తమిళ తాత ఉ.వే.స్వామినాథయ్యర్-6
కుంభ కోణం కాలేజి అధ్యక్షుడు వి.నాగోజిరావు సంగీతం లో దిట్ట .కొన్ని సంస్కృతతగ్రంథాలు ముద్రించాలనుకొని ,అయ్యర్ సాయం కోరగా చక్కగా పరిష్కరించి ముద్రణకు తోడ్పడ్డాడు .అయ్యర్ కు ఏదైనా సాయం చేయదలచి ‘’మీరు పాఠ్య పుస్తకాలు రాస్తే మీ రాబడీ పెరుగుతుంది , ,మంచి పుస్తకాలూ వచ్చి ఉభయ తారకంగా ఉంటుంది ‘’అనగా ‘’ధన్యవాదాలు డబ్బు రావటం మొదలైతే నా తమిళ పరిశోధన ఆగిపోతుంది నిరాకరిస్తున్నందుకు మన్నించండి ‘’అని వినయంగా చెప్పాడు .1890లో లార్డ్ హేవక్ కుంభకోణం కాలేజీని సందర్శించగా ,నాగోజి కోరికపై అయ్యర్ తమిళం లోస్వాగత పద్యాలు రాసి చదవగా ,హాజరైన గవర్నర్ హేమాహేమీలందరూ సముచితంగా ఉన్నదని మెచ్చారు .గవర్నర్ తో అయ్యర్ ఫోటోకూడా తీశారు .
తమిళ వ్రాత ప్రతులున్నాయని అయ్యర్ కి ఉత్తరం రాస్తే డబ్బులు పంపి పంపమనే వాడు .అవి వచ్చేవికావు .ఒకపండితుడికి డబ్బుప౦పి తే శరభ పురాణం పంపాడు .అది ఉపయోగపడలేదు .1901లో మదురైలో తమిళసంఘం ఏర్పడి ప్రతి ఏడాదీవార్షికోత్సవాలు జరిపారు .తేవర్ ఆహ్వానం పై అయ్యర్ వెళ్లి పాల్గొనేవాడు .రెండవ రోజు కవి సమ్మేళనానికి అధ్యక్షత వహించేవాడు .ఇలా కొన్నేళ్ళు గడిచాయి .1900లో మద్రాస్ లో ద్రావిడ భాషా సంఘం స్థాపించగా విద్యా శాఖకు చెందిన శేషాద్రి ఆచార్,ఫాదర్ జే లార్స్ లు కార్యదర్శు లైతే అయ్యర్ గౌరవ సభ్యుడు . అయ్యర్ లెక్చరర్ గా మంచి పేరు కీర్తి పొందాడు .ఆయన మద్రాస్ వస్తే బాగుంటుంది అని విద్యావేత్తలు భావించారు .శేషాద్రి ఆచార్ ఈ విషయం అయ్యర్ కు తెలియజేస్తే ‘’నా ఉద్యోగం ఇక్కడైతే మద్రాస్ కు ఎలా రాను?’’అని అంటే ‘’మీరుఒప్పుకుంటే ,మద్రాస్ రాజధాని కాలేజికి ట్రాన్స్ఫర్ చేయిస్తాను’’అన్నాడు అక్కడ ఒక వృద్ధ తమిళ పండితుడు ఉన్నాడు ఆయనకు ఇబ్బంది కలుగుతుందని మర్యాదగా తిరస్కరించాడు అయ్యర్ .
1902 వేసవి సెలవలలో పారిస్ కు చెందిన జూలియస్ విన్సన్ అనే శిష్యుడు వచ్చాడు .వీరిద్దరి మధ్య ఉత్తరప్రత్యుత్తరాలు జరుగుతున్నాయి .అప్పుడు తంజావూర్ కలెక్టర్ లయోనేల్ బైబర్ట్ కు అతిధిగా ఉన్నాడు లిన్సేన్ .తానుపా౦ డిచ్చేరి,కారైక్కాల్ వగైరాచూసివస్తానని కాలక్షేపానికి ఏదైనా పుస్తకం ఇవ్వమని అయ్యర్ నికోరితే ‘’పాత కా౦చీపురాణం ‘’కాగిత ప్రతి ఇచ్చాడు .అది చదివి రిజిస్టర్డ్ పోస్ట్ లో జాగ్రత్తగా పంపాడు .అయ్యర్ తమిళ సాహిత్య గౌరవం కోసం ఎడతెగని కృషి చేస్తున్నాడని చెప్పాడు .1903లో మూడవ ఎడ్వర్డ్ పట్టాభి షేకం సందర్భం గా తంజావూర్ లో కలెక్టర్ ఆధ్వర్యం లో జరిగిన సభకు అయ్యర్ ను ఆహ్వానించగా హాజరుకాగా, కలెక్టర్ మిళభాషకు అయ్యర్ చేస్తున్న కృషిని గుర్తించి గౌరవ పూర్వకంగా ఒక ప్రశంసా పత్రాన్ని బహూకరించాడు .ఇదీ మొదటి అఫీషియల్ రికగ్నిషన్ .
