

మన మరుపు వేనుక మన వెండి తెర మహానుభావులు -57 57-అందాల హుందా తార వేదవల్లి-సంధ్య


సంధ్య అసలు పేరు వేదవల్లి . నటి. మాయాబజార్ చిత్రంలో రుక్మిణి పాత్రధారి.ఆమె తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కుమారి జయలలితకు తల్లి.
జీవిత విశేషాలు
ఆమె బ్రిటీష్ ఇండియాలోని మద్రాస్ ప్రెసిడెన్సీలోని శ్రీరంగంలో తమిళ బ్రాహ్మణ కుటుంబంలో 1924 లో జన్మించారు ఆమె అసలు పేరు “వేదవల్లి”. సంధ్య పేరుతో సినిమా నటిగా వెలిగారు . 1950లో తన 26వ యేట తన భర్త జయరామన్ మరణించాడు. ఆమెకు ఇద్దరు పిల్లలు. వారు జయకుమార్, జయలలిత. ఆమె భర్త జయరామన్ మరణించేనాటికి జయలలిత వయస్సు రెండేళ్ళు[1]. ఆమె భర్త జయరామన్ లాయరుగా పని చేసేవాడు.[2] జయరామన్ మరణించిన తర్వాత బెంగళూరులో ఉంటున్న పుట్టింటికి కూతురితో సహా చేరారు వేదవల్లి. కుటుంబ బాధ్యతను మోయడం కోసం వేదవల్లి టైపు, షార్ట్ హ్యాండ్ నేర్చుకొని, గుమస్తాగా పని చేయడం మొదలుపెట్టారు. తర్వాత మద్రాసులో ఎయిర్‌హోస్టెస్‌గా, రంగస్థల నటిగా కొనసాగుతున్న తన సోదరి అంబుజవల్లి (విద్యావతి) దగ్గరికి వేదవల్లి వెళ్ళారు. ఆమె తన సోదరి అంబుజవల్లి అడుగుజాడలలో నటించారు . దాంతో ఆమె కుమార్తె జయలలిత ఆమెకు దూరంగా అమ్మమ్మ-తాతల దగ్గర పెరిగింది. చిన్నారి జయను వదిలి వేదవల్లి కూడా కుటుంబపోషణ నిమిత్తం 1952లో మద్రాస్‌కు వచ్చేసింది.[3] కూతురికి దూరంగా వేదవల్లి మద్రాసులో ఉంటూ, సంధ్యగా పేరు మార్చుకుని నాటకాల్లోకి, తర్వాత సినిమాల్లోకి అడుగుపెట్టారు. అటుపైన ఆర్థికంగా ఫర్వాలేదనిపించడంతో కుమార్తెను కూడా మద్రాసు తీసుకెళ్ళారు. వాస్తవానికి కూతురిని బాగా చదివించాలన్నది తల్లి సంధ్య ఆశయం. అందుకే, బాల నటిగా పలు అవకాశాలు వచ్చినప్పుడు, ‘అమ్మాయి చదువుకు ఆటంకం లేకుండా షూటింగ్స్ పెడితే ఓకే’ అని ఆమె కండిషన్ పెట్టేది[4]. తదనంతరం ఆమె జయలలిత ను కూడా నటిగా ప్రోత్సహించారు .
ఆమె క్యారెక్టర్ నటిగా, గుర్తింపు పొందిన నటులకు సోదరి లేదా తల్లిగా సహాయక పాత్రలను కూడాఅ పోషించారు . నటి కావడానికి ముందు వ్యవసాయ డైరెక్టరేట్‌లో కార్యదర్శిగా పనిచేశారు సుమారు 11ఏళ్ళు మాత్రమె ఫీల్డ్ లో ఉన్నా ఆమె ధరించిన పాత్రలు చిరాస్మరణీయం .
సంధ్య కేవలం 47 ఏళ్ళు మాత్రమె జీవించి 1971లో మరణించారు.చక్కని అంగసౌష్టవం ముఖవర్చస్సు కాంతులీనే కనులు అందమైన నాశిక ,స్పష్టమైన వాచికం ఆమె ప్రత్యేకతలు .అన్నీ హుందా తనం ఉన్న పాత్రలే పోషించారు .ఆమెను చూస్తుంటే అందమే మూర్తీభవించి నడిచి వస్తోందా అని పించేది .
నటించిన చిత్రాలు-
· ఇరుగు పొరుగు (1965)
· నర్తనశాల (1963)
· కులగోత్రాలు (1962)
· శ్రీశైల మహత్యం (1962)
· భార్యాభర్తలు (1961)
· శ్రీ వేంకటేశ్వర మహాత్మ్యం (1960)
· మనసిచ్చిన మగువ (1960)
· కృష్ణలీలలు (1959)
· చెంచులక్ష్మి (1958)
· మాయాబజార్ (1957)
· ప్రేమే దైవం (1957)
· తెనాలి రామకృష్ణ (1956)
· విప్రనారాయణ (1954)
నర్తనశాలలో విరాట రాజుభార్య సుధేష్ణ గా సంధ్య గొప్ప నటన ప్రదర్శించారు .విప్రనారాయణ లో దేవదేవి అక్కగా సమర్ధ వంతంగా నటించారు .తెనాలి రామకృష్ణ లో రాణీ పాత్ర లో మహా హుందాగా నటించారు .ప్రేమే దైవం లో గుమ్మడి శ్రీరంజని లతో ఆర్ నాగేంద్రరావు డైరెక్షన్ లో నటించారు .చెంచు లక్ష్మి లో చెంచు రాణిగా అంజలి తల్లిగా సహజంగా నటించారు .రంగారావు లక్ష్మీ రాజ్యం లతో కృష్ణలీలలు లో జంపన డైరెక్షన్ లోనూ ,భీం సింగ్ దర్శకత్వం లో జెమిని గనేశన్ సావిత్రి లతో ,పి.పుల్లయ్య డైరెక్షన్ లో వెంకటేశ్వర మహాత్మ్యం లో సరస్వతీదేవిగా నటించారు ప్రత్యగాత్మ డైరెక్షన్ లో భార్యాభర్తలు సినిమాలో రమణారెడ్డి భార్య,కృష్ణకుమారి తల్లి కనకం గా సరదాగా నటించారు .ఆరూర్ పట్టాభి దర్శకత్వం లో శ్రీశైల మహాత్మ్యం లో రాజకుమార్ సరసన ,కులగోత్రాలలో ప్రత్యగాత్మ డైరెక్షన్ లోనూ నటించారు .
సశేషం
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -7-2-22-ఉయ్యూరు