· మనమరుపు వెనక మన వెండి తెర మహానుభావులు -35
· 35-ముక్కు బులాకీతో చలాకీగా నటించే సురభి బాలసరస్వతి -1
సురభి బాలసరస్వతి తెలుగు చలనచిత్ర హాస్యనటి. ఈమె హాస్యపాత్రలతో పాటు కొన్ని చిత్రాలలో నాయికగా, ప్రతినాయికగా కూడా నటించారు. సురభి బాలసరస్వతి1931,జూలై 3న ఏలూరులో జన్మించారు .
1947లో వచ్చిన పల్నాటి యుద్ధం సినిమాలో మొదటిసారిగా నటించారు .ఆ ఏడాదే వచ్చిన ఛత్రపతి వారి రాధిక లో మరో బాలసరస్వతి కథానాయకి గా ఈమె ఉపనాయకిగా నటించారు.దీనికి మ్యూజిక్ సాలూరు హనుమంతరావు అందించగా డైరక్షన్ విపిటి సకే చేశారు ..స్వతంత్ర వారి ద్రోహి చిత్రంలో నర్సుగా నటించారు .వరలక్ష్మి లక్ష్మీరాజ్యం ,శివరావు వగైరా నటించగా మ్యూజిక్ పెండ్యాల ,ఇందులో కామ్పౌండర్, నర్స్ యుగళగీతం ఉంది .’’చక్కర కొట్టుకు వచ్చావా –బలే టక్కరి దానివే చినదాకా’’ అని శివరావు అంటే –నర్స్ –‘’టమారి మాటల పిలగాడా –నీ దిమాకు చూపకు నా మీద ‘’పాటకాంపౌ౦డర్ శివరావు నర్సు బాలసరస్వతిపై చిత్రీకరించారు .1949లో వచ్చిన ఆక్కినేని,అంజలి నటించి ,ఘంటసాల సంగీతం కూర్చి మీర్జాపురం రాజా డైరెక్ట్ చేసిన కీలుగుఱ్ఱం లో నటించారు .అదే సంవత్సరం భరణీ వారి లైలా మజ్ను లో భానుమతి ,నాగేశ్వరరావు లతోపాటు సురభి బాలసరస్వతి’’ జోరా’’ పాత్ర పోషించారు .ఇందులో బాలసరస్వతి ఒకపాట –‘’అనగా అనగా ఒకఖాను –ఆ ఖానుకో జనానా –ఆ జనానాలో తొంభై తొమ్మిది మంది బేగాలూ రాగాలు –హమేషా గానా పీనా బజానా –అయినా సరదాతీరని –సర్దార్ మరో నిఖాకు తయార్ –అందని ఆకాశం లో ఒక చందమామ కావాలి –కనమంటే కళ్ళున్న కబోది –వినమంటే చెవిటి –కళ్ళూ మనసూ గల ఏ పిల్లదీ – రమ్మంటున్నదీ ఆ తిమ్మన్ననీ –అమావాస్య అర్ధరాత్రి మస్తుమస్తుగా ముస్తాబై –కొమ్మో బొమ్మో తెలియని చీకట్లో –ఓచిన్నదాన్ని చూసి చేయి సాచి –ముసుగు తీసి చూశాడు –అంతకంటే చక్కందాఇంతుల మేల్బంతి –మెల్లకన్నూ సొట్టమూతీ-పిల్లను చూశాడు –గుభేల్ గుభేల్ మని గుండెల్లో –సైతాన్ సైతాన్ అంటూ ఖాన్ ఒకటే దౌడు ‘’దీని దర్శకత్వం భానుమతి భర్త రామ కృష్ణ. సంగీతం సుబ్బరామన్ .రచన సీనియర్ సముద్రాల .బాలసరస్వతి చలాకీ తనానికి మచ్చు గా ఉంటుంది ఈ పాట.
