మన మరుపు వెనుక మన వెండితెర మహానుభావులు -5454-అభ్యుదయ రచయిత,మనుషులు మారాలి ,కళ్యాణ మంటపం డైలాగ్స్ ఫేం-బొల్లిముంత శివరామ కృష్ణ

మన మరుపు వెనుక మన వెండితెర మహానుభావులు -54
54-అభ్యుదయ రచయిత,మనుషులు మారాలి ,కళ్యాణ మంటపం డైలాగ్స్ ఫేం-బొల్లిముంత శివరామ కృష్ణ

బొల్లిముంత శివరామకృష్ణ (నవంబరు 27, 1920 – జూన్ 7, 2005) అభ్యుదయ రచయిత, ప్రజా కళాకారుడు, హేతువాది. అప్పటి మద్రాసు ప్రభుత్వం ఆంధ్రులపై చూపుతోన్న వివక్షని తరిమెల నాగిరెడ్డి చేత పలికించిన రచయిత.. తెలుగు సాహితీ లోకంలో ఆయన నిశ్శబ్ద విప్లవం, మార్క్సిస్టు గాంధీ అని కూడా అంటారు. మనుషులు మారాలి ఆమె ఎవరు సినిమాల సంభాషణకర్త ఆయనే.కళ్యాణ మంటపం సినిమాలో అయన సంభాషణలు టపాసుల్లా పేలాయి గొప్ప పేరు తెచ్చాయి .

జీవిత విశేషాలు
గుంటూరు జిల్లా చదలవాడలో అక్కయ్య, మంగమ్మ దంపతులకు జన్మించిన శివరామకృష్ణ గుంటూరులోనే హయర్‌ గ్రేడ్ ట్రెయినింగ్ పూర్తిచేశారు. ఆయన తండ్రి చదలవాడలో పాఠశాల నెలకొల్పడంతో ఉపాధ్యాయుడిగా అందులోనే చేరారు. కవిరాజు త్రిపురనేని రామస్వామి చౌదరి, త్రిపురనేని గోపీచంద్ లతో పరిచయం కలిగింది. బాల్యంలో ఈయనపై జస్టిస్‌ పార్టీ ప్రభావం, త్రిపురనేని రామస్వామి చౌదరి ప్రభావం ఎక్కువగా ఉండేవి. అందుకు కారణం వారి తండ్రి గారికి రామస్వామి చౌదరి నడిపే బ్రాహ్మణ వ్యతిరేకోద్యమం తోనూ, జస్టిస్‌ పార్టీతోనూ సన్నిహిత సంబంధాలుండేవి. ఆ సంబంధాల ప్రభావం కొడుకు శివరామకృష్ణపై బాగా పడ్డాయి. ఈలోగా గోపీచంద్‌ కథలు రాసి పత్రికల్లో అచ్చేస్తూ ఉండేవారు. మంచి పేరు వస్తూ ఉండేది. అది చూసి శివరామకృష్ణ కూడా వచనంలోకి మారారు. తనూ కథలు రాసి పత్రికలకు పంపాలని నిశ్చయించుకున్నారు. ఫలితంగా 1936లో మద్రాసు నుండి వెలువడే ‘చిత్రాంగి’ పత్రికలో తన తొలి కథ ‘ఏటొడ్డు’ ప్రచురించారు. అప్పుడాయన వయసు పదహారు సంవత్సరాలు.

రచయితగా
1945లో తన ఉపాధ్యాయ వృత్తిని వదలి వ్యవసాయ కార్మిక సంఘంలో చేరి చల్లపల్లి రాజాకి వ్యతిరేకంగా సాగిన భూపోరాటంలో పాల్గొన్నారు. ఆ పోరాట అనుభవాలతోనే తొలి రాజకీయ నవల మృత్యుంజయులు రాశారు. నగారా అనే పత్రిక నడిపారు. కొడవటిగంటి కుటుంబరావు రాసిన ‘పిల్లి’ అనే కథపై కొడవటిగంటి తిరోగమన యాత్ర అంటూ విమర్శ రాశారు. బెంగాల్ కరవుపై బుర్రకథ రాశారు. ‘రైతుబిడ్డ’ హరికథ రాశారు. సూక్ష్మంలో మోక్షం, అంతరాత్మ అంత్యక్రియలు, శివరామకృష్ణ కథలు బొల్లిముంతవే. ఏ ఎండకాగొడుగు, పత్రికా న్యాయం, తెలంగాణా స్వతంత్రఘోష, క్విట్ కాశ్మీర్, ధర్మసంస్థాపనార్థాయ… ఇలా ఎన్నో నాటికలు రాశారు. రాజకీయ గయోపాఖ్యానం, రాజకీయ కురుక్షేత్రం వంటి పద్యనాటకాలు రాశారు. దొంగ దొరికింది, భలేమంచి చౌకబేరం… వంటి రేడియో నాటికలు రాశారు. నేటి భారతం పేరుతో మూకీ నాటిక రాశారు. ప్రజానాట్యమండలి పునరుద్ధరణ సమయంలో బొల్లిముంత శ్రీకాంత్‌తో కలసి అందరూ బతకాలి నాటకం రాశారు. దీన్ని రక్తకన్నీరు నాగభూషణం వందకు పైగా ప్రదర్శనలిచ్చారు.

1955 మధ్యంతరం ఎన్నికల్లో రెండు పర్యాయాలు బొల్లిముంతపై హత్యాప్రయత్నం జరిగింది. 1960లో మనసుకవి ఆత్రేయ దగ్గర చేరారు. వాగ్దానం, కలసివుంటే కలదుసుఖం, కలిమిలేములు వంటి అనేక చిత్రాలకు ఆరుద్రకు సహరచయితగా సహకరించారు. బి.ఎస్. నారాయణ దర్శకత్వం వహించిన సినిమాల్లో అధిక భాగం ఆయన రాసినవే. 1968లో విశాలాంధ్ర ప్రారంభించిన ప్రతిభ వారపత్రికకి సంపాదకుడయ్యారు. దర్శకుడు వి.మధుసూదనరావు చిత్రాలకు ఎన్నిటికో సంభాషణలు రాశారు. ఆయన రాసిన దాదాపు యాభై సినిమాల్లో మనుషులు మారాలి, ప్రజా నాయకుడు వంటి సీరియస్ సినిమాలేకాక శారద, కళ్యాణమంటపం, మూగకు మాటొస్తే, విచిత్రబంధం వంటి సెంటిమెంట్ ప్రధానమైన చిత్రాలు కూడా ఉన్నాయి. నాటకాల్లో హార్మోనియం వాయించారు. స్త్రీ పాత్రలు ధరించారు.

ఉద్యమాలలో]
1938-39 సంవత్సరంలో గుంటూరులో హయ్యర్‌ గ్రేడ్‌ టీచర్‌ ట్రైనింగ్‌కు వెళ్ళినప్పుడు అక్కడ విద్యార్థిఉద్యమంతో ప్రత్యక్ష సంబంధం ఏర్పడింది. ఆ రోజుల్లోనే ఆయన ‘దేశం ఏమయ్యేట్టు?’, ‘వ్యక్తి స్వాతంత్య్రం’ వంటి కథలు రాసి ప్రచురించారు. కమ్యూనిస్టు కార్యకర్తగా ఆయన తన అనుభవంలోకి వచ్చిన విషయాల్ని కథలుగా మలచడం తప్ప, పనికట్టుకుని కథలు రాయాలని రాయలేదు. వ్యవసాయ కూలీలు, ఇతర నిరుపేదలపై దృష్టి సారించి, కమ్యూనిస్టు భావజాలాన్ని ప్రతిబింబిస్తూ రాశేవారు. ఆ రోజుల్లో చదలవాడ పిచ్చయ్య చౌదరి అభ్యుదయ రచయితల సంఘం (అరసం) నాయకుడు. ఆయన ఇటు త్రిపురనేని రామస్వామి చౌదరి, అటు కృష్ణ శాస్ర్తి లాంటి వారందరినీ కలుపుకుని అభ్యుదయ సాహిత్యోద్యమాన్ని ముందుకు తీసుకు వెడుతూ ఉండేవారు. 1943 లో తెనాలిలో అరసం తొలి మహాసభ జరపడంలో చదలవాడ పిచ్చయ్య చౌదరి కృషి ఎంతో ఉంది. ఆ సభకు అధ్యక్షులు తాపీ ధర్మారావు. బొల్లిముంత శివరామకృష్ణ అప్పటికి ఇరవై మూడేళ్ళ యువకుడు. ఆ మహాసభకు కార్యకర్తగా పనిచేశారు. అప్పటిదాకా అరసంతో సంబంధాలు లేకపోవడం వల్ల, అరసం నిర్వహణలో వెలువడే ‘తెలుగు తల్లి’ పత్రికలో బొల్లిముంత కథలు అచ్చు కాలేదు.

