మనమరుపు వెనక మన వెండి తెర మహానుభావులు -39
· 39-శ్రీనాదుడిలాగా రాజసం ఉట్టిపడే ఆగర్భ శ్రీమంత నటుడు –జంధ్యాల గౌరీనాధ శాస్త్రి
· అతడే భీష్ముడు.. అతడే శ్రీనాథుడు..
·
నాగయ్య గారు నటించిన భక్త పోతన సినిమాలో ఒకదృశ్యం. కవిసార్వభౌముడు శ్రీనాథుని పాత్ర పోషించినది జంధ్యాల గౌరీనాథ శాస్త్రిగారని గొప్ప నటుడు. మా . ఆయన స్వయంగా బాగా ఆస్తిపరుడు. డబ్బుకోసమని ఒకపని చెయ్యవలసిన అవసరం ఆయనకి లేదు. అందుకని, తన ప్రవృత్తి రీత్యా నాటకాలని సినిమాలని, అదీను తనకి నచ్చిన నప్పిన పాత్ర అయితేనే చేస్తూండేవారు.. పెద్దమనుషులు సినిమాలో మ్యునిసిపలిర్మన్ పాత్రని చాలా సమర్ధవెత్తు విగ్రహం, కొనదేరిన ముక్కు, తీర్చిదిద్దినట్టున్న ముఖం, పెద్దపెద్ద కళ్ళు, వొంటితీరులో ఒక సహజమైన రాజసం ఈయన సొత్తు.
·
·
గుంటూరు జిల్లా తెనాలి తాలూకా పిడమర్రు గ్రామంలో5/10/1911న ఆగర్బ శ్రీమంతుల ఇంట జన్మించారు.పెద్దగా చదువు అబ్బలేదుగాని కళలపట్ల బాగా మక్కువ ఉండేది.
డా.గోవిందరాజుల సుబ్బారావు,ముదిగొండ లింగమూర్తి,గౌరినాధ శాస్త్రి గార్లు మంచి స్నేహంగా తెనాలి పట్టణంలో కలసి మెలసి తిరుగుతుండేవారు. ఈముగ్గురు మిత్రులు కొద్దిపాటి నెలల తేడాలో మద్రాసులో అడుగు పెట్టారు.
మంచిరూపము,చక్కని అభినయము,పదప్రయోగంలో విషిష్టత కలాగిన శాస్త్రి గారు తొలిసారి కావలి గుప్తా గారు లక్ష్మిఫిలింమ్స్ పేరిట’దౌపతి మానసంరక్షణము’ చిత్రంలో జంధ్యాల వారికి అవకాశం కలిగించారు. ఇందులో బందా కనకలింగేశ్వరరావు శ్రీకృష్ణుడుగా,బళ్ళారి రాఘవా ధుర్యోధనుడుగా,మునిపల్లె సుబ్బయ్య భీముడుగా,సురభి కమలాబాయి (పాతాళభైరవిలో తోటరాముడు తల్లి) ద్రౌపతిగా డా.శివరామకృష్ణయ్య గారికికూడా ఇది తొలి చిత్రమే! (లవకుశలో గిరిజ తండ్రి)కర్ణుగా నటించారు. ‘ద్రౌపతి వస్త్రాపహరం’అనె చిత్రానికి పోటీగా తయారైన చిత్రం ఇది. 1936/మార్చి/24 వతేదిన విడుదలైనది.
అనంతరం వాహినీ వారి ‘భక్తపోతన’ (1942) చిత్రంలో శ్రీనాధుడిగా నటిస్తూ పద్యాలు గోప్పగా పాడుతూ,మంచి అభినయం ప్రదర్శించారు. దర్శకుడు కే.వి.రెడ్డిగారు తేలిసారి దర్శకత్వం వహిస్తున్నతొి చిత్రం ఇది.వారి దృష్టికి వచ్చిన శాస్త్రిగారిని నాటకానుభవం లేకున్నా శ్రీనాధుని పాత్రకు ఎంపిక చేసారు.వీరి దర్శకత్వంలో వచ్చిన మరో వాహిని వారి ‘పెద్దమనుషులు’ (1954)చిత్రంలో ఛైర్మెన్ ధర్మారావు పాత్ర జంధ్యాల వారికి మరింత వన్నెతెచ్చింది.ఈచిత్రం ద్వారా డి.వి.నరసరాజు మాటల రచయితగా పరిచయం చేయబడ్డారు.అనంతరం పి.పుల్లయ్య గారి దర్శకత్వంలో ‘మాయమఛ్ఛీంద్ర'( 1945)జంద్యాలవారు నటించారు.నటుడు ముక్కామల కు ఇది తొలిచిత్రం.అనంతరం శోభనాచలవారి ‘భీష్మ’ (1944)చిత్రంలో భీష్ముని పాత్రలో జీవించారు.జూ”శ్రీరంజనీకి ఇది తొలి చిత్రం.
