మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు -64

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు -64

64-నవ్వుల పువ్వులే కాదు నవ నీత హృదయాన్ని కూడా పంచిన తొలి హాస్య పద్మశ్రీ –రేలంగి -1

రేలంగిగా పేరుగాంచిన రేలంగి వెంకట్రామయ్య (ఆగష్టు 9, 1910 – నవంబరు 27, 1975)[2] పద్మశ్రీ అవార్డు పొందిన మొదటి హాస్యనటుడు.[3] తూర్పు గోదావరి జిల్లా, రావులపాలెం సమీపంలోని రావులపాడు అనే గ్రామంలో రామదాసు(రామస్వామి), అచ్చయ్యమ్మ దంపతులకు జన్మించారు. తండ్రి హరికథ, సంగీతం నేర్పించేవాడు. చిన్నతనంలో తండ్రి దగ్గర ఈ విద్యలు నేర్చుకున్నారు. బాల్యమంతా ఎక్కువ భాగం రావులపాడు, కాకినాడల్లో గడిచింది. చదువుకునే వయసునుంచే నాటకాలు వేయడం ప్రారంభించారు 1935లో కృష్ణ తులాభారం చిత్రం ద్వారా 1935లోనే దర్శకుడు సి.పుల్లయ్య రేలంగిని సినీ పరిశ్రమకు పరిచయం చేశారూ.[4] కానీ, 1948 దాకా చెప్పుకోదగ్గ గుర్తింపు రాలేదు. ఈ సమయంలో పుల్లయ్య దగ్గర సినీ నిర్మాణానికి సంబంధించి పలు శాఖల్లో పని చేసారు. 1948లో వచ్చిన వింధ్యరాణి సినిమాతో ఆయన కెరీర్ విజయాల బాట పట్టింది. తర్వాత వచ్చిన కీలుగుర్రం, గుణసుందరి కథ, పాతాళ భైరవి, పెద్ద మనుషులు, మాయాబజార్, మిస్సమ్మ లాంటి విజయవంతమైన చిత్రాల్లో నటించడంతో ఆయన దాదాపు నాలుగు దశాబ్దాల పాటు 300కి పైగా చిత్రాల్లో నటించారు. నటుడిగా తారాస్థాయినందుకున్న రేలంగి పలు సన్మానాలు, బిరుదులు, పురస్కారాలు అందుకున్నాడు. 1970లో భారత ప్రభుత్వం ఆయనకు పద్మశ్రీ పురస్కారం ప్రదానం చేసింది. తాడేపల్లి గూడెంలో రేలంగి చిత్రమందిర్ పేరుతో ఒక థియేటర్ కూడా నిర్మించాడు. రేలంగి చిట్టచివరి చిత్రం 1975లో వచ్చిన పూజ.[3] చివరి దశలో తీవ్ర అనారోగ్యంతో బాధ పడ్డ రేలంగి 1975 లో తాడేపల్లి గూడెంలో మరణించారు.

బాల్యం, విద్యాభ్యాసం
రేలంగి వెంకట్రామయ్య తూర్పు గోదావరి జిల్లా, కాకినాడ సమీపంలోని రావులపాడులో 1910, ఆగష్టు 9వ తేదీన జన్మించాడు.[5] గవర కులానికి చెందిన రేలంగి పూర్వీకులు అబ్కారీ వ్యాపారం చేసేవారు.[3] కానీ రేలంగి తండ్రికి మాత్రం వారసత్వంగా వచ్చిన ఆస్తి ఏమీ పెద్దగా లేదు. రేలంగి తండ్రి అసలు పేరు రామస్వామి. ఒక పాఠశాలలో సంగీతం మాస్టారుగా పనిచేస్తూ హరికథలు, సంగీతం నేర్పించేవాడు.[6] అందుకని ఈయన్ను దాసు అనీ, తర్వాత రామదాసు అని పిలవడం ప్రారంభించారు. తల్లి అచ్చయ్యమ్మ. వీరికి వెంకట్రామయ్య ఒక్కడే సంతానం. ఈమె రేలంగి మూడు సంవత్సరాల వయసులోనే మరణించింది. రామస్వామి భార్య చెల్లెలైన గౌరమ్మను వివాహం చేసుకున్నాడు.

రేలంగి చిన్నతనం నుండి తన తండ్రి దగ్గర సంగీతం, హరికథలు నేర్చుకుంటూ పాటలు, పద్యాలు పాడడంలో మంచి పేరు తెచ్చుకున్నారు. కాకినాడలోని మెక్లారిన్ పాఠశాలలో చదువుకున్నాడు. రేలంగి రూపం చూసి తండ్రి అతన్ని పోలీసును చేయాలని ఆశపడ్డాడు. ఏమీ తెలియని వయసులో రేలంగి అందుకు సంబరపడినా నెమ్మదిగా అతని దృష్టి నాటకరంగం వైపు మళ్ళింది. దాంతో చదువు సజావుగా సాగలేదు. రామదాసు ఆర్థిక పరిస్థితి కుమారుడిని పై చదువులు చదివించే స్థోమత లేకపోయినా ఎం. ఎన్. ఎస్. ఛారిటీస్ సహాయంతో చదివించాలనుకున్నాడు. కానీ వాళ్ళు మార్కులు బాగా రావాలని షరతు విధించారు. కానీ రేలంగి మాత్రం చదువు కన్నా నాటకాల మీదనే ఎక్కువ ఆసక్తి కనబరచసాగాడు. తండ్రి కూడా తన కొడుకు బాగా చదువుకుని ఉద్యోగం చేసుకుని ప్రశాంతంగా జీవించాలని ఆశించినా కొడుకుకు నటనపై ఉన్న ఆసక్తిని చూసి ఏమీ అనలేక తటస్థంగా ఉండిపోయాడు. దాంతో ఆయన చదువు నాలుగో ఫారం (ప్రస్తుత ప్రమాణాల ప్రకారం తొమ్మిదో తరగతి) లో ఆగిపోయింది.[2]

