5-హేతువాది,నాస్తికుడు, ఆంధ్ర విశారద విజయోల్లాస వ్యాఖ్యకర్త ,తాతాజీ -తాపీ ధర్మారావు
తాపీ ధర్మారావు (Tapi Dharma Rao) (సెప్టెంబర్ 19, 1887 – మే 8, 1973) తెలుగు రచయిత, తెలుగు భాషా పండితుడు, హేతువాది, నాస్తికుడు . తాపీ ధర్మారావు జయంతి సెప్టెంబర్ 19 ని “తెలుగు మాధ్యమాల దినోత్సవం”గా జరుపుకుంటున్నాము.[1]
జీవిత చరిత్ర[మార్చు]
ధర్మారావు 1887 సంవత్సరంలో సెప్టెంబర్ 19న ప్రస్తుతం ఒరిస్సాలో ఉన్న బెర్హంపూరు (బరంపురం ) లోని ఒక తెలుగు కుటుంబములో జన్మించాడు.[1] ఈయన మాలపిల్ల, రైతుబిడ్డ మొదలైన సినిమాలకు సంభాషణలు రాశాడు. ఈయన ప్రాథమిక విద్యను శ్రీకాకుళంలో, మెట్రిక్యులేషన్ విజయవాడలో, పర్లాకిమిడిలో ఎఫ్.ఏ. వరకు చదువుకొని మద్రాసులోని పచ్చయప్ప కళాశాలలో చేరాడు. పర్లాకిమిడిలో చదివే రోజులలో వ్యవహారిక భాషావేత్త అయిన గిడుగు రామ్మూర్తి ఈయనకు గురువు కావటం విశేషం.ధర్మారావు తల్లి పేరు నరసమ్మ. తండ్రి అప్పన్న. వీరి ఇంటి పేరు మొదట్లో “బండి” లేదా “బండారు” కావచ్చును. అప్పన్న తాత లక్ష్మయ్య కొంతకాలం మిలిటరీలో పనిచేశాడు. తరువాత తాపీ పనిలో మంచి పేరు తెచ్చుకొన్నాడు. అలా అతనికి శ్రీకాకుళంలో “తాపీ లక్ష్మయ్యగారు” అన్న పేరు స్థిరపడిపోయిందట. కల్లికోట రాజావారి కళాశాలలో గణిత ఉపాధ్యాయులుగా పనిచేశాడు. 1910 ప్రాంతంలో కొందరు మిత్రులతో కలిసి బరంపురంలో వేగుచుక్క గ్రంథమాలను స్థాపించాడు. ఇతని తొలి రచన 1911లో ‘ఆంధ్రులకొక మనవి’ అనే పేరుతో విలువడింది. పత్రికా నిర్వహణలో ఇతని నేర్పు అనన్య సామాన్యమైనది. కొండెగాడు, సమదర్శిని, జనవాణి, కాగడా మొదలైన పత్రికలు ఇతని ప్రతిభకు నిదర్శనాలు. ఇతను 1973 మే 8న మరణించాడు. తెలుగు సినిమా దర్శకులు తాపీ చాణక్య ఇతని కుమారుడు.
జీవితంలో ముఖ్య ఘట్టాలు[2][మార్చు]
1887 – సెప్టెంబర్ 19 జననం – గంజాం జిల్లా, బరంపురం
1903 – మెట్రిక్ పరీక్షకెళ్ళే యత్నం విఫలం
1904 – మెట్రిక్ పరీక్షలో మొదటి శ్రేణిలో కృతార్థత – విజయ నగరం
1904 – గురజాడను సుదూరంగా దర్శించడం
1904 – ఎఫ్.ఎ. పర్లాకిమిడి రాజా కళాశాలలో ప్రవేశం, పర్లాకిమిడి
విశేషాలు[మార్చు]
· ఉమ్మడి రాష్ట్రంగా వున్న రోజుల్లో బొబ్బిలి రాజా వారు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నప్పుడు- ధర్మారావుగారు ఆయన దగ్గర కార్యదర్శిగా పనిచేశారు.
· ఆంధ్ర రాష్ట్ర పత్రికా రచయితల మహాసభ జరిగినప్పుడు తాపీవారే మొదటి అధ్యక్షులు.
· ‘మాలపిల్ల’ (1938) సినిమాకు కథ అందించినది- గుడిపాటి వెంకటచలం.
· తాపీని గౌరవంగా ‘తాతాజీ’ అని పిలిచేవారు.