మృత్యుంజయులు[మార్చు]
బొల్లిముంత 1945లో టీచర్‌ ఉద్యోగానికి రాజీనామా చేసి, పూర్తి సమయం పార్టీకి అంకితం చేశారు. పార్టీ పనులమీద తిరుగుతూ మునగాల పరగణాలోని జగ్గయ్య పేటకు వెళ్ళి రావడం జరుగుతూ ఉండేది. అక్కడే తెలంగాణ పోరాటం గూర్చి వినడం, అందిన రిపోర్టులు చదువుకోవడం, విషయాలు తెలుసుకోవడం జరుగుతూ ఉండేది. వాటితో ఉత్తేజితుడైన యువకుడు బొల్లిముంత ఇరవై ఏడేళ్ళ వయసులో ‘మృత్యుంజయులు’ నవల రాశారు. కమ్యూనిస్టు పార్టీ నాయకత్వాన 1946-51 మధ్య అర్ధ దశాబ్ద కాలం పాటు తెలంగాణ రైతులు సాయుధులై దోపిడీ వర్గాల మీద తిరుగుబాటు చేశారు. ఈ తిరుగుబాటులో కవులు, రచయితలు, కళాకారులు ఎంతోమంది భాగస్వాములయ్యారు. యాదగిరి, సుద్దాల హనుమంతు, తిరునగరి రామాంజనేయులు, నాజర్‌, సుంకర, వాసిరెడ్డి, కాళోజి, దాశరథి, కుందుర్తి, సోమసుందర్‌, గంగినేని వంటి కవులు తమ అక్షరాయుధాలతో ముందు నిలిచారు.

తెలంగాణ పోరాటం ప్రారంభమైన ఒక సంవత్సరానికి బొల్లిముంత ‘మృత్యుంజయులు’ నవల 1947 అక్టోబరు 25న విడుదల చేశారు. ఒక రకంగా కవుల కంటే కూడా తన నవలాయుధంతో ఆయన ముందు నిలిచారు. ఆ తర్వాత గంగినేని ‘ఎర్రజెండాలు’, వట్టికోట ‘ప్రజల మనిషి’, ‘గంగు’, మహీధర రామ్మోహనరావు ‘ఓనమాలు’, మృత్యు నీడల్లో’, తిరునగరి ‘సంగం’ వంటి నవలలు వెలువడ్డాయి. పోరాట విరమణకు ముందు, బొల్లిముంత నవల తర్వాత వెలువడింది లక్ష్మీకాంత మోహన్‌ ‘సింహ గర్జన’. దేశంలోని ఇతర ప్రాంతాల్లో రైతులు పంటలు పండించుకున్నందుకు శిస్తులు కడతారు. కానీ నాటి తెలంగాణలో శిస్తులు కట్టడానికి మాత్రమే పంటలు పడించాల్సి వచ్చేది. అంతటి దుర్భర స్థితిని సహజంగా చిత్రించింది మృత్యుంజయులు నవల. చచ్చేవాడికి రెండు చావులు ఉండవని దిన దిన గండంగా ప్రతిరోజూ చస్తూ బతకడం కన్నా భావి తరాల ఉజ్వల భవిష్యత్తు కోసం పోరాటంలో చావడమే మేలని జెండా పట్టి పోరాటంలో నేలకొరిగిన వీరులే ఈ మృత్యుంజయులు. నవలలోని ముఖ్య పాత్రలన్నీ పోరాటంలో మరణిస్తాయి.అంటే వీరమరణం పొందుతాయి. నవలా రచయిత దృష్టిలో వారంతా చావును జయించినవారు, మృత్యుంజయులు అని అర్ధం. తెలంగాణ పోరాట కాలంలో వెలువడిన తొలి నవలగా, ఒక చారిత్రక అవసరాన్ని గుర్తించి, ప్రజా పోరాటాన్ని నమోదు చేసిన నవలగా తెలుగు సాహిత్యంలో మృత్యుంజయులు నవలకు సుస్థిర స్థానం ఉంటుంది. నాటి కమ్యూనిస్టు నాయకులు చంద్రం ఈ నవలను బొల్లిముంతతో ఆరు సార్లు తిరగరాయించారట! రావి నారాయణ రెడ్డి ఈ నవలకు ముందు మాట రాశారు.

సినీ రచయితగా
1960లో ఆత్రేయ ప్రోత్సాహంతో బొల్లిముంత శివరామకృష్ణ ఆయనకు సహాయకుడుగా మద్రాసు వెళ్ళారు. ఆత్రేయ స్వయంగా నిర్మించి దర్శకత్వం వహించిన ‘వాగ్దానం’కు బొల్లిముంత తొలిసారి స్వయంగా మాటలు రాశారు. ‘తిరుపతమ్మ కథ’కు సంభాషణలు రాసేసరికి ఆ కళలో మరింత పట్టు సాధించారు. ఆ రకంగా ‘మనుషులు మారాలి’ చిత్రం సంభాషణలో పెద్ద హిట్టయ్యింది. దాంతో బొల్లిముంత మద్రాసులో స్థిరపడాల్సి వచ్చింది. సుమారు నలభై ఐదు సినిమాలకు సంభాషణలు రాశారు. మధ్యలో కొన్ని పాటలు కూడా రాశారు. ‘కాలం మారింది’కి రాష్ట్ర ప్రభుత్వ అవార్డు, ‘నిమజ్జనం’కు జాతీయ అవార్డు లభించాయి.

సినిమా రచయితగా[మార్చు]
· ఖైదీ బాబాయ్ (1973) (మాటల రచయిత)

· కాలం మారింది (మాటల రచయిత)

· శ్రీదేవి (1970) (మాటల రచయిత)

· తిరుపతమ్మ కథ (1963) (మాటల రచయిత)

· వాగ్దానం (1961) (స్క్రీన్ ప్లే)

· ఆయన జూన్ 7, 2005 న మరణించారు.ఆ మరుసటి నెలే జూలై 2005 సంచికను ‘ప్రజాసాహితి’ బొల్లిముంత శివరామకృష్ణ సంస్మరణలో వెలువరించింది.

· ఉపాధ్యాయుడిగా, ఉద్యమకారుడిగా, అరసం నేతగా, కమ్యూనిస్టు కార్యకర్తగా, నవలా రచయితగా, సినీ రచయితగా, సంపాదకుడిగా బహుముఖీనమైన ప్రతిభను కనరపరచిన బొల్లిముంత శివరామకృష్ణ సాహిత్య ప్రపంచంలో మృత్యుంజయుడిగా నిలిచారు.

పురస్కారాల
· 1988లో ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం, గుంటూరు జిల్లా శాఖ వారిచే కొండేపూడి సాహితీ సత్కారం అందుకున్నారు1

