మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు -62,63

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు -62,63

62,63-సినీ పరిశ్రమలో డాడీ,మమ్మీ లు -పిపుల్లయ్యశా౦తకుమారి దంపతులు

62- జయభేరి, అర్ధాంగి ,వెంకటేశ్వర మహాత్మ్యం దర్శక ఫేం, ఫైర్ బ్రాండ్ దర్శకులు -పి.పుల్లయ్య

పి. పుల్లయ్య గా పేరుగాంచిన పోలుదాసు పుల్లయ్య (మే 2, 1911 – మే 29, 1987) మొదటి తరానికి చెందిన తెలుగు సినిమా దర్శకుడు, నిర్మాత. వీరి సినీ నిర్మాణం పద్మశ్రీ పిక్చర్స్ పతాకం పై చేపట్టారు. ఈయన సతీమణి తెలుగు సినీనటి పి.శాంతకుమారి

బాల్యం

పుల్లయ్య 1911, మే 2న రంగమ్మ, రాఘవయ్య దంపతులకు నెల్లూరులో జన్మించాడు.

చిత్రసమాహారం

దర్శకత్వం

· అందరూ బాగుండాలి (1975)

· కొడుకు కోడలు (1972)

· అల్లుడే మేనల్లుడు (1970)

· ప్రాణ మిత్రులు (1967)

· తాయే ఉనక్కాగ (1966)

· ఆసై ముఖం(1965)

· ప్రేమించి చూడు (1965)

· మురళీకృష్ణ (1964)

· సిరి సంపదలు (1962)

· శ్రీవేంకటేశ్వర మహాత్మ్యం (1960)

· జయభేరి (1959)

· అదిసయ తిరుడన్ (1959)

· బండ రాముడు (1959)

· కలైవణన్ (1959)

· ఇల్లారమే నల్లారం (1958)

· వనగముడి (1957)

· పెన్నిన్ పేరుమై (1956)

· ఉమా సుందరి (1956)

· కన్యాశుల్కం (1955)

· అర్ధాంగి (1955)

· రేచుక్క (1955)

· మనంపోలే మాంగల్యం (1953)

· ధర్మదేవత (1952/I)

· మచ్చ రేకై(1950)

· తిరుగుబాటు (1950)

· వీటుకరి (1950)

· భక్తజన (1948)

· మాయా మచ్చీంద్ర (1945)

· భాగ్యలక్ష్మి (1943)

· ధర్మపత్ని (1941/I)

· ప్రేమబంధం (1941)

· సుభద్ర (1941)

· బాలాజీ (1939)

· సారంగధర (1937/I)

· హరిశ్చంద్ర (1935)

నిర్మాత

· కొడుకు కోడలు (1972)

· అల్లుడే మేనల్లుడు (1970)

· ప్రాణమిత్రులు (1967)

· ప్రేమించి చూడు (1965)

· సిరి సంపదలు (1962)

· శ్రీవేంకటేశ్వర మహాత్మ్యం (1960)

· అర్థాంగి (1955)

· ధర్మపత్ని (1941)

రావి కొండలరావు జ్ఞాపకాలు

పి. పుల్లయ్య గారు 1972లో రష్యా విజయం చేశారు. చేశాను గదా అని, సినిమా స్టూడియోలు తిరిగారు. అక్కడ అద్భుతమైన విగ్గులు, ఫేస్‌ మోల్డులూ చూసి అబ్బుర పడిపోయారు.

ముఖానికి తగిలించే మోల్డ్‌లు చాలా సహజంగా వున్నాయట. “మిరు డ్యుయల్‌ రోల్‌ సినిమా చెయ్యాలనుకుంటే, మో హీరో ముఖం రెండోవాడికి తగిలించి, ట్రిక్స్‌ బాధలేకుండా డైరెక్టుగా తీసుకోవచ్చు ” అని వాళ్లు చెప్పారుట. సునిల్‌దత్‌ అలాంటి సినిమా ప్లాన్‌ చేస్తున్నాడని అతని ముఖంలాంటి మోల్డ్‌లు చూపించారుట. “నేనూ అలాంటి సినిమా తియ్యెచ్చునే – అనుకున్నారు గాని, మన వూరు వెళ్లాక ఈ ముఖం మోల్డ్‌ చిరిగినా, విరిగినా నా వల్ల కాదురో అనీ, నాడా దొరికిందని గుర్రం కొనడం ఎందుకని, వూరుకున్నాను” అని చెప్పారు పుల్లయ్యగారు అప్పుడు. ఆయనది పూర్తి “క్లాత్‌ హెడ్‌” అంటే బట్టతల. ఒక్క వెంట్రుక వుండేది కాదు తలమోద. అక్కడున్న విగ్గు మేకర్లు పుల్లయ్యగారి తల చూసి, “మీ కెందుకూ 7 అద్భుతమైన విగ్గు- మో ముఖానికి తగిన క్రాపు విగ్గు వేసి ఇస్తాం. అలా తగిలించుకుంటే చాలు. అతి సహజంగా వుంటుంది. విగ్గు పెట్టినట్టు అస్సలు తెలీదు” అని ఆశపెట్టారుట.ఆయన ఆర్జరిచ్చినట్టే ఇచ్చి వెనక్కి తీసుకున్నారుట. “ఓర్నాయినో -ఇన్నాళ్లూ ఈ బాల్డ్‌ హెడ్డుతో తిరిగి, ఇప్పుడు బాలుడి హెడ్డుతో కనిపిస్తే – ఉన్న వెంట్రుకలు లాగేస్తారు. నా కెందుకీ విగ్గు సిగ్గులేక? అని నోరు మూసుకుని ఆ స్టూడియోల ప్రతిభకి ఓ నమస్కారం పెట్టి తిరగు ముఖం పట్టాను” అని చెప్పారు పుల్లయ్యగారు.