సంగ కాలపు కృతి అయిన ‘’ఐ౦గురు నూరు ‘’ను అయ్యర్ పరిశోదిస్తున్నప్పుడు యాళ్పాళం అంటే జాఫ్నానుంచి ఒకాయన సంగ్రహం గా ప్రచురిస్తే,మరికొన్ని ప్రచురించే అవకాశాలు ఉంటాయని జాబు రాయగా ,బాగుంది అనుకోని 1902లో సంగ్రహ ప్రతి ప్రచురించాడు .అది చూసిన జాఫ్నా ఆయన ‘’ఇంత సంగ్రహం గా అని నేను అనుకోలేదు ఇందులో నాదే తప్పు ‘’అని ఉత్తరం రాస్తే అయ్యర్ 1903జూన్ లో సమగ్ర ప్రచురణ వెలువరించాడు .దీన్ని త్యాగరాజ చెట్టికి కృతజ్ఞతగా అంకితమిచ్చాడు అయ్యర్ .
మద్రాస్ అయ్యర్
1903 వేసవిలో మద్రాస్ రాజదానికాలేజి తమిళ అధ్యాపకుడు శ్రీనివాసాచారి రిటైర్ అయ్యాడు . ,అయ్యర్ ‘’పదిట్రుపత్తు’’పరిశోధనలో మునిగి ఉండగా .కాలేజి ప్రిన్సిపాల్ హేన్స్ మన్ వచ్చి ,అయ్యర్ ను మద్రాస్ రాజదానికాలేజికి బదిలీ చేస్తూ ఆర్డర్ వచ్చిందని చెప్పి, తనతర్వాట ఇక్కడ ఎవర్ని నియమించాలో సూచి౦చ మనీ కోరాడు .23ఏళ్లుగా ఉంటున్న పట్టణం మిత్రబృందం ,మఠాధిపతులను ను వదిలి వెళ్ళటం బాధగానేఉందని చెబితే ‘’మద్రాస్ మీ పరిశోధనకు బాగా ఉపయోగపడుతుంది ‘’అని నచ్చచెప్పగా సరేఅన్నాడు
మద్రాస్ లో తిరు వట్టీశ్వరన్ పేటలో తనపిన తండ్రి ఇంట్లో బస చేసి కాలేజిలో చేరాడు అయ్యర్ .,కుంభ కోణం కాలేజిలో తమిళ క్లాసుకు ఎత్తైన వేదిక ,టేబుల్, కుర్చీ ఉండేవి .ఇక్కడ అవేవీ లేనేలేవు .ప్రిన్సిపాల్ బిల్డర్ బెల్ కు తెలియ జేయగా వెంటనే బీరువాతో సహా అవన్నీ ఏర్పాటు చేశాడు .1904జనవరిలో కోవిల్ వీధి అద్దె ఇంటికి మారాడు.జూన్ లో పదిత్రు పట్టు ప్రచురించాడు .1905 మొదట్లో తల్లి సరస్వతి అమ్మాళ్ చనిపోగా ,,శ్రీనివాస అయ్యంగార్ పరామర్శించటానికి వచ్చి అయ్యర్ ప్రచురించిన ‘మనిమేకలై ‘’ఎం. ఏ .కి పాఠ్య పుస్తకంగా నిర్ణయింపబడిన మంచి వార్త చెవినవేశాడు .దీనిపై వచ్చిన డబ్బు తల్లి అంత్యక్రియల ఉపయోగ పడింది .
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -14-11-21-ఉయ్యూరు . , ,