మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు 60

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు 60

60- ఇంట్లోనే సెట్ వేసి మార్కండేయ సినిమా తీసిన ,రంగుల లవకుశ ఫేం,తెలుగు చిత్ర పితామహ –సి.పుల్లయ్య

సి. పుల్లయ్యగా పేరుగాంచిన చిత్తజల్లు పుల్లయ్య (1898 – అక్టోబర్ 6, 1967) మొదటి తరానికి చెందిన తెలుగు సినిమా దర్శకుడు, నటుడు, నిర్మాత.

కాకినాడ వాస్తవ్యుడైన ఈయన బి. ఎ చదివి జాతీయభావం ప్రభావంతో 1920వ దశకంలో కాంగ్రెస్ లో చేరడం కోసం కలకత్తా వెళ్ళాడు. అక్కడ బులుసు సాంబమూర్తి సలహా మేరకు ఫిలిం లేబరేటరీలో చేరాడు. సినిమా నిర్మాణానికి సంబంధించిన అన్ని శాఖల్లో పనిచేశాడు. తెలుగు చలనచిత్ర పితామహుడి కుమారుడైన రఘుపతి వెంకయ్య కుమారుడు ఆర్. ఎస్. ప్రకాష్ దగ్గర భీష్మ ప్రతిజ్ఞ (1921) అనే మూకీ సినిమాకి సహాయకుడిగా పనిచేశారు. తర్వాత సినీ నిర్మాణానికి కావలసిన సామాగ్రిని తన స్వస్థలమైన కాకినాడకు తీసుకువచ్చి ఇంట్లోనే సెట్లు వేసి మార్కండేయ అనే సినిమా తీశారు. దాన్ని ప్రదర్శించడం కోసం కాకినాడలో స్వంతంగా సిటీ ఎలక్ట్రిక్ అనే పేరుతో టెంటు హాలు కట్టారు. ఇందులో చాలా మూకీ సినిమాలు ఆడాయి. సినిమా థియేటర్ ను ఒక ఉద్యమం లాగా చేపట్టి గుడారాలు, ప్రొజెక్టర్లూ, కుర్చీలు తీసుకుని ఆంధ్ర రాష్ట్రంలోనే కాక బెంగాల్, ఒరిస్సాల్లో కూడా ఊరూరా తిరిగి వాటిని ప్రదర్శించారు.[1]

టాకీ సినిమాలు రాగానే ఆయన దృష్టి చిత్ర నిర్మాణం మీద పడింది. 1933లో సతీ సావిత్రి సినిమా తీశారు. అది మంచి విజయం సాధించింది. తర్వాత లవకుశ చిత్రం తీశారు. అది కూడా మంచి విజయం సాధించింది. కలకత్తాకు చెందిన ఈస్టిండియా ఫిలిం కంపెనీ వారు, ఈయన రూపకల్పనలో అనసూయ, ధృవ విజయం (1936) అనే చిత్రాలు తీసి రెండింటినీ కలిపి ఒకే సినిమాగా విడుదల చేశారు.

బాల్యం
చిత్తజల్లు పుల్లయ్య 1898లో కాకినాడలో జన్మించారు. చిన్నప్పటి నుంచీ చాలా చురుకైన కుర్రాడు. 1921 లో ఆయన బి.ఎ.చదువుతున్న సమయంలో కాకినాడలో జాతీయ కాంగ్రెస్ పార్టీ సమావేశాలు జరిగాయి. ఆ సమావేశాలకు వెళ్లిన పుల్లయ్య మీద జాతీయభావాల ప్రభావం పడింది. వెంటనే ఇంగ్లీషు చదువుకు స్వస్తి చెప్పి, ఖద్దరు దుస్తులు కట్టడం మొదలెట్టారు. కాంగ్రెస్ సేవాదళంలో చేరేందుకు బొంబాయి వెళ్లారు.