ఈ పుల్లయ్య గారు “ప్రేమించిచూడు” తీశారు. (అందులో నేను వేసిన వేషం గురించి,” “సైలెన్స్‌ అని-ఇప్పటికీ చెబుతూ వుంటారూ శ్రేయోభిలాషులు) అందులో నాగేశ్వరరావుగారు హీరో, నేను ఆ హీరోకి తండ్రిని. ముళ్లపూడి రమణగారు స్కిప్ట రాశారు. రాస్తూ, హీరో తండ్రి బడిపంతులు గనక, దాన్ని అలా రూపొందించి చెప్తే – పుల్లయ్య గారు సంతోషించారుట. “ఈ వేషం రావికొండలరావు చేత వేయిస్తే- బాగా పండిస్తారు” అని రమణగారు చెప్పి ఆ మాట నాతో చెప్పి “మోరొకసారి పుల్లయ్య గారిని చూడండి” అంటే, నేను – ఇక్కడ మాయమై అక్కడ ప్రత్యక్షమైనంత స్పీడుగా వెళ్లాను. అప్పుడు నాకు 32,33 ఏళ్లు. కుర్రాడిని. ఒత్తుగా జుట్టు, నల్లగా వుండేది. నాకు వుల్లయ్యగారు తెలునుగాని, ఆయనకి నేను తెలియదు. “ఎవరయ్యా?” అంటూ వచ్చారాయన. “నేను ఫలానా. ఫలానా రమణగారు పంపిస్తే వచ్చాను. ఫలానా హీరో గారికి… ఫలానా తండ్రి వేషానికి..” అన్నాన్నేను. తత్తరపాటుతో తత్తత్తడబడుతూ. ఆయన ముఖంలో రంగు మారింది. తెల్లటి

ముఖారవిందం అరవిందం రంగులోకి దిగింది. నన్ను ఎగాదిగా చూశారు. నా పాంటు, నా షర్టు, నా క్రాపు చూసి- రెండో మాట లేదు, “ఫస్ట్‌ గెటవుట్‌ొ” అన్నారు. నా నల్లజుట్టు తల గిర్రున తిరిగింది- మూర్భవచ్చిన వాడిలా కాళ్ళూ చేతులూ కొట్టుకుంటూ వుండగా” నీకు బుద్ధిలేదా? ఆ రమణకి బుద్ధిలేదా? నాకు బుద్ధి లేదా? . నువ్వు నాగేశ్వర్రావుకి తండ్రివా ?…. ఐయామ్‌ నాట్‌ ఎ పూల్‌ – ప్లీజ్‌ గో !…” అన్నారు మళ్ళీ. నేనేదో అనబోయానుగాని , లోపలుంటుందిట- అంతరాత్మ కాబోలు అది నా నోరు నొక్కేసింది!.. ఓ నమస్కారం పెట్టి దిగులు, బాధ, నిఠాశల్దాంటి వన్నింటినీ తోడు చేసుకుని -ఈసారి మాయమైనట్టు కాకుండా – తాబేలు స్పీడులో రమణగారి దగ్గర కెల్లి జరిగింది వివరించాను . ఆయన నవ్వేసి “ఆపాత్ర చేసి చూపించండి” అన్నారు. మళ్లీ వెళ్లడం ఎలా? ..ఈ లోపల పుల్లయ్య గారికి సన్నిహితులైన

కొడవటిగంటి కుటుంబరావుగారు, ప్రతిభా శాన్వ్తీిగారూ ” అలా వుంటాడుగాని, పెద్దవాడిలాగానే చేస్తాడు” అని కొంత బోధ వరిస్తే ఎందుకైనా మంచిదని ఈ సారి రమణగారి చెయ్యిపట్టుకుని, తప్పుచేసిన విద్యార్ధి తండ్రి చెయ్యి పట్టుకుని మాస్టారి దగ్గరికి వెళ్ళినట్టు వెళ్లాను. తెలుగు మాస్టారి పాత్ర- తీరు చెప్పి – నటించి పుల్లయ్యగారికి _ చూపించాను. ‘వూ’ అని పుల్లయ్య గారు _. తలవూపారేగాని, నమ్మకం చాల్లేదు. నన్ను బరబరా లాక్కళ్ళి కారెక్కమన్నారు. ముందు సీట్లో ఆయన కూచున్నారు. ఎక్కడికో తెలీదు, ఎందుకో తెలీదు నాకు ! వెరివెధవలా చూస్తూన్నాను. జార్జి టవున్‌లో ఓ విగ్గుల షాపు వుంటే అక్కడికి తీసుకెళ్లి ఓ నాలుగైదు ముసలి విగ్గులు తీయించి, నాకు తగిలించి, చూసుకుని “ఈ విగ్గు ఖాయం చెయ్యవయ్యా”’ అని షాపు యజమానికి చెప్పి “పద” అని ఆఫీసుకి తీసుకెళ్లి కూచోబెట్టు నిదానంగా కూల్‌గా, “ యస్‌… యూ ఆర్‌ డూయింగ్‌ దట్‌ కారెక్టర్‌”… అన్నారు పుల్లయ్యగారు. “అమ్మయ్య!” అనుకుంది తడబుడుతున్న మనసు. “ఆయనని పుల్లయ్య అనకూడదు. -‘పెద్ద పులయ్య ‘ . బాబోయ్‌ పెద్దపులయ్య!” అనుకున్నవాడిని- కూల్‌గా ఆయన చెప్పేసరికి, “గోవులాంటి మనసు. వులయ్యకాదు, గోవయ్య” అనుకున్నాను ఆనందంగా. అలా వచ్చిందా వేషం నాకు “పేమించిచూడు’ లో.

పి.పులయ్య గారు“సిరిసంపదలు” తీశాడు. అందులో నాగయ్య గారు వేశారు. తర్వాత పుల్లయ్యగారు “ప్రాణమిత్రులు” తీశారు. అందులో జగ్గయ్య గారి కుటుంబం జమిందారీ కుటుంబం. ఆయన తండ్రి జమిందారు – కీర్తి శేషుడు. చిత్రంలో ఆ పాత్రరాదు. అయినా ఆ భవనంలో పెద్ద పెయింటింగ్‌ వుండాలని, ఎవరిదో పెయింటింగ్‌ అని కాకుండా, అలాంటి గెటప్‌లో అంతకు ముందొచ్చిన సినిమాలోని నాగయ్య గారి ఫోటోనే తీసుకుని, నిలువెత్తు పెయింటింగ్‌ చేయించి, సెట్లో వ్రముఖంగా పెట్టారు. ఆ విషయం నాగయ్యగారికి తెలిసి, పుల్లయ్యగారికి ఫోన్‌చేశారుట. “వుల్లయ్యా !నేను నీ సినిమాలో లేకపోయినా నా ఫోటో పెద్దసైజులో పెట్టావుట. మూరు నన్ను ఈవిధంగా ఉపయోగించు కుంటున్నావు కదా, మరి నాకు ఎంత ఇస్తావు? అని అడిగారు. దానికి పుల్లయ్య గారు పకపకా నవ్వి “ఓరి నీ అసాధ్యం కూలా! ఎంత పెద్దజోక్‌ పేల్చావయ్యా పొద్దున్నే” అన్నారుట. నవ్వుతూనే ఆ విషయం అందకికీ చెప్పేవారు పుల్లయ్యగారు.

