మన మరుపు వెనుక మన వెండితెర మహానుభావులు -7
7-సినిమాపాటకు శ్రావ్యత ,వేగమూ పెంచిన కొదండపాణి
మానవ జీవితంపై భారతీయ ఆధ్యాత్మిక ప్రభావాన్ని తెలియజేసే ‘’ఇదిగో దేవుడు చేసిన బొమ్మ-ఇది నిలిచేదేమోమూడు రోజులు –బందధాలేమో పదివేలు ‘’—రాగం ద్వేషం రంగులురా –భోగం భాగ్యం తళుకేరా-కునికే దీపం తొణికే ప్రాణం –నిలిచే కాలం తెలియదురా ‘’అనే మైలవరపు గోపి రాసిన పాటకు స్వీయ సంగీత దర్శకత్వంలో సుశీల గారితో కలిసి ‘ అందులోని విషాదభావాన్ని గుండెలు కరిగీలా ఆవిష్కరించి ’ పండంటి కాపురం సినిమాలో పాడి వెండి తెరకు పరిచయమైనారు ఎస్పి కోదండపాణి అనే శ్రీపతి పండితారాధ్యుఅల కోదండ పాణి .గుంటూరు జిల్లాలో జన్మించి బాల్యమంతా అక్కడే గడిపారు చిన్నప్పుడే సంగీతం నేర్చి తర్వాతహార్మోనియం అభ్యసించారు .తన గాత్ర ,హార్మోనియం లతోందర్నీ అలరి౦పజేసేవారు .శ్రీ పీసపాటి, శ్రీ అబ్బూరి వరప్రసాదరావు గార్ల పౌరాణిక నాటక బృందాలలో కలిసి పని చేశారు .ఆయన పద్యం పాడితే వన్స్ మోర్ కొట్టాల్సింది అంత గొప్పగా పాడేవారు .పాటకచేరీలలో తానూ ఒకటి రెండు పాడుతూ ఉండేవారు .స్తబ్దుగా ఉన్న కచేరీలను తనగాత్రం తో హుషారేక్కించి ఎలేక్ట్రిఫై చేసేవారు .
తనలోని కళను తానె గుర్తించి ఇక్కడకంటే మద్రాస్ లో బాగుంటుందని భావించి చేతి ఉంగరం అమ్మి మద్రాస్ చేరారు .ఎందఱో సంగీత దర్శకుఅలను కలిసినా ,ప్రయోజనం లేకపోయింది .అనుకోకుండా శ్రీ అద్దేపల్లి రామారావు గారి చిత్ర నిర్మాణ సంస్థ రేణుకా పిక్చర్స్ వారి ‘’నా ఇల్లు ‘’సినిమాలో 1953లో బృందగాగానం లో పాడే అవకాశం మాత్రం మొదటి సారిగా దక్కింది .రెండేళ్ళు గుంపులో గోవిందా గా బృందగానం తోనే గడిపారు .కసి పెరిగింది తనకంటూ ఒక ప్రత్యేకత సాధించాలని నిశ్చయానికి వచ్చి పట్టు వీడని విక్రమార్కునిలా అనేకరకాలైన పాటలను సాధన చేశారు .
అదృష్టం తలుపు తట్టి ప్రముఖ సంగీత దర్శకులు శ్రీసుసర్ల దక్షిణా మూర్తి గారివద్ద సహాయకునిగా ,హార్మోనిస్ట్ గా అవకాశం వచ్చి పని చేశారు .సుసర్ల వారి వద్ద పొందిన అనుభవంతో ఆయన సంగీత దర్శకత్వం లో 1955లో వచ్చిన ‘’సంతానం ‘’చిత్రం లో పాడే అవకాశం వచ్చింది .తర్వాత స్వరబ్రహ్మ కెవి మహదేవన్ గారి వద్ద అయిదేళ్ళు తపోదీక్షతో బాధ్యతలు నిర్వర్తించారు. స౦గీతం లోని మెలకువలన్నీ ఔపోసనం పట్టారు .