సినీ రంగంలో
రఘుపతి వెంకయ్య, అతని కుమారుడు రఘుపతి ప్రకాష్ దక్షిణ భారతదేశంలో మొట్టమొదటి సినిమా నిర్మాణ సంస్థ ‘స్టార్ ఆఫ్ ది ఈస్ట్’ ను స్థాపించారు. 1921లో భీష్మ ప్రతిజ్ఞ మూగచిత్రాన్ని నిర్మించారు (ఇది మూగచిత్రం గనుక “మొదటి తెలుగువాడి సినిమా” అనడం ఉచితం). ప్రకాష్ దర్శకత్వం వహించడమే కాకుండా ఈ చిత్రంలో భీష్ముని పాత్రను కూడా పోషించారు. ‘డి కాస్టెల్లో’ (De Castello) అనే ఆంగ్ల యువతి గంగ పాత్రను ధరించింది. తరువాత ప్రసిద్ధులైన సి.పుల్లయ్య, వై.వి.రావులూ ప్రకాష్ అనుచరులుగా తమ సినీ ప్రస్థానాన్ని ప్రారంభించారు. పుల్లయ్య కాకినాడలో ‘భక్తమార్కండేయ’ మూక్తీ చిత్రాన్ని 1925 లో నిర్మించి విడుదల చేసారు. ఒక తెలుగు వాడు ఆంధ్రదేశంలో నిర్మించిన మూకీ ‘భక్తమార్కండేయ’. ఇందులో పుల్లయ్య యమునిగా నటించాడు.

అక్కడ కాంగ్రెస్ నాయకుడు బులుసు సాంబమూర్తి సలహా మేరకు ఫిలిం లేబరేటరీలో చేరారు. రెండు పూటలా భోజనం పెట్టి, నెలకు ఐదు రూపాయల జీతం ఇచ్చేవారు. అక్కడే సినిమాలకు సంబంధించిన విషయాలన్నీ నేర్చుకున్నారు. అయితే, కొన్నాళ్లకు ల్యాబ్ దివాళా తీసి మూతపడే పరిస్థితి రావడంతో, పుల్లయ్యకు ఇవ్వాల్సిన జీతం బదులు ఓ సెకండ్ హ్యాండ్ కెమెరా, ప్రొజెక్టరు, ఫిల్ములు ఇచ్చి దయచేయమన్నారు నిర్వాహకులు. వాటిని తీసుకుని కాకినాడ చేరారాయన. కెమెరా చేతిలో ఉండడంతో సినిమా తీయాలన్న కోరిక కలిగింది. తమ ఇంటి రేకుల షెడ్డులో సెట్లు వేసి, ‘భక్త మార్కండేయ’ సినిమా తీయడానికి ప్లాన్ వేశారు. అందులో తను యముడిగా కూడా నటించారు. కష్టపడి తీసిన సినిమాను తన ఇంట్లో చీకటి గదిలో గోడ మీద ప్రోజక్ట్ చేసి, తమ వీధిలోని వాళ్లందరికీ చూపించారు. అయితే, ఆయనకు అది సంతృప్తినివ్వలేదు. సినిమా మెలకువల్ని ఇంకా నేర్చుకోవాలన్న తలంపుతో, తన కళాశాల ప్రిన్సిపాల్ రఘుపతి వెంకటరత్నం నాయుడు వద్ద రికమండేషన్ లెటర్ తీసుకుని, మద్రాసు బయలుదేరారు. అక్కడ వెంకటరత్నం నాయుడు సోదరుడు వెంకయ్య నాయుడు అప్పటికే సినిమా నిర్మాణంలో ఉన్నారు. వారి కుమారుడు ప్రకాష్ వద్ద పుల్లయ్య అసిస్టెంట్ డైరెక్టర్ గా చేరారు. రఘుపతి వెంకయ్యగారికి థియేటర్లు కూడా ఉండేవి. కొన్నాళ్లకు వాటి ప్రదర్శన నిర్వహణను పుల్లయ్యకు అప్పజెప్పారు. అప్పుడే ఆయన ఆ రంగంలో కూడా అనుభవం సంపాదించారు.