· తెలుగునాట అభ్యుదయ సాహిత్యోద్యమం తొలిదశలో ఉన్నప్పుడే బొల్లిముంత శివరామకృష్ణ (1920-2005) సాహిత్య సృజన ప్రారంభించారు. బాల్యంలో ఈయనపై జస్టిస్‌ పార్టీ ప్రభావం, త్రిపురనేని రామస్వామి చౌదరి ప్రభావం ఎక్కువగా ఉండేది. అందుకు కారణం, వారి తండ్రి గారికి రామస్వామి చౌదరి నడిపే బ్రాహ్మణ వ్యతిరేకోద్యమంతోనూ, జస్టిస్‌ పార్టీతోనూ సన్నిహిత సంబంధాలుండేవి. ఆ ప్రభావం కొడుకు శివరామకృష్ణపై బాగా పడింది. త్రిపురనేని రామస్వామి చౌదరి పద్యకవిత్వం రాస్తూ ఉండేవారు. అయితే పత్రికలకు పంపేవారు కాదు. బొల్లిముంత, గోపీచంద్‌, పి.వి.సుబ్బారావు లాంటి కుర్రాళ్లంతా ఆయనకు శిష్యులైపోయి ఆయనలాగా పద్య కవిత్వం రాయాలని ఉబలాటపడేవాళ్లు. వీళ్ల కవిత్వాన్ని ఆయన సరిచేసి సూచనలిస్తూ ఉండేవారు. ఈలోగా గోపీచంద్‌ తన తండ్రి గారి పద్య కవిత్వాన్ని పక్కన పెట్టి వచనంలోకి మారారు. కథలు రాసిన పత్రికల్లో అచ్చేస్తూ ఉండేవారు. మంచి పేరు వస్తూ ఉండేది. అది చూసి శివరామకృష్ణ కూడా వచనంలోకి మారారు. తనూ కథలు రాసి పత్రికలకు పంపాలని నిశ్చయించుకున్నారు. ఫలితంగా 1936లో మద్రాసు నుంచి వెలువడే ‘చిత్రాంగి’ పత్రికలో తన తొలి కథ ‘ఏటొద్దు’ ప్రచురించారు. అప్పుడాయన వయసు పదహారేళ్లు!
ఉద్యమాలతో మమేకం
కథలు రాసి ప్రచురించడం ప్రారంభించిన తర్వాత కొన్నేళ్ల వరకు ఆయనకు అభ్యుదయ రచయితల సంఘంతో సంబంధాలు ఏర్పడలేదు. 1938-39లో గుంటూరులో హయ్యర్‌ గ్రేడ్‌ టీచర్‌ ట్రైనింగ్‌కు వెళ్లినప్పుడు అక్కడ విద్యార్థి ఉద్యమంతో, ఆ తర్వాత చదలవాడలో ఉద్యోగంలో చేరినప్పుడు కమ్యూనిస్టు ఉద్యమంతో ప్రత్యక్ష సంబంధం ఏర్పడింది. ఆ రోజుల్లోనే ఆయన ‘దేశం ఏమయ్యేట్టు?’, ‘వ్యక్తి స్వాతంత్య్రం’ వంటి కథలు రాసి ప్రచురించారు. కమ్యూనిస్టు కార్యకర్తగా ఆయన తన అనుభవంలోకి వచ్చిన విషయాల్ని కథలుగా మలచడం తప్ప, పనికట్టుకుని కథలు రాయాలని రాయలేదు. వ్యవసాయ కూలీలు, ఇతర నిరుపేదలపై దృష్టి సారించి, కమ్యూనిస్టు భావజాలాన్ని ప్రతిబింబిస్తూ రాసేవారు. ఆ రోజుల్లో చదలవాడ పిచ్చయ్య చౌదరి అభ్యుదయ రచయితల సంఘం (అరసం) నాయకుడు. ఆయన ఇటు త్రిపురనేని రామస్వామి చౌదరి, అటు కృష్ణశాస్త్రి లాంటి వారందర్ని కలుపుకుని అభ్యుదయ సాహిత్యోద్యమాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉండేవారు. 1943లో తెనాలిలో అరసం తొలి మహాసభ జరపడంలో పిచ్చయ్య చౌదరి కృషి ఎంతో ఉంది. ఆ సభకు అధ్యక్షులు తాపీ ధర్మారావు. బొల్లిముంత శివరామకృష్ణ అప్పటికి ఇరవై మూడేళ్ల యువకుడు. ఆ మహాసభకు కార్యకర్తగా పనిచేశారు.
మృత్యుంజయుడు నవల
అవి కమ్యూనిస్టు ఉద్యమం ఉధృతమైన రోజులు. బొల్లిముంత 1945లో టీచర్‌ ఉద్యోగానికి రాజీనామా చేసి, పూర్తి సమయం పార్టీకి అంకితం చేశారు. పార్టీ పనుల మీద తిరుగుతూ, మునగాల పరిగణాలోని జగ్గయ్యపేటకు వెళ్లిరావడం జరగుతూ ఉండేది. అక్కడే తెలంగాణా పోరాటం గురించి వినడం, అందిన రిపోర్టులు చదువుకోవడం, విషయాలు తెలుసుకోవడం జరుగుతూ ఉండేది. వాటితో ఉత్తేజితుడైన బొల్లిముంత ఇరవై ఏడేళ్ల వయసులో ‘మృత్యుంజయులు’ నవల రాశారు. కమ్యూనిస్టు పార్టీ నాయకత్వాన 1946-51 మధ్య అర్ధ దశాబ్ద కాలం పాటు తెలంగాణ రైతులు సాయుధలై దోపిడి వర్గాలపై తిరుగుబాటు చేశారు. ఈ తిరుగుబాటులో కవులు, రచయితలు, కళాకారులు, ఎంతోమంది భాగ స్వాములయ్యారు. యాదగిరి, సుద్దాల, తిరునగిరి, నాజర్‌, సుంకర, వాసిరెడ్డి, కాళోజి, దాశరథి, కుందుర్తి, సోమసుందర్‌, గంగినేని వంటి కవులు తమ ఆక్షరాయుధాలతో ముందు నిలిచారు. తెలంగాణ పోరాటం ప్రారంభమైన ఒక సంవత్సరానికి బొల్లిముంత ‘మృత్యుంజయులు’ నవల 1947 అక్టోబర్‌ 25న విడుదల చేశారు. ఒక రకంగా కవులకంటే కూడా తన నవలాయుధంతో ఆయన ముందు నిలిచారు. ఆ తర్వాత గంగినేని ‘ఎర్రజెండాలు’, వట్టి కోట ‘ప్రజల మనిషి’, ‘గంగు’; ‘మహీధర రామ్మోహనరావు’ ‘ఓనమాలు’, ‘మృత్యునీడల్లో’, ‘తిరునగిరి’ ‘సంగం’ వంటి నవలలు వెలువడ్డాయి. అయితే అవన్నీ పోరాటం విరమించిన తర్వాత వెలువడ్డాయి. పోరాట విరమణకు ముందు, బొల్లిముంత నవల తర్వాత వెలువడింది లక్ష్మీకాంత మోహన్‌ ‘సింహగర్జన’.
దేశంలోని ఇతర ప్రాంతాల్లో రైతులు పంటలు పండించుకున్నందుకు శిస్తులు కడతారు. కాని, నాటి తెలంగాణాలో శిస్తులు కట్టడానికి మాత్రమే పంటలు పండించాల్సి వచ్చేది. ఆ దుర్భర స్థితిని సహజంగా చిత్రించింది ‘మృత్యుంజయులు’ నవల. చచ్చేవాడికి రెండు చావులు ఉండవని, దినదిన గండంగా ప్రతిరోజూ చస్తూ బతకడం కన్నా భావితరాల ఉజ్వల భవిష్యత్తు కోసం పోరాటంలో చావడమే మేలని జెండా పట్టి పోరాటంలో నేలకొరిగిన వీరులే ఈ మృత్యుంజయులు. నవలలోని ముఖ్యపాత్రలన్నీ పోరాటంలో మరణిస్తాయి. అంటే, వీరమరణం పొందుతాయి. నవలా రచయిత దృష్టిలో వారంతా చావును జయించిన వారు, మృత్యుంజయులు అని అర్థం! తెలంగాణా పోరాటకాలంలో వెలువడిన తొలి నవలగా, ఒక చారిత్రక అవసరాన్ని గుర్తించి, ప్రజాపోరాటాన్ని నమోదు చేసిన నవలగా తెలుగు సాహిత్యంలో మృత్యుంజయులుకు సుస్థిర స్థానం ఉంటుంది. నాటి కమ్యూనిస్టు నాయకులు చంద్రం ఈ నవలను బొల్లిముంతతో ఆరుసార్లు తిరగరాయించారట! రావి నారాయణరెడ్డి ఈ నవలకు ముందుమాట రాశారు.
సినీ రచయితగా …
కమ్యూనిస్టు పార్టీ చీలిపోకముందే 1964లో ఆత్రేయ ప్రోత్సాహంతో బొల్లిముంత శివరామకృష్ణ ఆయనకు సహాయకుడిగా మద్రాసు వెళ్లారు. మొదట్లో తమిళ సినిమాలకు అనువాదాలు చేస్తుండేవారు. ఆత్రేయ స్వయంగా నిర్మించి, దర్శకత్వం వహించిన, ‘వాగ్దానం’కు బొల్లిముంత తొలిసారి స్వయంగా మాటలు రాశారు. ‘తిరుపతమ్మ కథ’కు సంభాషణలు రాసేసరికి ఆ కళలో మరింత పట్టు సాధించారు. ఆ రకంగా ‘మనుషులు మారాలి’ చిత్రం సంభాషణలతో పెద్ద హిట్టయ్యింది. దాంతో, బొల్లిముంత మద్రాసులో స్థిరపడాల్సివచ్చింది. సుమారు 45 సినిమాలకు సంభాషణలు రాశారు. మధ్యలో కొన్ని పాటలు కూడా రాశారు. ‘కాలం మారింది’కి రాష్ట్ర ప్రభుత్వం అవార్డు, ‘నిమజ్జనం’కు జాతీయ అవార్డు లభించాయి.
”రచనలు అభూత కల్పనల వైపుకాక, జీవిత వాస్తవాల వైపు సాగాలి. సమస్యలు చర్చించాలి. పరిష్కారాలను సూచించాలి. యువ రచయితలకి సరైన మార్గం నిర్దేశించాలి. అప్పుడే ఆరోగ్యవంతమైన సమాజం ఏర్పడుతుంది.” అని తరచూ చెబుతూ ఉండేవారు బొల్లిముంత శివరామకృష్ణ. వారితో నా పరిచయం చాలా సాదాసీదాగా జరిగింది. అది 1993-97 మధ్య కాలం. ఓ రోజు ఓ కుర్రాడొచ్చి ”మా పెద్దనాన్న వస్తానన్నారు. ఇంట్లో ఉంటున్నారా?” అని అడిగాడు. ఎవరో సాహిత్యాభిమాని అయిఉంటాడనుకుని ‘సరే తీసుకురా… ఉంటా’నన్నాను. తీరా చూస్తే ఆయన సాహితీ దిగ్గజం బొల్లిముంత శివరామృష్ణ! అప్పటికే 70 ఏళ్ల పెద్దాయన. అభ్యుదయ నవలా రచయితగా, ‘మనుషులు మారాలి’ చిత్ర రచయితగా పెద్దపేరు సంపాదించుకున్నారాయన. అయనకు నాపై ఏర్పడిన వాత్సల్యపూరిత అభిమానానికి కృతజ్ఞతలతో వినమ్రంగా నమస్కరించి కూర్చోబెట్టాను. తీసుకొచ్చిన కుర్రాడి ఇంటిపేరు కూడా బొల్లిముంత అన్న విషయం మరిచిపోయాను. ఎందుకంటే, అతన్ని మా ఇంట్లో రమణ అని పిలుస్తుండేవాళ్లం. అతనే కవి బొల్లిముంత వెంకట రమణారావుగా రూపుదిద్దుకున్నాడు. అది ఆ తర్వాతి విషయం, శివరామకృష్ణ వాళ్లబ్బాయి హైద్రాబాదు విశాలాంధ్ర ప్రచురణాలయంలో పనిచేస్తుండే వాడు. అందువల్ల ఆయన తెనాలి నుంచి ఎప్పుడు కొడుకు దగ్గరకు హైద్రాబాదొచ్చినా మా ఇంటికి వస్తుండేవాడు. నేను దగ్గరలో ఉన్న దండమూడి మహీధర్‌, సుందరయ్య విజ్ఞాన కేంద్రం లైబ్రేరియన్‌ రాజు, రేడియో చిరంజీవి మొదలైన వాళ్లకు కబురు పెడుతుండేవాడిని. ఓ సారి మా ఇంట్లో, మరోసారి సుందరయ్య పార్కులో కూర్చుని సాహిత్యం గురించి మాట్లాడుకుంటూ ఉండేవాళ్లం. ఒక్కోసారి ఆయనకు ఓపిక ఉందంటే చిక్కడపల్లి నుంచి అలా హిమాయత్‌ నగర్‌ దాకా వెళ్తుండేవాళ్లం. డా|| ఏటుకూరి ప్రసాదో, బూదరాజు రాధాకృష్ణో ఎవరో ఒకరు కలుస్తుండే వాళ్లు. మళ్లా ముచ్చట్లు.. గజ్జెల మల్లారెడ్డి కొంతకాలం చిక్కడపల్లిలో ఉన్నారు. అప్పుడు అదో మీటింగ్‌ ప్లేస్‌! తండ్రి వయసున్న పెద్దవాళ్లతో ఈయనకు ఈ స్నేహాలేమిటని నన్ను చూసి కొందరు ఆశ్చర్యపోతుండేవాళ్లు.సంపాదకత్వం
ఆ రోజుల్లోనే బొల్లిముంత ‘ప్రజాపక్షం’ అనే మాసపత్రికకు సంపాదకత్వ బాధ్యతలు స్వీకరించారు. తెలుగు అకాడెమీ పక్కన డా|| మిత్ర ఉండే వీధిలో పత్రిక ఆఫీసు కూడా ఏర్పాటు చేశారు. పత్రిక ప్రారంభోత్సవం త్యాగరాయ గానసభ ఆడిటోరియంలో ఘనంగా జరిగింది. ప్రారంభ సంచికలో తెలంగాణ ప్రజల భాషలో నేను ఒక కవిత రాశాను. అయితే పత్రిక కొన్ని నెలలు మాత్రమే నడిచింది. ఆ తరువాత ఆయన మళ్లీ తెనాలి వెళ్లిపోయారు. మేం మళ్లీ కలుసుకునే అవకాశం రాలేదు. ఆయన 7 జూన్‌ 2005న మరణించారని తెలుసుకుని బాధపడ్డాం. ఆ మరుసటి నెల జులై 2005 సంచికను ‘ప్రజాసాహితి’ బొల్లిముంత శివరామకృష్ణ సంస్మరణలో వెలువరించింది. ఉపాధ్యాయుడిగా, ఉద్యమకారుడిగా, అరసం నేతగా, కమ్యూనిస్టు కార్యకర్తగా, నవలా రచయితగా, సినీ రచయితగా, సంపాదకుడిగా బహుముఖ ప్రతిభను కనబరిచిన బొల్లిముంత శివరామకృష్ణ సాహిత్య ప్రపంచంలో మృత్యుంజయుడిగా నిలిచారు.