ఆ సమయం లో హాస్యనటుడు శ్రీ బి పద్మనాభం రేఖా అండ్ మురళి ఆర్ట్స్ పేరుతొ అనేక నాటకాలు ప్రదర్శించేవారు ఆ సంస్థలో సంగీత దర్శకులుగా కొదండపాణి తన ప్రతిభనంతా చాటి సంగీతం సమకూర్చారు ఈ సంస్థలో పొందిన అపార అనుభవం, కీర్తి వలన 1961లో వచ్చిన ‘’కన్నకొడుకు ‘’చిత్రానికి సంగీత దర్శకత్వం వహించారు .1962లో కళా వాచస్పతి శ్రీ కొంగర జగ్గయ్య గారు నిర్మించిన ‘’పదండి ముందుకు ‘’సినిమాకు స౦గీత దర్శకులయ్యారు .ఇందులో సినారె రాసిన ‘’ఎవరిని అడగాలి బాపూ ఏమని అడగాలి ‘’,పాటకు కూర్చిన బాణీ ,సాహిత్యం హృదయాలను ద్రవింపజేస్తుంది .మైలవరపు గోపి రాసిన ‘’గాంధీ పుట్టిన దేశం –ఇది రఘురాముడు ఏలిన రాజ్యం –ఇది సమతకు మమతకు సందేశం ‘’పాటను సుశీలగారితో పాడించి అద్భుతమైన ఎఫెక్ట్ తెప్పించారు .ఇందులోనే ‘’ఓరోరి గుంటనక్కా –ఊరేగే ఊరకుక్కా ‘’సరదాగా సాగే దాశరధి గారిపాట .సిచుయేషన్ కు తగ్గ రీతిలో మలిచారు ‘’చిత్ర నిర్మాత భావనారాయనగారి మంచి రోజులొస్తాయి ,బంగారు తిమ్మరాజు ,తోటలో పిల్ల కోటలో రాణి,లోగుట్టు పెరుమాళ్ళకెరుక సినిమాలకు వరుసగా సంగీతం అందించారు
బాలుగా పిలువబడే శ్శ్రీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ను పద్మనాభంగారు తీసిన ‘’శ్రీశ్రీశ్రీ మర్యాద రామన్న ‘’సినిమాలో మొదటిఆవకాశమిచ్చి పాడించారు. బాలు సంగీత ప్రస్థానానికి తొలిఅడుగులు వేయించింది కోదండ పాణి గారే చాలాకాలం వరకు ఇద్దరి ఇంటిపేర్లు ఒకటే అని ఇద్దరికీ తెలీదు .తానూ సంగీతం చేసే ప్రతి పాట శ్రావ్యంగా ఉండాలనీ,సాహిత్య విలువ ఏమాత్రం దెబ్బతినకూడదని కొదందపానణి దృఢమైనాభిప్రాయం .మంచి బాణీల వోణీలు వేసినకోదందపాణి అరుడైనసంగీతదర్శకులు .బొమ్మను చేసీ ,ప్రాణము పోసి అనే దేవతలోనిపాట సుఖ దుఖాలలో ఇది మల్లెల వేళ యనీ ,శ్రీరామకధలో జగమే రామమయం,జ్వాలాద్వీప రహస్యం లో చుక్కలన్నీ చూస్తున్నాయి గీతాల మాధుర్యం ఎప్పుడూ హాంట్ చేస్తూనే ఉంటుంది . .