నాటక రంగం
ఒకసారి రామదాసు కొడుకుని ఎస్వీ రంగారావు, అంజలీదేవి మొదలయిన వారు సభ్యులుగా ఉన్న యంగ్‌మెన్ హ్యాపీ క్లబ్ వేస్తున్న రఘుదేవ రాజీయం అనే నాటకానికి తీసుకుని వెళ్ళాడు. అది రేలంగికి బాగా నచ్చింది. తాను కూడా నాటకాల్లో నటించాలనే కోరిక పుట్టింది. కానీ తండ్రికి చెబితే కాదంటాడేమోనని ఆయనకు తెలియకుండా నాటకాల్లో పాల్గొనడం మొదలుపెట్టాడు. యంగ్‌మెన్ హ్యాపీ క్లబ్ లో చేరి 1919లో తన పదవ ఏట బృహన్నల అనే నాటకంలో స్త్రీ పాత్రలో మొదటిసారి నటించారు. ఈ విషయం తండ్రికి తెలిసి తీవ్రంగా మందలించాడు కానీ రేలంగిని మాత్రం నటనకు దూరం చేయలేకపోయాడు. తర్వాత కూడా అనేక నాటకాల్లో ఆడ పాత్రలు ధరించాడు. అప్పట్లో ఆడ వేషాలకు నటులు అంతగా ముందుకు వచ్చేవారు కాకపోవడంతో ఈయనకు విరివిగా అవకాశాలు వచ్చాయి.

ఆంధ్ర బాల గాన సంఘం, ఆంధ్ర సేవా సంఘం వారు ఈయనకు ప్రమీలార్జునీయం, రామదాసు, రోషనార, మోహినీ భస్మాసుర, చింతామణి మొదలైన నాటకాల్లో ఈయనకు పాత్రలు ఇచ్చి ప్రోత్సహించారు. ప్రమీలార్జునీయంలో సుయోగుడు, చింతామణి నాటకంలో సుబ్బిశెట్టి, చింతామణి తల్లి శ్రీహరి పాత్రలు, విప్రనారాయణ లో శ్రీనివాసుడు, శ్రీకృష్ణ తులాభారంలో వసంతకుడు, మిస్ ప్రేమ ఎం. ఎ అనే సాంఘిక నాటకంలో విషాదరావు అనే విలన్ పాత్ర లాంటి విభిన్నమైన పాత్రలు పోషించి ప్రశంసలు అందుకున్నాడు. దాంతో నటన మీద మంచి పట్టు ఏర్పడింది.

కొంతమంది మిత్రులతో కలిసి నాట్యమిత్ర మండలి అనే పేరుతో ఒక నాటక సంస్థను స్థాపించారు. ఈ సమాజం వాళ్ళ తొలి నాటకం శ్రీరామనవమి పర్వదినాన తెనాలిలో ఏర్పాటు అయింది. ఈ నాటకం రక్తి కట్టింది కానీ నాటకం కోసం ఇంట్లో అమ్మ చీరలు దొంగతనం చేసుకుని వచ్చారు. తిరిగి ఇంటికి వెళ్ళడానికి భయపడి ఎక్కడ నాటకాల్లో అవకాశాలు వస్తే అక్కడ నటిస్తూ ఊరూరా తిరగసాగారు. ఉన్నప్పుడు తిండి, లేనప్పుడు పస్తులు ఇలా గడిచాయి ఆ రోజులు. అదే సమయంలో పారుపల్లి సుబ్బారావు, జొన్నవిత్తుల శేషగిరిరావు ఈయనకు తమ నాటక కంపెనీలో ఆశ్రయం కల్పించారు. ఈ కంపెనీలో హరిశ్చంద్ర, రంగూన్ రౌడీ మొదలైన నాటకాల్లో వేషాలు వేస్తూ దత్త మండలంలోని (సీడెడ్) జిల్లాలు తిరిగారు.

సినీ రంగ ప్రవేశం
రేలంగికి బాగా జ్ఞానం వచ్చేనాటికి థియేటర్లలో మూకీ చిత్రాలు ఆడుతుండేవి. అప్పటి దాకా నాటకరంగంలోనే అనుభవం ఉన్న రేలంగికి మనుషులు తెరమీద కనిపించడం ఆసక్తి కలిగించింది. 1931లో విడుదలయిన భక్త ప్రహ్లాద చిత్రం చూశారు. తాను కూడా చలనచిత్రాలలో నటించాలని నిశ్చయించుకుని సినిమాలు ఎక్కడ నిర్మిస్తారో వారి చిరునామా తెలుసుకుని తనకు తెలిసీ తెలియని ఆంగ్ల భాషలో ఉత్తరాలు రాయడం మొదలుపెట్టారు కానీ వాటికేమీ ప్రత్యుత్తరాలు వచ్చేవి కావు. అప్పటికే టాకీ సినిమాల శకం మొదలైంది. రేలంగికి సినిమాల్లో ఎలాగైనా కనిపించాలనే కోరిక దృఢమైంది.

