మన మరుపు వెనుక మన వెండితెర మహానుభావులు -26
26-‘’వినరా సూరమ్మ కూతురు మొగుడా ‘’పాటఫేం –అప్పలాచార్య
1966లోనే పొట్టిప్లీడరు సినిమాలో పద్మనాభానికి ‘’పోపోపో పొట్టి ప్లీడరు’’పాటరాసినా ,1972లో వచ్చిన ఇల్లు ఇల్లాలు సినిమాలో రాజబాబు ,రామాప్రభాలకు స్టోరీ సాంగ్ ‘’వినరా సూరమ్మ కూతురు మొగుడా వివరము చెబుతాను ‘’పాట వచ్చేదాకా కవి అప్పలాచార్య పేరు ఎవరికీ తెలియదు ఈ పాత దాదాపు మూడు దశాబ్దాలు ప్రతి ఇంట్లోనూ మారు మోగింది అంతటి హిట్ సాంగ్ రాశారు అప్పలాచార్య .అసలుపేరు
కొడకండ్ల అప్పలాచార్య సినిమాలలో హాస్య సన్నివేశాలను, హాస్య గీతాలను వ్రాయడంలో ప్రసిద్ధి చెందా. ఈయన సముద్రాల రాఘవాచార్య మేనల్లుడు. పద్మనాభం సినిమాలకు ఎక్కువగా హాస్యగీతాలను వ్రాశారు[1].1966నుంచి 86 వరకు 20 ఏళ్ళు సిని రచన చేశారు
3-5-1999లో మద్రాస్ లో చనిపోయారు .
70ల్లోనే అప్పలాచార్య చేసిన కొన్ని ప్రయోగాల్ని చెప్పుకుతీరాలి. ఒకటి ఇల్లుఇల్లాలు అనే సినిమాలో “వినరా సూరమ్మ కూతురు మొగుడా విషయం చెబుతాను అసలు విషయం చెబుతాను” అనే పాట. బహుశా తెలుగులో ఇలాటి పాట మరోటి లేదనుకుంటాను. మంచి సస్పెన్స్, హాస్యం, చమత్కారం అన్నీ సమపాళ్ళలో కలబోసిన పాట ఇది. కారు మబ్బులూ కమ్మిన వేళా…
కాకులు గూటికి చేరే వేళ…కా..కా…
చందమామ తొంగి చూసేవేళా …
సన్నజాజులు పూసే వేళ ..అహా…ఓహో…
ఒంటిగ నేనూ ఇంట్లో ఉంటే..
ఉయ్యాల ఎక్కీ ఊగుతు ఉంటే
లాలీ లాలీ లాలీ లలీ లాలీ లాలీ లాలీ లలీ లో…
ఏం జలిగిందీ…
తలుపు కిర్రునా చప్పుడైనది…
గుండె ఝల్లునా కొట్టుకున్నది…
తలుపు కిర్రునా చప్పుడైనది…
గుండె ఝల్లునా కొట్టుకున్నది…
మెల్ల మెల్లగా కళ్ళు తెరచి
నే వచ్చినదెవరో చూశాను…
ఎవలాలూ…
నల్లనివాడు…గుంట కన్నుల వాడు ..
గుబురుమీసాల వాడు …
అయ్యబాబోయ్…
ఆరడుగుల పొడుగు వాడు …
ముద్దులిమ్మని నన్ను అడిగినాడు …
ఏయ్ వాణ్ణీ నే నలికేత్తాను….
నేనివ్వ నేనివ్వ రానివ్వనంటూ మొగము దాచుకొన్నా…
పోనివ్వ పోనివ్వ ముద్దివ్వమంటూ జడను లాగినాడూ …
అమ్మా…నాన్నా….
అమ్మా…నాన్నా…కాపాడమంటూ…అల్లాడిపోయాను..
అయినా గానీ వదలక నన్ను ఒడిసిపట్టినాడు…
అంతలో వచ్చింది… ఏవిటీ మూల్చా?
కాదు… మా అమ్మ… హి హి ఏవంది?
