27- హేత్వాభాస హాస్యం
హేతువుకానిదాన్ని హేతువుగా చెప్పటం లో వచ్చే వికృతే హేత్వాభాసం .ఉదాహరణ మునిమాణిక్యంగారిస్వానుభావమే –‘’గుంటూరులో జట్కా ఎక్కాను గుర్రం పెళ్లినడక నడుస్తోంది ‘హుషారుగా నడవటం లేదేమిటి అనిఅడిగారు .జట్కా ఆతను ‘’బండిలో మీ రోక్కరే కదండీ బరువు లేదు బరువు లేకపోతె గుర్రానికి హుషారురు రాదు ‘’అని సోప్ పెట్టాడు .’’.దారిలో వీధిదీపాలు సరిగ్గా కాంతిగా వెలగటం లేదు .దీపాలు అలా ఏడ్పు మొహాలతో ఉన్నాయేం అని అతన్ని అడిగితె ‘’ఎండాకాలం కదా మండు టెండలకు మనుషులే ఆర్చుకు పోతున్నారుదీ.పాలు ఏడుస్తూ ఉండటం లో విచిత్రమేము౦ది సారూ ‘’అన్నాడు .
మరో ఉదాహరణ కూడా మాష్టారిదే .కుంపటి రాజెయ్యటానికి మాష్టారు పాత రైల్వే గైడ్ కాగితాలు చింపి అంటిస్తున్నారు .అవి మండటం లేదు .కా౦త౦ గారిని అవి ఎందుకు మండటం లేదని అడిగితె ‘’రైల్వే గైడ్ కాగితాలుకదా మండవు ‘’అన్నారట .దానికే దీనికీ సంబంధమే లేదు .
మాష్టారి స్నేహితుడి కొడుకు బాగా చదివి బర్మా వగైరా తిరిగివచ్చి బాగా ఆర్జించినవాడే .పెళ్లి వయసు వచ్చినా పెళ్ళికాలేదు .ఈ విషయం మాస్టారు కా౦త౦ గారితో అన్నారు ‘’చూస్తూ చూస్తోఆఅబ్బాయికి పిల్లననెవరిస్తారండీ ‘’అన్నారామె .ఎందుకివ్వరు అనిఅడిగితే ‘’బర్మా వెళ్లోచ్చినచ్చినవాడికి చూస్తూ చూస్తూ పిల్లను ఎవరు కట్ట బెడతారండీ మరీ చోద్యం కాపోతే’’అంటూ తలవిసురుతూ చెప్పారట .బర్మా వెడితే పిల్లనివ్వరా అంటే ‘’ఇవ్వరండీ ‘’అని తెగేసి చెప్పారట .ఇందులో హేతువు లేకపోవటమే హేత్వాభాసం .మాస్టారు వదలకుండా ‘’ఆ అబ్బాయి బర్మా వెళ్ళిన సంగతి ఎవరికీ తెలుసు?’’అనగా ‘’బర్మాకాకపోతే ఏదో పాడు దేశానికి వెళ్లి వచ్చి ఉంటాడు .పెద్దపెద్ద అ౦గలేసి నడుస్తాడు కనుక బర్మా వెళ్ళే ఉంటాడు. అందుకే పిల్లనివ్వరు ‘’ఇలా కారణం కాని దాన్ని కారణం ఉన్నట్లుగా చెబితే నవ్వు రాకేం చేస్తుంది?
మరో ఎక్సా౦పుల్ ఆయనే చెప్పారు .రాఘవయ్య మాష్టారు ఒక ఏడాది స్కూల్లో పని చేశారు .మరో ఏడుఇవ్వాలావద్దా అనే ప్రశ్న వచ్చింది .ఇవ్వకూడదని ఒక కమిటీ మెంబర్ గట్టిగా వాదించాడు .ఎందుకు అని మిగిలిన మెంబర్లు అడిగితె ‘’ఆయన సామర్ధ్యం సంగతి నేను ఆలోచించలేదు .హెడ్మాష్టారికంటే ఆయన ఎత్తరి మనిషి చూస్తూ చూస్తూ ఎలా ఇస్తాం .తనకంటే పొడవు మనిషితో హెడ్ గారు ఎలా పని చేయించగాలరండీ .అదేకాదు ఆయన సంతకం హేడ్మాష్టారి సంతకం కంటే పొడుగు .పొడుగు సంతకం చేసే వాడితో పని చేయించటం ఎవరికైనా కష్టం కాదటండీ మరీ చోద్యం కాకపొతే ‘’అని చెప్పాడట .మోకాలికీ బోడి గుండుకు ముడి వేయటం అంటారుదీన్ని మనవాళ్ళు .
ఇలాంటి వాదనలను ఇంగ్లీష్ లో ‘’నాన్ సెక్వి టూర్ ‘’అంటారని మునిమాణిక్యం గారువాచ . మన పూర్వ చాటువులలో కొన్ని ఉదాహరణలిచ్చారు సార్.వీటిలో భావాశ్రయహాస్యం ఉంటుంది అన్నారు .విష్ణుమూర్తి పట్టుబట్ట లే తప్ప నూలు బట్టలు ఎందుకు కట్టడు?’’దీనికి కారణం చెప్పాడోకాయన .నూలువైతే రోజూ చాకలికేసి ఉతికించి కట్టాలి .ఒక్కోసారి బట్టలు తేకపోతేవాడితోపోట్లాడాలి .ఆ బాధలు భరించలేక పట్టు పీతాంబరాలే కడతాడు అన్నాడు ..ఇలాంటి హేత్వాభాసాలను తర్క శాస్త్రం లో ‘’హేతు విపర్యాస హేత్వాభాసం ‘’-The fallacy of the false cause ‘’అంటారు అని మునిమాణిక్యం వారి వివరణ .
మునిమాణిక్యం మాష్టారు గారికి కృతజ్ఞతలతో
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -30-1-22-ఉయ్యూరు