పారుపల్లి సుబ్బారావు ట్రూపులో రేలంగికి పరదేశి అనే తబలా కళాకారుడితో పరిచయం ఏర్పడింది. అప్పటి దాకా ఒక లక్ష్యమంటూ లేకుండా లోకజ్ఞానం లేకుండా ఉన్న రేలంగికి పరదేశి రూపంలో ఒక మార్గనిర్దేశకుడు కనిపించాడు. తల్లిదండ్రులను వదిలి వచ్చేసి తాను తప్పు చేశాడని తెలుసుకుని, తిరిగి ఇంటికి వెళ్ళి తల్లిదండ్రులను క్షమాపణ వేడుకుని, ఇకమీదట బుద్ధిగా వాళ్ళు చెప్పినట్టే నడుచుకుంటానని చెప్పారు. వాళ్ళు పెళ్ళి చేస్తే అతని జీవితం గాడిలో పడుతుందని తాడేపల్లిగూడెం పక్కనే ఉన్న పెంటపాడుకు చెందిన బుచ్చియ్యమ్మనిచ్చి వివాహం జరిపించారు. ఆయన బావమరుదులు వ్యాపారంలో బాగా సంపాదించారు. అప్పటికి రేలంగి జీవితంలో స్థిరపడకపోయినా ఒక కళాకారుడిగా అతన్ని గౌరవించారు బావమరుదులు. భార్య తరపున ఎంత సంపద ఉన్నా స్వంతకాళ్ళ మీద నిలబడి ఆమెను బాగా చూసుకోవాలనుకున్నారు. మళ్ళీ నాటకాలు వేయడం మొదలుపెట్టాడు. వచ్చిన కొద్దో గొప్పో డబ్బును భార్య చేతిలో పెట్టేవారు. ఆమె కూడా నటీనటుల జీవితాలు ఎలా ఉంటాయో ఎరిగుండటం చేత సర్దుకుని పోగలిగింది.

మొదటి అవకాశం
కొద్ది రోజులకు నాటకాల్లో అవకాశాలు కూడా సన్నగిల్లాయి. రేలంగికి మాత్రం నటనపై మోజు అంతకంతకు పెరుగుతూనే ఉంది. కొద్ది రోజులకి పరదేశికి కలకత్తాలో సి. పుల్లయ్య దర్శకత్వంలో రూపొందుతున్న లవకుశ సినిమాలో అవకాశం వచ్చింది. పరదేశితో పాటు తాను కూడా కలకత్తా వస్తానన్నాడు. కానీ ఆయన మాత్రం తాను అక్కడ కుదురుకున్న తర్వాత అతని కోసం అవకాశాలు వెతుకుతాననీ మాట ఇచ్చాడు. కానీ రేలంగి మనసంతా కలకత్తా మీదనే ఉంది. అప్పుడు కలకత్తాలో ఐ. రాజారావు అనే వ్యక్తి శ్రీకృష్ణ తులాభారం సినిమాగా తీయడానికి సన్నాహాలు పూర్తి చేశాడు. ఇందులో వసంతకుడి పాత్ర కోసం అప్పట్లో నాటకాల్లో సున్నిత హాస్యానికి పెట్టింది పేరైన ఘండికోట జోగినాథం ఎంపికై కలకత్తాకు ప్రయాణమవుతున్నాడు. ఆయనతో పాటు హార్మోనిస్టు దూసి శాస్త్రి, దర్శకుడు రాజారావు మొదలైన వారంతా బయలు దేరారు. ఆ సినిమాలో ముందుగా అవకాశమేమీ రాకపోయినా ఏదో ఒక పని చేయవచ్చులే అని రేలంగి కూడా ఇంట్లో వాళ్ళనూ, భార్యను ఒప్పించి వాళ్ళతో పాటు బయలుదేరారు. కలకత్తా వెళ్ళగానే నిర్మాత దగ్గరకు వెళ్ళి ఆ సినిమాలో ఏదో ఒక వేషం ఇవ్వమని అడిగారు. అప్పటికే ప్రధాన పాత్రలు నిర్ణయమైపోవడంతో రేలంగి కొద్ది సేపు మాత్రమే కనిపించే వసుదేవుడు, చాకలివాడు, గొల్లవాడు లాంటి మూడు పాత్రల్లో నటించాడు. ఈ సినిమాకి గాను రేలంగికి నాలుగు నెలలు బస, భోజనం పెట్టి డెబ్భై రూపాయలు పారితోషికం ఇచ్చారు. 1935లో నిర్మించిన ఈ చిత్రం రేలంగికే మొదటి చిత్రం కాదు. జోగినాథానికి, కాంచనమాలకీ, ఋష్యేంద్రమణికీ, కపిలవాయి రామనాథ శాస్త్రికీ, లక్ష్మీరాజ్యానికి మొదటి సినిమానే. కానీ ఈ సినిమా ఆర్థికంగా పరాజయం పొందడం వల్లా, రేలంగి ధరించిన పాత్రలు బొత్తిగా ప్రాధాన్యం లేకపోవడం వల్లా, సరైన గుర్తింపు దొరకలేదు. మరే చిత్రంలోనూ అవకాశం లభించలేదు. దాంతో చేతికందిన డబ్బు తీసుకుని కలకత్తా వదిలి మళ్ళీ కాకినాడకు వచ్చేసి మళ్ళీ నాటకాల్లో వేషాలు వేయడం ప్రారంభించారు.