·

· రాజకీయ రంగంలోనే కాదు, సాహిత్య రంగంలోని అవకాశవాదాన్ని, తిరోగమన విధానాలను అనేక సందర్భాల్లో బొల్లిముంత శివరామకృష్ణయ్య నిర్ద్వంద్వంగా ఖండించారు. ఆయన అభ్యుదయ సాహిత్యోద్యమంలోనూ, ప్రజా నాట్యమండలి సాంస్కృతికోద్యమంలోనూ క్రియాశీలంగా కొనసాగారు. నిగర్వి, నిరాడంబరజీవితం గడిపిన ఉదాత్త మానవుడు, నమ్మిన సిద్ధాంతాల పట్ల జీవితాంతం నిబద్ధత కలిగిన ఉత్తమ మానవతావాది బొల్లిముంత జీవితం, వ్యక్తిత్వం, సాహిత్యం నేటి తరానికీ, రానున్న తరాలకూ స్ఫూర్తిదాయకం.

VDO.AI

‘మనిషి జీవితం అతని చైతన్యాన్ని నిర్ణయిస్తుంది సామాజిక అస్తిత్వం-సామాజిక చైతన్యాన్ని ప్రభావితం చేస్తుంది’ అన్న దృక్పథంతో రచనలు చేసిన అగ్రశ్రేణి అభ్యుదయ రచయిత బొల్లిముంత శివరామకృష్ణయ్య. ఉపాధ్యాయుడు, హార్మోనిస్టు, నటుడు, గాయకుడు, కవి, కథారచయిత, నవలాకారుడు, బుర్రకథా రచయిత, హరికథా రచయిత, జర్నలిస్టు, సినిమా రచయిత, అభ్యుదయ రచయితల సంఘం నాయకుడు, రాజకీయ కార్యకర్త, ఉత్తమ కమ్యూనిస్టు బొల్లిముంత.