దొంగ కొంగ!

“పొణమిత్రులు” తీస్తున్నప్పుడు ఒక తమాషా జరిగింది. హైదరాబాదు సారథి, స్టూడియోలో షూటింగ్‌. ఒక ఫ్లోర్‌లో సెట్టు వేశారు. అప్పటి పరిస్థితేమిటంటే, క్రేన్‌ కావాలంటే మద్రాసునుంచి రావాలి. ప్రొడక్షన్‌ వాళ్లు ఏర్పాటుచేశారు. అది, మద్రాసులో బయలుదేరింది ట్రక్కుమీద. షూటింగ్‌ కి ముందు రోజే అది హైదరాబాదు చేరుకోవాలి. షూటింగ్‌ లో నాగేశ్వరరావుగారు, జగ్గయ్యగారు, గుమ్మడిగారు, శాంతకుమారి గారూ- ఇంకా కొంత మంది వున్నాం. క్రేన్‌ వచ్చేస్తుందన్న ధీమాతోనే షూటింగ్‌ ఏర్పాట్లు జరిగాయి. ఉదయమే అంతా స్టూడియో చేరుకుని, మేకప్‌ వేస్తుకుని సిద్ధమైపోయారు.

ప్లోర్‌ లోవల – క్రేన్‌ షాట్‌కి తగ్గట్బగా లైటింగ్‌ చేశారు ఛాయాగ్రాహకుడు శ్రీ సెల్వరాజ్‌. క్రేన్‌ రాలేదు! ఫోన్లమీోద ఫోన్లు వెళ్తున్నాయి. అక్కడ ట్రక్కు బయల్టేరింది- మూడు రోజులయింది. ఇక్కడకు రాలేదు! పుల్లయ్యగారు చిందులు తొక్కుతున్నారు. పోనీ, క్రేన్‌ షాట్స్‌ వదిలేసి, తక్కినవి తీసుకోవచ్చుగదాని పుల్లయ్యగారికి చెప్పే సాహసం ఎవరికీ లేదు. పైగా పులయ్యగారు ఆ షాటులో సీను మొదలు పెట్టాలని ప్రిపేర్‌ అయికూచున్నారు. మధ్యాహ్నం వరకూ చూసిచూసి ‘పాకప్‌’ చేశారు. జరిగినదేమిటంటే విజయవాడ దాటిన తర్వాత ట్రక్కుకి రోగం వచ్చి మంచాన పడింది! మందులు,మాకులు అయిన తర్వాత, తెరిపిన పడింది- రాత్రి బయళల్టేరుళుంది. తెల్లవారేలోగా సారథి స్టూడియోకి చేరుకోగలదు. ఆ టక్కు డైవర్‌ తెలివిగా వ్యవహరించి, సాయంకాలానికి సారథి స్టూడియోకి ఓ ఫోన్‌ కొట్టాడు. ఈ శుభవార్తకి, అందరికీ-ముఖ్యంగా పుల్లయ్య గారికి, ఒకరోజు పోయిందేనన్న బాధవున్నా కొంత ఉపశమనం కలిగింది. మర్నాడు షూటింగ్‌ ఏర్పాట్లు జరిగాయి. మళ్ళీ అందరూ సిద్ధమై కూచున్నారు. తెల్లవారేసరికి వస్తుందనుకున్న “కొంగ” అనబడే క్రేన్‌ ఉదయం పదిగంటలయినా గూడు చేరుకుని వాలలేదు! మళ్ళీ అందరికీ టెన్షన్‌! పుల్లయ్య గారికయితే మరీనో. ఆయన ఏకంగా సారథి గేటు దగ్గరికే వెళ్లి రోడ్డుపైన తిరుగుతున్న ట్రక్కుల్ని చూస్తూ నించున్నారు.చూసి చూసి పుల్లయ్య గారికి బీపీ పెరిగిపోయినట్టుంది స్టూడియో దద్దరిల్లేలా అందరిమోద అరుస్తున్నారు. ఆ అరుపుతో ఆ టెన్షన్‌లో మొత్తానికి శబ్దంచేస్తూ ట్రక్కు వచ్చిచేరింది! అందరూ ఊపిరి పీల్చుకున్నారు. భాగాలు భాగాలుగా విడగొట్టిన గ్రేన్‌ని వచ్చినవాళ్లూ లైట్‌మెన్స్‌ అంతా కలిసి గబగబా దింపారు. బిగించారు. క్రేన్‌ లేచి నిటారుగా నిలబడింది….అందరూ కలిసి నెట్టుకుంటూ ఫ్లోర్‌ సింహద్వారం దగ్గరికి వచ్చేసరికి ఏముంది? శ్రేన్‌ లోపలికి వెళ్ళలేదు! ద్వారం క్రేన్‌ సైజుకంటే చిన్నది!…. అంతే! మళ్లీ పుల్లయ్యగారు తలపట్టుకుని నేలమోద కూలబడ్డారు.- “ఓరి క్రేనో” అంటూ.

అయిన ఆలస్యం అయిందని, ఏం పర్వాలేదని – మళ్లా క్రేన్‌ భాగాలు విడగొట్టి, ఒక్కొక్కటీ ఫ్లోర్‌ లోపలికి తీసుకెళ్ళి. మళ్ళీ బిగించేసరికి ‘లంచ్‌ బ్రేక్‌కి గంట కొట్టారు! “సీరియస్‌నెస్‌లో కూడా కామెడీ” అని అందరూ నవ్వేసుకున్నారు.

పుల్లయ్య గారు సెట్ లో అడుగుపెడితే అందరూ భయపడే వారు .అగ్రతారలైనా ఆయన ఆగ్రహానికి గురికావాల్సిందే .తాలీ వుడ్ లోఆయన ‘’ఫైర్ బ్రాండ్ దర్శకులు ‘’దర్శకత్వం లో దిట్ట.కోపమోస్తేమాత్రం దానికి ఎవరూ అడ్డుకట్ట వేయలేరు .ఎన్నో విజయవంతమైన చిత్రాల దర్శకులాయన .స్టోరీ డిస్కషన్ ,షూటింగ్ సమయాలలో ఎవరైనా అడ్డం వస్తే కొట్టినంత పని చేసేవారు .ఇదంతా కాసేపే .ఆతర్వాత చల్లబడి పోయేవారు .మాటలు పలుగు రాళ్ళే .మనసు వెన్నపూస..అందర్తో కోపంగా ,ప్రేమగా ఉండటం ఆయన విశిష్ట లక్షణం .అందుకే ఆయన్ను ‘’people లయ్య’’ అంటారు అని రావికొండలరావు గారువాచ .