పుల్లయ్య నీడలో
సి. పుల్లయ్య దగ్గర లవకుశ సినిమాకు పనిచేసిన, రేలంగికి ఆత్మీయుడు అయిన పరదేశికి మళ్ళీ ఆయన దర్శకత్వంలో రూపొందుతున్న అనసూయ ధృవ విజయం అనే సినిమాలో అవకాశం వచ్చింది. ఎలాగైనా పరదేశి ద్వారా పుల్లయ్య దగ్గర అవకాశం సంపాదించాలనుకున్నారు. దాంతో ఆయన రేలంగిని కూడా కలకత్తాకు తీసుకువెళ్ళి పుల్లయ్యకు పరిచయం చేశాడు. దాంతో రేలంగి ఒక్క వేషాలే కాకుండా సహాయకుడిగా, క్యాస్టింగ్ సహాయకుడిగా ఇలా సినిమా నిర్మాణానికి సంబంధించిన అన్ని పనుల్లోనూ పాలుపంచుకున్నాడు. అనసూయ ధృవ విజయంలో రేలంగి ఇంద్రుడి వేషం వేశారు. ఈ సినిమా తర్వాత రేలంగి పుల్లయ్య దగ్గరే పదిహేనేళ్ళ పాటు ప్రొడక్షన్ అసిస్టెంటుగా, సహాయ దర్శకుడిగా, క్యాస్టింగ్ అసిస్టెంటుగా, ప్రొడక్షను మేనేజరుగా గొల్లభామ (1947) చిత్రం వరకు పని చేశాడు. క్యాస్టింగ్ ఏజెంట్ కావడం వల్ల ఎంతోమంది నూతన నటీ నటులు ఈయన ద్వారా చిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యారు. వీరిలో కృష్ణవేణి, పుష్పవల్లి, భానుమతి, అంజలీ దేవి మొదలైన నటీమణులు ఉన్నారు. భానుమతి, అంజలీ దేవి నిర్మాతలుగా మారి సినిమాలు చేసినప్పుడు ఆయనకు కృతజ్ఞతగా మంచి వేషాలిచ్చారు. అదే సమయంలో వర విక్రయం, మాలతీమాధవం, మోహినీ భస్మాసుర, శ్రీ సత్యనారాయణ, బాలనాగమ్మ, గొల్లభామ మొదలైన సినిమాల్లో చిన్న పాత్రలు వేశాడు. వరవిక్రయంలో వీధిగాయకుడి పాత్రలో ఒక పాటను కూడా పాడారు. బాలనాగమ్మ సినిమాలో తలారి రాముడు పాత్రలో నటించాడు. గొల్లభామ సినిమాలో రాజుగారి విదూషకుడిగా నటించారు. బాలనాగమ్మ, గొల్లభామ చిత్రాలతో రేలంగికి కాస్త గుర్తింపు లభించింది.

కష్టాల నుంచి విజయాల వైపుకి
గొల్లభామ (1947) దాకా పుల్లయ్య దగ్గర పనిచేసిన రేలంగి తర్వాత కుటుంబం కోసం మళ్ళీ కాకినాడ వెళ్ళిపోవలసి వచ్చింది. అక్కడే ఉంటే సంసారం ఎలా నెట్టుకురావాలో తెలియక సినిమాల్లోనే తాడో పేడో తేల్చుకుందామని కుటుంబ సమేతంగా మద్రాసు వచ్చేశారు. కానీ అవకాశాలు మాత్రం పెద్దగా వచ్చేవి కావు. దాంతో కుటుంబం గడవడం కష్టంగా ఉండేది. తండ్రి అనారోగ్యం ఒక వైపు. భార్య మెటర్నటీ ఆసుపత్రిలో మరో వైపు. చేతిలో సరిపడా డబ్బులు ఉండేవి కావు. కొంతకాలం గడిచాక 1948లో వింధ్యరాణి అనే చిత్రంలో మంచి హాస్యపాత్ర లభించింది. పింగళి నాగేంద్రరావు రాసిన నాటకం ఆధారంగా వైజయంతీ ఫిలిమ్స్ వారు ఈ చిత్రాన్ని నిర్మించారు. డి. వి. సుబ్బారావు, పుష్పవల్లి నాయక, నాయికలుగా నటిస్తే రేలంగికి జంటగా జి. వరలక్ష్మి నటించింది. ఈ సినిమాకు గాను రేలంగికి మూడు వందల రూపాయల పారితోషికం లభించింది.[2] దీంతో ఆర్థిక కష్టాలు కొద్దిగా తీరాయి.