రచనలు[మార్చు]
- ఆంధ్రులకొక మనవి
- దేవాలయాలపై బూతుబొమ్మలు ఎందుకు? 1936
- పెళ్ళి దానిపుట్టుపూర్వోత్తరాలు 1960
- ఇనుపకచ్చడాలు
- సాహిత్య మొర్మొరాలు
- రాలూ రప్పలూ
- మబ్బు తెరలు
- పాతపాళీ
- కొత్తపాళీ
- ఆలిండియా అడుక్కుతినేవాళ్ళ మహాసభ
- విజయవిలాసం వ్యాఖ్య
- అక్షరశారద ప్రశంస
- హృదయోల్లాసము
- భావప్రకాశిక
- నల్లిపై కారుణ్యము
- విలాసార్జునీయము
- ఘంటాన్యాయము
- అనా కెరినీనా
- ద్యోయానము
- భిక్షాపాత్రము
- ఆంధ్ర తేజము
- తప్తాశ్రుకణము
· శృంగేరి పీఠాధిపతులు జగద్గురు చంద్రశేఖర భారతీ శంకరాచార్యుల వారి నుండి 1926లో ‘ఆంధ్రవిశారద’ బిరుదు,
- చేమకూరి వెంకటకవి రచించిన ‘విజయవిలాసం’ కావ్యానికి చేసిన ‘హృదయోల్లాస వ్యాఖ్య’కు 1971లో కేంద్రసాహిత్య అకాడమీ పురస్కారము.
- మరెన్నో సాహిత్య పురస్కారములు.
శ్రీ నాగసూరి వేణుగోపాల్ మాటలలో – ‘పత్రికలు వట్టి మాటల పోగులే కాదు, క్రియాకలాపానికి కూడా దారి తీయాలి. సంఘంలో ఒక కొత్త జీవనకళను కలిగించడంలో చేతనైన విధంగా పత్రికాముఖంగా పాటు పడాలి’’ ఇది తాపీ ధర్మారావు సంపాదకుడుగా ‘కాగడా’ వార పత్రికలో సుమారు ఏడు దశాబ్దాల క్రితం రాసిన విషయం! అది ఇప్పటికీ అర్థవంతమైనదే. తాపీ ధర్మారావును కొందరు జనవాణి, సమదర్శిని, కాగడా మొదలైన పత్రికల సంపాదకుడుగా గుర్తుంచుకుంటే–మరికొందరు ఎన్నో విజయవంతమైన తెలుగు చలనచిత్రాల స్క్రీన్ ప్లే, సంభాషణల రచయితగా స్మరించుకుంటారు. కొంతమంది కొత్తపాళీ, దేవాలయాలపై బూతు బొమ్మలెందుకు?, విజయవిలాసానికి హృదయోల్లాస వ్యాఖ్య వంటి విభిన్నమైన రచనల కర్తగా ప్రస్తుతిస్తుండగా – ఇంకొంతమంది రచయితల సంఘాలకు వారు చేసిన సేవలను కొనియాడుతారు.
కానీ వారు చేసిన సేవ ప్రధానంగా ఏమిటో విద్వాన్ విశ్వం, ఆరుద్ర వంటివారు చాలా విస్పష్టంగా పేర్కొన్నారు. తెలుగు దినపత్రికల్లో తొలిసారిగా వ్యావహారిక భాషను ప్రవేశపెట్టిన సాహసిగా విద్వాన్ విశ్వం ‘మాణిక్యవీణ’లో ధర్మారావును శ్లాఘించారు. మన తెలుగు సినిమాల్లో వ్యావహారిక భాష ఆయన పెట్టిన భిక్ష అని ఆరుద్ర ‘వనిత’ మాసపత్రికలో తాపీవారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ విశదం చేశారు. 1887 సెప్టెంబరు 19న పుట్టిన తాపీ ధర్మారావు 1973 మే 8న కన్నుమూశారు. గిడుగు రామమూర్తి ఆయనకు పర్లాకిమిడిలో పాఠం చెప్పిన గురువు. ఆయన విజయనగరంలో చదువుకునే కాలంలో గురజాడ అప్పారావు ఉన్నారు.
ధర్మారావు ఆసక్తి చూపిన అంశాల జాబితాగానీ, తిరిగిన ఊళ్ళ సంఖ్య గానీ, చేసిన ఉద్యోగాల చిట్టాగానీ పరిశీలిస్తే ఆశ్చర్యం కలుగుతుంది! శ్రీకాకుళం, విజయనగరం, బరంపురం, పర్లాకిమిడి, చీకటి సంస్థానం, విశాఖపట్నం, మదరాసు, చుండి, ఊర్కాడు, దక్షిణ వల్లూరు, మందసా, చల్లపల్లి, విజ యవాడ – ఇలా చాలా ఊళ్ళలో ఆయన పనిచేశారు. ఉపాధ్యాయుడు, సర్వేయరు, సంరక్షకుడు, అంతరంగిక కార్యదర్శి, మేనేజర్, రిక్రూటింగ్ ఆఫీసర్ – ఇలా ఎన్నో ఉద్యోగాలు చేశారు. ఈ ఉద్యోగాల సమయంలో వేట, గుర్రపుస్వారి, తుపాకి పేల్చడం, ఫొటోగ్రఫీ, టెన్నిస్ వంటివి నేర్చుకున్నారు. కుస్తీలు, నాటకాలు, మ్యూజిక్ గురించి చెప్పనక్కరలేదు. కనుకనే వారికి జీవితమంటే ఏమిటో తెలుసు. జనం భాష ఏమిటో బాగా తెలుసు!