టాకీ సినిమా వచ్చిన తర్వాత మళ్లీ పుల్లయ్య దృష్టి సినిమా మీదకు మళ్ళింది. అదే సమయంలో ఈయన గురించి తెలుసుకున్న కలకత్తాలోని ఈస్టిండియా ఫిలిం కంపెనీ వారు, తమ తెలుగు చిత్ర నిర్మాణ విభాగానికి ఇంచార్జ్ గా పుల్లయ్యను ఆహ్వానించారు. ఈస్టిండియా కంపెనీకి ఆయన రూపొందించిన తొలి సినిమా ‘సతీ సావిత్రి’. ఆనాటి రంగస్థల ప్రముఖులు వేమూరి గగ్గయ్య, రామతిలకం అందులో నటించారు. తర్వాత దేవకీ బోస్ బెంగాలీలో ‘లవకుశ’ ప్లాన్ చేస్తుంటే, ఆ సబ్జక్ట్ పుల్లయ్యను ఆకర్షించింది. దాంతో, ఆ కంపెనీకే దీనిని తెలుగులో తీయడానికి రెడీ అయ్యారు పుల్లయ్య. బలిజేపల్లి లక్ష్మీకాంత కవి స్క్రిప్ట్ రాశారు. పారుపల్లి సుబ్బారావు, సీనియర్ శ్రీరంజని ఇందులో సీతారాములుగా నటించారు. రథాలు, సెట్లు, కాస్ట్యూమ్స్ వంటి వాటిని బెంగాలీ వెర్షన్ కి వాడిన వాటినే వాడారు. 1934 లో విడుదలైన సినిమా గొప్ప విజయం సాధించింది. 1963లో ఇదే సినిమాను తన తనయుడు సి.యస్.రావుతో కలిసి పుల్లయ్య పునర్నిర్మించాడు. తెలుగులో తొలి రంగుల చిత్రంగా నమోదైన లవకుశలో ఎన్.టి.రామారావు, అంజలీదేవి సీతారాములుగా నటించగా, నాగయ్య వాల్మీకిగా నటించారు. పుల్లయ్య తీసిన అత్యంత విజయవంతమైన చిత్రాలలో ఇదీ ఒకటి.

దర్శకత్వం వహించిన తెలుగు సినిమాలు
· భువన సుందరి కథ (1967)

· భామావిజయం (1967)

· పరమానందయ్య శిష్యుల కథ (1966)

· లవకుశ (1963) కొంత భాగం తీసిన తరువాత పుల్లయ్య ఆరోగ్యం క్షీణించింది. సుందర్ లాల్ నహతా, బి.ఎన్.రెడ్డి ల ప్రోత్సాహంతో సి.పుల్లయ్య కుమారుడైన సి.యస్.రావు దర్శకత్వబాధ్యత చేపట్టి మిగిలిన భాగం పూర్తి చేశాడు..

· దేవాంతకుడు (1960)

· పక్కింటి అమ్మాయి (1953)

· సంక్రాంతి (1952)

· అపూర్వ సహోదరులు (1950)

· వింధ్యరాణి (1948)

· గొల్లభామ (1947)

· నారద నారది (1946)

· బాలనాగమ్మ (1942)

· మాలతీ మాధవం (1940)

· వరవిక్రయం (1939)

· మోహినీ భస్మాసుర (1938)

· సత్యనారాయణ వ్రతం (1938)

· చల్ మోహనరంగ (1937)

· దశావతారములు (1937)

· కాసుల పేరు (1937)

· అనసూయ (1936)

· ధ్రువ (1936)

· కృష్ణ తులాభారం (1935)

· లవకుశ (1934 సినిమా) (1963)

· రామదాసు (1933)

· సావిత్రి (1933)

మరణం[మార్చు]
1967, అక్టోబర్ 6 న మద్రాసులో మరణించాడు.

·

1926లో సి. పుల్లయ్య కాకినాడలో భక్త మార్కండేయ చిత్రాన్ని నిర్మించారు. కానీ అది తెరమీద కాకుండా గోడమీద ప్రదర్శతం కావడంతో అది గోడమీద బొమ్మగా పేరు తెచ్చుకుంది. అయితే తెలుగు మాట్లాడటం ఎవరూ వినలేదు.