తర్వాత శోభనాచల ప్రొడక్షన్స్ వారు తీస్తున్న కీలుగుర్రం (1949) అనే సినిమాలో ప్రముఖ నటి కృష్ణవేణి సహకారంతో ఒక చిన్న వేషం సంపాదించగలిగాడు. రేలంగికి జోడీగా కనకం నటించింది. రేలంగి ఈ చిత్రంలో స్వయంగా ఓ పాట కూడా పాడాడు. ఈ సినిమాకు గాను మరో మూడు వందలు లభించాయి. ఈ డబ్బులుతో తన వ్యక్తిగత సమస్యలు తీర్చుకుంటూనే రంగూన్ రౌడీలో తనతో పాటు నటించిన పద్మనాభాన్ని తన సైకిల్ మీద తిప్పుతూ వింధ్యరాణి సినిమాలోనే అవకాశం ఇప్పించారు. కీలుగుర్రం సినిమా శతదినోత్సవం జరుపుకుంది. ఈ చిత్రంలో రేలంగిది చిన్న పాత్రే అయినా ఈ చిత్ర నిర్మాత అయిన మీర్జాపురం రాజా నుండి వెండి కీలుగుర్రాన్ని జ్ఞాపికగా అందుకున్నారు. ఈ రెండు సినిమాలతో రేలంగ్ కెరీర్ విజయపథం వైపు మళ్ళింది.

రేలంగి ప్రతిభను వాడుకున్న వారిలో కె.వి.రెడ్డి ఒకరు. ఆయన గుణసుందరి కథ (1949) సినిమాలో రేలంగికి మంచి పాత్రనిచ్చాడు. ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది. దాంతో ఆయనకు మరిన్ని అవకాశాలు రావడం మొదలుపెట్టాయి. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే ఆయన మనస్తత్వం దర్శక నిర్మాతలకు బాగా నచ్చింది. స్త్రీ సాహసము, పాతాళ భైరవి, పెద్దమనుషులు, షావుకారు, సంసారం, బ్రతుకుతెరువు, పక్కింటి అమ్మాయి మొదలైన చిత్రాలతో ఆయనకు మంచి పేరు ప్రఖ్యాతులు లభించాయి.

విజయాలు
తర్వాత దాదాపు ప్రతి సినిమాలో రేలంగి ఒక ప్రముఖ పాత్రలో కనిపించేవారు. ముఖ్యముగా మిస్సమ్మ, మాయాబజార్, దొంగరాముడు, వెలుగునీడలు, విప్రనారాయణ, నర్తనశాల, అప్పు చేసి పప్పు కూడు మొదలయిన చిత్రాలలో వేసిన పాత్రలు కథానాయకుడితో సరిసమాన పేరు ప్రాముఖ్యతలను తెచ్చిపెట్టాయి.

రేలంగి పోషించిన కొన్ని పాత్రలు:

· నర్తనశాలలో – ఉత్తరకుమారుడు

· మాయాబజార్లో – లక్ష్మణకుమారుడు

· హరిశ్చంద్రలో – నక్షత్రకుడు

· లవకుశలో – రజకుడు

· జయభేరిలో – లచ్చన్న బంగారయ్య

· జగదేకవీరుడులో – రెండు చిడతలు

· సువర్ణ సుందరిలో – కైలాసం

· ప్రేమించి చూడు లో – బుచ్చబ్బాయ్

· వెలుగునీడలులో – వెంగళప్ప

· అప్పుచేసి పప్పుకూడులో – భజగోవిందం

· మిస్సమ్మలో – దేవయ్య

రేలంగి సరసన సూర్యకాంతం, గిరిజ ఎక్కువ నటించారు. రేలంగి నటుడిగా మాత్రమే కాకుండా కొన్ని చిత్రాలలో పాటలు కూడా పాడేవారు. ఆయన పాడిన వినవే బాల నా ప్రేమ గోల, కాణీ ధర్మం సెయ్ బాబూ, సరదా సరదా సిగరెట్టు వంటి పాటలు ఎంతో ప్రాచుర్యం పొందాయి. నిర్మాతగా రేలంగి సామ్రాజ్యం అనే చిత్రాన్ని నిర్మించాడు. ఈ చిత్రం హాస్యనటుడు రాజబాబుకు మొదటి చిత్రం.

కెరీర్ చివరి రోజులు
రేలంగికి పేరు, డబ్బు వచ్చిన తర్వాత తోటి హాస్యనటులకు అవకాశం కల్పించడం కోసం తన చిత్రాలను బాగా తగ్గించుకున్నారు. ఇలా అవకాశం దక్కించుకున్న వారిలో చలం, పద్మనాభం మొదలైన వారున్నారు.[2] అంతే కాకుండా ఉత్తమ హాస్యనటుడికిచ్చే పురస్కారాల పోటీల నుంచి స్వచ్ఛందంగా తప్పుకున్నాడు. వృద్ధాప్యం మీద పడినా, కీళ్ళ నొప్పులతో బాధ పడుతున్నా పారితోషికం గురించి పట్టింపు లేకుండా కాలక్షేపం కోసం చిన్న చితకా వేషాలు వేస్తూనే ఉండేవారు.[1]