గూడవల్లి రామబ్రహ్మంగారి తోడ్పాటుతో దేవాలయాలపై బూతు బొమ్మలెందుకు– అనే శీర్షికతో వ్యాసాలు రాశారు. అంతేకాదు ఆయనతో కలసి ‘మాలపిల్ల’తో చలనచిత్రరంగ ప్రవేశం చేశారు. తెలుగు చలనచిత్రాల తొలిదశలో ప్రవేశించిన ధర్మారావు ఒకవైపు సంభాషణలలో వ్యావహారిక భాషను, మరోవైపు హేతుబద్ధతను రంగరించారు. అప్పట్లో తెలుగు సినిమారంగంలో స్క్రీన్ ప్లే పరంగా ‘తాపీ స్కూలు’ అని ప్రత్యేకంగా పిలిచేవారట. పత్రికలలో అగ్రస్థానంలో ఉంటూనే సినిమాల్లో పనిచేశారు. ఏక కాలంలో మేధావుల, పండితుల వేదిక అయిన పత్రికారంగంలోనూ; పామరుల, సామాన్యుల రంజకమైన సినిమాల్లోనూ రాణించడం చిన్న విషయం కానేకాదు. వారికి ఆ మాధ్యమాల మర్మాలే కాదు, వాటి ప్రభావాలు కూడా బాగా తెలిసి వుండాలి!
ధర్మారావు సంభాషణలు రాసిన ప్రతి సినిమా శతదినోత్సవం జరుపుకుంది. వారి దగ్గర ఉపసంపాదకులుగా పనిచేసిన నార్ల వెంకటేశ్వరరావు, పండితారాధ్యుల నాగేశ్వరరావు, పి. శ్రీరాములు మొదలైన వారు తర్వాతి కాలంలో ప్రముఖ సంపాదకులుగా రాణిం చారు. తాపీ ధర్మారావు సంపాదకుల సంపాదకుడు, ఆయనను చూసి నేర్చుకున్నానని నార్ల వెంకటేశ్వరరావు పేర్కొనడం గమనించాలి. తన పత్రికాభాషకు స్ఫూర్తి వేమన అని ప్రకటించిన ప్రజాస్వామిక స్ఫూర్తిమూర్తి తాపీ ధర్మారావు.
-డాక్టర్ నాగసూరి వేణుగోపాల్
పెదవి దాటితే పృథివి దాటుతుందన్న సమయం. అ సంయమమూ ఎప్పు డయినా సడలు తుందేమోనన్నట్లు తరుచు చుట్ట బిగింపు; ముక్తసరిగా నూత పాయ మయిన మాట తీరు, న్యాయంకోనం ఎంతటి వారినయినా ఎదిరించగల దిట్టతనం:
తమ భావాలను ఎదుటివారికి సౌమ్యంగానయినా కచ్చితంగా చెప్పే కరకుతనం; మత భేదం కలిగినపుడు కుమారుణ్ణేకాదు, మరొకరినయనా సహించగల జౌదార్యం, తెలి యని ఏ చిన్న విషయమయినా ఏ చిన్నవాడు తెలిపినా స్వీకరించే సరనత. పరస్పరం పోటిలుపడి జీవితం నడివిన జిజ్ఞాసాపర్మిశమలు; తప్పని తెలిసిన తరువాత
చప్పున సవరించుకొని ముందడుగు వేసే గుండెనిబ్బరం; శతృత?౦తో నమీపించిన వారినెనా
మితులనుగా మార్చే సరళతర్యప్రవర్తన; కీర్రికోసం కాని, కాంచనం కోసంకాని,
కక్కు_ర్రిపడని వుదాత్తత; పాండిత్య పకర్ష కోసం కాక పరికోధితాంశాలు పదిమందికి. తెలియజేయడాని కే చేపట్టిన రచనాదీక్షః గడ్డంతోపా టే అందంగా పెరిగిన ఆంత రంగం; తాళ్సార మేమోనన్నంతగా ఒకొకప్పుడు తలపీ ంపజీసే తాపీఠనం – ఈధర్మా
లన్నీ సమపాళాలుగా పోతపోసినవ్య క్రిత్వం (శ్రీ తాపీ ధర్మారావుగారిడి అంటే పలు
రంగాలలో పాతకొ త్తలకు పసిడి వంతెనవంటి.. వారిని గురించి శాఖాచం దనాాయంగా చెప్పినట్టవుతుంది.