63- అమ్మ పాత్రకు అసలు నిర్వచనం ,’’ఎన్నాళ్ళని కన్నులు కాయగా ఎదురు చూతురా గోపాలా పాట ఫేం,కమ్మని పాటకు సుస్వరం,నటగాయక సంచలనం -శాంతకుమారి

శాంతకుమారి తెలుగు సినిమా నటి, దర్శకుడు పి.పుల్లయ్య సతీమణి. ఈవిడ 1936లో ‘శశిరేఖా పరిణయం’ సినిమాతో నటజీవితం ప్రారంభించి వందకు పైగా సినిమాల్లో నటించారు

బాల్య0]

శాంతకుమారి అసలు పేరు వెల్లాల సుబ్బమ్మ. సుబ్బమ్మ వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరు లో మే 17, 1920 సంవత్సరంలో వెల్లాల శ్రీనివాసరావు గారికి జన్మించారు. శ్రీనివాసరావు గారికి కళలు అంటే ఎంతో ఇష్టం. అందుకనే కూతురైన సుబ్బమ్మను మద్ర్రాసులో ఉన్న ప్రొ.పి. సాంబమూర్తి గారి వద్దకు కర్ణాటక సంగీతం, వయొలిన్ నేర్చుకోవటానికి దరఖాస్తు చేయించారు. డి.కె.పట్టమ్మాళ్ సుబ్బమ్మ యొక్క సహాధ్యాయిని. పదమూడేళ్ళ వయసులోనే సుబ్బమ్మ కర్ణాటక సంగీతం లో ఉత్తీర్ణురాలయ్యింది. పదహైదేళ్ళ వయసులో వయొలిన్ లో ఉత్తీర్ణురాలైంది. తరువాత గురువుగారితో కలసి దక్షిణ భారతదేశం అంతా ఎన్నో కచేరీలు చేసింది. పదహారేళ్ళ వయసులోనే విద్యోదయా స్కూలులో పిల్లలకు సంగీతం నేర్పించేది.

సినీ జీవితం

సుబ్బమ్మ కచేరి చూసిన దర్శక-నిర్మాత పి.వి.దాసు మాయాబజార్ (1936) లేదా శశిరేఖ పరిణయం సినిమాలో శశిరేఖ పాత్రను ఇచ్చారు. కానీ సుబ్బమ్మ సినిమాలలో నటించటానికి ఆమె బామ్మ నిరాకరించడంతో, పి.వి.దాసు, అతని మేకప్ మనిషైన మంగయ్య వప్పించడానికి ఎంతో ప్రయత్నించారు. సుబ్బమ్మను శశిరేఖ వేషంలో చూసిన ఆమె బామ్మ చివరకు ఆమె సినిమాలో నటించడానికి ఒప్పుకొంది. దాసుగారు సుబ్బమ్మ కొంచెం పాతగా ఉందని పేరును శాంతకుమారిగా మార్చారు.

శాంతకుమారీగా మారిన నట-గాయక సంచలనం తరువాత సినిమా సారంగధర (1937). ఇందులో ఆమె చిత్రాంగి అనే దుష్టపాత్రను ఎంతో ఉత్సాహభరితంగా నటించింది. ఈ చిత్ర దర్శకుడైన పి.పుల్లయ్య గారిని ఇష్టపడి పెళ్ళిచేసుకొంది. పెళ్ళిచేసుకొన్న తరువాతకూడ ఆమె నట జీవితం సాఫీగా సాగిపోయింది. శాంతకుమారి పి.పుల్లయ్య దంపతులకు రాధ, పద్మ అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

శాంత కుమారి సినిమా జీవితం మొదట్లో అన్నీ పురాణాలు ఇతివృత్తంగా ఉన్న సినిమాలలోనే నటించారు. యశోద గా కూడా నటించిన ఈమె కృష్ణుని ముద్దుచేస్తూ “చిరు చిరు నగవులు చిందే తండ్రి” అనే మధురమైన పాటను అద్భుతంగా పాడారు.

శాంతకుమారికి మెదటి సాంఘిక చిత్రం ధర్మపత్ని. అందులో అక్కినేని నాగేశ్వరరావు విద్యార్థిగా నటించారు. అక్కినేనికి శాంతకుమారికీ మధ్య ఎంతో ఆత్మీయమైన అనుబంధం ఉండేది. అక్కినేనిని ఆమె అప్యాయంగా చిన్న తమ్ముడిని పిలచినట్లు అబ్బి అనే వారు. మాయలోకం సినిమాలో అక్కినేనికి ప్రక్క కథానాయికగా నటించిన శాంతకుమారి, జయభేరి సినిమాలో వదినగా నటించారు, అర్థాంగి సినిమాలోనైతే సవతి తల్లిగా నటించారు. ఎన్.టీ.ఆర్ కు కూడా తల్లా పెళ్ళామా సినిమాలో బామ్మగా నటించారు. తెలుగు సినీ పరిశ్రమలో అగ్రతారలైన ఎన్‌.టి. రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, తమిళ సినీ ప్రముఖులు శివాజీ గణేశన్, జెమినీ గణేశన్ తదితరులకు చాలా చిత్రాల్లో శాంతకుమారి తల్లిగా నటించారు.

పద్మశ్రీ పిక్చర్స్‌, రాగిణి పిక్చర్స్‌ పేరుతో సొంతంగా ఇరవైకి పైగా సినిమాలను నిర్మించారు. తాను హీరోయిన్‌గా ప్రధాన పాత్రల్లో నటించిన సినిమాలనే మళ్లీ తీసినపుడు తల్లి పాత్రల్లో నటించిన అరుదైన రికార్డు శాంతకుమారి సొంతం.

సినిమాలలో నటించడం మానేసిన తరువాత ఆమె మంగళంపల్లి బాలమురళీకృష్ణ పాడే పాటలను వ్రాసి, స్వరపరిచే వారు.

