శతాధిక బెంగాలీ గ్రంథ కర్త –బుద్ధ దేవ బోస్ -2
బుద్ధ దేవ్ గురుత్వమే చాలామందికి మార్గదర్శకమైంది .’’కవితా భవన్ ‘’సంస్థ స్థాపించి వివిధ ధోరణులకవులను ,రచయితలు కేంద్రీకరించాడు .నవతరం రచయితలకు ఆసరాగా ఉన్నాడు .’’ఏక్ పైసా ఏక్తీ’’అంటే పైసాకి ఒక ప్రతి అనేధారావాహిక ప్రారంభించాడు.చివరి రోజుల్లో రుషి గా ఆశ్రమవాసం కల్పించుకొన్నాడు .పరిపక్వత పెరిగిన కొద్దీ భాష ప్రౌఢ తరమైంది .సంక్షిప్తత పెరిగింది .జీవించి ఉండగానే విశేష కీర్తి ప్రతిష్టలు పొందాడు .రోజురోజుకూ ఆయన గౌరవం పెరుగుతూనే ఉంది .సాహిత్య నిర్మాతలలో ఒకడయ్యాడు .
‘’నా కళకు ఇతి వృత్తం మానవ జీవన మృత్తిక ‘’అన్న ఆడెన్ మాటలు బుద్ధ దేవ్ కు నచ్చాయి .ఒక విశిష్ట వ్యక్తిత్వ రూపమే మనిషి అన్నాడు .నిత్య నైమిత్తిక బాధలు ,నిత్యం మృత్యువాత పడుతున్న మానవుడు (UNAMUNO) అనే ఈభావం టాగూర్ భావానికిచాలా దూరం .మానవుని దైవత్వం గురించి టాగూర్ చెప్పింది చాలామందికి అర్ధం కాలేదు .దుర్గామాత ఆరాధన విషయం లో ఇతని వ్యాఖ్యానం విలక్షణం విశేషమైనది .వంగ భూమికేచెందిన ఓఅక అద్వితీయ సంప్రదాయంగా భావించాడు .అమ్మ విగ్రహాన్ని పచ్చిమట్టి తో నిర్మిస్తారు .ఇది జీవిత అశాశ్వతత్వానికి ,అనివార్య మృత్యు శక్తికి సంకేతంగా భావించాడు .
1930లో బంధితుని ఆక్రోశం – ‘’బందీర్ బందనా ‘’రాసి ప్రచురించాడు .ఇది ఆయన ఉత్తమకావ్యాలలో ఉత్తమ శ్రేణికి చెందింది .దీనిలో ఆయన తిరుగుబాటు తత్త్వం కనిపిస్తుంది .సాహసోపేత రొమాంటిక్ ప్రయోగావాదిగా కనిపిస్తాడు .దేహం ,ఆత్మల సమ్యగ్ స్వరూపమే జీవితం అనే తత్త్వం ప్రదర్శించాడు .ప్రకృతిలో దర్శనీయ సౌందర్యాలకు రసమయ ప్రతిక్రియ ఇది .ఒక ఇంద్రియాను భూతిని వేరొక ఇంద్రియానుభవంగా అందించే ‘’సైనే స్ధటిక్’’ ఉపమాలంకారాలు ఇందులో కోకొల్లలు .మన్మధ యజ్ఞానికి కాక వంగ జాతి ఒక విశిష్ట సామూహిక ఆరాధనా క్రతువులో బందీ అయ్యాడు కవి .స్వర్గం నుంచి బహిష్కృతుడైన ప్రవాసి ఆక్రందన వినిపిస్తాడు .విషాద భరిత జీవిత నాటకం లో కవి ఏకాకి పాత్రలో లోగొంతులో ఆర్తనాదం వినిపిస్తున్నాడా అని పిస్తుంది –‘’ ఆ బీజాక్షర లిపిని గ్రహించ గలిగే సరికి –ఆశ్చర్య ముగ్ధు డనైపోయాను-యవ్వనమా నువ్వు తు౦టరివి కాదు మెకానివికాదు-కనీసం చిన్నపురుగైనా కావు –నీవొక దేవతవు –స్వర్గలోక బహిష్క్రుతవు-నేనే ఆ దేవతను స్వర్గలోక బహిష్క్రుతుడను –కనుక నీ కనులు –పంజర బంధిత పక్షుల జంట –దైహికబంధాల –బాధలపాఠశాల-తెంచి విముక్తి పొందాలని తహతహ ‘’ శాప భ్రష్ట కావ్యం లొని ఈ పంక్తులు అనుభూతమయే ఒకానోకవాయు సంచారానికి అర్ధం -అతిక్రమణమే –trans gression మేకానీ ఊహాలోక ఉత్క్రమణం –trans cendendence కాదు.ఈ విహార యాత్ర ముగించి భౌతిక జీవన ఆవరణ లోకి అడుగుపెట్టాలి .