మనమరుపు వెనక మన వెండి తెర మహానుభావులు 47,48
47.48-అనిశెట్టి ,పినిశెట్టి
47-అనిసెట్టి సుబ్బారావు (1922-1981), ఆగ్నివీణ ఫేంస్వాతంత్ర్య సమరయోధుడు,-అనిశెట్టి సుబ్బారావు
, తెలుగు సినిమా రచయిత, ప్రగతిశీల కవి, నాటక కర్త.
నాటకరంగ ప్రవేశం
1942లో నరసరావుపేటలో నవ్య కళాపరిషత్‌ను స్థాపించారు ఈయన రచనలలో అగ్నివీణ (1949), బిచ్చగాళ్ల పదాలు ముఖమైనవి. ఈయన నాటకాల్లో రక్తాక్షరాలు (1943), అనిశెట్టి నాటికలు (1945), గాలిమేడలు[2] [3](1949 డిసెంబరు), శాంతి4, మా ఊరు (1954) చెప్పుకోదగినవి. సుబ్బారావు కొన్నాళ్ళు ప్రజాశక్తి, అభ్యుదయ పత్రికలకు సంపాదకునిగా పనిచేశారు. 1942లో, 1944లో స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొని జైలుకెళ్ళారు. కమ్యూనిజం వైపు ఆకర్షితుడై తన నాటకాల ద్వారా ఆ సిద్ధాంతాలను ప్రచారం చేశారు
సినీరంగ ప్రస్థాన
1955లో రచయితగా తెలుగు సినీరంగంలో అడుగుపెట్టారు. సుబ్బారావు, మహాకవి శ్రీశ్రీకి బాగా సన్నిహితుడు. సుబ్బారావు మరణించిన తర్వాత మద్రాసులోని సంతాప సభలో శ్రీశ్రీ ‘నాకు అనిశెట్టి, ఆరుద్ర అ-ఆ’ లాంటివారు. అ-పోయింది. ఆ- మిగిలింది’ అని చెప్పి క్లుప్తంగా తమ అనుబంధాన్ని తెలిపి ముగించారు.
అనిసెట్టి పుట్టింది ఆగర్భ శ్రీమంతుల ఇంట్లోనే గాని అతడు తన చుట్టూ వున్న ఆగర్భ దరిద్రుల ఆర్తనాదాలనే విన్నారు. తండ్రి కోటి లింగం కోటికి పడగెత్తగల శ్రీమంతులు. నరసరావుపేటలోనూ, చిలకలూరిపేటలోనూ ఆయిల్ మిల్లులు, ఇరవై లారీలు ఉండేవి. తండ్రికి మిల్లులోని పనివాళ్ళు ఒకసారి సమ్మె చేస్తే అనిసెట్టి ఆ కార్మికుల పక్షమే వహించి తండ్రికి కోపం తెప్పించారు. 1941 నాటికి గుంటూరు హిందూ కళాశాలలో బి.ఎ. పట్టా పుచ్చుకొన్న అనిసెట్టిని అతని తండ్రి ‘లా’ చదవడానికి మద్రాసు పంపించాడు.
సినిమాలు
ప్రియురాలు (1952)
పెంపుడు కొడుకు (1953)
నిరుపేదలు (1954)
పరివర్తన (1954 సినిమా)
వదినగారి గాజులు (1955)
కనకతార (1956)
కుటుంబ గౌరవం (1957)
భలే బావ (1957)
దైవబలం (1959)
కార్మిక విజయం (1960)
పతివ్రత (1960)
భట్టి విక్రమార్క (1960)
శ్రీకృష్ణపాండవయుద్ధం (1960)
కన్యకా పరమేశ్వరీ మహత్మ్యం (1961)
జేబు దొంగ (1961)
పాప పరిహారం (1961)
సీత (1961)
స్త్రీ హృదయం (1961)
పవిత్ర ప్రేమ (1962)
రక్తసంబంధం (1962)
తోబుట్టువులు (1963)
దొంగ నోట్లు (1963)
సోమవార వ్రత మహాత్మ్యం (1963)
ఆదర్శ సోదరులు (1964)
కలియుగ భీముడు (1964)
గుడిగంటలు (1964)
దొంగను పట్టిన దొర (1964)