తెలుగు సినిమా దర్శకుల గొప్పదనం గురించి అందరికీ తెలిసిన విషయమే. మన సినిమాకు మొదటి దశలో కూడా వెలుగులు నింపిన మేటి దర్శకులు ఉన్నారు. వారిలో ప్రముఖుడు సి.పుల్లయ్య. కాకినాడకు చెందిన ఈయన 1920వ దశకంలో కాంగ్రెస్ లో చేరేందుకు కలకత్తా వెళ్లి పరిస్థితుల దృష్ట్యా సినిమాల్లో చేరారు. 1921లో ఆర్ఎస్ ప్రకాశ్ తీసిన భీష్మ ప్రతిజ్ఞ అనే మూకీ సినిమాకు సహాయకుడిగా పని చేశారు. తర్వాత కాకినాడలోనే తన ఇంట్లోనే సెట్లు వేసి మార్కండేయ అనే సినిమా తీసి ప్రదర్శించారు. ఇందుకోసం కాకినాడలో సిటీ ఎలక్ట్రిక్ అనే పేరుతో టెంటు హాలు నిర్మించార

అనంతరం ఇందులో చాలా మూకీ సినిమాలు ఆడాయి. సినిమా ప్రదర్శనల కోసం సినీ సామాగ్రితో ఆంధ్ర, ఒరిస్సా, బెంగాల్ కూడా తిరిగి ప్రదర్శించేవారట. టాకీ సినిమాలు మొదలయ్యాక ఆయన 1933లో సతీ సావిత్రి సినిమా తీశారు. ఈ సినిమా విజయం తర్వాత అనేక సినిమాలు తీశారు. సి.పుల్లయ్య తీసిన సినిమాల్లో నేటికీ అద్భుతంగా నిలిచిపోయిన సినిమా లవకుశ. ఎన్టీఆర్, అంజలీదేవి నటించిన ఈ సినిమా ఎవర్ గ్రీన్ క్లాసిక్ గా నిలిచిపోయింది. అప్పట్లో బెంగాలీలో ‘లవకుశ’ ప్లాన్ చేసారు. తెలుగులో పుల్లయ్య ఈ సినిమా తీయడానికి రెడీ అయ్యారు. తనయుడు సి.యస్.రావుతో కలిసి పుల్లయ్య 1963లో తీశారు. తెలుగులో తొలి రంగుల చిత్రంగా లవకుశ రికార్డు సృష్టించింది.

పుల్లయ్య తీసిన అత్యంత విజయవంతమైన చిత్రాలలో ఇదీ ఒకటి. ఆ తర్వాత ఆయన పరమానందయ్య శిష్యుల కథ, భామా విజయం, పక్కింటి అమ్మాయి, వర విక్రయం, దేవాంతకుడు, భువనసుందరి కథ, బాలనాగమ్మ, సంక్రాంతి, అపూర్వ సహోదరులు.. వంటి హిట్ చిత్రాలు ఎన్నింటినో తెరకెక్కించారు. తెలుగు సినిమా తొలి తరం దర్శకుడిగా ఖ్యాతి గడించిన సి పుల్లయ్య

