అవస్యందిత పద ప్రయోగ హాస్యం
విచిత్రంగా హృదయాహ్లాదంగా నడిచే సంభాషణ అవస్య౦దితహాస్యం కిందకు వస్తుందన్నారు మునిమాణిక్యం మాష్టారు .ఉదాహరణ –శివుడు గంగను నెత్తికి ఎత్తించు కొన్నాడు .’’ఎవరయ్యా నెత్తి మీద రమణి ?అని పార్వతి అడిగితె ,’’ఆమె మనిషికాదు గంగ ‘’ వేసవిలో నీరు దొరుకుతుందో లేదో అని ముందు జాగ్రత్తగా తెచ్చి దాచాను ‘’అన్నాడు శివుడు .’’నీరు అయితే మొహం కనిపిస్తోంది ఏమిటి ?’’అని మళ్ళీ ప్రశ్న .’’అది ముఖం కాదు కమలం ‘’అన్నాడు .’’పువ్వు అయితే ఆ మిలమిల్లాడే కళ్ళు ఏమిటి ?”’’’అవి కళ్ళు కాదు బంగారం! అవి చేపలు ‘’అన్నాడు .నవ్విన శాంకరి ‘’తెల్లని కంఠం కనపడుతో౦దేమిటి ?’’.’’అది శంఖం లే ‘’అన్నాడు .ఇలా సాగుతుంది .ఆమెకు అసలు సంగతి తెలుసు .కానీ మొగుడితో వేళాకోళ౦ ‘’ఆడటమే .ఇందులో ముఖం కమలం ,క౦ఠం శంఖం గా పోల్చటం కవి సమయం .ఇందులో గంగ వర్ణనతో పాటు ,పార్వతి ని ఉడికించటం కూడా ఉంది .ఇదంతా ఆచార్య బిరుదురాజు రామరాజు గారి పుస్తకం నుంచి గ్రహించానని మునిమాణిక్యం చెప్పారు .
మరో ఉదాహరణ –భార్యా భర్తలు ఉదయం కాఫీ తాగుతున్నారు .ఆమె ‘’ఏమండీ రాత్రి అంతా పక్క మీద దొర్లుతూనే ఉన్నారు .నిద్ర పట్టలేదా ?కళ్యాణీ అని కలవరించారేమిటి ? చెబితే ,నేనూ సంతోషిస్తాను కదా ‘’అన్నది .అతడు ‘’నిన్నసాయంత్రం కల్యాణి అనే గుర్రం పై వంద రూపాయలు పందెం కాశాను రెండు వందలు వచ్చాయి ఆ సంతోషం తో నిద్రరాక దొర్లాను .నాకు వచ్చిన దాన్లో సగం వంద నీకిస్తాను ‘’అని కవరింగ్ ఇచ్ఛి ,వంద చేతికిచ్చాడు .ఆ సాయంత్రం ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చిన భర్త తో ‘’మీరు పందెం కట్టిన గుర్రం కల్యాణి మధ్యాహ్నం ఫోన్ చేసింది ‘’అన్నది అతడు ‘’దేశం తెలివిమీరింది .గుర్రాలు కూడా ఫోన్లు చేస్తున్నాయి ‘’అని తప్పించుకొన్నాడు నిజం ఇద్దరికీ తెలుసు .భార్యాభర్తలమధ్య ,జరిగిన సురుచిర ,సుషమ హాస్యంఅన్నారు మాష్టారు .ఇదంతా ఒక క్రీడాత్మక వ్యాపారం.’’నోరు జారిన మాటకు వేరే అర్ధం చెప్పటం అవస్యందిత హాస్యం ‘’అంటారు అని ముట్నూరు కృష్ణారావు గారు అర్ధం చెప్పారని మునిమాణిక్యం అన్నారు .కావాలనే ఒక మాట అని ,ఒక రకం గా అర్ధం చేసుకో నిచ్చి ,,మళ్ళీ దానికి రమణీయ మైన అర్ధం చెప్పటానికి అవస్యందిత హాస్యం అంటారు అని వివరణ ఇచ్చారు మాస్టారు .ఇది కాంతా సంమితమైన క్రీడ గా ,,మనోహర వాగ్విలాసంగా భావింప జేయటం లో సాహిత్య పరమైన సొగసు ఉంది ..ఇందులో భావ వక్రత లేదు ,అర్ధ వైభవమూ లేవు.కొన్ని శబ్దాల ప్రయోగం వలననే హాస్యం సాధించ బడింది .ఇదీ శబ్దాశ్రయ హాస్యమే అంటారు మాస్టారు .
శ్రీ మునిమాణిక్యం మాస్టారు గారికి కృతజ్ఞతలతో
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -4-12-21-ఉయ్యూరు