మాస్టారమ్మాయి (1964)
అందీ అందని ప్రేమ (1965)
భీమ ప్రతిజ్ఞ (1965)
కన్నెపిల్ల (1966)
సర్వర్ సుందరం (1966)
శ్రీకృష్ణ మహిమ (1967)
నువ్వే (1967)
భార్య (1968)
కన్నుల పండుగ (1969)
పంచ కళ్యాణి దొంగల రాణి (1969)
ప్రేమ మనసులు (1969)
రాజ్యకాంక్ష (1969)
బలరామ శ్రీకృష్ణ కథ (1970)
అనుభవించు రాజా అనుభవించు (1974)
జన్మహక్కు (1980)
అనిశెట్టి కొంతకాలం మద్రాస్ లా కాలేజిలో ,తర్వాత 1946లో విశాఖ లో ఆంధ్రా యూని వర్సిటిలో ఎం ఎ లో చేరారు కానీ పూర్తీ చేయలేదు .శిల్ప ద్రుష్టికలకవి అనిశెట్టి ఈయన ఆగ్నివీణ అందర్నీ బాగా ఆకర్షించింది ..సినిమాలలో డబ్బింగ్ చిత్రాల రచయితగా ప్రవేశించారు .1942 ఆగస్ట్ లో జరిగిన విద్యార్ధుల సమ్మెకు నాయకత్వం వహించారు .ఈ ఉద్యమానికి చెందినా కరపత్రం రాసినందుకు 1942లో మద్రాస్ లో అరెస్ట్ చేశారు రెండేళ్ళు జైలు శిఖా అనుభవించారు ఆయన రాసిన రక్తాక్షరాలు ,,మా వూరు ,అనిశెట్టి నాటికలు బాగా ప్రచారంయ్యాయి.శాంతిఅనే చాయానాటకం ఇతర భారతీయ భాషలలోకి అనువాదం చెందింది .ప్రజాశక్తి పత్రిక కు కొంతకాలం సంపాదకత్వం వహించారు .60వ ఏట అనిసెట్టి సుబ్బారావు మరణించారు .
అభ్యుదయ కవిత్వం లోఅనిశెట్టి అగ్ని వీణ చిరస్మరనీయమైనది –‘’భయం భయం బ్రతుకు భయం ,-అన్నా మనకీ లోకం పన్నిన పద్మవ్యూహం –ఆశలతో బతుకు లీడ్చే ఆస్థి పంజరాలు మనం –ఆవేదన హితమయ్యెఆశా జీవులం మనం .-గతమంటే కారు వెగటు రేపంటే తగని భయం ‘’అని సామాన్యుని దుర్భర స్థితిని ,నిస్సహాయతను రమణీయంగా వర్ణించారు .ఆయన గీతాలలో ‘’ఎవరిపిల్లలోయ్ మీరు ‘’అత్యుత్తమ గీతం అంటారు –‘’ఈ లోకపు శాసనాలు ఎంగిలాకులిస్తాయ్ –ఇనుప కమ్ములిస్తాయ్ ‘’అనిరోద్దుమీద బ్రిద్జికిండా స్టేషన్ లో దుమ్మూ ధూళీ మధ్య తిరిగే పశివారిని గూర్చి జాలితో పలికిన వేదన ఇది .భావతీవ్రతను వెలువరించటం లో అనిశెట్టి కి ఒక ప్రత్యేకత ఉంది .ఆయన గీతాలు ధారాశుద్ధితో గుండెల్ని చీల్చుకుపోతాయి .సినిమాపాటలూ అలానే ఉంటాయి .తత్వ దృష్టి కవితా ప్రీతి ఆయనకు వెన్నతో పెట్టినవి .గుండెలోని ఆవేశానికి ఆవేదనకుకాక శిల్పపరంగా ఒకరూపం కట్టించటానికి ఎక్కువగా రాయత్నించాడని ఆవంత్ససోమసుందర్ చెప్పారు .ఇతడి ఆగ్నివీణ ముట్టుకుంటే రోష విస్ఫులింగాలు కోపాలనం వీరాగ్ని జ్వాలలు వెళ్ళగక్కటం చూస్తాం అన్నారు సోమసుందర్ .
48-పల్లెపడుచు నాటక ఫేం-పినిశెట్టి శ్రీరామమూర్తి
తెలుగు నాటక, సినిమా రచయిత, దర్శకులు.
జనన౦
వీరు తూర్పు గోదావరి జిల్లా పాలకొల్లు లో జన్మించారు.