కుమారుడు ,డైరెక్టర్ సి స్ రావు –

(శి హ్మ సృష్టిలో తానొక బ్రహ్మగావుట్టి – ఆ సృష్టికి ప్రతిస్పష్టిగా తన యుగంలోని తారలను నూటికి 95 మందిని తానే స్పష్టంచి, “పిల్లల కోడీ స.పుల్లయ్య” అన్న బిరుదు నందుకున్న దర్శక పీతానుహుడు చిత్తజల్లు పుల్లయ్యగారి కుమూరుడిగా నెను పుట్టడం ఎన్నో జన్మల పుణ్యఫలంగా నేను భావిస్తున్నాను! చలనచిత్ర స్పష్టిక సంబంధించి నా దృష్టిలో సి,పుల్లయ్య, హెచ్‌. ఎమ్‌. రెడ్డి గూడవల్లి రామబ్రహ్మంగార్హు బ్రహ్మ, విష్పు, ను హశ్వరులు. మా నాన్నగారు తెరపైన కథ చెప్పె విధానంలో డొంకతిరుగుడులేని సూటీ అయిన విధానాన్ని అవలంబించేవారు. ఈనాటిమాదిరిగా ఫ్లాష్‌బ్యాక్‌లు, కళ్ళముందు గుండ్రాలు తిరగడాలు లాంటివి ఆ రోజుల్లో లేవు. “ప్రేక్షకులకు కథ పూర్తిగా అర్థమయ్యేరీతిలోనే చిత్రాలు తీయాలి” అని చెప్పేవారు. జీతంగా కెమెరా 1921, ఆ ప్రాంతంలో నాన్నగారు కాకినాడలో ల్‌ చదువుతున్నప్పుడు ఆల్‌ ఇండియా కాంగ్రెస్‌ కమిటీ సమావేశం జరిగింది. బులుసు సాంబమూర్తిగారి అధ్యక్షతన ఉపన్యాసాలు జరిగాయి! ఆ సమావేశాల్లో నాన్నగారు చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు! అదిగో ఆ కాంగ్రెస్‌ సమావేశాల రోజునుంచి ఆయనగారు చనిపోయేవరకు ఖద్దరు బట్టలే వేసుకున్నారు. బులుసు సాంబమూర్తిగారి సూచనమేర నాన్నగారు బొంబాయి వెళ్ళి సినిమాటో(గ్రఫీలో శిక్షణ పొందారు. కాంగ్రెస్‌ కమిటీ సమావేశాలకు అలహాబాద్‌ వెళ్ళారు. అటునుంచి బొంబాయి వెళ్ళి కాకా కలేల్‌కర్‌ ఫోటోస్టూడియోలో లేబరేటరీ పనిలో జాయిన్‌ అయ్యారు. కొంతకాలంపాటు స్టూడియోలో పనిచేసిన తర్వాత నాన్నగారు తిరిగి కాకినాడ వచ్చారు. “కాకా కలేల్‌కర్‌” స్టూడియోవారు జీతం ఇవ్వలేని స్థితిలో నాన్నగారికి ఓ కమెరా పెట్టె, డెవలప్పింగ్‌ ఫిల్మ్‌ ఇచ్చి దండం పెట్టేశారు! అవి పుచ్చుకుని నాన్నగారు కాకినాడ వచ్చేశారు. అది మూకీ చిత్రాలయుగం, (స్త్రీపాత్రల్నికూడా పురుషులే ధరించేవారు. బొంబాయి నుంచి వచ్చిన నాన్నగారు మ(ద్రాసువెళ్ళి రఘుపతి వెంకయ్యగారు స్థాపించిన స్టార్‌ ఆఫ్‌ ఈస్ట్‌ ఫిలిమ్స్‌ లిమిటెడ్‌ సంస్థలో చేరారు. ఈ చేరడంలోకూడా చిన్న కధ ఉంది. కాకినాడలోని కాలేజీ ప్రిన్సిసాల్‌ గారైన రఘుపతి వెంకటరత్నం నాయుడుగారు నాన్నగారికి సిఫార్సు లెటరు రాసి ఇచ్చి మద్రాసు పంపడం వలన రఘుపతి వెంకయ్యగారు నాన్టగార్జి తన శిష్యునిగా తీసుకున్నారు. నాన్నగారు ఒకే ప్రింట్‌ని