1920 నవంబరు 27వ తేదీన గుంటూరు జిల్లా వేమూరు మండలం, చదలవాడలో శ్రీమతి మంగమ్మ-, శ్రీ అక్కయ్య దంపతులకు పుట్టిన శివరామకృష్ణయ్య ప్రాథమిక, మాధ్యమిక విద్య తమ స్వగ్రామంలో కొనసాగించి, గుంటూరులో హయ్యర్‌గ్రేడ్‌ శిక్షణ పూర్తి చేశారు. సంస్కృతాన్ని, సంగీతాన్ని స్వయంకృషితో నేర్చుకున్నారు. చదలవాడలో ఆయన తండ్రి నెలకొల్పిన పాఠశాలలో కొంతకాలం ఉపాధ్యాయుడిగా పనిచేశారు. రైతులు, వ్యవసాయ కార్మికుల పిల్లలకు విద్యాబోధన చేశారు. బొల్లిముంత 16వ ఏట రచించిన ‘ఏటొడ్డు’ కథ ‘చిత్రాంగి’ పత్రికలో అచ్చయ్యింది. అది ఆయన తొలిరచన. నూనూగు మీసాల నూత్న యవ్వనవేళ త్రిపురనేని రామస్వామి చౌదరి హేతువాద భావజాలంతో ప్రభావితులయ్యారు. త్రిపురనేని గోపీచంద్‌తో ఏర్పడిన స్నేహం బొల్లిముంత జీవితాన్ని మలుపు తిప్పింది. తమ జీవిత లక్ష్యం నిర్ణయించుకోవలసిన దశలో మార్క్సిస్టు సాహిత్యాన్ని విస్తృతంగా అధ్యయనం చేశారు. తమ గ్రామస్థితిగతులు, రైతుల, వ్యవసాయకూలీల దుర్భర జీవితాలు పరిశీలించారు. వ్యవసాయ కార్మిక సంఘంలో పనిచేయడం మొదలుపెట్టారు. కమ్యూనిస్టు పార్టీ రాజకీయాలతో ఎక్కువగా మమేకమయ్యారు. చల్లపల్లి జమీందారుగా వ్యతిరేకంగా సాగిన భూపోరాటంలో ప్రత్యక్షంగా పాల్గొన్నారు. భూమికోసం, భుక్తి కోసం, బానిసత్వ విముక్తి కోసం హైదరాబాద్‌ సంస్థానంలో జరుగుతున్న రైతాంగ సాయుధ పోరాట ఉదంతాలను పత్రికలలో చదివి, స్పందించి 1947లోనే ‘మృత్యుంజయులు’ నవల రాశారు. తెలంగాణా విమోచనోద్యమ నవలల్లో ఇదే తొలి నవల. నిజాం నిరంకుశత్వానికీ, భూస్వాముల దౌర్జన్యాలకూ వ్యతిరేకంగా పోరాడుతూ ప్రాణాలర్పించిన అమరవీరులను మృత్యుంజయులుగా చిత్రించారు.
పోలీసుచర్య తరువాత నెహ్రూ ప్రభుత్వం కమ్యూనిస్టులపై క్రూర నిర్బంధకాండను అమలు జరిపిన కాలంలో అజ్ఞాతవాసంలో ఉంటూనే గుంటూరు నుంచి ‘నగారా’ పత్రికను నడిపారు. ఆనాటి నెహ్రూ ప్రభుత్వం స్వదేశంలో కమ్యూనిస్టులపై దారుణమైన నిర్బంధకాండను, ఊచకోతను ప్రయోగిస్తూ, మరోవైపు విదేశీవ్యవహారాలలో సోషలిస్టు శిబిరంతో స్నేహసంబంధాల కోసం అర్రులు చాచే ద్వంద్వ వైఖరిని ఎండగడుతూ బొల్లిముంత ‘మొదళ్ళు నరికి చివుళ్ళకు నీరు పోస్తానంటాడు పండిట్‌ నెహ్రూ’ అనే వ్యాసం రాశారు. రాజకీయ రంగంలోనే కాదు, సాహిత్య రంగంలోని అవకాశవాదాన్ని, తిరోగమన విధానాలను అనేక సందర్భాల్లో నిర్ద్వంద్వంగా ఖండించారు. 1943 ఫిబ్రవరి 13, 14 తేదీల్లో తెనాలిలో జరిగిన ప్రథమాంధ్ర అభ్యుదయ రచయితల సంఘం మహాసభల నిర్వహణలో క్రియాశీలంగా పాల్గొన్నారు. అభ్యుదయ సాహిత్యోద్యమంలో భాగస్వామిగా ఉంటూనే, కొడవటిగంటి కుటుంబరావు రాసిన ‘పిల్లి’ కథను ‘నగారా’ పత్రికలో తీవ్రంగా విమర్శించారు. ప్రభుత్వ వ్యతిరేక రచనలు అచ్చవుతున్నాయని ఆ పత్రికను ప్రభుత్వం నిషేధించింది.
ప్రజలను చైతన్యపరచడానికి బొల్లిముంత శివరామకృష్ణయ్య అనేక సాహిత్య ప్రక్రియలనూ, ప్రజా కళారూపాలను సుసంపన్నం చేశారు. బెంగాల్‌ కరువుపై బుర్రకథ రాశారు. రైతుల జీవన స్థితిగతులను వివరిస్తూ ‘రైతుబిడ్డ’ హరికథ రచించారు. బొల్లిముంత కథలు-‘సూక్ష్మంలో మోక్షం’, ‘అంతరాత్మ అంత్యక్రియలు’, ‘శివరామకృష్ణ కథలు’ సంపుటాలుగా వెలువడ్డాయి. 1940-50 దశకాల తెలుగు ప్రాంతాల సామాజిక, రాజకీయ, సాంస్కృతిక పరిణామాలను చిత్రిస్తూ ‘ఏ ఎండకాగొడుగు’, ‘పత్రికా న్యాయం’, ‘తెలంగాణా స్వతంత్ర ఘోష’, ‘క్విట్‌ కాశ్మీర్‌’, ‘ధర్మ సంస్థాపనార్థాయ’ మొదలైన నాటికలు రచించారు. ‘దొంగ దొరికింది’, ‘బలే మంచి చౌకబేరం’ రేడియో నాటికలు రాశారు. ‘నేటి భారతం’ పేరుతో మూకీ నాటికను రూపొందించారు.
‘ప్రజాశక్తి’ పత్రికలో శివరామకృష్ణ రచించిన ‘దేశం ఏం కావాలి’ కథ విశేష జనాదరణ సంపాదించింది. 1955 మధ్యంతర ఎన్నికల్లో కమ్యూనిస్టు పార్టీ పరాజయంతో నిస్పృహ చెందిన బొల్లిముంత క్రమంగా ప్రజారంగాన్ని వదిలి 1960లో మద్రాసు సినిమా రంగంలోకి ప్రవేశించారు. ఆచార్య ఆత్రేయకు ఘోస్ట్‌ రైటర్‌గా ‘కలిసి ఉంటే కలదు సుఖం’, ‘కలిమిలేములు’ మొదలైన అనేక చిత్రాలకు సంభాషణలు రాశారు. ఆత్రేయ దర్శకత్వంలో రూపొందిన ‘వాగ్దానం’ చిత్రానికి సహరచయితగా తెరపైకెక్కారు. నాటి నుంచి బి.ఎస్‌.నారాయణ దర్శకత్వం వహించిన చిత్రాలన్నింటికీ బొల్లిముంత సంభాషణలు రచించారు.
1967లో తిరిగి తెనాలి వచ్చేశారు. అప్పటికి కమ్యూనిస్టు పార్టీ చీలిపోయింది. అదే సంవత్సరం జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో బందరు స్థానం నుంచి సిపిఐ అభ్యర్థిగా బొల్లిముంతను పార్టీ నిలబెట్టింది. మోటూరి హనుమంతరావు సిపిఎం అభ్యర్థి. హోరాహోరీగా జరిగిన దాయాది పోరులో ఉభయ కమ్యూనిస్టులను ఓడించి, చల్లపల్లి జమిందార్‌ విజయం సాధించాడు.
1968లో ‘విశాలాంధ్ర విజ్ఞాన సమితి’ వారి ‘ప్రతిభ’ సచిత్ర వారపత్రికలో బొల్లిముంత సహాయ సంపాదకుడిగా చేరారు. 1969లో వి.మధుసూదనరావు పిలుపుతో తిరిగి మద్రాసు బాటపట్టారు. ‘మనుషులు మారాలి’ సినిమాకు కథ, సంభాషణలు సమకూర్చారు. ఆ చిత్రం వందరోజులు ఆడింది. అప్పటి నుంచి వీరమాచినేని (విక్టరీ) మధుసూదనరావు దర్శకత్వం వహించిన అత్యధిక భాగం సినిమాలకు బొల్లిముంతగారే సంభాషణా రచయిత. క్రమంగా కథకూ, సంభాషణలకూ, సందేశాలకూ ప్రాధాన్యత తగ్గిపోయి, నాయక ప్రాధాన్య చిత్రాల హోరు ప్రారంభమయ్యాక శివరాం మౌనంగా సినిమారంగం నుండి నిష్క్రమించి, స్వగ్రామం చదలవాడకు చేరుకున్నారు.
1943లో తెనాలిలో జరిగిన ‘అరసం’ మొదటి మహాసభల్లో కార్యకర్తగా పాల్గొన్న శివరామకృష్ణయ్య అభ్యుదయ సాహిత్యోద్యమంలోనూ, ప్రజా నాట్యమండలి సాంస్కృతికోద్యమంలోనూ క్రియాశీలంగా కొనసాగారు. ఆయన సారథ్యంలోనే తెనాలిలో అరసం స్వర్ణోత్సవాలు (1994), వజ్రోత్సవాలు (2004) ఘనంగా జరిగాయి. 1988 అక్టోబర్‌ 8, 9 తేదీలలో భీమవరంలో జరిగిన అభ్యుదయ రచయితల సంఘం 10వ రాష్ట్ర మహాసభల్లో బొల్లిముంత అరసం ప్రధాన కార్యదర్శిగా, నేను కార్యదర్శిగా ఎన్నికయ్యాం. 1992లో గుంటూరులో జరిగిన అరసం 11వ రాష్ట్ర మహాసభల్లో ప్రధాన కార్యదర్శి బాధ్యతలను బొల్లిముంత శివరామకృష్ణయ్య నుంచి నేను స్వీకరించాను. పెనుగొండ లక్ష్మీనారాయణ కార్యనిర్వాహక ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు.
బొల్లిముంత ఆదర్శాలను కొనసాగిస్తున్న ప్రగతిశీల రచయితలను సముచిత రీతిలో గౌరవించడానికి తెనాలి సాహితీమిత్రులు బొల్లిముంత బతికున్నప్పుడే, ఆ మహారచయిత పేరిట ‘బొల్లిముంత సాహితీపురస్కారం’ నెలకొల్పారు. ఈ పురస్కారం పొందిన వారిలో హితశ్రీ, పి. దక్షిణామూర్తి, వెలగా వెంకటప్పయ్య, నగ్నముని, ఎం.డి.సౌజన్య, కె.శివారెడ్డి, పరుచూరి సోదరులు, బి.నరసింగరావు, వంగపండు ప్రసాదరావు, గణేశ్‌ పాత్రో, సి.రాఘవాచారితోపాటు ఈ వ్యాస రచయిత కూడా ఉన్నారు.
85 సంవత్సరాల పరిపూర్ణమైన సామాజిక, సాహిత్య, రాజకీయ జీవితం గడిపిన బొల్లిముంత శివరామకృష్ణయ్య 2005 జూన్‌ 7నఅస్తమించారు. నిగర్వి, నిరాడంబరజీవితం గడిపిన ఉదాత్త మానవుడు, నమ్మిన సిద్ధాంతాల పట్ల జీవితాంతం నిబద్ధత కలిగిన ఉత్తమ మానవతావాది బొల్లిముంత జీవితం, వ్యక్తిత్వం, సాహిత్యం నేటి తరానికీ, రానున్న తరాలకూ స్ఫూర్తిదాయకం, ఆదర్శప్రాయం.

