మన మరుపు వెనక మన వెండి తెర మహానుభావులు -35

·         మనమరుపు వెనక మన వెండి తెర మహానుభావులు -35

·         35-ముక్కు బులాకీతో చలాకీగా నటించే సురభి బాలసరస్వతి-2

·         1951లో వచ్చిన జ్ఞానాంబిక వారి మంత్రదండం సినిమాలో బాలసరస్వతి గిరిజగా నటించారు .అక్కినేని శ్రీరంజని శివరావు వగైర ఇతర  తారాగణం .ఈమె గిరిజ పాత్రపైఒక పాట ఉంది –‘’తలుపులు తలుపులు పరుగిడవా హాయ్ వలపులు పెనగోనవా హాయ్ –జిలిబిలి పలుకుల కలకల చెలగే

·         పులుగులు కనుగొన పులకలు కలుగవా హాయ్ –జలజల కురిసే కలికి వెన్నెలల తళుకులకలువకు కులుక విదేలా ‘’—దీనికి తాపీ వారు రచన ,నాళ౦ నాగేశ్వరరావు సంగీతం కూర్చారు .బాగ్రౌండ్ మ్యూజిక్ ఎస్ రాజేశ్వరరావు .1951లో ఆశ్వినివారి శ్రీధర్ డైరెక్షన్ లో వచ్చిన మాయలమారి లో అంజలి నాగేశ్వరరావు గార్లతో పాటు బాలసరస్వతి ‘’కురంజి ‘’గా నటించారు . ఈమెకూ ప్రతాప్ గా వేసిన నాగేశ్వరరావు కు ఒకపాట ఉంది .కురంజి –‘’మియాం మియం హి –హువాహువా –జమ్బాలో బాలో మియాం –ప్రతాప్ –మియాం మియాం కురంజి –సంబాలో గేర్రయ్యయ్యో –ప్రతాప్ –హువాహువాహువా ,కురంజి –హిహిప్పేప్పే హియుకేన్ కేరేఫైహి –ఇద్దరూకలిసి –టికోటికో హుం ఫక్-కుంగల కూడియో హే’’ దీని అర్ధం ఏమిటో మనకు బుర్ర బద్దలు కొట్టు కున్నా అర్ధం కాదు .చివరికి కురంజి –బాగ్గెం కలిగే సెయ్యి ,-బంగారం సిలికే సెయ్యి –పాడిపంటలగల సెయ్యి –ఫలవంతమైనదీ ఈసేయ్యి –అంటూ ‘’నామాట నమ్మ వె కొమ్మా –పెళ్లి రేకలే పెల్లుగ ఉండాయ్-పోల్లుగాదులే తల్లీ –మూతిని మీసం ఉన్న వొళ్ళు –నీకు ముగ్గురు మొగుల్లె తల్లీ ‘’అని బహుశా సోదే చెప్పివుంటుంది . ఒక జిప్సీ డాన్స్ లో కూడా కురంజి గా బాలసరస్వతి నటించారు –ఝాలకిల బోలె షికోరిబోలె జోజో ఖోలే అంటే మిగిలిన జిప్సీలు –లకిబికి బొమికిలియా –రఖి రఖి రోమికిలియా – అని పదం కలిపితే కురంజి –రాఖిలా షోకిలా ,-జనుక బులన మీలానా జాను బొలన ‘’అంటూ సాగే తమాషా గీతం .మొదటిపాట ఆదినారాయణరావు రాస్తే రెండో దాన్ని తాపీ రాశారు .సినీ సంగీతం ఆదినారాయణరావు కూర్చారు .

·            1951లో వచ్చిన స్వాతి వారి రూపవతి సినిమాలో బాలసరస్వతి హీరోయిన్ రూపవతిగా నటించారు నారాయణరావు ,శివరావు ,జిఎన్ స్వామి మగపాత్రలు .బాలసరస్వతిపై ఒకపాట-‘’నాడిచూడ గలరా –మందులేవి దాచినా-సెలవిండి దయయుంచి –భలేభలే వైద్యులే దండము ఆడెను దాసోహం –మీ చేతిమాత్రా వైకుంఠ యాత్రా ‘’ఇందులో చివరిమాట లోకం లో పాతుకుపోయినమాట .రూపకు కుమార్ కు యుగళగీతం –‘’రూప –కలవరమాయే నా మదిలోనా ఇదేమిటీ వేళా-ఆనందమాయే హేతువేమో మరి హేతువేమో –అంటే కుమార్-విధియే వెర్రి గాలి ఎన్నో అలలై వీచీ వీచీ –కలదోసేగానా మనజీవితాలూ మేలాయే నీ వేళా’’అంటాడు .మరో యుగళం లో రూప –తెలుసుకోవోయి తెలుసుకోవోయి నేదాచినదీ తాయమేమో –అంటే కుమార్ –దాచినదీ తాయమేమో తెలుసునే రాణీ ‘’అని సాగుతుంది .రూపకు ఒక విషాదగీతం కూడా ఉంది –‘’నీకు నే దిక్కనుకొంటి నాడు తారుమారాయేనా బతుకు తీరు –దిక్కుమాలితి నేడు రావమ్మ తోడూ –ఎన్నెన్నో ఆశలు అడుగంటేనే కంటి నీరే ఆ పై మిగిలినదీ ‘’.రూపవతికి మరో భక్తిపాట –‘’ప్రభో నీ చల్లని చూపుల స్వాతి వానయే ప్రవిమలానందదాయీ –కనవా వినవా రావిదేల కోపమా నిన్నే ఎంతోనమ్మినానే నీకిది న్యాయమా ‘’ మరో డ్యూయెట్ కూడా రూపా కుమార్ కు ఉంటుంది .రూపకు –కన్నారచూచి  దీవించికరుణించ రాలేనేవా ప్రభూ –కనుదోయి నాకేల దీనముగా ఈ బ్రతుకెల “’ అనే విషాదగీతం ,మరో గీతం లో ఇద్దరూ –కానలేవా స్త్రీధనమోయి ,,శీలమోయీ పావనమోయీ –రావోయి స్వర్గంమోయి కాదా సతి లీలా ఇలా అనిరూప అంటే –సత్యశీలా నువ్వేనే ధన్యజీవీ నేనేనీ –స్వర్గామేదే లేదే ఇదే లేవే నిజంగా ‘’  అంటూ ఆనందంగా పాడి సుఖాంతం చేస్తారు అక్కినేని బాలసరస్వతి నాయకా నాయికలుగా .