నటించిన సినిమాలు

 1. మాయాబజార్ లేదా శశిరేఖాపరిణయం (1936)
 2. సారంగధర (1937)
 3. రుక్మిణీ కల్యాణం (1937)
 4. భక్తజయదేవ (1938)
 5. శ్రీ వేంకటేశ్వరమహత్యం (1939)
 6. ధర్మపత్ని (1941)
 7. పార్వతీ కల్యాణం (1941)
 8. కృష్ణప్రేమ (1943) (రాధ పాత్ర)
 9. మాయాలోకం (1945)
 10. గుణసుందరి కథ (1949) (గుణసుందరిదేవి దుష్ట బుద్ధిగల అక్కగా)
 11. షావుకారు (1950)
 12. ధర్మదేవత (1952) (కాత్యాయిని పాత్ర)
 13. అర్ధాంగి (1955)
 14. సారంగధర (1957)
 15. జయభేరి (1959) (అన్నపూర్ణ పాత్ర)
 16. శ్రీ వెంకటేశ్వర మహత్యం (1960) (వకుళ పాత్ర)
 17. సిరిసంపదలు (1962)
 18. ప్రేమించి చూడు (1965)
 19. ప్రాణమిత్రులు (1967)
 20. బంగారు పిచ్చుక (1968)
 21. అక్కాచెల్లెలు (1970) (జడ్జి రామచంద్రరావు గారి తల్లి)
 22. ప్రేమనగర్ (1971)
 23. కొడుకు కోడలు (1972)
 24. సోగ్గాడు (1975)
 25. అందరూ బాగుండాలి (1976)

బహుమతులు

· 1999వ సంవత్సరానికి గాను ఆమె ‘రఘుపతి వెంకయ్య అవార్డు’ను అందుకున్నారు.

· ఎన్‌టిఆర్‌ జయంతి సందర్భంగా సినీ కళాకారులకు ఇచ్చే ‘కళా నీరాజన’ పురస్కారాన్ని కూడా ఆమె అందుకున్నారు.

మరణం

తెలుగు చిత్ర పరిశ్రమ ఆప్యాయంగా ‘అమ్మ’ అని పిలుచుకునే నటి శాంతకుమారి జనవరి 17 2006 తదీ మధ్యాహ్నం 12.30 గంటలకు దీర్ఘకాలిక అస్వస్థత తరువాత చెన్నై లోని స్వగృహంలో మరణించారు .

పూర్వం సినిమా రంగంలో స్వార్ధం, అసూయ,ద్వేషాలు లేవు . కేవలం కళ కోసం నటించే రోజులవి. డబ్బు సంపాదించాలనే యావ ఏకోశానా ఉండేది కాదు. నటన కోసం పోటీ పడేవాళ్ళు.
మంచి పాత్రల కోసం తపించేవాళ్ళు. వచ్చిన పాత్రను ఎలా మెప్పించాలా అని రేయింబవళ్ళు కృషి చేసే వాళ్ళు . దర్శకుడే దేవుడు. ఆయన మాటే వేదం.ఇది మొదటి తరం సినీ సాంప్రదాయం.
అప్పుడు నటీనటులు జీతాల పద్ధతిలో పనిచేసేవారు.
ఒక్కొక్క చిత్రం 4 నుంచి 6 నెలల నిర్మాణం జరిగేది. ఆ చిత్రం పూర్తయి, ఆ నిర్మాణ సంస్థ ‘రిలీవ్ ఆర్డర్” ఇచ్చే వరకూ మరో చిత్రంలో నటించడానికి వీల్లేదు.
సకాలంలో చిత్ర నిర్మాణం పూర్తి కాక పోతే అదనపు రోజుల కు అదనపు డబ్బు ఇచ్చేవారు. దర్శకుడంటే గురువు, దేవుడు. ఆయన సెట్లోకి వస్తే భయపడేవాళ్లు. దర్శకుడే అప్పుడు సమస్తం.అలాంటి రోజుల్లో సినీ నాయిక గా అడుగు పెట్టిన తార వెల్లాల సుబ్బమ్మ అలియాస్ శాంతకుమారి.

1936లో పివి దాసుగారు తీసిన ‘మాయాబజార్’ చిత్రాన్ని ‘శశిరేఖా పరిణయం’ అని కూడా అంటారు. రెండు పేర్లు ఉన్న సినిమా ఇది.ఈ చిత్రం ద్వారా చిత్ర రంగంలో అడుగు పెట్టారుశాంతకుమారి. ఈ చిత్రంలో శశిరేఖ పాత్ర ధరించారు. అప్పటికి ఆమె వయసు 15 సంవత్సరాలు.

వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరులో 1920 మే17 న వెల్లాల సుబ్బమ్మ జన్మించారు. వీరి తండ్రి శ్రీనివాసరావు గారికి కళలు అంటే ఇష్టం.
వెల్లాలసుబ్బమ్మను మద్రాసులో ఉన్న ప్రొ పి సాంబమూర్తి వద్ద కర్ణాటక సంగీతం, వయొలిన్ నేర్పించారు. పదమూడేళ్ళ వయసులోనే సుబ్బమ్మ కర్ణాటక సంగీతం లో ఉత్తీర్ణురాలయ్యింది. పదహైదేళ్ళ వయసులో వయొలిన్ లో ఉత్తీర్ణురాలైంది. కర్నాటక సంగీతాన్ని క్షుణ్నంగా అభ్యసించిన ఒకే ఒక తెలుగు నటిగా ఆమెకు పేరుంది.
తరువాత గురువుతో కలసి దక్షిణ భారతదేశం అంతా ఎన్నో కచేరీలు చేసింది. పదహారేళ్ళ వయసులోనే విద్యోదయా స్కూలులో పిల్లలకు సంగీతం నేర్పించేది.
వెల్లాలసుబ్బమ్మ కచేరి చూసిన దర్శక-నిర్మాత పివి దాసు 1936 మాయాబజార్ లేదా శశిరేఖ పరిణయం సినిమాలో శశిరేఖ పాత్రను ఇచ్చారు. కానీ సుబ్బమ్మ సినిమాలలో నటించటానికి ఆమె బామ్మ మొదట నిరాకరించారు. అయితే సుబ్బమ్మను శశిరేఖ వేషంలో చూసిన ఆమె బామ్మ చివరకు ఆమె సినిమాలో నటించడానికి ఒప్పుకొంది.
పి వి దాసు వెల్లాలసుబ్బమ్మ పేరు పాతగా ఉందని పేరు ను శాంతకుమారి గా ఈ సినిమాలో మార్చారు.
ఇది తెలుగులో ‘మాయాబజారు’ ఇతివృత్తంతో వచ్చిన తొలి సినిమా. 1936లో విడుదలైన ఈ తెలుగు సినిమాకు శశిరేఖా పరిణయం అని కూడా ఇంకో పేరు ఉంది. చిత్రపు నరసింహారావు దర్శకత్వం వహించారు.
సినిమాలో సాలూరి రాజేశ్వరరావు అభిమన్యుడి పాత్ర పోషించాడు. ఈ సినిమా శాంతకుమారి తొలిచిత్రము. వేల్ పిక్చర్స్ సంస్థ ఆధ్వర్యంలో పి.వి.దాసు చిత్రాన్ని నిర్మించారు. గాలిపెంచల నరసింహారావు సంగీతం అందించారు.
తరువాత 1937 లో రెండవ సినిమా సారంగధర లో నటించింది.సారంగధర 1937, ఫిబ్రవరి 5న విడుదలైంది. పి.పుల్లయ్య దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అద్దంకి శ్రీరామమూర్తి,బందా కనకలింగేశ్వరరావు,పులిపాటి వెంకటేశ్వర్లు, కొచ్చర్లకోట సత్యనారాయణ,శ్రీరంజని సీనియర్, కన్నాంబ, పి.శాంతకుమారి, బాలామణి తదితరులు నటించగా, ఆకుల నరసింహారావు సంగీతం అందించాడు.
ఇందులో ఆమె చిత్రాంగి అనే దుష్టపాత్రలో ఎంతో ఉత్సాహభరితంగా నటించింది. ఈ చిత్ర దర్శకుడైన పి.పుల్లయ్య గారిని 1937లో ఇష్టపడి ప్రేమపెళ్ళిచేసుకొన్నారు .
పి. పుల్లయ్య గా పేరుగాంచిన పోలుదాసు పుల్లయ్య మొదటి తరానికి చెందిన తెలుగు సినిమా దర్శకుడు, నిర్మాత. పద్మశ్రీ పిక్చర్స్ అధిపతి. పుల్లయ్య 1911, మే 2న రంగమ్మ, రాఘవయ్య దంపతులకు నెల్లూరులో జన్మించారు.
పెళ్ళిచేసుకొన్న తరువాత కూడ ఆమె నట జీవితం సాఫీగా సాగిపోయింది. శాంతకుమారి పి.పుల్లయ్య దంపతులకు రాధ, పద్మ అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఇందులో పద్మ పేరును వెంటేశ్వర మహాత్యం సినిమా గుర్తుగా పెట్టారు.
శాంత కుమారి సినిమా జీవితం మొదట్లో అన్నీ పురాణాలు ఇతివృత్తంగా ఉన్న సినిమాలలోనే నటించారు. యశోద గా కూడా నటించిన ఈమె కృష్ణుని ముద్దుచేస్తూ “చిరు చిరు నగవులు చిందే తండ్రి” అనే మధురమైన పాటను అద్భుతంగా పాడారు.
1937లో రుక్మిణీ కల్యాణము లో నటించచారు . 1937, జూలై 5న విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమాఇది. విభూతి దాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కె. రఘురామయ్య, జె.వి. రెడ్డి, నిడుముక్కల సుబ్బారావు, ఎ. వి. సుబ్బారావు, శాంతకుమారి, రమాదేవి తదితరులు నటించగా,
పి.మునుస్వామి సంగీతం అందించాడు.
శాంతకుమారికి మెదటి సాంఘిక చిత్రం ధర్మపత్ని.
ఈ సినిమా 1941లో విడుదలైంది. సుప్రసిద్ధ మరాఠీ రచయిత విష్ణు సఖారాం ఖండేర్కర్ రాసిన ఓ కథ ఆధారంగా ఈ చిత్రం రూపొందింది.మరాఠీలో మొదటి జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత ఈయనే.
పి.పుల్లయ్య దర్శకత్వంలో ఫేమస్‌ ఫిలింస్‌ పతాకాన ఈ’ చిత్రాన్ని షిరాజ్‌ ఆలీ హకీం నిర్మించాడు. శాంతకుమారి ఈ చిత్రంలో హీరోయిన్‌.
కొల్హాపూర్‌లోని శాలిని సినీటోన్ స్టూడియోలో చిత్రీకరణ జరిపారు. ఇందులో పనిచేసిన టెక్నిషియన్లంతా మరాఠీ వారే. మ్యూజిక్ అన్నాసాహెబ్ మైన్ కర్. అప్పటి ప్రఖ్యాత రంగస్థల నటుడు ఉప్పులూరి సంజీవరావు కుమారుడు హనుమంతరావు హీరోగా పరిచయమయ్యారు. ఈచిత్రానికి మాటలను విశ్వనాథ సత్యనారాయణ చేత రాయించాలనుకున్నారు. అయితే, మరీ గ్రాంధికమవుతుందేమో నని ఆలూరి వెంకటసుబ్బారావు చేత రాయించారు. ఆయనే చక్రపాణి. ఈచిత్రం విడుదల తర్వాత ఆమెకు కూతురుపుట్టారు. పాపకి హీరోయిన్ పేరు రాధ అని పేరుపెట్టారు.

అక్కినేని నాగేశ్వరరావు నటించిన తొలి సినిమా ఇదే. ఓ చిన్న పాత్రలో బాల నటుడిగా విద్యార్థి పాత్రలో అక్కినేని నాగేశ్వరరావు నటించారు. అపుడు ఆయన వయసు కేవలం 15 సంవత్సరాలు. అన్న రామబ్రహ్మం నాగేశ్వరరావు ఈ చిత్రంలో హీరోకావాలని ఆశించి కోల్లాపూర్ కు తీసుకు వెళ్లారు. మరీ చిన్న వయసు కావడంతో అది సాధ్యపడలేదు. అపుడు పుల్లయ్య ‘ఆనందమాయెగా, మన మోహనుడు పెళ్లి కొడుకాయెగా, మనరాధమ్మ పెళ్లికూతురాయెగా’ అనే పాట సీక్వెన్స్ లో కనిపించిన పది మంది విద్యార్థుల్లో ఒకరిగా కనిపించే అవకాశాన్ని పుల్లయ్య కల్పించారు. అయితే, అదే పుల్లయ్య నాగేశ్వరరావును అర్థాంగి (1955) చిత్రంలో హీరోని చేశారు.

