మన మరుపు మరుగు న వెండి తెరమహానుభావులు -32
32-కట్టబొమ్మన డైలాగ్ ఫేం- కెవిఎస్ శర్మ-2
ఎన్టీఆర్, జగ్గయ్య, వల్లభజోస్యుల శివరాం, కె.వి.ఎస్,శర్మ మొదలైన వారందరినీ సభ్యులుగా చేర్చుకొని సొంతంగా ‘నవజ్యోతి సమితి’ అనే నాటక సంస్థను స్థాపించి, అనేక నాటకాలలో నటించారు.
ఠాగూర్ రాసిన ‘శాక్రిఫైస్’, రాయప్రోలు రాసిన ‘కొండవీటి పతనం’ నాటకాలలో నటించారు.
‘‘వీరపాండ్య కట్టబ్రహ్మన్న’’ చిత్రం తమిళంలో 175 రోజులు పైగా ప్రదర్శింపబడింది. తెలుగులోనూ విజయవంతంగా నడిచింది.
ఈ చిత్రాన్ని హిందీలో ‘అమర్ షాహిద్‌గా’ 1960లో రూపొందించారు.
నటులు కె.వి.యస్.శర్మ, శివాజీ గణేషన్‌కి డబ్బింగ్ చెప్పారు
ఎస్సెల్సీ తర్వాత ఎస్ఆర్ఆర్ (అప్పటికి సివిఆర్ అని చేరలేదు) కాలేజీలో ఇంటరు (అప్పట్లో ఎఫ్ఏ)లో చేరాడు. విశ్వనాథ సత్యనారాయణ గారు లెక్చరరు. కాలేజీలోనే కెవిఎస్ శర్మ (తర్వాతి కాలంలో సినిమా నటుడు)
1950 ప్రాంతంలో విజయవాడలో సుంకర కనకారావు, కొప్పరపు సుబ్బారావు, డి.వి.నరసరాజు, కె.వి.ఎస్.శర్మ, నిర్మలమ్మ మొదలైనవారితో కలిసి గురజాడ అప్పారావు కన్యాశుల్కం నాటకాన్ని విజయవంతంగా ప్రదర్శించేవాడు.
ఇతివృత్తాన్ని అనుసరించి కథనంలో ఉత్కంఠతనీ, ఆశ్చర్యాన్ని కలిగించే అంశాన్నీ అవసరం మేరకు ఆయన జొప్పించేవారు. ‘లక్షాధికారి’లో కెవిఎస్ శర్మ పాత్రని విభన్నంగా చూపిస్తూ, గుమ్మడి పాత్రని సస్పెన్స్‌లో ఉంచడం ఓ టెక్నిక్. ‘జమీందార్’లో ఏయన్నార్ పాత్రను చివరివరకు డిటెక్టివ్ ఆఫీసర్ అని తెలియనివ్వకుండా కథ నడిపించడం మరో తార్కాణం. ‘అంతస్తులు’లో గుమ్మడి పాత్రలోని చీకటి కోణాలు చూపించిన విధానం మరువలేనిదే. ఇవన్నీ మధుసూదనరావు ‘మార్కు’లే
తెలుగులో తొలిసారి దర్శకుడిగా ఆదుర్తి సుబ్బారావు పరిచయమైన చిత్రం -అమర సందేశం. హిందీలో విజయవంతమైన బైజూ బావారా చిత్రానికి రీమేక్‌గా దీన్ని రూపొందించారు. కథానాయకుడు అమరనాథ్. జూ.శ్రీరంజని, పద్మిని, రేలంగి, తుర్లపాటి విజయలక్ష్మి, మాస్టర్ మోహన్, మిక్కిలినేని, కెవిఎస్ శర్మలాంటి ఉద్దండ నటులు.
సశేషం
మీ –గబ్బిటదుర్గాప్రసాద్ -21-1-22-ఉయ్యూరు
.