వెళ్ళవే నా తల్లి… వెళ్ళవే అమ్మా…
ముద్దులిస్తే… నీకు డబ్బులిస్తాడు…
మంచి బట్టలిస్తాడు… డబ్బులిస్తాడు…
మంచి బట్టలిస్తాడు….అనీ ముందుకు తోసింది
హా అది తల్లా!!.. కాదు లాచ్చసి..
పిశాచి…దెయ్యం….
తలవాతేవైందో చెప్పు …
తప్పనిసరియై వెళ్ళేను .సిగ్గుపడుతు నిలుచున్నాను..హా..
గదిలోకెత్తుకు పోయేడు కథలూ కబుర్లు చెప్పేడు…
తన దుప్పటిలో చోటిచ్చాడు…
ఛీ.. కులతా పాపాత్ములాలా…
నువ్వు నాకొద్దు.. ఫో.. వాడిదగ్గిరికే పో…
అంత కోపం ఎందుకయ్యా …అప్పుడు నావయసైదయ్య …
ఏవిటీ అప్పుడూ నీకైదేళ్ళా..ఆ…హహ..
అంత కోపం ఎందుకయ్యా… అప్పుడు నావయసైదయ్యా …
ఆ వచ్చినదీ మా తాతయ్య…
తాతయ్య….తాతయ్యా…
తకతయ్య… మలి చెప్పవేం….
తాతయ్య….తకతయ్య..
తాతయ్య….తకతయ్య..
తాతయ్య….తకతయ్య.. హహహ..
తాతయ్యా…నేనూ ఎవలో అనుకున్నాను….
తాతయ్య కొంప ముంచేశాలు.. హహహహహ..
- అలాగే, పూర్తి హాస్యం కోసం రాసిన మరోపాట “ఆకాశం నుంచి నాకోసం వచ్చావా, పొంగే అందాల మిఠాయిపొట్లం తెచ్చావా” అనేది. దీన్లో చాలా గమ్మ్తౖతెన పోలికలు వాడటం జరిగింది. ఉదాహరణకి, “నీ జడపిన్ను నా తలరాతకు పెన్ను, నీ సిగపువ్వు బుజబుజరేకుల లవ్వు, నీ చిలిపి బిడియం అమృతంలో కూరిన వడియం, నీ పెదవులు రెండు నా ముక్కుకు దొండ పండ్లు” అనే చరణంలో ఉన్న ఉపమానాలు ఎప్పుడూ ఎక్కడా విన్నవి కావు. 70ల్లో వచ్చిన మరో ప్రయోగం హిందీలో బాగా హిట్ అయిన పాటల ట్యూన్లకి తెలుగులో హాస్యపాటలు రాయటం.
“మీనా” చితానికి అప్పలాచార్య మాట, లను రాస్తున్నారు కలం బలం వుండి కూడా. అంగబలం లేమివల్ట (పసిద్భుడు కాలేకపోయిన రచయిత అప్పలాచార్య. ఇప్పుడు అతని శక్తిని పరీక్షించ బాధ్యతను అప్పగించి ది విజయనిర్మల ఇందులో. నెగ్గితే ఆఫర్లు వస్తాయి ఈ చిన్నతనంలో కృష్ణ, జగ్గయ్య ఎన్వీ? రాజబాబు; విజయ”) , చందకళ, ఎస్వరలక్షీ సూర్యకాంతం, రమా(ప్రభ, ఛాయాదేవి అల్టురామరింగయ్య, సాక్షి రంగా రావు – ముఖ్య ప్మాతధారులు నందినీలో నిర్మాణ నిర్వాహకుడిగ్గా వుండి, పనులన్నీ సామర్శ్య్యంతో చక్కబెట్టిన పివి రమ ణయ్య ఈ చితానికి నిర్మాత .ఛాయను వి ఎస్. అర్ స్వామి, కూర్పును కోటగిరి గోపాలరావు, కళను తోట నిర్వహిస్తున్నారు (శీ ఫిలింస్ విడుదల. మొత్తానికి. “మీనా కధను తనకే దక్కిం చుకొన్నాడు, రమణయ్య న్యాయం జయిస్తుంది, మంచితనం ఫలితాన్ని యిస్తుంది అని నిరు పించబడింది
ఎన్నో దు:ఖాలకు ఆలవాలమైన ఈ ప్రపంచంలో ఎన్నో అందాలు వున్నట్లే
కష్టాల మధ్యలో, కన్నీళ్ళ మధ్యలో, సరదాలు హాస్యాలు చలోక్తులు చమత్కారాలు వెల్లి విరిసి నవ్వుల పువ్వులవుతూ వుంటాయి.