తన సైకిల్‌ వెనకాల కట్టుకుని (ప్రదర్శన కోసం గెయిటీ మొదలైన సినిమా హాల్స్‌కి టైమ్‌ ప్రకారం ప్రేంట్‌ను అందచేస్తూ ఉండేవారు. నాన్నగారికి తాను చేసే పనిలో అసంతృప్తి ఏర్పడింది. ఎంచేతనంటే నాన్నగారు డైరెక్షన్‌ సైడ్‌ పనినేర్చుకుందామని మద్రాసువస్తే వెంకయ్యగారు (ప్రొజెక్షన సైడ్‌ పని నేర్పారు. ఇదే విషయాన్ని ఓరోజున నాన్నగారు వెంకయ్యగారికి చెప్పేశారు. రఘుపతి వెంకయ్యగారు నాన్నగారి అభిప్రాయాన్ని, ఉద్దేశాన్ని అర్ధంచేసుకుని తన కుమారుడైన (ప్రకాష్‌ వద్దకు పంపారు. దర్శకత్వశాఖలో పనిచేసేందుకు రాక్సీ థియేటర్‌ వెనకాల ఓ చిన్న షెడ్‌ ఉండేది. దాన్నే స్టార్‌ ఆఫ్‌ది ఈస్ట్‌ ఫిలిమ్స్‌ ఆఫీస్‌ అనేవారు. నాన్నగారు ప్రకాష్‌గారి వద్ద డైరెక్షన్‌ శాఖలో చేరి కొన్ని చిత్రాలకు సహాయదర్శకుడిగా కూడా పనిచేశారు! ‘ప్రకాష్‌గారు వ్యాపారరీత్యా దెబ్బతినడంతో నాన్నగారికి ఓ ఓపెన్‌ షట్టర్‌ (ప్రొజెక్టర్‌, నాలుగు ఫిలు శైలు, కొనో,ఫ్రోమ్‌ అనే ఇన్‌స్టుమెంట్‌ ఇచ్చి నాన్నగారిపై తనకు గల అభిమానాన్ని చాటారు. లై న్తూదీరూ… ప్రకాష్‌ గారి వద్ద సహాయ దర్శకుడిగా పనిచేసిన అనుభవంతో నాన్నగారు కాకినాడ వచ్చి మా సొంత ఇంటివద్దనే సెట్టులేసి సాంకేతిక పరికరాలనన్నిటిని అమర్చుకుని “భక్త మార్కండేయ” చిత్రాన్ని తీశారు. యముడిగా మా నాన్నగారు, ఇంకా ముద్దూరి బుచ్చన్నశాసై కాకినాడ రాజారత్నం మొదలైనవారు ఆ సినిమాలో నటించారు. పౌరాణిక చిత్రాలు (ప్రజలకు బాగా నచ్చుతాయనే ఉద్దేశంతో ముందుగా పౌరాణిక చిత్రాలనే నాన్నగారు తీశారు. నాన్నగారి గురించి ఒక విచిత్రమైన సంఘటన చెబుతాను. ఫిలిమ్‌ ఇండ(స్టీలోకి మొట్టమొదటగా నాన్నగారు | ప్రవేశించాలనుకున్నప్పుడు ఆయనగారు కలకత్తా వెళ్ళి | గంగానదిలో స్నానం చేస్తుంటే అక్కడ ఓ ఫిల్మ్‌ కంపెని వాళ్ళు చెట్టుకింద కూర్చొని ఎడుస్తున్నారు. నాన్నగారు వాళ్ళదగ్గరకెళ్ళి “బాబూ మీరు తెలుగులో ఎడుస్తున్నారు మీరు తెలుగువాళ్ళా?” అని అడిగారు! వెంటనే వాళ్ళు “మేము తెలుగువాళ్ళమే. సురభి నాటకం కంపెనీవారి “రామదాసు” నాటకం పట్టుకొచ్చాం. సినిమాగా ఎలా తీయాలో తెలియదు. మీకుగానీ తియటంవస్తే కాస్త తీసిపెట్టరాదూ” అని అన్నారు. “ఓ అలాగే తిసిపెడ్డా!”’ అని నాన్నగారు చెప్పి షాట్‌ డివిజన్‌, సినీ ఆర్డర్‌ అన్నీ ప్రిపేర్‌చేసి వాళ్ళకి సినిమాతీసి ఇచ్చారు. అలా నాన్నగారు సినిమా పరిశ్రమలోకి రాకమునుపే ఓ సినిమా తీశారు. 