తమిళ తాత ఉ.వే.స్వామినాథయ్యర్-8
నిరుపమాన పాండిత్యం ,నిరాడంబర జీవితం
అయ్యర్ ఒక చిన్న ఇంట్లోనెలకు 20రూపాయల అద్దెకు ఉండేవాడు .ఒకసారి ఇంటి యజమాని స్నేహితుడు యజమానిని ‘’ఇంత తక్కువ అద్దె కు ఎందుకు ఇచ్చారు ?”’అని అడిగితె ఇంటి యజమాని ‘’ఈ ఇరవై కూడా తీసుకోవటం నా తప్పే .మా ఇంట్లో ఆయన అద్దెకు ఉన్నందుకు నెలనెలా ఇరవై రూపాయలు నేనే ఆయనకు ఇవ్వాలి .అంతగొప్ప పండితుడు మా ఇంట్లో ఉండటం వలన మా ఇల్లు ఒక గుడిలా పవిత్రమైనది .ఆయన్ను దర్శించటానికి ఎందరెందేరో ప్రముఖులు వస్తున్నారు .ఆయన అంతకు ఆయన ఖాళీ చేస్తే తప్ప అద్దె ఇంకొక రూపాయికూడా పెంచను,ఖాళీచేయమని అడగనుకూడా ‘’అని నిర్మొహమాటంగా చెప్పాడట.ఒక సారి యజమాని అయ్యర్ ని ‘’ఈఇల్లు కొనాలనుకొంటే మీకే ఇస్తాను ‘’అంటే తనకు కుంభకోణం లో ఇల్లు ఉందనీ ,ఇప్పుడు మద్రాస్ లో దీన్ని కొనే తాహతు లేదని వినయంగా చెప్పాడట .కానీఇంటాయన మిత్రుడు ఆ ఇంటిని 4,500కు బేరం పెట్టించాడు .అయ్యర్ కు లోపలభయంగా ఉంది .తనపుస్తకాలకు సరిపడా ఇల్లు ఎక్కడదొరుకుతుంది ఇవన్నీ తీసుకు వెళ్ళటం ఎలా అని చింతిస్తూ వాకిట్లో కూర్చున్నాడు .ఇంటాయన సేహితుడు అటు వెడుతుంటే యజమాని ఇల్లు అమ్ముతున్నారని బజానా కూడా తీసుకొన్నారని ,తనకు చెబితే ఇంకో వంద పెంచి కొనే వాడినికదా ‘’అన్నాడు అయ్యర్ .ఆయన ‘’ఏడాదిక్రితం మీకు చెబితే కొనలేను అన్నారట కదా .మీరు ఎక్కడో పెద్ద ఇల్లు కట్టిస్తున్నారనీ చెప్పాడు మా వాడు ‘’అనగా ,అయ్యర్ ‘’అప్పుడు కొనాలనిపించలేదు ఇప్పుడు కొనాలని ఉంది మీరు ఇంటిని నాకు ఇప్పించేట్లు సాయం చేయండి ‘’అన్నాడట దీనంగా .ఆసాయంత్రం ఆ మిత్రుడే వచ్చి ‘’మీ యజమాని తీసుకొన్న బయానా తిరిగి ఇచ్చేశాడట ఇల్లు మీకే అమ్ముతాడట ‘’అని కమ్మని వార్త చెప్పాడు .నెల ఆతర్వాత ఆఇల్లుకొని చెట్టి గారి స్మృత్యర్ధం ‘’త్యాగరాజ విలాసం ‘’అని పేరుపెట్టాడు అయ్యర్ .
1906లో అయ్యర్ ‘’వే౦బత్తురార్ తిరవిళై యాడార్’’పురాణాన్ని పరిశోధన అంశాలతో ,పద పట్టికతో సహా పా౦డిత్తురై తేవర్ ఆర్ధికసాయం తో ప్రచురించాడు .తమిళ సంఘం వారి పరిశోధన ప్రచురణ ‘’సెందమిళు’’కు వ్యాసాలూ రాయమని తేవర్ కోరగా ,అయ్యర్ తాను పరిశోధిస్తున్న ‘’తిరువారూర్ ఉలా ‘’ను ఆపత్రిక లో ధారావాహికంగా ప్రచురించి దాని కీర్తి ప్రతిష్టలు పెంచాడు .తర్వాత మీనాక్షి సుందరం పిళ్ళై రాసిన ‘’తనియూర్ పురాణం ‘’,మణ్ణి పడిక్కరై’’పురాణాలను 1907 డిసెంబర్ లో ప్రచురించాడు అయ్యర్ .
1908లో జైలులో ఉన్న దక్షిణ భారత తొలి నౌకా నిర్మాత ,ప్రముఖ దేశ భక్తుడు వ.ఉ.చిదంబరం పిళ్ళై అయ్యర్ కు ఉత్తరం రాస్తే తనిఖీలన్నీ పూర్తయి అయ్యర్‌కు చేరింది . తిరుక్కురళ్ గురించి ఆయన చేస్తున్న అధ్యయనం ,దాన్ని ఇంగ్లీష్ లోకి అనువాదం చేస్తున్న సంగతి రాశాడాయన .ఆయనకు వచ్చిన సందేహాలను తెలియ అరచగా ,అయ్యర్ వెంటనే తీర్చాడుకూడా .
అయ్యర్ కి స్వంత ప్రెస్ ఉంటె బాగుంటుంది అని తిరువాడు దురై పీఠాధిపతిఅంబలవాణ దేశికర్ భావించి అయ్యర్ తో చెప్పగా ‘’నా సమస్యను అర్ధం చేసుకొని ప్రెస్ ఏర్పాటు చేస్తామని అన్నందుకు కృతజ్ఞతలు .నా పరిశోధన -ప్రెస్ విషయాలు చూడటం తో కుంటు పడుతుంది .మీఆజ్ఞ మన్నించనందుకు క్షమించండి ‘’అన్నాడు వినయంగా .
అ నాటి గవర్నర్ కార్మైకేల్ పురాతత్వ శాఖ చూడటానికి వస్తున్నట్లు కబురు చేయగా ,అపూర్వ విగ్రహాలు ,కళా ఖండాల గురించి ఆయనకు ఎలా వివరించాలో సందేహ పడుతున్న ఆ శాఖాధిపతి,అయ్యర్ ను సహాయమడిగితే ,గవర్నర్ దంపతులతో పాటు వెంట ఉండి వాటి ప్రాముఖ్యాలను చరిత్రను సంపూర్ణంగా వివరించగా ,అధికారి ఆంగ్లం లోకి అనువాదం చేసి వారికి తెలియజేశాడు. గవర్నర్ దంపతులు చాలా సంతోషించారు .గవర్నర్ ఫోటో తీసుకోవాలని అక్కడ వారు అనుకొంటుంటే గవర్నర్ అంతబాగా వివరించిన ‘’పండిట్ ‘’ఎక్కడా అని ఎదురు చూస్తున్నాడు .గవర్నర్ అయ్యర్ ను తన ప్రక్కన కూర్చోపెట్టుకొని ఫోటో దిగాడు .అయ్యర్ భావ ప్రకటన జాతి భాషా పరమైన సరిహద్దులు దాటి ఆన౦దాన్ని,గౌరవాన్ని ,ప్రాముఖ్యతను చేకూర్చింది .
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -16-11-21-ఉయ్యూరు