కుటుంబం
రేలంగి సతీమణి పేరు బుచ్చియమ్మ.[7] ఈమె పెంటపాడుకు చెందిన చేబోలు వీరాస్వామి కుమార్తె. ఈమె అన్నదమ్ములు పెద్దగా చదువు లేకపోయిన తమ కులవృత్తి అయిన అబ్కారీ వ్యాపారంలో బాగా సంపాదించారు. తమ చెల్లెలికి వెంకట్రామయ్య తగిన జోడీ అని భావించారు. 1933 డిసెంబరు 8 వ తేదీన వీరి వివాహం వధువు స్వగృహంలో జరిగింది. పెళ్ళి సమయానికి బుచ్చియమ్మ రేలంగి కన్నా పదిహేనేళ్ళు చిన్నది. వీరి కుమారుడు సత్యనారాయణ బాబు. సినిమాల్లో తీరిక లేకుండా నటిస్తున్నప్పుడు ఇంటి వ్యవహారాలన్నీ భార్య బుచ్చియ్యమ్మే చూసుకునేది. రేలంగి తన సంపాదన మొత్తం ఆమె చేతిలో పెట్టి తన అవసరాలకు, దాన ధర్మాలకు వరకు ఆమె నుంచి తీసుకునే వాడు. భార్యా భర్తలిద్దరూ దైవ భక్తి కలవారు కావడంతో ఖాళీ దొరికినపుడు కుటుంబంతో సహా పుణ్యక్షేత్రాలకు వెళ్ళి వచ్చేవారు. కొడుక్కి పెళ్ళీడు వచ్చేసరికి రేలంగి మంచి స్థితిమంతుడు. ఎంతోమంది తమ ఆడపిల్లలని ఇవ్వడానికి ముందుకు వచ్చారు. కానీ ఆయన మాత్రం తనకు పూటకు ఠికాణా లేని రోజుల్లో కూడా గౌరవించి పిల్లనిచ్చిన తమ బావమరిది కూతుర్నిచ్చి వివాహం జరిపించాడు.

రేలంగి తన తల్లిదండ్రులకు ఎలా ఏక సంతానమో ఆయనకు కూడా సత్యనారాయణ బాబు ఒక్కడే సంతానం. తండ్రి గారాభం వల్ల అతనికి కూడా చదువు పెద్దగా అబ్బలేదు. అతని చదువు పి.యు.సి తో ఆగిపోయింది. బాల్యం నుంచీ నటనపై ఆసక్తి ఉండేది. చిన్నతనంలోనే నాటకాల్లో నటించి మూడు అవార్డులు సంపాదించాడు. బాలానందం అనే సినిమాలో హీరోగా, విలన్ గా కూడా నటించాడు. సత్యనారాయణ బాబు చిన్నతనంలోనే సినిమా డిస్ట్రిబ్యూషన్ వ్యాపారం ప్రారంభించాడు. చట్టాలు మారాలి అనే సినిమాను తమిళంలో డబ్బింగ్ చేసి నిర్మాతగా కూడా మారాడు. తండ్రికిచ్చిన మాట కోసం సినిమాలకు దూరంగా ఉన్నాడు. 1958లో కుసుమ కుమారితో సత్యనారాయణ బాబు పెళ్ళి జరిగింది. కాలక్రమంలో అతనికి ఇద్దరు కొడుకులు, ఐదుగురు కూతుర్లు కలిగారు. సత్యనారాయణ బాబు డిసెంబరు 26, 2013 న హైదరాబాదులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో కన్ను మూశాడు.[8] సత్యనారాయణ కొడుకులిద్దరూ ఉన్నతోద్యోగాల్లో స్థిరపడ్డారు. పెద్ద అల్లుడు మెదక్ జిల్లా సదాశివపేట ఛైర్మన్ గా పనిచేశాడు.

బుచ్చియమ్మ భర్త మరణానంతరం దాదాపు మూడు దశాబ్దాల పాటు జీవించింది. తాడేపల్లి గూడెంలో రేలంగి కట్టించిన విశాలమైన ఇంటిని కొడుకు అమ్మేసే దాకా ఆమె అక్కడే జీవించింది. ఒక్క థియేటరు తప్ప భర్త సంపాదించిన అపారమైన సంపద అంతా ఆమె కళ్ళ ముందే కరిగిపోయింది.[9] చివరి దశలో రేలంగి చిత్రమందిర్ వెనుకల ఉన్న అతిథి గృహంలో నివసించేవారు. ఈమె 2004లో మరణించింది.