నాగయ్య రామారావు రేలంగి కృష్ణవేణి హేమలత వగైరా నటించి ,ప్రసాద్ డైరెక్షన్ లో సముద్రాలరచన ,ఘంటసాల సంగీతం కూర్చిన ‘’మనదేశం ‘’సినిమాలో శోభగా వేసిన కృష్ణవేణి స్నేహితురాలు గా బాలసరస్వతి నటించారు .బిఎ సుబ్బారావు డైరెక్షన్ లో శోభనాచాలావారి పల్లెటూరిపిల్ల సినిమాలో అంజలి ,నాగేశ్వరరావు లతోపాటు ‘’కంప ‘ పాత్ర పోషించారు .శివరావు దర్శకత్వం లో పరమానందయ్య శిష్యులు లో నటించారు. దీనికి ఓగిరాల సుసర్ల సంగీతం.తాపీధర్మారావుగారు రచన .
1950లో వచ్చిన సాధనావారి సంసారం లో రామారావు నాగేశ్వరరావు ,లక్ష్మీరాజ్యం సూర్యకాంతం లతో పాటు కామాక్షిగా నటించారు.రేలంగి తాతారాం ఈమె కామాక్షి.ఇద్దరికి –‘’ నా మాట వినవె రవ్వంత మోమాటమెందుకే ఇంత –ఏ నాటికైనా నీ వాడనే –అని అతడు అంటే ‘’చాలు చాలులే సరసాలు –చనువిచ్చితిననికాబోలు –చాటుకు రమ్మని ఒంటిపాటునా –ఇవా మంతనాలు –నీకు నాకు జోడు –ఈ అద్దం లో చూడు ‘’అనే సరదాగీతం లో ఇద్దరూ గొప్పగా నటించారు .ఘంటసాల బలరామయ్య గారి దర్శకత్వం లో 1950లో వచ్చిన ప్రతిభావారి శ్రీ లక్ష్మమ్మకథ సినిమాలో అంజలి నాగేశ్వరరావు లు హీరో హీరోయిన్ లు గా నటిస్తే బాలసరస్వతి ‘’చిట్టి ‘’పాత్ర నటించారు .రంగడు గా నటించిన శివరావు తో చిట్టిగా నటించిన బాలసరస్వతి లకు ఒక సరదా పాట ఉంది –‘’చీటికి మాటికి చిట్టేమ్మంటావ్-పెదరాయు డుంటడు చిన రాయు డుంటడు –కరణాలుంటరు కాపులుంటరు –చీపురు దెబ్బలు తింటవురో-అయ్యా పిల్లోడా మా అయ్యోస్తే మరి తంటారో’’అని చిట్టి అంటే రంగడు –‘’అబ్బో అబ్బో అలాగునైతే –అంతకు తగిన బొంతను నేను –అయ్యకు దయ్యం వదిలిస్తాను పట్టుకు భరతం పట్టిస్తాను –అమ్మీ చిట్టమ్మీ-మీ అయ్యకు భరతం పడతానే ‘’పాట సూపర్ డూపర్ హిట్ అయింది సినిమా ఫ్లాప్ అయినా . వీళ్లిద్దరిమీదా మరోపాటకూడా ఉంది – ‘’రాకరాక నీ వోచ్చావోయ్ నా కేటి సరుకులు తెచ్చావోయ్ –‘’అని ఆమె అంటే –అతడు –‘’సీరరెడతా సారేడతా-సెవిలోకి పోగేడతా –కాసుల పెరేడతా ,బేసరి కొని బెడతా ‘’-సిట్టి పొట్ట౦టావు-మిట్టిపడిపోతావు –గట్టి సరుకేమున్దోయ్ గడసరి బావా ‘’అంటే అతడు ‘’నా జిలిబిలి పలుకుల చిలకా –నా తలపుల వలపుల గిలకా –నా అత్తరి బిత్తరి ఇత్తడి పిత్తడిబంగారు బొమ్మా ‘’ అంటూ సాగే పాడే పాటలోకూడా ఇద్దరూ ఒకర్నిమించి ఒకరు నటిస్తారు .పాటలు మాటలు –బలిజే పల్లి ,గోపాలరాయ వర్మ ద్వయం .
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -23-1-22-ఉయ్యూరు
నమస్తే అండి. యాజ్ఞవల్క్య స్మృతి అనే పుస్తకం తెలుగులో pdf ఉంటే చెప్పగలరు.