1933, ఆ (ప్రాంతంలో కలకత్తాలోని ఈస్ట్‌ ఇండియా కంపెనీవారు నాన్నగారి ప్రతిభాపాటవాలు గుర్తించి నాన్నగార్ని వాళ్ళ కంపెనీకి ఆహ్వానించి తెలుగు విభాగం నాన్నగారికి అప్పుగించి సినిమాలు తీయమన్నారు. ప్రథమంగా “సావిత్రి” చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ చి(తంలో ఆనాటి మేటి రంగస్థల నటీనటులైన వేమూరు గగ్గయ్య, నిడుముక్కల సుబ్బారావు, రామతిలకం మొదలైనవారు నటించారు. సావిత్రి చిత్రం తర్వాత నాన్నగారు షీ దశాబ్దం పాటు లవకుశ, సతీ అనసూయ, ధృవవిజయం, కాసులపేరు, మోహినీ భస్మాసుర, వరవి[క్రయం, బాలనాగమ్మ, సత్యనారాయణ(వ్రతం, గొల్లభామ, ఛల్‌మోహనరంగా మొదలైన చిత్రాలకు దర్శకత్వం వహెంచారు. లవకుశ చేసిన మేలు నాన్నగారి రోజుల్లో థియేటర్లలో ప్రింట్‌ ఆడేందుకు కాంట్రాక్ట్‌ పద్దతి ఉండేది. ఆ పద్దతి ప్రకారమే ఆ థియేటర్లలో ఆ సినిమా ఆడాలి అన్న రూల్స్‌ ఉండేవి. నాన్నగారి లవకుశ వల్ల అటు ప్రజలకు, ఇటు సినీ పరిశమకు జరిగిన ప్రయోజనం ఏమిటంటే – “సింగిల్‌ స్టార్‌ సింసైక్స్‌ ప్రొజెక్టర్‌” సౌకర్యం అన్ని థియేటర్లలో అమర్భబడింది. ఇది ఎలాగంటే – లవకుశ ఫల్ము డబ్బాలు రాజమండ్రి, కాకినాడ మొదలైన థీయేటర్‌లకు వెళ్ళాల్సి ఉండేవి. అవి అక్కడికి వెళ్ళిన తర్వాత వారం, పదిరోజులు గడిచినా తిరిగి వచ్చేవి కావు. థియేటర్లతో కుదుర్చుకున్న కాంట్రాక్ట్‌ గడువు అయిపోయేది, ఫిల్ములు మ(ద్రాసు వచ్చేవికావు. దానివల్ల (ప్రింట్లు వెళ్ళాల్సిన థియేటర్‌ వాళ్ళకు, ఆ వూళ్ళోని (ప్రజలకు కోపం వచ్చెది. ఇదంతా దేనివల్ల జరిగిందంటే లవకుశ ప్రింట్‌ ఓ వూరికివెడితే అక్కడి ప్రజలు ఆ ప్రింట్‌ని నెలరోజులపాటు వారి వూళ్ళో (ప్రదర్శింపచేసేవారు. పైగా థియేటర్‌వాళ్ళు = గోమ్స్‌ ఫిల్ముని తిరిగి పంపడానికి మాకు ఏమాత్రం అభ్యతరం లేదు కాని ఫిల్ము పంపితే మమ్మల్ని చంపెస్తామని, మా థియేటర్‌ని నాశనం చేసేస్తాం అని ప్రజలు అంటున్నారు” అని మద్రాసులోని ఫీల్ము కంపెనీవారికి చెప్పేవారు. ఇలాంటి పరిస్థితుల్లో కలకత్తాలోని “ఛటర్జీ – భూపాల్‌’ సౌండ్‌సిస్టమ్‌ వారితో ఈస్ట్‌ ఇండియా కంపెనివారు అగ్రిమెంట్‌ కుదుర్చుకుని “సింగ్‌స్టార్‌ సిం ప్లెక్స్‌ (ప్రొజెక్టర్‌ “ని ప్రవేశపెట్టారు. అంతకుముందుదాకా థియేటర్లలో సినిమా ఆడించేందుకు మేకులు కొట్టి చెక్కముక్కలతో ప్రొజెక్టర్‌ తయారుచేసే ప్రక్రియ ఉండేది! ఈ సింగిల్‌స్టార్‌’ (ప్రొజెక్టర్‌ రావడంతో ఆ పాతపద్దతికి తెరపడింది. ఇది నాన్నగారి “లవకుశ చేసిన మేలు. 