తావీవారి నాయనగారు నరసింగరావుగారు. పెద్ద గవర్నమెంటు డాక్టరు.
అప్పన్నగారు – అన్నగారు యిద్దరూ డాక్టర్లే, నాయనగారు బరంప్ప రానికి బదిలీ
అయినపుడు 1887లో తాపీవారు “జన్మించారు. వారి చిన్ననాటి చదువు సాములు
గ్రీకాకుళ ౦లో సాగాయి. వారు విజయవాడలో మె[టిక్క్యులేషన్ చదివి, పర్దాకిమి కలో
ఎప్. ఏ. పూర్తిచేసి, మదాను పచ్చయప్ప కళాశాలలో పట్టథదులయారు.
తాపీవారికి పసితనంనుంచే తెలుగు సాహిత్యమన్నా విషయ జిజ్ఞాస అన్నా
ఆసక్తీ, అభిరుచీ వుండేవి. కాని, నాయనగారు షు పూర్తిగాదొర. పద్యాలు “అల్లితే పడ
తిట్టేవారు. తెలుగు చదివితే తినేవారు; కనుక తాపీవారు నాయనగారు మేడమీదకు వెళ్ళే
వరకూ ఏ ఇంగ్రీషు పుస్తకమో చదువుతున్నట్లు నటించి తర్వాత పద్యాలు [వానుకునేవారు.
నాయన్‌గారి [కమశిక్షణకూడా కరుకై నదే. తమ పిల్లలు ఇంగ్రీషుబాగా చదివి,
గొప్పవాళ్ళయి, పెద్దకే పెద్ద సర్కారు ఉద్యోగాలు వెలిగించాలని వారి ఆశయం. తాపీ
వారు చిన్న ప్పుడు ఒకనాడు తాంబూలం నములుతుండడం శాయనగారు చూచారు.
“కాంబూలం వేసుకుంటే చదుకృరాదు” ఆని శాసించారు. తాపీవారు తమ్ములం మర
ప్పుడూ తాకనై నా తాకలేదు. కాని చుట్టమా[త్రం అనుంగుచుట్టం వలె అర్థశతాబ్ది వారిని
వెన్నాడింది. తం డ్రికొడుకుల ఒడ్డూ పొడుగూ ఒకటే ఆందువల్ణి పొరపాటున
ఒకరి దుస్తులు మరొకరు ధరించడం సంభ వించేది. నాయనగారు కోటుజేబులో సైత
స్కోపుకోసం తముడుకుంటే, చుట్టముక్కలు తగిలే వేళకు కొంచెం తికమక పడేవారు.
ఏమంటారు తమంతటి క మారుణ్ణి |
తాపీవారు తలచుకునే వుంటే వారి యోగ్యతనుబట్టీ నాయనగారి పలుకుబడిని
బట్టీ, గొప్ప సర్కారు ఉద్యోగమే దొరికేది. కాని వారికది యిష్టంలేదు ఒక్కదాసికి
ఆంటి పెట్టుకుని వుండడంకూడా ఆ స్వేచ్బాచారులకు, సాహితీ, పియలకు గిట్టలేదు
ఉన్నంతలో ఉపాధ్యాయవృ శే వుత్తమమని బరంపురంలో కళ్ళికోటరాజా కళాశాలలో
లెక్కల మేష్టారుగా చేళారు. అప్పుడే (19010—11) కొందరు మితు3 ఇతో కలిసి
వేగుజుక్క- ‘గంథమాల స్థాపించారు. విజ్ఞాన నచం|డికా (గంథమాఐ. ఆం|ధ భాషాభి
వర్ధిసీ సభ తాకని విషయాలపై (గంధాలు (పచురించడం యీ (గ్రంథమాల లక్షం.