· —

బొల్లి ముంత పై ఆచార్య ఎస్ వి సత్యనారాయణ రాసిన ఆప్తవాక్యాలు –

రాజకీయ రంగంలోనే కాదు, సాహిత్య రంగంలోని అవకాశవాదాన్ని, తిరోగమన విధానాలను అనేక సందర్భాల్లో బొల్లిముంత శివరామకృష్ణయ్య నిర్ద్వంద్వంగా ఖండించారు. ఆయన అభ్యుదయ సాహిత్యోద్యమంలోనూ, ప్రజా నాట్యమండలి సాంస్కృతికోద్యమంలోనూ క్రియాశీలంగా కొనసాగారు. నిగర్వి, నిరాడంబరజీవితం గడిపిన ఉదాత్త మానవుడు, నమ్మిన సిద్ధాంతాల పట్ల జీవితాంతం నిబద్ధత కలిగిన ఉత్తమ మానవతావాది బొల్లిముంత జీవితం, వ్యక్తిత్వం, సాహిత్యం నేటి తరానికీ, రానున్న తరాలకూ స్ఫూర్తిదాయకం.

ప్రొఫెసర్‌ ఎస్వీ సత్యనారాయణ

( బొల్లిముంత శివరామకృష్ణయ్య శతజయంతి సందర్భంగా)