రచనా ప్రస్థానం
చిన్ననాటి నుండి నాటక రచన, ప్రదర్శనలలో కృషిచేశారు. 1944 సంవత్సరంలో ‘ఆదర్శ నాట్యమండలి’ని స్థాపించారు. ఆదర్శజ్యోతి అనే నాటకం రాసి, ప్రదర్శించి ప్రశంసలు పొందారు. వీరు రాసిన ఇతర నాటకాలు ‘కులం లేని పిల్ల’,[1] ‘పల్లె పడుచు’, ‘అన్నా చెల్లెలు’ అనేక నాటక సమాజాల వారు దేశమంతటా ప్రదర్శించారు. స్త్రీ పాత్ర లేకుండా రాసిన ‘ఆడది’ నాటిన వేయికి పైగా ప్రదర్శనలు ఇవ్వబడి చరిత్ర సృష్టించింది. అదే విధంగా ‘పంజరంలో పక్షులు’, ‘రిక్షావాడు’, ‘సాగరయ్య సంసారం’ కూడా బహుళ ప్రజాదరణ పొందాయి. ‘పల్లెపడుచు’ నాటకాన్ని సినిమాగా బోళ్ల సుబ్బారావు నిర్మించడంతో సినీ రచయితగా పినిశెట్టి చలనచిత్ర రంగంలోకి ప్రవేశించారు. ‘రాజూ- పేద’ చిత్రానికి వీరు సమకూర్చిన సంభాషణలు అత్యంత సహజంగా, శక్తివంతంగా సాగి అలరించటంతో వీరి ప్రస్థానం జయప్రదంగా ప్రారంభమైంది. సంతానం, ఇలవేల్పు, సిరిసంపదలు, ధర్మపత్ని, పిన్ని, జరిగిన కథ -వంటి 60పైగా చిత్రాలకు రచన చేశారు. వీరు ‘చిలకాగోరింక’, ‘గృహలక్ష్మి’ చిత్రాల్లో హాస్యపాత్రలు కూడా పోషించారు.
వీరి కుమారులు ఈనాటి మేటి దర్శకుడు రవిరాజా పినిశెట్టి, ఛాయాగ్రహకుడు రాము పినిశెట్టి. వీరి మనవడు ఆది పినిశెట్టి వర్ధమాన నటునిగా కొనసాగుతున్నారు
సినిమాలు
గడసరి అత్త సొగసరి కోడలు (1981) (కథ, మాటలు)
చిన్ననాటి కలలు (1975) (మాటలు)
ఆస్తికోసం (1975) (కథ)
రామాలయం (1971)(మాటలు)
బంగారు గాజులు (1968) (మాటలు)
పంతాలు పట్టింపులు (1968) (మాటలు)
కలిసొచ్చిన అదృష్టం (1968)(మాటలు)
అత్తగారు కొత్తకోడలు (1968) (కథ)
వీలునామా (1965) (మాటలు)
నిత్య కళ్యాణం పచ్చ తోరణం (1960) (కథ, మాటలు, దర్శకత్వం)
సంతానం (1955) (మాటలు)
పరివర్తన (1954) ('అన్నా చెల్లెలు' నవల)
పల్లె పడుచు (1954)
రాజు-పేద (1954) (మాటలు)
మంచి ప్రతిభఉన్న పినిశెట్టిశ్రీరామమూర్తి యాభై ఏళ్ళు నిండకుండానే మరణించటం శోచనీయం .
తాతినేని ప్రకాశరావు గారు దర్శకత్వం వహించిన జనతా వారి పరివర్తన సినిమాకు పినిశెట్టి శ్రీరామమూర్తి సంభాషణలు మనిశెట్టి పాటలు రాశారు
పినిశెట్టి నిత్యకళ్యాణం పచ్చతోరణం సినిమా తీస్తూ అందులో ఒక ముఖ్యపాత్రను గుమ్మడి గారిని వేయమని కోరితే హాస్యం దుష్టత్వం ఉన్న ఆపాత్రకు సీస్ ఆర్ సరిపోతారు ఆయనతో వేయించమని చెప్పారట .అలానే చేశారు పినిశెట్టి .’’నాటకాలనుంచి వచ్చి సినిమా లకు తగినట్లు అభినయశైలిని మార్చుకొన్న సియేస్ ఆర్ మాడ్యులేషన్ ,ఉచ్చారణ శైలి జాగ్రత్తగా పరిశీలిస్తూ ఉండు ‘’అని చక్రపాణి గుమ్మదిగారితో తరచుగా చెప్పేవారని గుమ్మడి ఉవాచ .
సశేషం
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -1-2-22-ఉయ్యూరు