తదనుగుణంగానే తెనుగులో మొట్టమొదటి ఆంధ వాజ్మయచరి తను “తెలుంగనెడు
కాంత” సీీయచరి|త రూపంలో “* “ ఉషఃకాలము” అనే పేరుతో ప్రకటించారు. మొదటి
నిరూపక నవల “వాడే వీడు మొదటి థావపరిణామనవల “ కొవ్వురాళ్ళు”, మొదటి
ఆంధ చార్మితక నాటకం “_పేమముూ” మొదలయిన [గంథాలు వెలువరించారు. వారి
కార్య వ్య|గతకు (ప్రోత్సాహకరంగా మొట్టమొదటి ఊగాది సంచికలో (1911 లో)
“అంధుల కొక మనవి” అన్న వ్యాసం [పచురితమయింది. అదే వారి తొలి వచన
రచన. సమకాలంలోనే ఆంధప(తికలో (అప్పుడది బొంబాయినుంచి వెలువడుతున్న
వారప్మతిక )
“నల్రిరొ నిన్ను జేకౌని ఘనంబగు నా తపమందువై చి, నీ
వల్దలనాడుచుండ, దరవాసము జేయుచు జూచుచుండు నీ
కల్పిరి వాని దూరవు; ముఖంబున గోపము జూప; వెంతయో
చల్చగనోర్చి; తౌర ! ఘనసౌఖ్యము నాకమునందు గాంచ వే”
అంటూ “నల్లిపె పె కారుణ్యము” అన్న శీర్షికతో ఎలిజీ ([వాళారు. అవే వారి అచ్చయిన
మొట్టమొదటి పద్యాలు, ఆంగ్లంలోని అనేక వాజ్మయకాఖలను అనుసరించి, మన రచ
నలను కొత్త పుంతలకు తిప్పాలని రకరకాల రచనలు జేశారు.
ఇంతలో నాయనగారు కాలధర్మం చెందడం వల్ల వారు విశాఖపట్టణం తిరిగి
రావలనీ నచ్చింది అప్పుడు: “కొండెగాడు” అనే కానీ ప్మతిక పెట్టి—
“ప త్రార్థేన [ప్రవక్ష్యామి యదు క్తం [గంధ కోటిభిః”
అనే హెడింగ్‌తో పిటి. శ్రీనివాసయ్యంగారు మొదలయిన పెద్దల రచనలను ఘాటుగా
విమర్శించారు. సెట్టి నరసింహంగారి వసంత సేనకూడా ఈ కొండెగాని క థినవిమర్శను
తప్పించుకోలేదు. ‘దానితో వారి [పసిద్ధి విస్తరించి, కలెక్టర్ వెర్నాన్ దృష్టిలో
పడింది. మైనర్ జమీందార్హకోనం కోర్టాఫ్. వార్డ్ మదానులో పెట్టిన న్యూయింగ్లన్
కాలేజీలో ‘ట్యూటర్- గార్డియన్ పదవికి వెర్నాన్ తాపీవారిని సిఫార్సుజేశారు. న.
1018 నుంచీ పదహారు సంవత్సరాలపాటు ఊర్కాడు, చుండి, సౌత్‌వల్లూరు, మందసా
మైనరు జమీందారులకు ఉపాధ్యాయులుగా వుంటూ వారివెంట దక్షిణ భారతమంతా
తిరిగారు. వారికి ఆప్తులుగా నిజమయిన సంరక్షకులుగా వుంటూ వారి హృదయాలను
చూరగొని, వారిని కమశితణలో పెట్టారు. ఒక జమీందారు కుమారుడు న్యాయం
కాలేజీ (పిస్పిపాలును కోపంతో “తుపాకీతో కాల్చి చంపాడు, కాని, తాపీవారు
మ్మాతం ఎప్పుడూ ఆచార్య గొర వాన్ని కోల్పోలేదు.
అటు తర్వాత వారు విజయనగరంలో సంవత్సరంపాటు ట్యుటోరియల్ కాలేజి
నడిపారు. అలా ఉంటూనే బొబ్బిలి దివాన్ గిరి (హెడ్ మేనేజరీ) చేశారు, అప్పుడే
జస్టిన్ పార్టీ పతిక ‘ సమదర్శిని’ సంపాదకులయ్యారు. సక బాం ముమ్మరం కావ
డంవల్ల సమదర్శినిని దినప తిక చేయడం, చెన్నపురిలో వాసం అవసరమయ్యాయి.
పతిక జస్టిస్ పౌర్టీదయినా, భావాలు జాతీయాలు. కనుక ఆ పిక తాపీ వారి వయా
ములో ఎంతో ప్రజా సేవచేసింది. వారు ఒక్కరూ వా ర్రలు(వాసి వేళ్ల కాయలుకాచేవట.
ఆ రోజులలోనే భాషా విషయంలో వారీ మతం మారింది. వారు మొదట్లో వీర గాంధికవాదులు; గిడుగువారికి పర్పాకిమిడిలో |పియశిమ్యలయినా వ్యావవిరిక భాషా
వాదంలో వారిని ఎదిరించినవారు; 1907 లో వ్రాసిన “విలాసార్దునొ నాఓకంలో గుర జాడ వారిని దుయ్యబట్టిన వారుకూడ. మతం మారడంతో ‘కొ త్రపాశీ’ “పేరుతో (ప్రజా
మిితలో ధారావాహికంగా భాషావిషయిక వ్యాసాలు వాళారు.
