21-అపలాప పద ప్రయోగ హాస్యం
అపలాపం అంటే మోసపుచ్చటం .ఈ మోసం చేయటం తమాషాకు చమత్కారసాధనానికీ ,మాత్రమె .దీనివలన సహృదయ సమాదరణీయమైన మధురానుభూతి కలుగు తుంది .ఉదాహరణ –సామాన్య అయిన నాయిక ప్రియుడితో ‘’ఒకరికి చేయి, మరొకరికి కాలు ,మరొకడికి నడుమిచ్చి కూర్చున్నాను బావా ‘’అన్నది అంటే ఆమె ఎవరినొఆదరి౦చి౦ది అనుకోవాలని ఆమె భావం .నిగ్గు తేల్చుకోవటానికి ‘’ఎవరికి చేయి, కాలు ,నడుమిచ్చి కూకున్నావే పిల్లా ‘’?అని అడిగాడు .ఆమె గడుసుగా ‘’గాజులకు చేయిచ్చి ,అఅందెలకు కాలిచ్చి వడ్డాణానికి నడుమిచ్చి కూకున్నా ‘’అంది .అన్ని అలంకారాలతో అతడికోసం వేచి ఉన్నానని సూటిగా చెప్ప కుండా వ్యంగ్యం గా అదే విషయాన్ని తెలియ జేసింది అన్నమాట .దీనినే వ్యంజనం అంటారని మునిమాణిక్యం మాస్టారువాచ .
అసంబద్ధ ప్రయోగ హాస్యం –వివేకరహిత౦గా , అస౦బద్ధంగా పిచ్చివాడు, తాగుబోతు మాట్లాడుతారు .వాళ్ళమాటలు జుగుప్స కలిగించినా ,నవ్వు పుట్టిస్తాయి .ఒక సారి నెహ్రు ఒక పిచ్చాసుపత్రి సందర్శనకు వెళ్ళాడు .అందులో ఒక మంచి డ్రెస్ వేసుకోన్నవాడిని ఆస్పత్రి అంతా తిరిగి చూపించటానికి ఏర్పాటు చేశారు .అతడు అంతా చూపించాక నెహ్రు ‘’నేనెవరో తెలుసా ?’’అని అడిగాడు .అతడు తెలియదు అంటే ‘’జవహర్ లాల్ నెహ్రు ను ‘’అన్నాడు .ఆపిచ్చి పెద్దాయన ‘’భయం ఏమీ లేదు .నీకు త్వరలోనే నయమౌతుంది .నేనూ మొదట ఇక్కడికి వచ్చినప్పుడు నేను మహాత్మా గాంధీ అని చెప్పుకొనే వాడిని డోంట్ వర్రీ ‘’అంటే నెహ్రు పగలబడి నవ్వకేం చేస్తాడు ?.
ఇద్దరు పిచ్చివాళ్ళు ఆస్పత్రి ఆవరణలో చెట్టుకింద కూచుని మాట్లాడుకొంటున్నారు. ఒకడు పిడికిలి మూసి ‘’నా చేతిలో ఏముందో చెప్పు ‘’అనగా రెండో వాడు ‘’పొద్దున్న మీఆవిడ వచ్చింది కదా ఆమెనే గుప్పిట్లో దాచావ్ ‘’అన్నాడు వాడు గలగలా నవ్వి మళ్ళీ ఆలోచించి చెప్పు అంటే ‘’ఏనుగు ‘’అనగా కాదు అంటే నేను చెప్పలేను నువ్వే చెప్పు అంటే వాడు ‘’స్టేట్ బాంక్ ఆఫ్ ఇండియా ‘’అని పగలబడి నవ్వాడు .మొదటివాడు ‘’నీ చేతిలోకి ఎలా వచ్చింది పోద్దునేగా నేనుదాన్ని జాగ్రత్తగా జేబులో దాచుకొన్నాను .ఆదినాది నాకిచ్చేయ్ ‘’అన్నాడు .విన్నవాళ్ళు పళ్ళు ఇకిలించి నవ్వుకొన్నారు .
మునిమాణిక్యంగారు ఒకసారి పిచ్చి ఆస్పత్రికి వెళ్లి అక్కడ తెలిసినవాడిని ‘’ఏరా రామూ ‘’అంటే వాడు ‘’నేను రాముకాదు’’అంటే ఆశ్చర్యపోయి మాష్టారు ‘’అయితే నువ్వెవరు ?’’అంటే ‘’నేను ఫ్రాన్స్ రాజు నెపోలియన్ ‘’అన్నాడు .నవ్వుకొన్నమాష్టారు ‘’ఎవరు చెప్పారు ?’’అంటే ‘’దేవుడు దేవుడు చెప్పాడు ‘’అని గట్టిగా అరిస్తే ,పక్కగదిలోనుంచి ఒకడు పరిగెత్తుకొచ్చి ‘’నేను నీకు ఎప్పుడు చెప్పాన్రా వెధవా ?’’అన్నాడు ఈ సంభాషణలో ఒకరి మనసు ఒకరు నొప్పించలేదు క్షుద్రభావమూ లేదు .నిర్మల స్ఫుహనీయ హాస్యం ఇది అన్నారు మాష్టారు .
శ్రీ మునిమాణిక్యం మాస్టారు గారికి కృతజ్ఞతలతో
మీ- గబ్బిట దుర్గాప్రసాద్ -6-12-21-ఉయ్యూరు