కొత్త చంద్రుడికి పూర్ణ చంద్రుడితో పెళ్లి కావాలి .ఇదే ఫలితార్ధం.కవే పురోహితుడు ..కావ్య సందర్భంగా అతడే వరుడౌతాడు . దురదృష్టం అతడిని వెంటాడుతుంది .తప్పించుకొని ముందుకు పోతున్నాడు ఈనూతన చంద్రుడు .ఇతన్ని తప్పించుకోని గమ్యం దూరమౌతోంది .దోబూచులాడే ప్రేయసితో అతడు సాహసిక యాత్రికుడు .చేరుకోవటమే ఫలశ్రుతి .కామ ప్రకోపాలతో భ్రమలు గొలిపే యవ్వన రాజధాని అది .ప్రేయసి సర్వలక్షణాలు అతనికి పూర్వానుభవాలే .తన ప్రశస్త జ్ఞానం తో కవి ఒక ఐన్ద్రిక మంత్ర నగరి నిర్మించుకొన్నాడు .అతని కవిత్వం లో క్లినికల్ టచ్ ఉంటుంది .పయార్ చందస్సుల బంధాలనుంచి బుద్ద దేవ్ విడుదలపొందాడు .సందర్భ శుద్ధి పాటించాడు .’’నేనుకవిని –నేనే పాట కూర్చాను –మెరుపు వెలుగుల కవచం తో –ఇదే నా ప్రజ్ఞా విశేషం –నీ వందించే దానికి నా శ్రమశక్తితో మెరుగులు తీర్చాను –ఇదే నా బుద్ధి విశేషం ‘’అంటాడు .బందీర్ బందనా ఆధునిక భాషా శైలితో రాశాడు .టాగూర్ ఆధునికతను మరింత మెరుగు పరచాడు ఈ కవి ఆయన నాదాన్ని ఉదాత్తనుదాత్త స్వరిత౦ గా మార్చి ప్రయోగించాడు బుద్ధదేవ్ .
దీని తర్వాత 1933లో రాసిన ‘’పృధ్వీర్ పధే’’-భూమికిఅభిముఖంగా –కవితా సంపుటిలో పరిపూర్ణ తాత్విక అవగాహన పెంచుకొన్నాడు బుద్ధదేవ్.సందేహం లేని వాక్శుద్ధి ప్రదర్శించాడు .తన అనుభూతులనే కవితామయం చేశాడు .1937లో రాసిన ‘’కనకావతి ‘’కావ్యం లో సౌందర్య రసవాద సిద్ధి చూపాడు .ఇది సాధనా అభ్యాసాలతో సాధించినదే .టాగూర్ శ్రోత్రిక భావం నుంచి విముక్తి పొందింది .విపరీత విమర్శకు గురయ్యాడు మనకవి .ఇందులో భావతీవ్రత అసామాన్యమైనది .రొమాంటిక్ భావం మొదట్నించీ ఉండనే ఉంది .కోనో మేయర్ ప్రతి –అమ్మాయి కోసం వంటికవితల్లో ఈ లక్షణం బాగా కనిపిస్తుంది .’’ఎందుకో తెలీకుండా నేను మరణించాల్సిందే –ఈ పాణి పల్లవం ఎవరికీ చెందిందో అలాంటి నేనే ‘’.వేదనామయ అనుభూతి పారిపోకుండా ఇందులో స్థిరంగా నిలిచి ఉంది .’’తత్కాలీన మహోద్రేక స్థితి లో కవితలు ఉప్పొంగి వచ్చాయి .నా సర్వెంద్రియాను భావాలను ఉద్రేకతల్ని రసావేశాలను రంగరించి రాసినకవితలివి .శేషేర్ రాత్రి రాశాక నాలో భావుక శక్తి మరింతస్వేచ్చ పొందింది ‘’అన్నాడు బోస్.ఇంతకీ భావుకస్వేచ్చ అంటే ఏమిటో తెలుసుకోవటానికి 1940లో రాసిన ‘’పూవులు ‘’చెబుతుంది .పూలు వ్రేళ్ళు ముఖ్యంకాదు .పత్ర సౌందర్యమే సృజన శక్తికి ప్రతీకాత్మకమైంది ‘’అన్నాడు .అవి ‘’ఆవుల్లో నియన్ డయోసిషన్ శక్తులు కావచ్చు –‘’దైవం జీవనోత్సవాల ప్రతినిధి –వసంతారామ పవమానం –పరవశిస్తాడు ఒక ముద్దుకు ‘’.ఇందులోని కవితలన్నీ జంత్ర వాద్య సమ్మేళన స్వరభరితాలు .గుణాత్మకత సంపూర్ణత్వం పొందుతుంది .విలియం ఏట్స్ కవి అభి వ్యక్తి కన్పిస్తుంది .
సశేషం
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -10-2-22-ఉయ్యూరు .