ఇంతలో దేశంలో ఎన్నికల సంరంభం బయలుదేరింది (1986). పిఠాపురం రాజావారు తమ పార్టీకోసం ఆంగ్ల తమిళ తెలుగులలో మూడు పృత్రికలు.. పెట్టారు. వాటిలో తెనుగు ష,తీక ‘జనవాణికి తాపీ వారు సంపాదకులు. ఇప్పుడు పేరు మోనిన
పతికా రచయితలలో చాలమంది వారివద్ద శిక్షణ పౌందినవారే. జనవాణి మూడేళ్ళ
పాటు నడిచింది. తర్వాత వారు స్వతం| తంగా కాగడా” వార పతిక కొన్నాళ్ళపాటు
నడిపి, మ!దానుపై బాంబులు పడగానే, పత్రిక ఆవి, చల్లపల్లికి వెళ్ళి మూడేళ్లపాటు
యుద్ధంకోసం అసిస్టెంట్ పబ్టిసిటీ- రె కూటింగ్ ఆఫీసరుగా పనిచేశారు, 1986 నుంచే
సారంగధర చితంతో వారికి సినిమాతో కలిగిన సంబంధం 46-47 అలో పూర్తిగా
జీవనాధార మయింది. అప్పటినుంచి ఇంతవరకు దాదావు 50 చిత్రాలకు సంభాషణలు
మొదలయినవి |వాశారు, 49 నుంచి ఐదేళ్ళపాటు “జనవాణి ఆనే వారప(తిక నడిపారు.
తర్వాత నేటి వరకు తమ పాత రచనలను పునర్ము|దించడంలో నిమగ్నులయి
ఉన్నారు.
చుండి జమీందారుకు సంరక్షకులుగా ఉన్నప్పుడు వారికి నెల్లూరు ఉనికిపట్టు.
అప్పటి నెల్లూరును గురించి చెప్పనక్కరలేదు-అదొక సకల కళాకేంద్రం. అక్కడ
మహావిద్వాంసులు వేదం వేంకటాచలయ్య (న్యాయవాది) గారితో తాపీ వారికి పరిచయ
మయింది. “వారి [ప్రభావం నాపై ఎంతో |పసరించింది. వారు నాతో తప్ప ఎవ్వరి
తోనూ మాట్లాడే వారుకారు, వారి పుస్తకాలు నాకు తప్ప ఎవరికీ ఎరవిచ్చేవారుకారు.
అప్పుడే నేను మిథిక్ సొసైటీ నభ్యుడు, లిటరరీ సొసైటీ సభ్యుడు కావడం. పెళ్ళి
పుట్టు పూర్వాలు, దేవాలయాలపై బూతు బొమ్మలు మొదలయిన విషయాలు పిళో
ధించాను.” అని పాతవిషయాలు చెబుతున్నప్పుడు తాపీ వారి సంయమం సడలిన క్లే
కనిపిస్తుంది.
14వ ఏటే వారు విజయవిలాసం చదివారు. నెల్హారిలో మితులతో
బిలియర్స్‌స్ ఆకుకుంటూ, పద్యాలు చెప్పుకుంటూ విశోద కాలక్షేపం చేసుకోనే
టప్పుడు ఓక మిత్రుడు విజయవిలాసంలోని పద్యం . చదివి అవివట్టంఅంటే ఏమి
టన్నారు. వేదం వెంకటరాయశా న్ర్రీగారి వ్యాఖ్యానం చూడగా, వారికి సంకృ స్తీ కలుగ
లేదు. అలాగే గుట్టగియాడవంటి పద్యాల వ్యాఖ్యా వారికి నచ్చలేదు. [పతి పదంలోను
జాతి, వార్త, చమత్కారం గుప్పించాంని [ప్రతిజ్ఞ చేసిన వేంకటకవి హృదయం ‘ఇంకొ
బాగా తెలుపాలనే సత్మంకల్నంతో విజయవిలాస వా౭భఖి? |పారంభించారు. ఒక పతి
ఊర్కాడు సంస్థానంలో ఉన్నప్పుడు శృంగేరీ పీఠాధిపతులు తాపీ వారిని
“ఆం(ధ విళారదా $” అని సంబోధించి, చకార రలత్ సన్మానించారు. అప్పుడు
తాషీవారు చెప్పిన “అక్షరకారదా ప్రశంస” అన్న కవిత మనలిపి పుట్టుపూర్వాల
[పామాణిక మైన చరిత సం్యగహమే.
తాపీవారు ఆగర్భ శ్రీమంతులు; నూనూగు మీసాల కాలంనుంచి సంస్థానాధీ శులతోనే మెలగి, సకల భోగాలూ అనుభవించి, వివిధ మానవ (సవృత్తులూ తరచిన
వారు. ఆడంబరాలన్నా, ఆర్భాటాలన్నా వారికి గిట్టవు కనుకనే “రావు బహదూర్”
బీరుదం నిరాకరించారు. చిన్నప్పుడు గోల్స్, చదరంగం మొదలయిన ఆటలు ఆడే
వారు. గురపు స్వారీలో నిపుణులు, వారి ఇరువురు కుమారులు శ్రీ మోహనరావు,
(ఫ్రీ చాణక్య తండికి కీర్తి తెచ్చేవారే.