Advertisement

కమ్యూనిస్టు రచయిత బొల్లిముంత శివరామకృష్ణ
⋅ November 26, 2020

”కమ్యూనిస్టులకు తమ అభిప్రాయాలు, లక్ష్యాలూ దాచుకోవడమంటే అసహ్యం. సమస్త వర్తమాన సాంఘిక పరిస్థితులనూ బలవంతంగా కూలదోయడం ద్వారానే తమ లక్ష్యాలు సిద్ధించ గలవని వాళ్లు బహిరంగంగానే ప్రకటిస్తారు.” (కమ్యూనిస్టు పార్టీ ప్రణాళిక).
ఉత్తమ కమ్యూనిస్టు ఉత్తమ ప్రచారకుడు కావాలనే ఆదర్శానికి నిదర్శనగా బొల్లిముంత శివరామక ష్ణ తన అభిప్రాయాలను, లక్ష్యాలను ఏ మాత్రం దాచుకోకుండా తను ఆశించిన సమ సమాజ లక్ష్యంగా జీవించారు. జీవితకాలంలో కచ్చితంగా అటువంటి నికార్సయిన సాహిత్యాన్నే స ష్టించారు.
బొల్లిముంత శివరామకృష్ణ గుంటూరుజిల్లా వేమూరు మండలం చదల వాడ గ్రామంలో నూరేళ్ల క్రితం 27 నవంబర్‌ 1920న జన్మించారు. తల్లి దండ్రులు మంగమ్మ, అక్కయ్య. తండ్రి వద్దనే ప్రాథమిక విద్యతో పాటు సంస్కృతం నేర్చుకున్నారు. 8వ తరగతి చదివిన తరువాత హయ్యర్‌ గ్రేడ్‌ పూర్తి చేసి ఉపాధ్యాయ వృత్తి చేపట్టారు. 13ఏళ్ల వయస్సులోనే నాటకరంగంలో ప్రవేశించిన బొల్లిముంత యువకునిగా ‘అమ్మ’ నవల చదివిన ప్రేరణలో కమ్యూనిస్టు ఉద్యమంలో కలిసి సాగారు. తెనాలి తాలూకా పార్టీ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించారు. భూపోరాటాల్లో పాల్గొన్నారు. జైలు శిక్షలు అను భవించారు. అజ్ఞాత వాస జీవితం గడిపారు. భారత కమ్యూనిస్టు పార్టీ ఆదేశం మేరకు 1967లో బందరు పార్లమెంటు నియోజక వర్గానికి పోటీచేసి ఓటమి పాలయ్యారు. అభ్యుదయ సాహితోద్యమంలో, ప్రజా సాంస్కృతిద్యోమంలో క్రియాశీలంగా వున్న బొల్లిముంత భీమవరంలో 1988 అక్టోబర్‌ 8, 9 తేదీలలో జరిగిన అరసం రాష్ట్ర 10వ మహాసభలో ప్రధాన కార్యదర్శిగా ఎంపికై గుంటూరులో 1992 నవంబర్‌ 14, 15 తేదీలలో జరిగిన 11వ మహాసభ వరకూ కొనసాగారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రజానాట్యమండలి ఉపా ధ్యక్షులుగా కూడా సేవలందించారు.
కమ్యూనిస్టుగా రాజకీయోద్యమాలలో క్రియాశీలంగా పాల్గొంటూ సాహిత్య రచనకుపక్రమించిన బొల్లిముంత 1947లో ప్రారంభమైన తెలంగాణ విమోచన పోరాటాన్ని ప్రతిబింబిస్తూ ఆ ఏడాదే ‘మ త్యుంజయులు’ నవలను వెలువరించారు. పోరాట ప్రాంతం వాడిగా కాకుండా ఆంధ్ర ప్రాంతానికి చెందిన బొల్లిముంత చేసిన ఈ రచన ఆ సాయుధ పోరాట కాలంలో వెలువడిన తొలి నవలగా సాహిత్య చరిత్రకెక్కింది.
”యువకుడుగా తన కాలంలో తన సమీప ప్రాంతం తెలంగాణాలో ప్రారంభమైన ప్రజా పోరాట నేపథ్యాన్ని అవగాహన చేసుకుని, దాని ఆంత ర్యాన్ని అర్థం చేసుకొంటూ ఆ పోరాటం జరుగుతున్న తీరుతెన్నుల్ని గమనిస్తూ, ప్రజల పక్షమే అంతిమ విజయమని వైతాళిక గీతికగా ఆవిష్కరించిన కథాకథనం ‘మృత్యుజయులు’ నవల” అని పుస్తక ప్రచురణ కర్తలు (ప్రజాశక్తి ప్రచురణాలయం, బెజవాడ-25 అక్టోబర్‌ 1947) అభిప్రాయం ప్రకటించారు. ఈ నవలను ప్రజా ఉద్యమాలకు ఒక సందేశంగా తెలంగాణా సమరసేనాని రావి నారాయణరెడ్డి అభివర్ణిస్తే, ప్రముఖ అభ్యుదయ రచయిత తుమ్మల వెంకట్రామయ్య ‘ఈ నాటికీ వీరగాథమే!’ అని కొనియాడారు. 2015 వరకూ ఆరు ముద్రణలు పొందిన చిరస్మరణీయ నవల మృత్యుంజయులు. తెనాలిలో 2015 నవంబర్‌లో జరిగిన బొల్లిముంత జయంతి సభలో ఆరవ ముద్రణను ఆవిష్కరించే గౌరవం నాకు లభించింది.
”ఆనాటి నైజాం రాజ్యంలో నెలకొన్న పరిస్థితుల్ని, దేశముఖులు, పటేళ్ళ ఆగడాల్నీ; సామాన్య ప్రజలు – ముఖ్యంగా గ్రామీణ రైతాంగ ప్రజానీకం అనుభవిస్తున్న కష్టాల్నీ, యువకుల్లో తలెత్తుతున్న తిరుగుబాటు ధోరణుల్నీ అక్షరీకరించి; ఇక్కడి ప్రజల్లో చైతన్యాన్నీ, బైటివారిలో సంఘీభావాన్ని రేకెత్తించి ఉద్యమ దిశగా జనాన్ని సమాయత్తం చేయడానికి జరిగిన ప్రయత్నమిది” అని మృత్యుంజయులు నవలను వివరిస్తూ ప్రసిద్ధ రచయిత శీలా వీర్రాజు ‘ప్రజా ఉద్యమానికి అద్దంపట్టిన బొల్లిముంతశివరామకృష్ణ నవల, మృత్యుంజయులు’ వ్యాసం (మహోజ్వల తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట నవలా సాహిత్యం – పరిచయాలు – పరిశీలన; జనసాహితి జంటనగరాల శాఖ ప్రచురణ – మే 2010)లో రాశారు.
బొల్లిముంత స జనాత్మక రచయితేగాక కళాకారుడు కూడా. అభ్యుదయ సాహిత్యోద్యమంతో, అరసంతో, ప్రజా సాంస్క తికోద్యమంతో, కమ్యూనిస్టు కార్యాచరణతో పెనవేసుకుపోయిన జీవితమాయనది, జీవనయానమాయనది. అనేక నాటికలు, నాటకాలు రచించి తెలుగునాట ఉద్యమస్ఫూర్తిని వెదజల్లారు. 1954లో వీరి తొలి కథాసంపుటి ప్రముఖ అభ్యుదయ సాహితీవేత్త అవసరాల సూర్యారావు ‘పరిచయం’తో వెలువడింది. ఆ సంపుటిలోని కథలతోపాటు మొత్తం 31 కథలతో విశాలాంధ్ర పబ్లిషింగ్‌ హౌస్‌ 1990లో మళ్లీ అవసరాలవారి పరిచయంతో ‘బొల్లిముంత శివరామక ష్ణ కథలు’ సంపుటిని ప్రచురించింది.
రచనా వైఖరి
”రచనలో ఉద్వేగం ఉండాలి. ఉత్త ఉద్వేగం చాలదు. భావనాశక్తి, శిల్ప ప్రావీణ్యం, సజీవ భాష, పాఠకుణ్ణి ఉరకలు పెట్టించి మనసును వూటలూరించే సంవిధానం, సందేశం… ఒకటా? వీటన్నిటికంటే ముఖ్యంగా ప్రజాజీవిత చిత్రణ – అదీ అభ్యుదయ మార్గంలో ఉండాలి” అని ”తెలుగుప్రాణి’ కథానికలో తన సాహిత్య దశ, దిశా నిర్దేశాన్ని స్పష్టం చేసిన బొల్లిముంత ఆ విధంగానే కథా సాహిత్యాన్ని స ష్టించారు. విశాలాంధ్ర పక్షపత్రిక, నగారా, ప్రతిభ, జయశ్రీ వంటి పలు పత్రికలలో ప్రచురితమైన 26 కథానికలు, 5 గల్పికలు ఈ సంపుటిలో చోటుచేసుకున్నాయి. 1948 నుండి 1969 వరకు రచనాకాలంగా కనిపిస్తుంది. తన 15వ ఏటనే రాసిన ‘ఏటొడ్డు’ కథ ఈ సంపుటిలో చోటుచేసుకోలేదు. బొల్లిముంత మరేమైనా కథలు రాశారేమో వెతకాల్సి ఉంది. స్వాతంత్య్రంపై ఎన్నో ఆశలు పెట్టుకున్న, పెంచుకున్న ప్రజానీకానికి దానివల్ల వొరిగిందేమీ లేదని, అదొక మేడిపండని స్వాతంత్య్రం వచ్చిన వెంటనే కథారచన ప్రారంభించిన బొల్లిముంత తన కథల్లో స్పష్టం చేశారు. వర్గసమాజంలోని స్వాతంత్య్రానికి అర్థం నిజమైన స్వేచ్ఛ లేకపోవటం, దోపిడీకి గురికావటమే అని విశదీకరించారు (‘స్వాతంత్య్రం’ గల్పికలో). నిజమైన స్వేచ్ఛాస్వాతంత్య్రాలు వర్గరహిత సమాజంలోనే సాధ్యమన్నారు. ఆ సమాజం పోరాటం ద్వారానే సాధ్యమని సందేశించారు. ”రండోరు! రండోరు! పేదల్లారా! పోరాడాం మన హక్కులకై… పోయేదేముందోరు మనకింకా/పోతే ఈ పేదరికమేనోరు!…… ఉక్కు ముక్కలుగ ఒక్కుమ్మడిగా, పోదాం రండోరు పేదల్లారా!” అని ‘సమ్మెపిలుపు’ కథానికలో సమరనాదం మ్రోగించారు. మార్క్స్‌, ఏంగెల్స్‌ కమ్యూనిస్టు ప్రణాళికలో పేర్కొన్న ”కార్మికులు పోగొట్టుకునేది ఏమీ లేదు, తమ శ ంఖలాలు తప్ప. వాళ్లు పొందవలసింది ఎంతైనా ఉంది” మాటలను బొల్లిముంత ఉటంకించారు. బొల్లిముంత కథల్లో శ్రీశ్రీ చెప్పిన పతితులు, భ్రష్టులు, బాధాసర్పదష్టులు, దగాపడిన తమ్ముళ్లు కనిపిస్తారు. అన్నార్తుల ఆక్రందనలు వినిపిస్తాయి. ‘తీవ్ర శ్రుతిలో, తీవ్ర ధ్వనితో వారు చేసే నినాదాలు మిన్నంటుతాయి. మరోపక్క నిస్సహాయతతో కూడిన దయనీయమైన జీవితాలు, భూస్వామ్య పెట్టుబడిదారీ వర్గాల దోపిడీ, పాలక కాంగ్రెస్‌ పార్టీ ప్రజా వ్యతిరేక విధానాలు, ప్రజలపై, ప్రజా సంస్క తిపై ప్రభుత్వ దమనకాండ వంటి ఎన్నో విషయాలు ఈ కథల్లో కనిపిస్తాయి. సామ్యవాద వ్యవస్థ కొరకు పోరాడే ప్రజా శక్తుల పక్షాన నిలిచి వారికి స్ఫూర్తినీ, చైతన్యాన్ని అందించే కథలను రాశారు బొల్లిముంత.
బ్రతుకు బాటలో పోరాటాలు
