మనమరుపు వెనక మన వెండి తెర మహానుభావులు 46
46-ప్రజారచయిత,దర్శకుడు- జంపన
జంపన చంద్రశేఖరరావు ప్రముఖ ప్రజా రచయిత, తెలుగు సినిమా రచయిత, దర్శకుడు, నిర్మాత.
వీరు ఏలూరులో జన్మించి, విద్యాభ్యాసం చేసి, తెలుగులో ఎం.ఎ. పట్టా పొందారు. అక్కడి సి.ఆర్.రెడ్డి కళాశాలలో కొంతకాలం తెలుగు ఉపన్యాసకులుగా పనిచేశారు. వీరు చెన్నైకి మకాం మార్చి నవలా రచలను చేశారు. కొవ్వలి లక్ష్మీనరసింహారావు నవలలు రైళ్ళలో విపరీతంగా ఖర్చవడం చూసి వీరి పద్ధతిలో తానూ అలాంటి నవలలను ఎక్కువగా రాశారు. ఆరోజుల్లో కొవ్వలి, జంపన నవలలను చదవని వారు అరుదు. వీరు రాసిన నవలలలో ఎవరి పెళ్లాం? (1940), నల్లకళ్ల అమ్మాయి (1947), వెంకటేశ్వర మహాత్మ్యం, ఊర్వశి అనే నాటకం (1948), ఆకలి అనే ఖండకావ్య సంపుటి ముఖ్యమైనవి. వీరు అపరాధ పరిశోధన నవలలు అనేకం రాశారు. స్త్రీ పురుష సంబంధాలు, వివాహ సమస్యలు వీరి రచనలలో ప్రాధాన్యం వహించిన అంశాలు. సరళమైన భాష, ఉత్కంఠభరితమైన కథాకథన విధానం వీరి రచనలకు ప్రజాదరణ చేకూర్చాయి.
వీరు 1953లో చెన్నైలో హృద్రోగంతో పరమపదించారు.
చిత్రాలు[మార్చు]
భట్టి విక్రమార్క (1960) (దర్శకుడు)
హరిశ్చంద్ర (1960) (దర్శకుడు)
కృష్ణలీల (1959) (దర్శకుడు)
మేనరికం (1954) (నిర్మాత, దర్శకుడు)
వాలి సుగ్రీవ (1950) (దర్శకుడు)
ఇరవై వ శతాబ్ది ప్రారంభం లో కొత్త పాథకులను అలరించే తేలిక నవలలు విస్తృతంగా రాసి ,ప్రజలలో గ్రంధ పతనాసక్తి పెంపొందించిన ప్రజా రచయితా జంపన చంద్ర శేఖరరావు .వీరి తర్వాత కొవ్వలి నరసింహారావు .వీరిని ప్లాట్ఫారం రచయితలనేవారు .అంటే కాలక్షేపం బటాణీలవంటి పుస్తకాలు రాసేవారని అభిప్రాయం ఆ రకంగా నైనా పుస్తకం చదవాలనే కొరికి తీర్చిన వారు .జంపన ఏలూరులో పుట్టి అక్కడే చదివి తెలుగు లో ఎం ఎ చేశారు .ఏలూరు సి ఆర్ రెడ్డి ఆలేజిలో లెక్చరర్ గా పని చేశారు .ఎవరి పెళ్ళాం ,నళ్ళకళ్ళ అమ్మాయి మొదలైన నవలలు ,వెంకటేశ్వర మహాత్మ్యం ,ఊర్వశి నాటకాలు ,ఆకలి అనే ఖండకావ్య సంపుటి జంపన రాశారు .జంపన –కొవ్వలి జంట రచనలపైఆకాలం వారికీ విపరీతమైన క్రేజు ఉండేది .డిటెక్టివ్ నవలలూ రాశారు జంపన .స్త్రీపురుష సంబంధాలు వివాహ సమస్య వీరి రచనల ఇతి వృత్తాలు సరళ మైన భాష సస్స్పెంస్ తో కధనంవీరి ప్రత్యేకత .