తాపీవారు ప్రస్తుతం వె హేదరాబాదులో శ్రీ చాణక్యవద్ద ఉన్నారు. పాత రచనల
పునర్ముదణ చూచుకోడం, సాహిత్య అకాడెమీ పనులు చేయడం వారి నేటి దినచర్య.
వారు తమ దృష్టినంతా నేడు విజయవిలాస వ్యాఖ్యాన ప్రచురణలో కేంద్రీకరించి
ఉన్నారు. దేవాలయాలమీద బూత బొమ్మలెందుకన్న రచన రెండవ ము[దణం పెక్కు
ఫోట్రోలతోను, విదేశాల మ్యూజియంలలోని చితాలతోను ఉదాత్త పరిశోధక [ప్రచు
రణగా సుర్రు యత్నిస్తున్నారు.
తాపీ వారిది తాబేటి నడక అని ఈ తరం ఆ(తగాష్ట అనుకోవచ్చు. ఆ గుణమే
వారి పాత కొ త్త పాశ్టీలనుంచి సంఖ్యాతీతంగా వివిధ రచనలను వర్షింపజేసింది. వివిధ రంగాలలో భీమ్మలుగా దర్శనమిన్తూ, పాత కొత్తలకు పూవుల వంతెనగా కానవన్తూన్న
తాపీవారు వేదోకాయువుతో తమ రచనలన్నింటినీ సంపుటాలుగా ముదించి తమ
ధర్మాన్ని నిర్వర్తి ‘ర్రింపజేస్తారు. సందేహంలేదు.
తన మనస్సుకు నచ్చకపోతే ఉద్యోగాన్నీ కూడా వదిలి పెట్టేసేవారు సంపన్న గృహం లో పుట్టినా అందుకే ఆటుపోటులు ఎదుర్కొన్నారు .కళ్ళికోట రాజా కాలేజిలో లెక్కల మేష్టారుగా పని చేశారు .1910లో బరంపురం లో మిత్రులతోకలిసి ‘’వేగుచుక్క ‘’గ్రంధ మాల స్థాపించి ‘’తెలుమ్గానేది కాంత ‘’,ఉషః కాలం మొదలైనపుస్తాకాలు ప్రచురించారు .పత్రికా నిర్వహణలో కడు సమర్ధులు కొండెగాడు ,సమదర్శిని ,జనవాణి ,కాగడ పత్రికలూ ఆయన సమర్ధతకు నిదర్శనాలు .అవి రాజకీయాలను విమర్శించటమే కాక ,జాతీయతను పెంపొందించాయి .అడుగు జాలని వాడు ,పోతనకవిత్వ పటుత్వం వంటి గొప్ప వ్యాసాలూ రాశారు దేవాలయాలపై బూతుబోమ్మలు తో గొప్ప ప్రచారం లభించింది .ఇనుప కచ్చడాలు నేపాల చోలగా శబ్దాలు మొదలైన పరిశోధన వ్యాసాలూ రాశారు .నెల్లూరు లో ఉన్నకాలం లో మిధిక్సొసైటీ ,లిటరరీ సొసైటీ సభ్యులుగా ఉన్నారు .చేమకూర వేంకటకవి రచించిన ‘’విజయ విలాస కావ్యం ‘’లోని ప్రతి పద్య చమత్కృతి ,జాతి వార్తా చమత్కారాలు ఆవిష్కరిస్తూ ఆయన రాసిన ‘’విజయోల్లాస వ్యాఖ్య ‘’రసజ్ఞులకు జుంటి తేనే .పండితుడు అనే గౌరవం పొందారు .ముక్కు తిమ్మన పారిఆతాపహరణం కావ్యానికి ‘’భావ ప్రకాశిక ‘’వ్యాఖ్యానం కూడా రాశారు
ఈయన యుద్ధకాలం లో ‘’అసిస్టెంట్ పబ్లిసిటి –రిక్రూట్ మెంట్ ఆఫీసర్ గా ‘’పని చేశారు
1936లో సినీ రంగ ప్రవేశం చేసి నాలుగు దశాబ్దాలు మాటలు,పాటలు రాశారు .ముద్దుబిడ్డ సినిమాలో వీరిపమాటలు ,ఆరుద్ర పాటలు చిరస్మరణీయాలు .కొడుకే డైరెక్టర్ .