.
అదే మానవ జీవితం- ఈ ప్రపంచం రచనల్లో హాస్యం సన్నగిల్లిపోయింది. హాస్యరస ప్రధానమైన కథ పత్రికలో కనిపించటమే అరుదైపోయింది – కనిపించినా అందులో హాస్యం పల్చగా వార్చినా గంజిలా వుంటోంది. ఇంక సినిమాల్లో హాస్యపు సన్నివేశాలు పెట్టి ప్రేక్షకుల్ని నవ్వించడానికి తెగ అవస్థ పడుపోతున్నారు-,
- “మోసగాళ్లకు మోసగాడు”
నక్క జిత్తుల నాగన్న పాత్రలో నాగభూషణం జీవించారు ..ఆ క్యారెక్టర్ ఊతపదం ‘అబ్బయ్య’ కూడా బాగా పేలింది. నాగభూషణం పై చిత్రీకరించిన పాట ‘ఎలాగుంది ఎలాగుంది అబ్బాయా’ కూడా సరిగ్గా కథకు సరిపోయింది. ఆదినారాయణరావు సంగీతం కూడా సినిమాకు ఊపు నిచ్చింది. కృష్ణ ఆస్థాన రచయిత అప్పలాచార్య నాగభూషణం పాత్ర ద్వారా కొంత కామెడీ అందించారు
విజయనిర్మల డైరెక్ట్ చేసిన మీనా సినిమాకు అప్పలాచార్య మాటలు రాస్తున్నారు .కలం బలం ఉన్నా అంగబలం లేక వెనకబడి పోయిన రచయితా
ఎన్నో దు:ఖాలకు ఆలవాలమైన ఈ ప్రపంచంలో ఎన్నో అందాలు వున్నట్లే
కష్టాల మధ్యలో, కన్నీళ్ళ మధ్యలో, సరదాలు హాస్యాలు చలోక్తులు చమత్కారాలు వెల్లి విరిసి నవ్వుల పువ్వులవుతూ వుంటాయి.
.
అదే మానవ జీవితం- ఈ ప్రపంచం రచనల్లో హాస్యం సన్నగిల్లిపోయింది. హాస్యరస ప్రధానమైన కథ పత్రికలో కనిపించటమే అరుదైపోయింది – కనిపించినా అందులో హాస్యం పల్చగా వార్చినా గంజిలా వుంటోంది. ఇంక సినిమాల్లో హాస్యపు సన్నివేశాలు పెట్టి ప్రేక్షకుల్ని నవ్వించడానికి తెగ అవస్థ పడుపోతున్నారు-,
హాస్యనటుడు పద్మనాభం సినిమా’’పొట్టిప్లీడరు ‘’లో పోపోపో పొట్టి ప్లీడర్ పాట తోపాటు ,మరపురానికధలో ‘’ఉలికి ఉలికి చిరునవ్వులోలికే పాపా తళుకు బెళుకు ‘’,చెల్లెలికోసం లో-కన్నీటి కోనేటిలో చిన్నారి కలువపూసింది ,నేనేంటే నేను లో ‘’బలే బలే నరసిమసామినిర, నిన్ను నంచుక తి౦టనురా ,’’కర్పూరహారతి లో –‘’కిల్లాడెంకటసామి బలే వకీలయా ‘’,శ్రీరామ కధలో –చారుచారు బలే చారు చామంతి విలే ‘’,మొల్ల లో –‘’తిక్కన్న పెళ్లి కొడుకాయెనే ‘’,జగజ్జెట్టీలు లో ‘’సోకైనమల్లెపువ్వు మీదా మగాడా నీకు మోజు లేదా ?’’,పగసాధిస్తా లో’’ఓ మై డార్లింగ్ నిన్ను విడిచి ‘’,మా మంచి అక్కయ్య లో –ఏమోఏమోఅడగాలనుకొన్నాను ‘’,అత్తా కోడళ్ళు లో –‘’బలేబాలే బావయ్యో గబగబా రావయ్యో ‘’,అనూరాధ లో ‘’యాదయ్యయాదయ్యజాజిరీ యదలోన యాదయ్య ‘’,కత్తికి కంకణం లో –గప్పం గప్పం కత్తులు బల్ గమ్మత్తైన కత్తులు ‘’,దైవం లేదా దైవం లేదా ‘’,జాతకరత్న మిడత౦ భొట్లు లో-‘’అమ్మమ్మయ్యో అయ్యయ్యయ్యో తాళలేని బాధరా ‘’,కనరావా ఓ ప్రియా ,’’చెలియా సఖియా ‘’,దయ చూడవే గాడిదా పాటలు, ‘’వీరమ్మ సంపద విషయంము వివరించి ‘’పద్యం,నా తమ్ముడులో –హేమ సుందరాకారా ‘’,మనసు మాంగల్యం లో –ఎలాఉన్నది ఎలాఉన్నది ‘’,ఆజన్మ బ్రహ్మ చారిలో –పెళ్ళిమానండోయ్ బాబూ కళ్ళు తెరవండోయ్ ‘’,’’వినుమా వేదాంతసారం ,అడవిన పూలకట్టేల పద్యం ,మాయామోహ జగమే సత్యమని ,ఇన్స్పెక్టర్ భార్య లో’’ చూడు చూడు చూడు ‘’,ద్రౌపది వస్త్రాపహరణం నాటిక ,’’నా వళ్ళంతా బంగారం ,నీ కళ్ళు చెదిరే సింగారం ,’’ఇల్లు ఇల్లాలు లో ‘’వినరా సూరమ్మ కూతురు మగడా ‘’,ఇల్లే ఇలలో స్వర్గమని ఇల్లాలే ఇంటికి దీపమని ‘’,గూడు పుఠానిలో –ఓమాయా ముదరమగ్గిన బొప్పాసుకాయా ‘’పద్యం ,’’ఓసీ మాయా పచ్చి అరటికాయా ‘’విరివిగా కన్నాలు వేసిన మొనగాడు మా తాత ‘’హాన్డ్సప్పు హాన్డ్సప్పు నాఎదుట కూర్చొనుట తప్పు ‘’పండంటికాపురం లో –‘’ఆడి పాడే కాలం లోనే అనుభవించాలి’’,తల్లీ కొడుకులు లో- వెయ వెయ ఇంకా వేయి ‘’,మమత లో –గరంగరం పప్పు ఇది బరం పురం పప్పు పాటలు రాశారు .
ఇవికాక మా౦గల్యభాగ్యం, హారతి ,అమ్మా నాన్న, దేవుడే గెలిచాడు ,పెద్దన్నయ్య ,పోరుగింటికాపురం ,వనజ గిరిజ ,జన్మజన్మల బంధం ,పల్లెసీమ, మొరటోడు ,,సావాసగాళ్ళు, లవ్ మారేజ్ , ,కిలాడి కిష్టుడు శాంతి ,సంఘం చెక్కిన శిల్పాలు ,సినిమా పిచ్చోడు ,అమాయకుడు కాదు అసాధ్యుడు, భోగిమంటలు సినిమాలకు పాటలు రాశారు. చివరి సినిమా,1986లో వచ్చిన ఆది దంపతులు సినిమాలో ‘’సాగి౦చరా మామ సంసారం సాగించారా ‘’చివరి పాట సత్యం సంగీత దర్శకత్వం లో రాశారు అప్పలాచార్య.
ఎక్కువగా కోదండపాణి సంగీతం చేసిన సినిమాలకు పాటలు రాశారు .ఆతర్వాత సత్యం, మహదేవన్ ,పెండ్యాల ,చక్రవర్తి, జికే వెంకటేష్ ,చలపతిరావు ,రాఘవులు ,రమేష్ నాయుడు సంగీతం చేసిన చిత్రాలకూ పాటలు రాశారు .
‘’వినర సూరమ్మ కూతురు మగడా’’సినిమాతో వెలిగిపోయిన అప్పలాచార్య దమ్మున్న గీత రచయితా అని పించుకొన్నారు .
సశేషం
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -19-1-21-ఉయ్యూరు
, ,
—