మనమరుపు వెనక మన వెండి తేర మహానుభావులు -31

మనమరుపు వెనక మన వెండి తేర మహానుభావులు -31

31-తొలి మహిళా చిత్ర నిర్మాత –దాసరికోటిరత్నం

గారంగస్థలంపై మహిళల పాత్రలను పురుషులే పోషించే కాలంలో నాలుగు దశాబ్దాలు నాటక రంగంలో స్త్రీ, పురుష పాత్రలను పోషించిన అసమాన నటీమణి దాసరి కోటిరత్నం. సినీరంగంలో ప్రవేశించి అనేక సినిమాల్లో నటించి చిత్రాలను నిర్మించిన తొలి మహిళా నిర్మాత ఆమె. 1935లో విడుదలైన ‘సతీ అనసూయ’ చిత్రానికి ఆమే నిర్మాత. తెలుగు సినిమా, నాటక రంగాలలో 45 సంవత్సరాల పాటు విశేషక షిచేశారు.
గుంటూరు జిల్లా ప్రత్తిపాడులో కోటిరత్నం 21-12-1910న జన్మించారు. ఆమె తండ్రి రంగస్థల నటుడు కావడంతో చిన్నప్పటినుండే కోటిరత్నానికి నటనలో శిక్షణ ఇచ్చాడు. తొమిదో యేటనే రంగస్థల వేదికపై అడుగుపెట్టి హరిశ్చంద్ర నాటకంలో లోహితస్య, బొబ్బిలి యుద్ధం నాటకంలో చిన్నరంగారావు, లవకుశలో కుశుడు, ప్రహ్లాదలో ప్రహ్లాద మొదలైన పాత్రలు వేసి ప్రేక్షకులను మెప్పించారు. నాటకాలలో నటిస్తూనే రాజనాల వెంకటప్పయ్య శాస్త్రి వద్ద శాస్త్రీయ సంగీతంలో శిక్షణ తీసుకున్నారు. అద్భుత నటనకు మధుర స్వరం తోడవటంతో మంచి నటీమణిగా పేరుతెచ్చుకున్నారు.
దాసరి కోటిరత్నానికి రంగస్థల నటిగా, గాయనిగా ప్రఖ్యాతి పొందిన ఆమె మహిళా నాటక సమాజాన్ని స్థాపించారు. నాటకల్లో స్త్రీ పాత్రలతో పాటు అనేక పురుష పత్రాలు ధరించేవారు. లవకుశ పాత్రలతోనే కాదు గంభీరమైన కంసుడు భీముడు వంటి పురుష పాత్రలను వేసి మెప్పించారు. సావిత్రి నాటకంలో సత్యవంతుడు, సక్కుబాయి నాటకంలో క ష్ణుడు, సతీ అనసూయ, గంగావతరణం మొదలైన నాటకాల్లో నారదుని పాత్ర కూడా పోషించారు.
నక్కబొక్కల పాడులో స్థిరపడి అక్కడ ఆమె స్థాపించిన నాటక సమాజానికి అనతి కాలంలోనే మంచి పేరు వచ్చింది. ఈ సమాజం వేసిన నాటకాలు కొన్ని ఐదు సంవత్సరాల పాటు నిరవధికంగా ప్రదర్శించబడ్డాయి. ఆ తర్వాత మకాం గుంటూరుకు మార్చి అక్కడ నాటక సమాజాన్ని కొనసాగించారు. ఆమె నాటక సమాజంలో పారుపల్లి సుబ్బారావు, తుంగల చలపతిరావు,25మంది మహిళా కళాకారులు ఉండేవారు. ఎన్నో నాటకాలు అభ్యాసం చేసి, ఊరూరా ప్రదర్శించేవారు. కోటి రత్నం నాటక సమాజంలోని వారందరికీ నెలవారీ జీతాలు ఇచ్చేవారు.
1935లో తన నాటక బ ందంతో కలకత్తా వెళ్ళి అక్కడ ఆరోరా ఫిలింస్‌ కంపెనీలో భాగస్వామిగా, బి.వి.రామానందం, తుంగల చలపతిరావులతో కలిసి భారతలక్ష్మి ఫిలింస్‌ అనే సంస్థను నెలకొల్పి, ‘సతీసక్కుబాయి’ చిత్రాన్ని నిర్మించారు. ఇందులో కోటిరత్నం టైటిల్‌ పాత్రలో సక్కుబాయిగా, తుంగల చలపతిరావు క ష్ణుడిగా నటించారు. టైటిల్‌ పాత్ర పోషించిన తొలి మహిళ కూడా ఆమే కావడం గమనార్హం. 1935లో విడుదలైన ఈ సినిమాకు చారుచంద్ర రారయ్ దర్శకత్వం వహించాడు. ఆ తర్వాత ‘సతీ అనసూయ’ అనే మరో చిత్రాన్ని నిర్మించి, అందులోనూ టైటిల్‌ పాత్రలో నటించారు. లంకాదహనం, మోహినీ భస్మాసుర, వరవిక్రయం, పాండురంగ విఠల, వరూధిని, పాదుకా పట్టాభిషేకం, గొల్లభామ, బంగారు భూమి, అగ్నిపరీక్ష, చంద్రవంక మొదలైన సినిమాలలో నటించారు. 