అక్కినేనికి శాంతకుమారికీ మధ్య ఎంతో ఆత్మీయమైన అనుబంధం ఉండేది. అక్కినేనిని ఆమె అప్యాయంగా తమ్ముడిని పిలచినట్లు అబ్బి అనే వారు.
మాయలోకం సినిమాలో అక్కినేని ప్రక్కన హీరోయిన్ గా శాంతకుమారి నటించారు. ఇది అక్కినేని నాగేశ్వరరావు నటించిన రెండవ చిత్రం.మాయలోకం సినిమా కు గూడవల్లి రామబ్రహ్మం దర్శకత్వం వహించారు. కాంభోజరాజు కథ ఆధారంగా నిర్మించిన 1945 నాటి తెలుగు జానపద చలన చిత్రం. త్రిపురనేని గోపీచంద్ సంభాషణలు రాయగా, గాలిపెంచల నరసింహారావు సంగీతాన్ని సమకూర్చారు.
ఈ సినిమాలో శాంతకుమారి “మోహనాంగ రార నవ మోహనాంగ రారా “- పాట,.మరియు “ఎవరోయీ నీవెవరోయీ ఈ మాట తెలిపి పోవోయి “- ఈ రెండు పాటలు పాడారు. అపుడు టాప్ హీరోయిన్ అయిన శాంతకుమారితో నటించేందుకు నాగేశ్వరరావు సిగ్గుపడేవారట. ఆయనకు ప్రేమ పాఠాలు తానే చెప్పానని ఒక సారి ఆమెయే రాశారు.
“మాయలోకం లో నాగేశ్వర్రావుతో నాయికగా వేశాను. అప్పటికినేనే సీనియర్ ను. షావు కారు చిత్రంలో ఎన్టీయార్ తో నటించాల్సింది. కాని ఆయన పీలగా ఉండేవారు. నేను కాస్త పుష్టి. దాన్తో కుదర్లేదు. నాపక్కన నటించడానికి నాగేశ్వర్రావు భయపడేవాడు. అతనిని నేనే ప్రేమ పాఠాలు చెప్పేదాన్ని…’ అని ఆమె జ్యోతిచిత్ర లో ‘అయిదు దశాబ్దాల తెలుగు చిత్ర చరిత్ర’ మీద రాస్తూ చెప్పారు. Source:
నాగేశ్వరరావు నటించిన జయభేరి సినిమాలో వదినగా నటించారు, అర్థాంగి సినిమాలో సవతి తల్లిగా నటించారు.
ఎన్.టీ.ఆర్ కు తల్లా పెళ్ళామా సినిమాలో బామ్మగా నటించారు. తెలుగు సినీ పరిశ్రమలో అగ్రతారలైన ఎన్‌.టి. రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, తమిళ సినీ ప్రముఖులు శివాజీ గణేశన్, జెమినీ గణేశన్ తదితరులకు చాలా చిత్రాల్లో శాంతకుమారి తల్లిగా నటించారు.
పద్మశ్రీ పిక్చర్స్‌, రాగిణి పిక్చర్స్‌ పేరుతో సొంతంగా ఇరవైకి పైగా సినిమాలను నిర్మించారు. తాను హీరోయిన్‌గా ప్రధాన పాత్రల్లో నటించిన సినిమాలే మళ్లీ తీసినపుడు తల్లి పాత్రల్లో నటించిన అరుదైన రికార్డు శాంతకుమారి సొంతం.
సుమారు 30 సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. మాయబజార్, సారంగధరలలో ఆమె పాటిన పాటలు దొరకడం లేదు. అయితే, కృష్ణ ప్రేమ పాటలు సూపర్ హిట్ అయ్యాయి.
శ్రీ వెంకటేశ్వర మహాత్యం చిత్రంలో ఆమె గొప్పగా పాడిన, ఈ చిత్రం తమిళ డబ్బింగులో పాడింది పి లీల.అయితే ఇదే చిత్రాన్ని హిందీలో డబ్బు చేసినపు హిందీ పాటలు చక్కగా పాడి ఆందరినీ ఆశ్చర్యం పరిచారు
మాయాబజార్ లేదా శశిరేఖాపరిణయం,సారంగధర
రుక్మిణీ కల్యాణం , భక్తజయదేవ,
శ్రీ వేంకటేశ్వరమహత్యం,
ధర్మపత్ని,పార్వతీ కల్యాణం,
కృష్ణప్రేమ,మాయాలోకం,
గుణసుందరి కథ, షావుకారు,
ధర్మదేవత,అర్ధాంగి,
సారంగధర,జయభేరి
శ్రీ వెంకటేశ్వర మహత్యం,
సిరిసంపదలు,ప్రేమించి చూడు,ప్రాణమిత్రులు,
బంగారు పిచ్చుక,ప్రేమనగర్,
కొడుకు కోడలు,సోగ్గాడు ఇలా వందకు పైగా సినిమా ల్లో నటించారు.
1975లో ‘సోగ్గాడు’ విడుదలైంది . పల్లెటూరు నేపథ్యంలో శోభన్ బాబు హీరోగా వచ్చిన ఈ సినిమా శోభన్ బాబును “సోగ్గాడు శోభన్ బాబు” అని ఈ సినిమా తరువాత పిలువ సాగారు. ఈ సినిమా లో శాంతకుమారి శోభన్ బాబు అత్త పాత్రలో జయచిత్ర తల్లిగా నటించింది.
సినిమాలలో నటించడం మానేసిన తరువాత ఆమె మంగళంపల్లి బాలమురళీకృష్ణ పాడే పాటలను వ్రాసి, స్వరపరిచే వారు.
1999వ సంవత్సరానికి గాను ఆమె ‘రఘుపతి వెంకయ్య అవార్డు’ను అందుకున్నారు. ఎన్‌టిఆర్‌ జయంతి సందర్భంగా సినీకళాకారులకు ఇచ్చే ‘కళా నీరాజన’ పురస్కారాన్ని కూడా ఆమె అందుకున్నారు.
దీర్ఘకాలికంగా అస్వస్థత కు గురైన శాంతకుమారి 2006 జనవరి17 న చెన్నై లోని స్వగృహంలో మరణించింది.

‘అమ్మ’ పాత్రల్లో మేటిగా న

నటించి మెప్పించడమే కాదు, నిజజీవితంలోనూ ఎందరి చేతనో ‘అమ్మా’ అని పిలిపించుకున్న మహానటి పి.శాంతకుమారి. ప్రముఖ తెలుగు దర్శకులు పి.పుల్లయ్య సతీమణి శాంతకుమారి. పుల్లయ్యను ‘డాడీ’ అని, శాంతకుమారిని ‘మమ్మీ’ అంటూ పలువురు నటీనటులు, నిర్మాతలు, సాంకేతికనిపుణులు అభిమానంగా పిలిచేవారు. ఆ దంపతులు సైతం ఎంతోమందిని తమ కన్నబిడ్డల్లాగే చూసుకొనేవారు. చిత్రసీమలో ఆదర్శప్రాయమైన జంటల్లో పుల్లయ్య, శాంతకుమారి ముందు వరుసలో ఉంటారు. ఈ దంపతులిద్దరికీ తెలుగుచిత్రసీమలో ప్రతిష్ఠాత్మకమైన ‘రఘుపతి వెంకయ్య అవార్డు’ లభించడం విశేషం!