సినిమా జీవితం
· మాలపిల్ల (1938)
· రైతుబిడ్డ (1939)
· కృష్ణప్రేమ (1943)
· ద్రోహి (1948)
· కీలుగుర్రం (1949)
· పల్లెటూరి పిల్ల (1950)
· కన్నతల్లి (1953)
· రోజులు మారాయి (1955)
· 56-త్రిభాషా చిత్ర దర్శకుడు,ఆర్మీటేలీగ్రాఫిస్ట్ , రోజులుమారాయ్ మూవీ ఫేం –తాపీ చాణక్య
· తాపీ చాణక్య చలనచిత్ర దర్శకుడు. తెలుగు రచయిత, తెలుగు భాషా పండితుడు, హేతువాది, నాస్తికుడు అయిన తాపీ ధర్మారావు నాయుడు ఇతని తండ్రి. తల్లి అన్నపూర్ణమ్మ. 1925లో విజయనగరంలో జన్మించారు. సినిమారంగంలో ప్రవేశించడానికి ముందు భారత సైన్యంలో రేడియో టెలిగ్రాఫిస్టుగా పనిచేశారు. పల్లెటూరి పిల్ల చిత్రంలో బి.ఎ.సుబ్బారావు వద్ద సహాయకునిగా పనిచేశాడరు. రోజులు మారాయి చిత్రానికి దర్శకత్వంతో పాటు కథను కూడా అందించారు తెలుగుతోపాటు హిందీ, తమిళ చిత్రాలకు దర్శకత్వం వహించారు.
సినిమాల జాబితా
తెలుగు
- అంతా మనవాళ్లే (1954)
- రోజులు మారాయి (1955)
- పెద్దరికాలు (1957)
- ఎత్తుకు పైఎత్తు (1958)
- భాగ్యదేవత (1959)
- కుంకుమ రేఖ (1960)
- జల్సారాయుడు (1960)
- కలసి ఉంటే కలదు సుఖం (1961)
- కానిస్టేబులు కూతురు (1963)
- రాముడు భీముడు (1964)
- వారసత్వం (1964)
- సి.ఐ.డి. (1965)
- అడుగు జాడలు (1966)
- విధివిలాసం (1970)
- బంగారుతల్లి (1971)
- బందిపోటు భయంకర్ (1972)
తమిళం
- పుదియ పతై (1960)
- ఎంగ వీటు పెన్ (1965)
- నాన్ అనైట్టల్ (1966)
- ఒలి విళక్కు (1968)
- పుదియ భూమి (1968)
హిందీ
- రామ్ ఔర్ శ్యామ్ (1967)
- మాధవి (1969)
- బిఖరే మోతి (1971)
- మన్ మందిర్ (1971)
- జాన్‌వర్ ఔర్ ఇన్‌సాన్ (1972)
- మానవతా (1972)
- సుబహ్ ఓ షామ్ (1972)
- గంగ మంగ (1973)
మరణం
హానక్య తన 48వ యేట 1973, జూలై 14న మరణించారు. ఈయనకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు[1].
.1954లో అంతామనవాళ్ళే ,1955లో సూపర్ డూపర్ హిట్ రోజులుమారాయి 1967పెద్దరికాలు సినిమా కు దర్శకత్వం వహించారు .మాటలు నార్ల చిరంజీవి సంగీతం మాష్టర్ వేణు .పాటలు ధర్మారావు కొసరాజు గార్లు .కుంకుమ రేఖ సెంటిమెంటల్ సినిమా అద్భుతంగా చిత్రీకరించారు .1964లో సురేష్ వారి రాముడు భీముడు సినిమా ను కూడా సప్పర డూపర్ హిట్ చేసిన దర్శకుడు .రామారావు ద్విపాత్రాభినయం ,పెండ్యాల సంగీతం ,శ్రీశ్రీ నారాయణ రెడ్డి కొసరాజు గార్లపాటలు ,నాగార్జున సాగర్ షూటింగ్ చిత్రాన్ని చిరస్మరణీయం చేశాయి –‘’ఉందిలే మంచికాలం ముందు ముందునా’’,దేశమ్ము మారిందోయ్కాలమ్ము మారిందోయ్ తెలిసిందిలే తెలిసిందిలే ,నవ్వుపాట సరదా సరదా సిగరెట్టూ పాటలు ఇంకా చెవులలో హోరు పెడుతూనే ఉన్నాయి ,హిందీ సినిమా రాం ఔర్ శ్యాం కూడా గొప్ప విజయమే పొందింది చాణక్య దర్శకత్వం లో .తండ్రి సాహిత్యం లో కుమారుడు సినీ దర్శకత్వం లో గొప్ప పేరు పొందారు .వర్దీ సం ఆఫ్ ఎ వర్దీ ఫాదర్ చాణక్య .
సశేషం
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -6-2-22-ఉయ్యూరు