 తండ్రి వద్దే నటన లో శిక్షణ పొంది 9 వ ఏట రంగస్థలం పై కాలుపెట్టి ,పేరుపొంది ,కొద్దికాలం లో  హరిశ్చంద్ర  లోహితాస్యుడు ,బొబ్బిలి యుద్ధం లో చిన రంగారావు ,లవకుశ లో కుశుడు ,భక్త ప్రహ్లాదలో ప్రహ్లాదుడు ,పాత్ర పోషణ చేసి మగవాళ్ళతో దీటుగా నటించి సెబాస్ అనిపించుకొన్నారు .నటిస్తూనే సంగీతం లో శిక్షణ పొందారు .అద్భుత నటనకు మంచి స్వరం తోడవటం తో గొప్ప నటీమణిగా స్థిరపడ్డారు .మహిళలు నాటకాలలో నటించటాన్ని వ్యతిరేకించే కాలం లో తాను నటించటమే కాకుండా ఒక నాటక సమాజం స్థాపించి ,ఊరూరా ప్రదర్శనలిచ్చిన సాహసి కోటి రత్నం .ప్రత్తిపాడు వదిలి తాతగారిఊరు నక్క బొక్కలపాడు చేరి నాటక సమాజం పెట్టిన ఘనత ,గౌరవం ఆమెది  ఈ సమాజంతో ఉషా పరిణయం శశి రేఖా పరిణయం,కృష్ణాలీలలు రామదాసు ,సావిత్రి  నాటకాలు ఆడారు  .తెనాలిలో పుట్టిన తోట రాఘవయ్య ,మల్లాది గోవింద శాస్త్రి ,పారుపల్లి సుబ్బారావు పారుపల్లి సత్యనారాయణ వంటి ఉద్దండ నటులు ఆమె నాటకాలలో పాత్రలు ధరించారు .అయిదేళ్ళు తాతగారి ఊరులోనే ఉండి నాటకాలు ప్రదర్శించి ,తర్వాత గుంటూరు చేరారు .

  కోటిరత్నం ప్రతిభ గుర్తించిన నవలానాటక సమాజం అధినేత  దంటు వెంకట కృష్ణయ్య ఈమెను పురుష వేషం వేయటానికి ఆహ్వానించారు .అప్పటికే ఆ సమాజం లో కన్నాంబ ,బందరు రమాబాయి ,గుంటూరు తిలకం ,శ్రీహరి ,అన్జనీబాయి ,సరస్వతమ్మ మొదలైన గొప్ప నటులున్నారు .వారితో కలిసి నటించే గొప్ప అవకాశం ఆమెకు లభించింది .నారద పాత్ర వేశారు .సతీ అనసూయ ,గంగావతరణం ,నాటకాలలో నారడుడుగా నటింఛి దాదాపు రెండు వందల రజత పతకాలను పొందారు .అవన్నీ మెడలో వేసుకొని పరవశం పొందేవారు .ఆరోజుల్లో కోటిరత్నం నాటకం అంటే చాలు ఎంతెంతో దూరాలనుంచి బళ్ళుకట్టుకొని వచ్చి చూసి మురిసిపోయేవారు ప్రేక్షకజబనం .

  పెరుగుతున్న ఆదరణ కు తగినట్లు మరొక నాటక సమాజం ఏర్పరచి సావిత్రి నాటకం ప్రదర్శించి సత్యవంతునిగా నటించారు .దీనికి కొప్పరపు సుబ్బారావు  దర్శకులు .మద్రాస్ లో రాయల్ టాకీస్ లో ఈ నాటకాన్ని చూసిన కాశీనాధుని నాగేశ్వరరావు పంతులుగారు ఆమెను ప్రత్యేకంగా అభినందించి బంగారు కంకణాలు బహూకరించారు .నైజాం లో నిజాం నవాబుకోటలో ఈ నాటక ప్రదర్శన చూసిన దివాన్ శ్రీ రాజా కృష్ణప్రసాద్ కోటిరత్నంగారికి వెండి గొడ్డలి, వెండి తాడు బహూకరించారు .ప్రదర్శి౦చిన ప్రతిచోటా సన్మానాలు బహుమానాలు పొందారు .