అదృష్ట దేవతలో వీటూరి పాటకు ఘంటసాలగారి చే పాడించిన ‘’కాలం కలిసివస్తే ‘’మంచి హిట్ సాంగ్ .బస్తీ బుల్ బుల్ సినిమాలో చేసిన ట్యూన్స్ అన్నీ బల్ బలేగా ఉన్నాయి –ఈ కళ్ళలో ఈ గుండెలో ఈమదురాలబాధ నిండెనులే ,ఏ ఎండా కాగోడుగుపట్టు రాజా సైటైరికల్ గా రాత,గానం ఉంటాయి .పద్మనాభం నిర్మించిన కథా నాయకి మొల్ల కు కొదండపాణి సంగీతం కూర్చి సుమధుర స్వరాలు పూయించారు .జగమే రామమయం మనసేఅగణిత తారక నామ మయం ,అద్భుతంగా ఉంటె –‘’తిక్కన్న పెళ్ళి కొడుకాయేనే మా మొల్లమ్మ పెళ్లి కూతురాయేనే ‘’పాటకవ్విస్తే మొల్ల రాసిన ఆణిముత్యపు పద్యాలు సుశీలమ్మతో పాడించి దైవత్వం కల్పించారు .గోపాలుడు భూపాలుడుసినిమాలో టి.ఎం.సౌందరరాజన్ తో ‘’ఇదేనా తరతరాల చరిత్రలో జరిగినదీ ‘’పాట పాడించి గత చరిత్రను ముందు నిలిపారు .ఇందులో బాగా హిట్ అయినపాట ‘’కోటలోని మొనగాడా వేటకు వచ్చావా –జిన్కపిల్లకోసమో ఇంకా దేని కోసమో ? సినారే రాయగా మహా హుషారుగా సుశీల ఘంటసాల గార్లతో పాడించారు .మంచిమిత్రులు సినిమా కు మ్యూజిక్ అందించి –సినారె రాసి న –ఎన్నాళ్ళో వేచిన హృదయం ఈనాడే ఎదురౌతుంటే –ఇన్ని నాళ్ళు దాచిన హృదయం ఎగిసి ఎగిసి పోతుంటే –ఇంకా తెలవారదేమి ఈ చీకటి వ విడిపోదేమీ ?’మాధుర్యం, స్పీడ్ భావ పరవశ్శత్వం ఉద్వేగం మిత్రుల ఆరాటం అన్నీ కలగలుపుగా ఘంటసాల బాలుతో పలికించిన తీరు ఆపాటను చిరస్థాయిని చేసింది .పద్మనాభం తీసిన శ్రీరామకద చిత్రం లో నారదుడు వేసిన పద్మనాభం శ్రీరామజననం నుంచి సీత వియోగం దాకా తల్లడిల్లే రాముని గతం గుర్తు చేసే పాట తో సినిమా ప్రారంభమౌతుంది .కొదండపాణి సంగీత దర్శకత్వం వహించి వీటూరి రాసిన భక్తీ భావం పొంగిపొరలే సుశీలతో కలిసిపాడిన –‘’రావేలా కరుణాలవాలా డరిసెన మీయగ రావేలా –నతజనపాల సన్నుతగుణ లీలా -కమలాలోలా కాంచన చేల ‘’ బహుకమ్మని గీతం ,సర్వకళా సారము నాట్యము,మాధవా మాధవా నను లాలించరా ‘’మరో భక్తిమందార౦ .సీనియర్ సముద్రాల రాసిన ‘’రామకధా శ్రీరామకద –ఎన్నిమార్లు ఆలించినగానీ ఎన్నిమార్లు దరిసిన్చినగానీ –తనివి తీరాదీ దివ్య కథా ‘’బాలుతో పాడించి చిరయశస్సు చేకూర్చారు .పేదరాసి పెద్దమ్మ చిత్రం లో శ్రీశ్రీ రాసిన –కులుకు నడకల చినదానా –తళుకు బెళుకుల నెరజాణా’’,,పిఠాపురం మాధవ పెద్దిలతో కొసరాజు రచన –వీరులమంటే వీరులం రణ శూరులమంటే ‘’అనే సరదా గీతం ,చిల్లర భావనారాయణతో రాయించి శ్రీ మంగళం పల్లి బాలమురళీ కృష్ణగారితో పాడించిన –శివ మనో రంజనీ వరపాణీస్వరవాణీ కనవే ‘’భక్తికి పరాకాష్టగా ఉంటుంది .