విశిష్టత
రేలంగి ఎన్నో కళాశాలలకు విరాళాలు ఇచ్చేవాడు. ఎందరికో వివాహాలకు సహాయం చేసేవాడు. రేలంగి ఇంట నిత్యం అన్నదానములు జరిగేవి.[10] రేలంగి పుట్టింది రావులపాడు, పెరిగింది కాకినాడలో అయినా తాడేపల్లి గూడెంతో ప్రత్యేకమైన అభిమానం ఉండేది. అందుకు కారణం ఆ ఊరి ప్రజలు ఆయనపై చూపిన అభిమానం. వారికోసం ఏమైనా చేయాలనుకున్నాడు. ఊరి ప్రజలకు సినిమాలపై ఆసక్తి మెండు. ఆయన పెద్ద నటుడైన తర్వాత తన సినిమా విడుదలైతే మొదటి రోజునే చూడాలని ఉబలాట పడేవాళ్ళు. అందుకని అక్కడే అత్యాధునిక సదుపాయాలతో సినిమా థియేటర్ నిర్మించాలనుకున్నాడు. అనేక వ్యయప్రయాసలతో కూడుకున్న ఈ పనికి పూనుకున్న రేలంగిని కొంతమంది శ్రేయోభిలాషులు వారించారు. కానీ రేలంగి మాత్రం వారి మాటలు లెక్క చేయలేదు. అలా రేలంగి చిత్ర మందిర్ నిర్మాణం ప్రారంభమైంది. తాను చిత్రీకరణల్లో విరామం లేకుండా ఉండటంతో తన కుమారుడికి ఈ బాధ్యత అప్పజెప్పాడు. ఈ పని కోసం ఆయన మద్రాసు నుంచి కుటుంబంతో సహా తాడేపల్లిగూడెం కి వచ్చి స్థిరపడ్డాడు. నిర్మాణానికి అనుకున్నదానికంటే ఖర్చు చాలా ఎక్కువైంది. చివరికి 1962 లో ఈ థియేటర్ నిర్మాణం పూర్తయింది. దీని ప్రారంభోత్సవానికి ఎస్. వి. రంగారావు, జమున, కాంతారావు, జె. వి. రమణమూర్తి లాంటి ప్రముఖులందరూ విచ్చేశారు. దర్శకుడు కె. వి. రెడ్డి రిబ్బన్ కత్తిరించాడు. రేలంగి గురువు సి. పుల్లయ్య మొదటిసారిగా ప్రొజెక్టరు ఆన్ చేశాడు. ఈ థియేటర్ పుణ్యమా అని ఆ ఊరి ప్రజలకు ఎంటర్ ది డ్రాగన్, మెకన్నాస్ గోల్డ్ లాంటి హాలీవుడ్ చిత్రాలను కూడా తమ ఊళ్ళోనే చూసే అరుదైన అవకాశం లభించింది. ఈ థియేటరును సత్యనారాయణ బాబు మల్టీప్లెక్స్ లాగా తీర్చిదిద్దాలనుకున్నా ఆ కోరిక తీరకుండానే మరణించాడు.[8]

సన్మానాలు, పురస్కారాలు, బిరుదులు
రేలంగి నటుడిగా తారా స్థాయికి చేరగానే ఆయనకు సన్మానాలు, బిరుదులు, కనకాభిషేకాలు, గజారోహణలు మొదలైనవెన్నో జరిగాయి. 1955 లో హైదరాబాదులో ఆంధ్ర నాటక కళాపరిషత్తు వాళ్ళు ఆయనకు ఘన సన్మానం చేశారు. ఈ సన్మాన కర్త ప్రముఖ రంగస్థల నటుడు స్థానం నరసింహారావు. 1956లో రేలంగికి రాజమండ్రిలో లలిత కళానికేతన్ వారిచే మరో ఘన సన్మానం జరిగింది. ఈ సభలో హాస్యబ్రహ్మగా పేరు గాంచిన భమిడిపాటి కామేశ్వరరావు రేలంగికి హాస్య నటచక్రవర్తి అనే బిరుదును ప్రదానం చేశాడు. ఈ సభలో ఆయనకు సువర్ణ కంకణాలు, దండం బహుకరించారు. 1959 మే 14 న తెలుగు ఫిల్మ్ జర్నలిస్టులు మద్రాసు వాణీ మహల్ లో రేలంగిని గజారోహణం చేయించి ఘనసన్మానం జరిపారు. ఆ మరుసటి రోజునే మద్రాసు విజయా గార్డెన్స్ లో తోటి నటీనటులందరూ కలిసి సన్మానం చేశారు. ఈ సన్మానానికి ప్రముఖ తెలుగు, తమిళ భాషల నటులందరూ హాజరయ్యారు. శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం సెనేట్ సభ్యుడిగా నియమింపబడ్డాడు. ఆంధ్రప్రదేశ్ సంగీత నాటక అకాడెమీ వారు ఫెలోషిప్ ఇచ్చి గౌరవించారు.

బండారులంక, రాజమండ్రి, కొవ్వూరు మొదలైన ఊళ్ళలో రేలంగికి కనకాభిషేకాలు జరిగాయి. 1967 లో ఏలూరు పట్టణంలోని ప్రభాత్, శ్యామల థియేటర్ల సంయుక్త ఆధ్వర్యంలో రేలంగికి ఘన సన్మానం జరిగింది. 1970లో భారత ప్రభుత్వం ఆయనకు పద్మశ్రీ పురస్కారాన్ని ప్రధానం చేసింది.

మరణం
చివరి దశలో రేలంగి తీవ్రమైన నడుమునొప్పితో బాధపడ్డాడు. వైద్యులు ఇది ఎముకలకు సంబంధించిన వ్యాధిగా తేల్చారు. ఈ సమయంలో ఆయనకు రేలంగి సతీమణి బుచ్చియమ్మ అక్క కూతురైన రాజేశ్వరి ఆయనకు దగ్గరుండి సేవలు చేసింది. రాజేశ్వరి రేలంగి దంపతులను స్వంత తల్లిదండ్రుల్లా భావించేది. 1975 నవంబరు 27 ఉదయం తాడేపల్లి గూడెంలోని తన స్వగృహంలో మరణించాడు.