తర్వాత మకాం మద్రాస్ కు మార్చి సినిమాలకు మాటలు రాసి ఆతర్వాత దర్శకులుగా పని చేశారు .
1960లో జంపన దర్శకత్వం వహించిన భట్టి విక్రమార్క చిత్రం లో అంజలి రామారావు ,రేలంగి మొదలైన వారు ముఖ్యనటులు విక్రమార్క,ప్రభావతి అంటే రామారావు అంజలీ దేవి గార్ల సౌందర్యం అంతా తనివి తీరా చూసి ఆస్వాదించాల్సిన సినిమా అనిసెట్టి రచన ,పెండ్యాల సంగీతం ఘంటసాల సుశీల గానం సినిమాకు మరింత వన్నె తెచ్చాయి .ప్రతి ఫ్రేం అత్యద్భుతం కనులవిందు .ఆది ఇరానీ ఫోటోగ్రఫీ కి జోహార్లు .నెలరాజా వెన్నెలరాజా ,కొమ్ములు తిరిగిన మొగవాళ్ళు కొంగు తగిలితే పోలేరు ,సత్యాయా గురుడా నిత్యామయా మొదలైన పాటలు ఎన్నిసార్లు విన్నా వినబుద్ధి అవుతాయి .
రాజ్యం పిక్చర్స్ హరిశ్చంద్ర లో రంగారావు లక్ష్మీ రాజ్యం గుమ్మడి మొదలైన వాళ్ళు నటించగా జంపన డైరెక్ట్ చేశారు .మాటలు జంపన పాటలు జంపన ,కొసరాజు రాశారు పద్యాలు బలిజేపల్లి,జాషువా గార్లవి . సుసర్ల సంగీతం కమల్ ఘోష్ చాయాగ్రహణం .నృత్యం వెంపటి సత్యం లతో క్లాసిక్ సినిమా గా తీశారు జంపన ఆయన దర్శకత్వ సామర్ధ్యానికి ఈ రెండు సినిమాలు నిలువుటద్దాలు .కృష్ణ లీలలు రాజ్యం పిక్చర్స్ నిర్మించగా జంపన డైరెక్ట్ చేశారు రంగారావు ,గుమ్మడి శ్రీరంజని ,.సంగీతం సుసర్ల ఫోటోగ్రఫీ ఎం ఎ రెహ్మాన్ .ఆరుద్ర ,కొసరాజు సదాశివ బ్రహ్మ౦ లు మాటలు పాటలు .అద్భుతమైన సినిమాగగా జంపన తీర్చిదిద్దారు .రంగారావు గారి కంసపాత్ర చిరస్మరణీయం .బాలకృష్ణుని లీలలు పరమాకర్షణీయం .మెలో డ్రామా బాగా పండించారు .1964లో వచ్చిన మేనరికం సినిమాకు నిర్మాత దర్శకుడు జంపన .పెండ్యాల మ్యూజిక్ ,నారాయణరావు జి వరలక్ష్మి సావిత్రి వగైరాలున్నారు .పెద్దగా ఆడిన సినిమాకాదు .1960లో వచ్చిన అశోకా వారి వాలి సుగ్రీవ సినిమా కు కవి ,జంపన డైరెక్టర్ .ఎస్ వరలక్ష్మి జి వరలక్ష్మి శ్రీరంజని ,రాజారావు ఏవి సుబ్బారావు మొదలైనవారు నటులు .సంగీతం రాజేశ్వరరావు పెంచలయ్య ఘంటసాల ,పెండ్యాల ,వేణు .ఇదీ బాగా ఆడిన సినిమా కాదేమో . జంపన దర్శకత్వ ప్రతిభ అంతా భట్టి, , కృష్ణలీలలు లో దర్శనమిస్తుంది .పరవశింప జేస్తుంది .
సశేషం
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -31-1-22-ఉయ్యూరు