  శ్రీ కృష్ణ తులాభారం నాటకం లో కృష్ణ ,నారద పాత్రలు రెండూఆమే పోషించేవారు సమర్ధంగా ..తన సమాజం లో ప్రముఖనటులు దొమ్మేటి సత్యనారాయణ,  సూర్య నారాయణ లను చేర్చుకొని ‘’రంగూన్ రౌడీ నాటకం ‘’నాలుగేళ్ళు ప్రదర్శించి లెక్కలేని బహుమతులు,సన్మానాలు  పొందారు కోటిరత్నం .,

 ఇంతటి ప్రతిభా వంతమైన నటన ,సమాజ నిర్వహణ ఉన్న కోటి రత్నం గారికి అరుదైన సినిమా చాన్స్ లభించింది .ఈమె సమాజాన్నికలకత్తాలోని భారత లక్ష్మీ సంస్థ ఆహ్వానించి సతీ సక్కుబాయి సినిమాను నిర్మించింది .రామ చంద్రరే దర్శకుడు .కానీ ఈ సినిమాలో కోటిరత్నం సక్కూ బాయిగా ,తుంగల చలపతి రావు కృష్ణుడుగా  నటించటం గొప్ప విశేషం .సక్కు భర్తగా కుంపట్ల సుబ్బారావు ,గయ్యాళి అత్తగా సూరవరపు వెంకటేశ్వర్లు నటించారు .దీనికి రచన చిలకమర్తి లక్ష్మీ నరసింహం పంతులుగారు .1935మే21న సినిమా రిలీజయింది . ఈ సినిమాకోసం కలకత్తాలో నాలుగు నెలలు ఉన్నారు కోటిరత్నం .సినిమా నిర్మాణ మెలకువలన్నీ అవగతం చేసుకొన్న ప్రజ్ఞాశీలి ఆమె .

  ప్రయోగాలు చేయటం లో ముందు ఉండే కోటిరత్నం తన బృందంతో సంప్రదించి లాభాలు సమానం గా పంచుకొందామని తామే సినిమా నిర్మించటానికి పూనుకొన్నారు .స్థానిక మద్దతు కావాలికనుక ఆరోరా ఫిలిం కార్పోరేషన్ వారిని సంప్రదించి ఒప్పించి ఉమ్మడి భాగస్వామ్యంతో ‘’సతీ అనసూయ ‘’సినిమా నిర్మాణం ప్రారంభించారు .ఇలా ఒక తెలుగు మహిళా మొట్ట మొదటి సారిగా సినిమా నిర్మించిన ఘనత ,రికార్డ్ సాధించారు కోటిరత్నం హాట్స్ ఆఫ్ .అనసూయగా కోటిరత్నం టైటిల్ పాత్ర పోషించారు . ఈసినిమా 1935అక్టోబర్ 4 విడుదలై తెలుగు చిత్రరంగ నిర్మాణం లో ఒక నూతన శకం ఆరంభమైంది .ఆతర్వాత కలకత్తా లోనే తయారైన లంక దహనం ,మోహినీ భస్మాసుర ,వరవిక్రయం ,పాండు రంగ విఠల్,వరూధిని సినిమాలలో కోటిరత్నం నటించారు ఆ తర్వాత కొత్త హీరోయిన్లు రావటంతో వీరికి అవకాశాలు తగ్గగా ,తుంగల సూరిబాబు సూరవరపు తదితరులతోకలిసి ‘’సక్కుబాయి ‘’నాటకం ప్రదర్శిస్తూ తాను కృష్ణుడుపాత్ర పోషించారు .తుంగల మరణం తర్వాత సక్కుబాయిగా నటిస్తూ ప్రదర్శనలు ఇచ్చారు .

  1943లో కోటిరత్నం మళ్ళీ సినిమాలో నటించారు .కన్నాంబ గారు ఈమెను స్వయంగా ఆహ్వానించి తమ పాదుకా పట్టాభిషేకం చిత్రం లో కౌసల్య పాత్ర ఇచ్చి నటి౦పజేశారు .మళ్ళీ నాటకాలకు వెళ్ళాల్సిన పరిస్తిస్థితికలగలేదు .గొల్లభామ చంద్రవంక ,అగ్ని పరిక్ష బంగారుభూమి మొదలైన సినిమాలో వరుసగా పది హీను సంవత్సరాలు నాన్ స్టాప్ గా నటించారు .1958లో కోటిరత్నం అనారోగ్యం పాలై గొంతు దెబ్బతినటం తో సినీ అవకాశాలు తగ్గి ఆదుకొనే వారుకూడా లేక ,దుర్భర జీవితాన్ని గడుపుతూ జీవితం గడిపారు .1960లో తణుకులో ఆంధ్రనాటక పరిషత్ కోటి రత్నంగార్ని ఘనంగా సత్కరించారు .ఈ తృప్తితో రెండేళ్ళ తర్వాత ఆమె 45 ఎల్లా పాటు అవిశ్రాంత నటనతో ఆంద్ర దేశాన్ని ఉర్రూత లూగించిన,పురుష వేషాలు ధరించి మగవారికి దీటుగా నటించి ,నాటక సమాజం నెలకొల్పి ఊరూరా ప్రదర్శనలిచ్చి వేలాది స్వర్ణ రజత పతకాలు సత్కారాలు అందుకొన్న  తోలి మహిళా సినీ నిర్మాత ,’’నటకోటి రత్నం ‘’శ్రీమతి దాసరి కోటి రత్నం 21-12-1972న చిలకలూరి పేటలో 63వ ఏట మరణించారు . .

  సశేషం

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -20-1-21-ఉయ్యూరు

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in సినిమా and tagged . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.