నేనంటే నేను సినిమాలో ఆల్ టైం రికార్డ్ పాట-ఓ చిన్నదానా నన్ను విడిచి పోతావటే-పక్కనున్న వాడిమీద నీకు దయరాదటే—గుంతలకిడి గుంతలకిడి గుమ్మా ‘’ గుంతలకిడి విన్యాసంతో ఊపేశారు బాలు కొసరాజు రచనకు .మంచి కుటుంబం సినిమాలో ‘’ఎవరూ లేని చోటా ఇదిగో చిన్నమాట ‘’త్యాగశీలవమ్మా మహిళా అనురాగ శీలవమ్మా –తోటివారికి సకలము నొసగే కరునణామయివమ్మా ,మనసే అందాల బృందావనం వేణు ‘మాధవుని పేరే మధురామృతం ‘’,’’నీలోఏముందో ఏమో ఏమో మనసు నిన్నే వలచింది ‘’వంటి పాటలకు తెనేలోలకే బాణీలు కూర్చారు .అలాగే ఇందులోనే ‘’తుళ్ళి తుళ్ళి పడుతోంది మనసు ,నరాననెరా నెరబండీ జరాజరా నిలుపుబండి,డింగ్ డాంగ్ డింగ్ డాంగ్ ,ప్రేమించుట పిల్లలవంతు వంటి కిలాడి సరదాపాటలకూ జీవం పోశారు పొట్టిప్లీడరు సినిమాలో సన్నీ వేశానికి తగ్గ ట్యూన్ కట్టి హిట్ చేశారు .దేవత సినిమాలో ‘’ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి ఇల్లాలే ఈజగతికి జీవనజ్యోతి ,కన్నులలో మిసమిస కనిపించనీ ,తొలివలపే పదే పదే గీతాలకు బాణీలతో అజరామరం చేశారు .జ్వాలాద్వీప రహస్యం లో –ఎన్నడు చూడని అందాలు కన్నులముందర తోచెనులే ‘’పాటను సుశీలగారితో గొప్పగా పాడించారు .పదండిముందుకు సినిమాలో తమాషా దేఖో తస్సాదియ్యా ‘’,మనసిచ్చిన నచ్చిన చినవాడా మొనగాడా పాటకు జానకమ్మతో భలేగా పాడి౦చటమే కాదు ,,మహమ్మద్ రఫీ గారితో నిర్మాత నటుడు జగ్గయ్య రాసిన ‘’మంచికి కాలం తీరిందా ,మనిషికి హృదయం మాసిందా’’ హృదయాలను తాకింది
1961లో జగ్గయ్య దేవిక కృష్ణకుమారి ల కన్నకొడుకు సినిమాలో జగ్గయ్యరాసిన ‘’రుణరుణ కింకిణిచరణా’’,నామదిలోని కోరికలు అల్లెను పూలమాలికలు ,పూవులు పాపులు దేవుని చిరునవ్వులే నేలపైన చుక్కలు ,మొదలైన గీతాలకు శ్రావ్యమైన బాణీలు కట్టి విజయం సాధించారు .1955లో వచ్చిన సంతానం సినిమాలో బృందగానం లో నాగయ్యగారి నా ఇల్లు సినిమాలో నేపధ్యగానం లో కొదందపాణి పాల్గొన్నారు
మొత్తం 101సినిమాలకు సంగీత దర్శకత్వం చేసిన కొదడపాణి అతి తక్కువవయసు 42.ఏళ్ళకే 5-4-1974 న గంధర్వ లోకం చేరుకొన్నారు .గాన గాంధర్వ బాలసుబ్రహ్మనం గారిని వెండి తెరకు పరిచయం చేసిన ఈ మహనీయుని జ్ఞాపకార్ధం బాలు మద్రాసులో కొదందపాణి రికార్డింగ్ దియేటర్ నెలకొల్పి తన కృతజ్ఞతచాటుకొన్నారు .కోదండపాణి శ్రీరాముని కోదండం నుంచి శరాలు లక్ష్యం వైపు వెళ్లి సాధించి తిరుగులేనివి అనిపించుకున్నట్లు ,కోదండ పాణి శ్రావ్యమైన వేగంతో కూడిన బాణీలు కూడా ప్రేక్షక హృదయాలను పూల బాణాలుగా తాకి ,అలరించి మెప్పించి మహదానందంతో పరవశం కలిగించాయి.ఆ పేరుకు ఆయన సార్ధకత్వం తెచ్చారు .
సశేషం –
మీ గబ్బిట దుర్గాప్రసాద్ -29-12-21-ఉయ్యూరు