1 of 12,828

మనమరుపు వెనక మన వెండి తెర మహానుభావులు 40
· 40-రెండు సార్లు భక్తప్రహ్లాద దర్శకుడై న పౌరాణిక దర్శక బ్రహ్మ –చిత్రపు నారాయణ మూర్తి
· చిత్రపు నారాయణమూర్తి (1913-1985) తొలితరం చలనచిత్ర దర్శకుడు మరియు నిర్మాత. ఇతడు కృష్ణా జిల్లా మచిలీపట్నంలో జన్మించాడు. ఇతడు తన మొదట తన సోదరుడు చిత్రపు నరసింహమూర్తికి సహాయకుడిగా సీతాకళ్యాణం, సతీతులసి, మోహినీరుక్మాంగద, కృష్ణ జరాసంధ మొదలైన సినిమాలకుపనిచేశాడు. దర్శకుడిగా ఇతని తొలిచిత్రం భక్త మార్కండేయ. ఈ చిత్రం ఇతడిని మంచి దర్శకుడిగా నిలబెట్టింది. తరువాత ఇతడు తెలుగు, తమిళ,కన్నడ భాషలలో అనేక సినిమాలకు దర్శకత్వం వహించాడు. ఇతడు 1961లో కృష్ణకుచేల అనే సినిమాను నిర్మించాడు. అది అతనికి ఆర్థికంగా నష్టాలను తెచ్చిపెట్టింది.ఆయన తెలుగు,తమిళం,కన్నడంలో సినిమాలకు దర్శకత్వం వహించారు.
· తెలుగులో అయన దర్శకత్వం వహించిన సినిమాలు:-
1938 భక్త మార్కండేయ – వేమూరి గగ్గయ్య, శ్రీరంజని (సీనియర్)
1940 మైరావణ – వేమూరి గగ్గయ్య,చిత్తజల్లు కాంచనమాల
1941 దక్షయజ్ఞం – వేమూరి గగ్గయ్య, సి.కృష్ణవేణి, త్రిపురారిభట్ల రామకృష్ణ శాస్త్రి, సదాశివరావు, బెజవాడ రాజారత్నం, టీ.జి. కమలాదేవి, జి.వరలక్ష్మి
1942 భక్త ప్రహ్లాద – వేమూరి గగ్గయ్య, జి.వరలక్ష్మి
1943 భక్త కబీర్
1944 భీష్మ – జంధ్యాల గౌరీనాథశాస్త్రి, కృష్ణవేణి, లక్ష్మీరాజ్యం, సి.ఎస్.ఆర్, పారుపల్లి సుబ్బారావు, బలిజేపల్లి లక్ష్మీకాంతం, పారుపల్లి సత్యనారాయణ
1944 సంసార నారది – మద్దాలి కృష్ణమూర్తి
1947 బ్రహ్మరథం – బి.జయమ్మ, సి.కృష్ణవేణి, అద్దంకి శ్రీరామమూర్తి,పారుపల్లి సుబ్బారావు, ఏ.వి.సుబ్బారావు, కళ్యాణం రఘురామయ్య
1948 మదాలస – సి.కృష్ణవేణి, అంజలీ దేవి, శ్రీరంజని, కళ్యాణం రఘురామయ్య, ఏ.వి.సుబ్బారావు
1949 బ్రహ్మరథం
1953 నా చెల్లెలు – జి.వరలక్ష్మి, సూర్యకళ, రామశర్మ, అమరనాథ్
1956 నాగులచవితి – ఆర్.నాగేంద్రరావు, షావుకారు జానకి
1960 భక్తశబరి – శోభన్ బాబు, చిత్తూరు నాగయ్య, పండరీబాయి
1961 కృష్ణ కుచేల — సి.ఎస్.ఆర్., కన్నాంబ, ముక్కామల, రాజశ్రీ,పద్మనాభం
1964 పతివ్రత — సావిత్రి, రాజసులోచన, జి.వరలక్ష్మి, ఎస్.వి.రంగారావు,కుచలకుమారి, జెమినీగణేశన్
1967 భక్త ప్రహ్లాద — రోజారమణి, ఎస్.వి.రంగారావు
· తెలుగు సినిమాల ప్రారభాదశలో ప్రతిభా పాటవాలు ప్రదర్శించి ,పౌరాణిక చిత్రాలతో చిత్రపరిశ్రమను సుసంపన్నం చేసినవారు చిత్రపు నారాయణ మూర్తి .పోరానికం తీయాలంటే అందరూ ఆయన్నే కోరేవారు అంతటి అధారిటి ఆయనది .సుమారు మూడు దశాబ్దాలు చిత్ర దర్శకుడుగా ఉన్నా తీసిన సాంఘికాలు చాలా తక్కువే ,భక్తప్రహ్లాద రెండు సార్లు డైరెక్ట్ చేసిన ఘనత ఆయనది .మొదటిదానిలో గగ్గయ్య మొదలైనవారు రెండవదానిలో రంగారావు రోజారమణి .రెండూ గొప్ప హిట్ సాధించినవే .ముఖ్యంగా రోజా రమణి ప్రహ్లాడుడుగా నటించిన చిత్రం ప్రతి అంగుళం భక్తిభావ భంజనమే నిర్మాతగా బ్రహ్మరధం ,శ్రీకృష్ణ కుచేల తీసి చేతులు కాల్చుకొన్నారు .
· బందర్లో మళ్ళీ ట్యూషన్లు చెప్పుకొని బతికారు .తర్వాత సతి తులసి చేయమని ఆహ్వానం వస్తే డైరెక్ట్ చేశారు .తర్వాత మోహినీ రుక్మాంగద ఆఫర్ వస్తే దర్శకత్వం చేశారు .మీర్జాపురం రాజా కృష్ణ జరాసంధ నిర్మిస్తూ అసిస్టెంట్ డైరెక్టర్గా తీసుకొన్నారు ,కొంతకాలం ప్రొడక్షన్ మేనేజర్ గా చేశారు .తర్వాత భక్తమార్కండేయ ,మైరావణ లకు దర్శక,ఎడిటర్ గా పని చేశారు శోభనాచాలవారు భక్తప్రహ్లాద ,దక్షయజ్ఞం సినిమాలకు ఒకరోజు ఒక సినిమాలో రెండో రోజు రెండో సినిమాకు దర్శకత్వం చేసి సమర్ధంగా పూర్తీ చేశారు .దక్షయజ్ఞం లో గగ్గయ్య ,కృష్ణవేణి నటించారు .ప్రహ్లాదలో గగ్గయ్య హిరణ్యకశిపుడు వేశారు .
· ఆతర్వాత శోభనాచాలవారి భీష్మ సినిమాకు డైరెక్టర్ గా చేహారు .భీష్ముడుగా జంధ్యాల గౌరీనాధ శాస్త్రి నటించారు .వయోభారం తో తిలోత్తమ ,తెలుగు తమిళం లకు దర్శకులు ఆయనే .చిత్తూరు రాణి పద్మిని తెలుగు తమిళ వర్షన్ లకు ఆయనే దర్శకులు .చివరిదాకా ఆయన దర్శకత్వ బాధ్యతలలోనే గడిపారు .
· సశేషం
· మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -27-1-22-ఉయ్యూరు