ దానిలో తమిళ బోధకుడు కావాలనీ చెట్టి అయ్యర్ చెవిన వేశాడు .ఇక్కడ పని చేస్తూ తండ్రికి కొంత ఆర్ధికం గా సాయపదాలనుకొన్నాడు అయ్యర్ .కానీ పిళ్ళైకి నచ్చలేదు.అయ్యర్ ఇంకా చదువుకోవాలని ఆయన భావం .అయ్యర్ ని తనదగ్గరే ఉంచమని అవసరం వచ్చినప్పుడు ఉద్యోగం చేయవచ్చు నని తండ్రితో చెప్పగా అయ్యర్ బ్రహ్మానంద భరితుడయ్యాడు .
1873లో పిళ్ళై తిరుప్పేరున్డురై కి వెళ్ళగా ,అయ్యర్ సవేరినాద పిళ్ళై ఆయనతో వెళ్ళారు .ఆక్షేత్ర మహాత్మ్యం విని ఈ ఇద్దరూ ఆశ్చర్యపోయారు .తమిళ సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన శైవ గ్రంధం ‘’తిరువాచకం ‘రాసిన మానిక్క వాచాకర్ కు జరిగే ప్రత్యెక అర్చన విధి చూసి మరీ ఆశ్చర్యపోయారు .పిల్లైగారి స్థలపురాణం ఆవిష్కరణ కు ఇక్కడ కు వచ్చారు .ఇంకా పురాణం పూర్తికాలేదు వీలు దొరికినప్పుడల్లా పిళ్ళై పద్యాలు రాసి మర్నాడు అందరికీ చదివి వినిపింఛి వివరించేవాడు ఇది ఇంకా ఆశ్చర్యం కలిగించింది అయ్యర్ కి.1874లో వ్రుదాప్యం లో ఉన్న తండ్రికి సేవ చేశాడు అయ్యర్ .తండ్రికి సంపాదనలేదు కుటుంబం అప్పులపాలైంది .చదువు మానేసి పౌరాణికవృత్తి చేబడితే పరిసరగ్రామాలవారు ఆదరిస్తారని హితవు చెప్పాడు .ఒప్పుకొని చెంగానం, కారై గ్రామాలలో ‘’తిరు విల్లై యాడల్’’పురాణం చెప్పాడు .పిళ్ళై గురుత్వాన్ని వదులు కాకూడదని మనసు చెబుతోంది .అంబర్ లో పుస్తకా విష్కరణకు వెళ్ళిన పిళ్ళై ని చేరి మళ్ళీ శిష్యుడయ్యాడు .కారై వెళ్లి ఆపేసిన పురాణాన్ని పూర్తీ చేశాడు .మంచి ఆదరణ కలిగి ఇంకా ప్రవచనాలు చేయమని గ్రామస్తులు కోరారు .తనమనసులోని మాటను వినయంగా చెప్పి గురువును చేరాడు .
తమిళం లో మొదటి నవల’’ప్రతాప మొదలియార్ ‘’ రాసిన మున్సిఫ్ ఉద్యోగం చేసిన వేద నాయకం పిళ్ళై ఒకసారి దేశికర్ దర్శనానికి రాగా , ఇద్దరు పరస్పరం గౌరవించుకోవటం చూసి అయ్యర్ చకితుడయ్యాడు .అయ్యర్ ప్రియతమా గురువు మీనాక్షి సుందరం పిళ్ళై 1-1-1876న శివైక్యం చెందాడు .ఆఖరు క్షణం వరకు శిష్యుడికి తిరువాచకం లోని సందేహాలు తీరుస్తూనే ఉన్నాడు .అయ్యర్ దుఖం కట్టలు తెన్చుకోగా దేశికర్ ఓదార్చాడు –‘’మనం ఒక మణి ని కోల్పోయాం .ఆలోటు భర్తీ చేయలేం .కానీ ఎం చెయ్యగలం ?పిల్లైగారికి నువ్వంటే ప్రాణం .నువ్వు మతం లో చేరి ,నావద్ద నేర్చుకోవచ్చు ‘’అని అనునయించాడు.అయ్యర్ ఇప్పుడు దేశికర్ శిష్యడై కొత్తగా చేరిన వారికి బోధిస్తున్నాడు .’’కావిడిచ్చి౦దు’’రచించిన చొక్కి కుళ౦అన్నామలై రెడ్డియార్ కొన్ని తమిళ గ్రంధాలు అధ్యయనం చేయటానికి అక్కడికి రాగా ,అయ్యర్ సాయం చేశాడు .
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -10-11-21-ఉయ్యూరు