సినీరంగంలో జంధ్యాల,ముక్కామలా,ఎస్.వి.రంగారావు మంచిమిత్రులుగా ఉండేవారు.జంధ్యాల వారు నిర్మాతగామారి త్రిమూర్తి బేనర్ పైన’గీతాంజలి’ (1948)’గుణసుందరికథ’ (1949) ‘ఆకాశరాజు(1951) (జానపదం)చిత్రాలు నిర్మించారు.దర్శకుడు జ్యోతిసిన్హ.ఆవేటి పూర్ణిమ(అక్కినేని వారి అందాలరాముడు చిత్రంలో పడవలో బామ్మ పాత్రధారి) అనే ఏలూరుకు చెందిన అమ్మాయిని కథానాయకిగా పరిచయంచేయడం కోసం ‘ఆకాశరాజు’తీసారు.మూక్కామలా సలహపై కొత్తగూడెంలో లాయర్ గా ఉన్న ‘మంత్రవాది శ్రీరామమూర్తి కి పూర్ణిమ సరసన కథానాయకుడు పాత్రఇచ్చారు.కవిసామ్రాట్ విశ్వనాధ సత్యనారాయణగారు ఈచిత్రానికి మాటలు రాసారు.ఆచిత్రం ఆర్ధికంగా విజయం సాధించక పోవడంతో ఆస్తి అంతా పోగోట్టుకుని రోడ్డుపాలైయ్యారు.
మందుకు ,పూర్ణిమకు దాసుడుగా మారిపోయాడు.ఒక రోజు బాగాతాగి పూర్ణిమ కొరకు ఏలూరు వెళుతూ రైలులో సృహతప్పగా ప్రయాణీకులు ఆయనను బంధువుల ఇంటికి చేర్చారు. అలా ఆయన చరిత్ర అక్కడితో 7/5/1964. లో ముగిసింది.జంధ్యాలవారి మనవడు(కూతురు కుమారుడు)రాంబాబు బాపువారి’త్యాగయ్య’చిత్రంలో శ్రీరాముడిగా,విశ్వనాధ్ వారి ‘సిరిసిరిమువ్వ’ చిత్రంలోనూ నటించాడు. ‘భలేరాముడు'(1956) ‘జయభేరి(1959) వీరు నటించిన చివరిచిత్రం.
సినీరంగ ప్రవేశం[మార్చు]
నిండైన విగ్రహమూ, విశాల నేత్రాలు గల వ్యక్తి కోసం అన్వేషిస్తున్న తరుణంలో దర్శకుడు కె.వి.రెడ్డికి ఒక సభలో గౌరీనాథశాస్త్రి తారపడ్డాడు. నాటకానుభవం లేకపోయినా ఉత్సాహం ఉంది గనుక, పాత్రకు న్యాయం జరుగుతుందని శ్రీనాథుడి పాత్రకు ఎంపిక చేశారు. శాస్త్రి గారి మంచి కంఠం, చక్కని వాచికం, రెండూ ఉన్నాయి కనుక ఇరువురికీ అంగీకారమైంది. సంభాషణల వల్లె వేయించి, క్షుణ్ణంగా రిహార్సల్సు చేయించారు. దృశ్యాలు షూట్ చేసే ముందు, కనీసం మూడు, నాలుగు రోజులైనా రిహార్సల్సు ఉండేవి. పోతన పాత్రలాంటిది నటించడం నాగయ్యకీ కొత్త. కొత్తవాడైన గౌరీనాథశాస్త్రికి మరీ కొత్త. పాత్ర లక్షణాలను గ్రహించి, దర్పాన్ని జోడించి ఎంతో సహజంగా నటించారు శాస్త్రి. పోతన చిత్రం విజయవంతమై శ్రీనాథుడి పాత్రధారి గురించి ఒక గొప్ప సహజ నటుడు లభించాడు అని అందరూ చెప్పుకున్నారు.
1956లో వచ్చిన ‘బలే రాముడు’ సినిమాలో కూడా గౌరీనాథశాస్త్రి నటించారు. నాగయ్య ‘రామదాసు’ చిత్రం ఆరంభిస్తూ శాస్త్రిని కబీర్ పాత్రకు తీసుకున్నారు. కాని, కొన్ని దృశ్యాల్లో నటించిన తర్వాత 1958లో గౌరీనాథ శాస్త్రి మరణించడంతో ఆ పాత్రను గుమ్మడి పూర్తి చేశారు .
· శ్రీనాథుడుడంటే ఇలానే ఉండేవాడు కాబోలు ముమ్మూర్తులా!” అని సాహితీవేత్తలు కూడా భావించి శ్లాఘించారు. ఆయనకు సంగీతం వచ్చు. హిందూస్థానీ సంగీతమూ తెలుసు. జమీందారీ వంశం లాంటి
” భక్తపోతన “(1943)- సినిమాలో శ్రీనాధుడు పాత్రను ,
భీష్మ (1944),
‘మయామచ్ఛీంద్ర’ (1945) మచ్ఛీంద్రుడి పాత్రను ,
‘భీష్మ’ (1944)లో గౌరీనాథశాస్త్రి భీష్ముడు.
‘ఒక రోజు రాజు’ అనే జానపదం (1944) ,
‘రామాంజనేయ యుద్ధం’ ఆంజనేయుడు పాత్రని,
· ‘గీతాంజలి’ (1948) .
·
‘ఆకాశ రాజు’ (1951) రొనాల్డ్ కాల్మన్ అనే హలీవుడ్ నటుడు నటించిన ఒక చిత్రంలోని గెటప్‌తో, శాస్త్రిగారు దుష్ట పాత్ర ధరించారు.
‘పెద్ద మనుషులు’ (1954) చిత్రంలో ఛైర్‌మన్ పాత్ర ,
1956లో వచ్చిన ‘బలే రాముడు’లో కూడ నటించా రాయన.
‘రామదాసు’ చిత్రం లో కబీర్ పాత్రకు తీసుకున్నారు. కాని, కొన్ని దృశ్యాల్లో నటించిన తర్వాత – 1958లో గౌరీనాథ శాస్త్రి మరణించారు. (ఆ పాత్రను గుమ్మడి గారు చేశారు)) .
· సశేషం
· మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -27-1-22-ఉయ్యూరు