పద్దెనిమిదేళ్ల పాలేరు రంగడు పంటజొన్న చేను మంచెపై నిలబడి వడిసెల తిప్పుతూ, కేకలు పెడుతూ పక్షుల్ని తోలుతుంటాడు. ఆ మంచెపై వాలిన ముసలి కాకొకటి రంగడికి ‘జీవనగీత’ను బోధిస్తుంది. ”నీవూ నీలాంటి వాళ్లూ మమ్మల్ని డబ్బాలు మోగించి జడిపించ చూస్తున్నారు. నల్లటి గుడ్డల్ని వేలాడగట్టి, కాకినే చంపి గుంజకు వేలదీని ‘మీరూ యిలాగే చస్తారు. కనుక మా పొలాల మీదికి రాబోకండి’ అని భయపెట్టబోతున్నారు… కానీ మేం తిండికి మాడి చస్తామా? బ్రతుకు పోరాటం మానుకుంటున్నామా? బ్రతికి తీరుతాం. మేంకాకులం కానీ భీరువులం కాం…మీరూ మాలాగే పోట్లాడండి… చావుకు భయపడి చచ్చిపోకండి. బ్రతుకు కోసం పోరాడ్డంలో చచ్చిపోయినా ఫర్వాలేదు. మిగతావాళ్లకైనా బ్రతుకు బాటలు ఏర్పడతాయి.” వామపక్ష భావజాలప్రచారానికి కథా ప్రక్రియను బొల్లిముంత ఎంతచక్కగా ఆశ్రయిం చారో ఈ కథ ‘జీవనగీత’ద్వారా అర్ధం చేసుకోవచ్చు. పక్షులు, జంతువులు పాత్రలుగా మారి మాట్లాడటం, మాట్లాడే భావన కలిగించే ‘యాంత్రియో మార్ఫిజమ్‌’ శిల్ప విధానాన్ని ముసలికాకి పాత్ర ద్వారా ఈ కథలో చక్కగా ప్రయోగించారు బొల్లిముంత. కుహనా ప్రజాస్వామికవాది, భూస్వామి శ్రీరాములు దోపిడీని ముసలినక్క ఎలా తన చతురతతో ప్రతిఘటించిందో వివరించినకథ ‘చేపచెట్టెక్కింది’. ‘చందమామ’లోని జానపద కథలా పాఠకు లను ఆకట్టుకుంటుంది. బ్రతుకు బాటలు ఏర్పాటు చేసుకోవటానికి సంఘం పెట్టుకొని సమ్మెకట్టిన పాకీ పనివాళ్ల ధైర్యాన్ని ‘సమ్మె పిలుపు’ కథ వివరిస్తుంది. పాకీ పనివాళ్ల జీవితచిత్రణ, వాళ్ల పనిలో ఉండే నిక ష్టాన్ని, వాళ్ల జీవన దైన్యాన్ని, హైన్యాన్ని ఈ కథ కళ్లకు కడుతుంది. అదే బ్రతుకు బాటలో ఉద్య మించి హతుడైన సాలమన్‌ జీవితాన్ని చిత్రించిన కథ ‘గోరీల దొడ్లో, ‘హరిజనుడే మనరాజ్యం ఏలుతాడ’ని చెప్పిన గాంధీ మాటలు స్వాతంత్య్రా నంతరం ఎంత బూటకంగా, సత్యదూరంగా మారాయో ఈ కథ వివరిస్తుంది. దళితులపై సాగుతున్న దోపిడీని ఈ కథ ఆర్థంగా చిత్రించింది. చదువుల కోసం హిందూ మతం నుండి క్రిష్టియన్‌ మతం స్వీకరించి మతాంతీకరణ చెంది స్వామి సాలమన్‌గా మారి తనవారికోసం ఉద్యమించటం, ఆ ఉద్యమంలో దోపిడీదారుల పక్షాన కొమ్ముగాసిన పోలీసులు సాలమన్ను హత మార్చటం ఈ కథాంశం.
మా పాపమిట్టాపండి మనుషులం మార్కెట్టులో సరుకులాగా అయి పోయాం. అంతా బేరమే. మీకుఇష్టమైతే కొంటారు. మాకు ఇష్టమైతే అమ్ముతాం. అంతేనా?” మనిషి తన సమస్త సహజ అస్తిత్వాలను కోల్పోయి మార్కెట్‌ సరుగ్గా మారటాన్ని తెలుపుతున్న ఈ కథలోని మాటలు నేటికీ వాస్తవమే కదా!
”…. ఇరవై ఏళ్ల స్వరాజ్య జీవనంలో కూడా కూడూ గుడ్డా లేకపోవటమే ఈ కథకి కారణాలుగా బైటపడేవి. హ దయం ఉండి ఆలోచిస్తే, ఆచరణలోకి తెస్తే, ముందుముందు జనవరి 26లయినా ఇట్లాంటి కథలు లేనివిగా, కనీసం కథలకి కారణాలు కానివిగా ఉండేవి. కానీ, ”అయితే-గియితే”- అని మన ఆశలేతప్ప అవేవీజరుగలేదు…యికజరుగుతాయన్న ఆశాలేదు..” స్వాతంత్య్రం వచ్చిన ఇరవై ఏళ్ల అనంతరం 1969లో రాసిన ‘జరగని కథకోసం’లో దేశ వాస్తవ భౌతికపరిస్థితులను పేర్కొంటూ ‘మన స్వతంత్రమొక మేడిపండు, మన దరిద్రమొక రాచపుండు’ అని వివరిస్తారు బొల్లిముంత. స్వాతంత్య్రానంతరం ఆకలిచావులపై రాసిన మరోకథ ‘అంతరాత్మ అంత్యక్రియలు’.
బొల్లిముంత రాసిన ‘ప్రాణం వెల’ను గురించి కొంత చెప్పుకోవాల్సి ఉంది. సింహాద్రి నాగావళి నదిలో పడవతోటి జనాన్ని ఆ ఒడ్డుకు, ఈ ఒడ్డుకు చేరుస్తూ కుటుంబాన్ని పోషించుకునే శ్రమజీవి. గజ ఈతగాడు కూడా. ఒకానొక వరద సందర్భంలో పడవ నడపలేని అస్సహాయ స్థితి. ఇంట్లో ఆకలి కేకలు. షావుకారు గుర్నాథం వద్దకు నూకలకోసం వెళ్లినప్పుడు వరదకు నదిలో పైనుంచి కొట్టుకువచ్చే కలప ఏరుకొని వస్తే దానికి డబ్బు చెల్లిస్తానంటాడు. కొద్దిగా నూకలుకొలుస్తాడు. వరద ఉధ తిలో ఉన్న నాగావళి నదిలోకి దుస్సా హసంతో దూకి అందినకాడికి కలపను ఒడ్డుకు చేరుస్తాడు. కానీ, ప్రవాహ ప్రమాదంలో చనిపోతాడు. ఇదీ కథాంశం. బ్రతుకు తెరువుకోసం దుస్సాహ సానికి దిగి ప్రాణం కోల్పోయిన సింహాద్రిని మన కళ్లముందు కనబడేట్టు చిత్రించారు. ఈ కథలో వేగం వరద నాగావళి అంత వేగాన్ని సంతరించుకుని ప్రవాహరీతిలో సాగుతూ పాఠకునిలో క్షణక్షణమూ ఉత్సుకతను, ఉత్కంఠను రేకెత్తిస్తుంది. తెనాలి ప్రాంతానికి చెందిన బొల్లిముంత ఉత్తరాంధ్రకు చెందిన నాగావళి నదిని, అక్కడ ఎక్కువగా వినబడే పేర్లలో ఒకటైన సింహాద్రిని ఈ కథలో చేర్చటం విశేషం. మా గోఖలే రాసిన ప్రసిద్ధమైన కథ ‘బల్లకట్టు పాపయ్య’ను గుర్తుకు తెస్తుంది ఈ కథ.
ప్రజా సంస్క తిపై దాడులను నిరసిస్తూ…
‘ఏకపుత్రులు’ అందరిలాగానే అతి గారాబంగా పెరిగిన సీతారాముడులో ఆ ఊళ్లో ఏర్పడిన యువజన సంఘం ద్వారా మార్పులు చోటుచేసుకున్నాయి. సీతారాముడు కళాకారుడవుతాడు. ‘ఈ నాటకం ఆడితే ప్రజలు చెడతారు. శాంతిభద్రతలు ఇరుకునపడతాయి’ అనే అభియోగంతో హెడ్‌ కానిస్టేబుల్‌ సీతారాముడి బ ందం ఆడే నాటకాన్ని నిషేధిస్తాడు. తన అభియోగానికి సాక్ష్యంగా ”ఈ తెరలు చూడండి. లక్ష్మిగాని, సరస్వతిగాని, చివరకు మన హనుమంతుడుగానీ ఉన్నారేమో!…. ఈ తబలాకి చుట్టిన గుడ్డ చూడండి ఎర్రగా” అని చూపుతాడు. ఇవి నవ్వు తెప్పించే విషయాలుగా మనకు కనపడతాయి. అదే సమయంలో పాలకపక్ష చౌకబారుతనాన్ని, డొల్లతనాన్ని చూపుతాయి. నాటక ప్రదర్శన సందర్భంలో దర్శకుడిని అరెస్ట్‌ చేస్తాడు హెడ్డు. తరువాత సీతారాముడి గ్రామంపై పోలీసుల దాడి. ఎక్కడెక్కణ్ణుంచో, ఎవరె వర్నో పట్టుకొచ్చి ఆ వూరి పొలిమేరలో కాలుస్తారు. సీతారాముణ్నీ పట్టుకెళ్లి దాడులు, హత్యలు ఆరోపణలపై పోలీసులు చంపుతారు. ‘తెలుగు ప్రాణి’ అనే ఈ కథ 1954లో ప్రచురితమైంది. అయితే అంతకుముందు తెలంగాణ సాయుధ పోరాట నేపథ్యంలో తెలుగు నేలమీద అనేక గ్రామాల్లో కాంగ్రెస్‌ పాలకపక్షం సాగించిన దారుణ మారణకాండను బలీయంగా చిత్రించిందీ కథ. ఈ కథ 1950 ప్రాంతాలలో ప్రజా సాహిత్య, సాంస్క తికోద్యమాలపై ప్రభుత్వం చేసిన దాడులను, విధించిన నిషేధాలను గుర్తుకు తెస్తుంది. విశాలాంధ్ర పక్షపత్రిక, మా భూమి నాటకం, సోమసుందర్‌ వజ్రాయుధం కవితా సంపుటం వంటి రచనలపై నిషేధం, మా భూమి ప్రదర్శనపై, బుర్రకథ కళారూపంపై ఆనాటి కాంగ్రెస్‌ ప్రభుత్వం విధించిన నిషేధాలను కళాకారులు, రచయితలు, సంపాదకులపై దాడులు చేయటాన్ని ప్రజాస్వామిక స్వభావమున్న వారెవరూ మరచిపోలేని సత్యాలు. కమ్యూనిస్టులపై పోలీసు వ్యవస్థ సాగిస్తున్న హత్యాకాండను వివరించిన మరో కథ ‘పరిశోధన’.
అవకాశవాదాన్ని ఎండగడుతూ…
అంతవరకూ స్వాతంత్య్రాన్ని వ్యతిరేకిస్తూ వచ్చిన జస్టిస్‌ పార్టీకి చెందినవారు కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే కాంగ్రెస్‌ జెండాలు పట్టుకొని, గాంధీ టోపీలు పెట్టుకొని ‘ఏ యెండకు ఆ గొడుగు పట్టడా’న్ని, బీద ప్రజలను తమ పాత పద్ధతులలోనే దోచుకుంటున్న ‘షావుకారు నారయ్య’లాంటి వారి నిజస్వరూపాలను ‘ప్రజాసేవ’ కథ (1948 విశాలాంధ్ర పక్షపత్రిక) బహిర్గతం చేసింది. ఇటువంటిదే మరో కథ ‘దేశం ఏం కావాలి?. ”స్వాతంత్య్ర సమర యోధుడు చక్రపాణి జైలునుంచి విడుదలై స్వగ్రామం తిరిగొస్తుంటే అంతకు ముందు చక్రపాణిని స్వాతంత్య్రోద్యమాన్ని ద్వేషించిన, నిరసించిన రౌడి వెంకయ్య, షావుకారునారయ్య, గమళ్ళసోములు, ప్రైవేట్‌బాపినీడు, పెత్తం దారు, ప్రక్కవూరు గ్రామ మునసబు వంటివారు ఎదురేగి స్వాగత మివ్వటం ద్వారా వాళ్లలో ఏర్పడ్డ అవకాశవాద తత్వాన్ని, ఆ కాలంలో నడిచిన కాంగ్రెస్‌ మార్కు దుష్ట సంస్క తిని ఎండగట్టింది. ఈ కథ చక్రపాణి కలలో సాగిన ఈ కథలోని సంఘటనలను తలచుకొని ‘దేశం ఏంకావాలి?” అని బొల్లిముంతతో పాటు మనమూ ఆవేదనకు గురవుతాం.

· సశేషం

· మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -6-2-22-ఉయ్యూరు

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in సినిమా and tagged . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.