·          .రచన శ్రీ శర్మ సంగీతం సుబ్బరాయన్ .గానం పిఠాపురం ,జిక్కి ,రావు బాలసరస్వతి .దర్శకత్వం కే ప్రభాకర్ .అంటే ఈసినిమాలో బాలసరస్వతి నవరసాలు పోషించిందని అర్ధమౌతోంది హీరోయిన్ గా తన సత్తా నిరూపించారు .1954 పక్షిరజావారి అగ్గిరాముడు సినిమాలో రామారావు భానుమతి లతో పాటు జానకి పాత్రలో బాలసరస్వతి నటించారు .ఇదే ఏడాది గోకుల్ ఆర్ట్ పిక్చర్స్ తాతినేని ప్రకాశరావు డైరెక్షన్ లో నాగేశ్వరరావు జమున మొదలైన వారు నటించిన నిరుపేదలు సినిమాలో బాలసరస్వతి నటించారు .అలాగే జనతావారి పరివర్తన లో సావిత్రి ,రామారావు లతో కాసులు పాత్ర పోషించారు .ఇందులో ఒకపాట-ఇంతచల్లనివేళ విన్తపిలుపులివేల –ఇంతమోహమిదేలా ‘’ఆమెపై చిత్రించారు మాటలు అనిశెట్టి ,పాటలు పినిశెట్టి మ్యూజిక్ చలపతిరావు డైరెక్షన్ తాతినేని ప్రకాశరావు గార్లు .అలాగే అంజలి వారి అనార్కలి లో అనార్ సఖి గుల్నార్ గా బాలసరస్వతి నటించారు ఈమెపై –‘’కులాసాల సరసాల కురిపింతురా .-ఖుషీగా విలాసాల మురిపింతురా – హమేషా తమాషాల అలరింతురా ‘’పాటచిత్రించారు .ప్రేమ జగానా వియోగానికేనా ప్రేమగాధ విషాదాన్తమేనా-బ్రతికించు శ్రహరాజదసూ ఐ ఖుదా –నీకో సలామో ఖుదా ఖుదాఖుదా’’ చాలా అర్ధవంతమైన డీ అనార్కలిని కాపడేది ఈ పాట.సముద్రాల సాహిత్యం ఆదినారాయణరావు సంగీతం వేదాంతం రాఘవయ్య గార్ల దర్శకత్వం లో ఈ సినిమా ఒక క్లాసిక్ అయింది .

·           1955లో పి.పుల్లయ్యగారి డైరెక్షన్ లో శాంతకుమారి ,నాగేశ్వరరావు జగ్గయ్యలతో పాటు జగ్గయ్య లతోపాటు జగ్గయ్య రప్ర్మికురాలు వాంప్ నీల వేణి గా బాలసరస్వతి గొప్పగా నటించారు .నీలవేణి పాడిన ‘’ఏడవనీ ఏడ్చే వాళ్లను ఏడవనీ నవ్వే వాళ్ళ అదృష్టమేమని –నాలుగు ఘడియల నరజీవితమూ –నవ్వండి నవ్వే వాళ్ళతో నవ్వండి –నవ్వుల తోటగా చేయండి ‘’పాట సూపర్ హిట్ అయి చాలాకాలం మోతమోగించింది .అలాగే ‘’సిగ్గేస్తాదోయ్ బావ  సిగ్గేస్తాదోయ్ –మొగ్గలేను ఒగ్గలేను మొగమెత్తీ చూడలేను –పచ్చికా బయలులోన మచ్చికగా మనముంటే –సిగ్గులేని చందమామ చాటు నుండీ చూస్తాడు ‘’పాటకూడా హిట్ సాంగే .వీటి అభినయం గురంచి వేరే చెప్పాలా ?ఆత్రేయ రచనకు పరాకాష్ట .

·           కాంతారావు సీస్ ఆర్ జానకి వగైరా నటించి  విఠాలాచార్య దర్శకత్వం లో వచ్చిన కన్యాదానం సినిమాలో బాలసరస్వతి గిరిజ గా నటించారు .మాటలుపాటలు శ్రీశ్రీ

·          సశేషం

·         మీ గబ్బిట దుర్గాప్రసాద్ -24-1-22-ఉయ్యూరు .

·              

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in సినిమా and tagged . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.