శాంతకుమారి అయిన సుబ్బమ్మ!
శాంతకుమారి అసలు పేరు వెల్లాల సుబ్బమ్మ. 1920 మే 17న కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణంలో వెల్లాల శ్రీనివాసరావు, పెద్ద నరసమ్మ దంపతులకు ఆమె జన్మించారు. శ్రీనివాసరావుకు లలితకళలంటే ఎంతో అభిమానం. దాంతో కూతురు సుబ్బమ్మకు పిన్నవయసులోనే శాస్త్రీయ సంగీతంలో శిక్షణ ఇప్పించారు. ఆల్ ఇండియా రేడియోలో గాయనిగానూ పనిచేశారామె. సుబ్బమ్మ గానం, అభినయం నచ్చి 1936లో తెరకెక్కిన ‘శశిరేఖా పరిణయం అను మాయాబజార్’లో శశిరేఖగా ఆమెను ఎంచుకున్నారు. చిత్రసీమలో సుబ్బమ్మ కాస్తా శాంతకుమారిగా మారిపోయారు. తరువాతి సంవత్సరంలోనే పి.పుల్లయ్య దర్శకత్వంలో రూపొందిన ‘సారంగధర’లో చిత్రాంగిగా తన పాటతోనూ, నటనతోనూ మురిపించారు. ఈ సినిమా పూర్తికాగానే తన 17వ యేట ఆ చిత్ర దర్శకుడు పి.పుల్లయ్యను వివాహమాడారు శాంతకుమారి. 1939లో తన భర్త తెరకెక్కించిన ‘బాలాజీ’ చిత్రంలో పద్మావతిగా నటించి మెప్పించారు. ఆ సినిమా కథనే తరువాత 1960లో ‘శ్రీవేంకటేశ్వర మహాత్మ్యం’గా రూపొందించారు పుల్లయ్య. ఇందులో యన్టీఆర్ శ్రీనివాసునిగా నటించగా, వకుళ మాతగా శాంతకుమారి అభినయించారు. ఈ చిత్రమే యన్టీఆర్ ను తెరవేలుపుగా నిలిపింది. థియేటర్లను దేవాలయాలుగా మార్చింది.

అందరికీ ‘అమ్మ’నే!
తన భర్త దర్శకత్వం వహించిన పలు చిత్రాలలో శాంతకుమారి నాయికగానూ, కీలక పాత్రల్లోనూ నటించారు. 1947లో పుల్లయ్య, శాంతకుమారి దంపతులు రాగిణి పిక్చర్స్ అనే సంస్థను స్థాపించి, పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించారు. తరువాత ‘పద్మశ్రీ పిక్చర్స్’ పతాకంపైనా అనేక సినిమాలను నిర్మించి, తెలుగువారిని ఆకట్టుకున్నారు. ఈ చిత్రాలన్నిటా శాంతకుమారి తనకు తగ్గ పాత్రలు ధరించి మెప్పించారు. తనకంటే వయసులో చిన్నవారయిన ఏయన్నార్, గుమ్మడి వంటి వారికి జోడీగానూ నటించారు శాంతకుమారి. తరువాతి రోజుల్లో యన్టీఆర్, ఏయన్నార్, జగ్గయ్య, శివాజీగణేశన్, జెమినీ గణేశన్ వంటి మేటి నటులకు తల్లిగా నటించి మెప్పించారు. తెలుగులోనే కాదు తమిళ చిత్రాలలోనూ శాంతకుమారి మేటి నటిగా సాగారు. చిత్రసీమలో అడుగుపెట్టే నిర్మాతలు ఎందరో పుల్లయ్య, శాంతకుమారి దంపతుల ఆశీస్సులు తీసుకొనేవారు. అలాంటి వారిలో డి.రామానాయుడు ఒకరని చెప్పవచ్చు. ఆయన తొలి చిత్రం ‘రాముడు-భీముడు’ (1964)లో యన్టీఆర్ కు అక్కగా నటించారు శాంతకుమారి. ఆ సినిమాతో నిర్మాతగా పరిచయమైన రామానాయుడు, ‘ప్రేమనగర్’ (1971)తో చిత్రసీమలో నిలదొక్కుకున్నారు. ‘ప్రేమనగర్’లో ఏయన్నార్ కు తల్లిగా నటించారామె. అలా రామానాయుడును నిర్మాతగా నిలిపిన రెండు చిత్రాలలోనూ శాంతకుమారి కీలక పాత్రలు పోషించారు. నాయుడు సైతం ఆమెను ‘అమ్మ’గానే ఎంతో గౌరవించేవారు.

నటిగా…గాయనిగా…
తన దరికి చేరిన పాత్రలకు న్యాయం చేయడంలో శాంతకుమారి ఎప్పుడూ ముందుండేవారు. నటిగానే కాకుండా గాయనిగానూ సుప్రసిద్ధులైన శాంతకుమారి చేతనే తరువాతి రోజుల్లోనూ కొందరు అదే పనిగా పాటలు పాడించారు. యన్టీఆర్ దర్శకత్వంలో రూపొందిన ‘తల్లా-పెళ్ళామా’లో హీరోకు తల్లిగా నటించిన శాంతకుమారి, అందులో “మమతలెరిగిన నా తండ్రీ… మనసు తెలిసిన ఓ నాన్నా…” అనే పాటను పాడి ఎంతగానో ఆకట్టుకున్నారు. ఈ పాటలో నందమూరి హరికృష్ణ ఆమె మనవడిగా నటించడం విశేషం. 1979 వరకు శాంతకుమారి నటిగా కొనసాగారు. 1981లో పి.పుల్లయ్యను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రఘుపతి వెంకయ్య అవార్డుతో గౌరవించింది. 1999లో శాంతకుమారికి రఘుపతి వెంకయ్య అవార్డు లభించింది. 2006 జనవరి 16న శాంతకుమారి కన్నుమూశారు. తెలుగునాట ‘అమ్మ’ పాత్రల్లో శాంతకుమారి అభినయం నభూతో నభవిష్యత్ అని చెప్పవచ్చు.

పుల్లయ్య గారి జయభేరి చిత్రం ఆల్ టైం క్లాసిక్ .అర్ధాంగి సాంఘిక చిత్రరాజమే .వెంకటేశ్వర మహాత్మ్యం సూపర్ డూపర్ క్లాసికల్చిత్రం

చిత్రం .ఇవి ఆదంపతులు సాధించిన విజయానికి ఆణిముత్యాల వంటి తీపి గుర్తులు .

సశేషం

మీ గబ్బిట దుర్గాప్రసాద్ 10-2-22-ఉయ్యూరు

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in సినిమా and tagged . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.