17 వారాల భత్యం నాన్నగారు సినిమాలు తీసేరోజుల్లో అందరు ఆర్జిస్టులూ కంపల్సరీగా షూటింగ్‌ మితం చూడాల్సిందే. అలా చూడటం ఆర్టిస్టులకు ఓ ఎడ్యుకేషన్‌ అని నాన్నగారు అంటూ సంయేాళు! అలాగే నాన్నగారు తన తప్పులను, లోపాలను ఎవరైనా ఎత్తిచూపితే ఎంతో ఆనందంగా వాటిని తీసుకునేవారు. తిరిగి ఆ తప్పులు, ఆ లోపాలు జరగకుండా ఎంతో జాగ్రత్త తీసుకునేవారు. _వినదగునెవ్వరు చెప్పన” అన్న సూక్తిని అక్షరాలా నాన్నగారు పాటించేవారు. చలనచిత్ర రంగంలో మేటి తారలైన భానుమతి, అంజలీదేవి, కృష్ణవేణి, పుష్పవల్లి, రేలంగి, కస్తూరి శివరావు మొదలైన ఎందరెందరో నటినటుల్ని నాన్నగారు వెండితెరకు, తెలుగు (ప్రేక్షకులకు పరిచయం చేశారు. నాన్నగారు మొట్టమొదటిగా దర్శకత్వం వహించిన ‘సతీసావిత్రి” ఆరోజుల్లో బెంగుళూరులో 17 వారాలపాటు ఆడటం గొప్పవిషయం. అది నాన్నగారి దర్శకత్వ (ప్రతిభకు షే మచ్చుతునక, అలాగే నాన్నగారు దర్శకత్వం వహించిన ‘లవకుశి గ్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఆ బంట నీరాముడిగా పారుపలి ల్లి సుబ్బారావు, సతగా మంగళగిరి శ్రీరంజని అద్భుతంగ ‘లవకుళో.. నంధృ కాంతారావు, ఎన్‌.టీ.ఆర్‌. కన్టాంబ నటించారు. పల్లెప్రజలు అన్నంమూటలు కట్టుకుని, ఎడ్డబండ్హమీద తిరునాళ్ళకు వచ్చినట్టుగా లవకుశ చిత్రాన్ని చూడటానిక్తి వచ్చేవారు. తర్వాత 1958లో ఎన్‌.టి.ఆర్‌. శ్రీరాముడిగా నటించిన లవకుశ చిత్రం నాన్నగారి పర్యవేక్షణలో తీయబడింది. ఆ చిత్రానికి నేను దర్శకత్వం వహించడం నా పూర్వజన్మ సుక[తంగా నేనుభావిస్తాను! నాన్నగారు 1949లో దక్షిణ భారతదేశంలోనే (ప్రప్రథమంగా, మద్రాస్‌లో ఎయిర్‌ కండిషన్‌ థియేటర్‌ మినర్వా టాకీసు నిరి గ్రంచారు. అలాగే 1952లో మద్రాసులో ఓపెన్‌ ఎయిర్‌ థియేటర్‌ స్థాపించారు. పిక్సరని చక్కగా తీయగలనన్న నమ్మకం, విశ్యాసం కలిగిన తర్వాతే నాన్నగారు ఏదైనా పిక్చర్‌ తీసేవారు. కథ్రాపరంగా పెద్దపెద్ద పండితులతో, చరిత్ర పరిశోధకులతో చర్చించేవారు. వారి అభి[ప్రాయాలను తీసుకునేవారు, వారి సలహాలను పాటించేవారు, నాన్నగారి గురించి ఇలా చెప్పుకుంటూపోతే ఓ మహా [గ్రంథమే అవుతుంది. మట్టిలోని మాణిక్యాలతో ఓ అందమైన హారాన్ని తయారుచేసిన రూపశిల్పి నాన్నగారు!

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in సినిమా and tagged . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.