నవ్వించడమంటే నవ్వుకునేంత హాయి కాదు .. నవ్వించడమంటే ఎదుటివారిని ఏడిపించేంత తేలికా కాదు. నవ్వించాలంటే మాటల్లో మెరుపుల్లాంటి విరుపులు ఉండాలి.. భావాల ఆవిష్కరణలో చాతుర్యం ఉండాలి .. అర్థాల్లో చమత్కారం పండాలి. అదే సమయంలో అందుకుతగిన హావభావ విన్యాసం చేయగలగాలి. అలాంటప్పుడే అవతలివారిని నవ్వించే ప్రయత్నం ఫలిస్తుంది. తెరపై నవ్వించలేకపోతే నవ్వులపాలు కావలసి వస్తుంది. అందుకే నవరసాల్లో హాస్యరసంతో అవతలివారిని మెప్పించడం చాలా కష్టతరమైనదని పెద్దలు సెలవిచ్చారు. అంతటి కష్టతరమైన హాస్యాన్ని అవలీలగా నడిపించిన తొలితరం హాస్యనటుల్లో రేలంగి వెంకట్రామయ్య ఒకరు.

రావులపాడులో పుట్టి చెన్నైలో అడుగెట్టి..

రేలంగి 1910.. ఆగస్టు 13న కాకినాడ సమీపంలోని ‘రావులపాడు’ గ్రామంలో, ఓ మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. ఆయన తండ్రి హరికథలు చెబుతూ జీవనాన్ని నెట్టుకొచ్చేవారు. ఆర్థికపరమైన ఇబ్బందుల కారణంగా 9వ తరగతితో చదువు ఆపేసిన రేలంగి నటనపట్ల ఆసక్తిని చూపడం మొదలెట్టారు. సినిమాల పట్ల ఆసక్తితో చెన్నైకి చేరుకున్నారు. దర్శకుడు సి.పుల్లయ్య దగ్గర ప్రొడక్షన్ టీమ్ లో స్థానం లభించడంతో సాపాటుకు ఇబ్బందిలేదని హాయిగా ఊపిరి పీల్చుకున్నారు. ఆ రోజు నుంచి పుల్లయ్యగారు అప్పగించిన బాధ్యతలను నిర్వహిస్తూ, నటుడిగా ఎప్పుడు అవకాశం వస్తుందా అనే ఆశతో ఎదురుచూడసాగారు.

రేలంగి పనితీరు .. వ్యక్తిత్వం నచ్చడంతో, ఆయనను నటుడిగా చేయాలనే నిర్ణయానికి సి.పుల్లయ్య వచ్చారు. తన సినిమాల్లో రేలంగికి చిన్న చిన్న పాత్రలను ఇవ్వడం మొదలెట్టారు. తన పని తాను చేస్తూనే ఆ పాత్రల్లో నటిస్తూ, నటుడిగా రేలంగి తన వేగాన్ని పెంచారు. ‘కీలుగుఱ్ఱం’లో చేసిన ‘గోవి౦దుడు’ పాత్ర .. ‘గుణసుందరికథ’లో చేసిన ‘కాలమతి’ పాత్ర హాస్య నటుడిగా ఆయన ఉనికిని చాటాయి. అలా 40వ దశకంలో నటుడిగా తన గురించి అందరూ మాట్లాడుకునేలా చేసిన రేలంగి, 50వ దశకం ఆరంభంలోనే ‘పాతాళభైరవి’ చేశారు.

పాటలు పాడటంలోనూ ఘనాపాటి

‘పాతాళ భైరవి’ సినిమాలో సూరసేనుడి పాత్రలో ‘వినవే బాలా నా ప్రేమ గోల’ అంటూ రేలంగి చేసిన సందడితో కెరియర్ పరంగా ఇక ఆయన వెనుదిరిగి చూసుకోవలసిన అవసరం లేకుండా పోయింది. అప్పట్లో ఏ స్టేజీ నాటకంలోనైనా ఈ పాట ఉండవలసిందే అనేంతగా ఈ పాట పాపులర్ అయింది. రేలంగికి ఒక పాట పెట్టడమనేది ఈ సినిమా నుంచే మొదలైంది. ‘శివ శివ మూర్తివి గణనాథా .. ‘ .. ‘ధర్మం చెయ్ బాబూ ..’ .. ‘కాశీకి పోయాను రామా హరే .. ‘శివగోవింద గోవిందా .. ‘ఇంగిలీషులోన మ్యారేజీ .. ‘ చక్కనిదానా చిక్కనిదానా ..’ .. ‘సుందరి నీ వంటి దివ్య స్వరూపం .. ‘, ‘సరదా సరదా సిగరెట్టు..’ వంటి కొన్ని పాటలను అందుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు.

రేలంగి పనితీరు .. వ్యక్తిత్వం నచ్చడంతో, ఆయనను నటుడిగా చేయాలనే నిర్ణయానికి సి.పుల్లయ్య వచ్చారు. తన సినిమాల్లో రేలంగికి చిన్న చిన్న పాత్రలను ఇవ్వడం మొదలెట్టారు. తన పని తాను చేస్తూనే ఆ పాత్రల్లో నటిస్తూ, నటుడిగా రేలంగి తన వేగాన్ని పెంచారు. ‘కీలుగుఱ్ఱం’లో చేసిన ‘గోవిదుడు’ పాత్ర .. ‘గుణసుందరికథ’లో చేసిన ‘కాలమతి’ పాత్ర హాస్య నటుడిగా ఆయన ఉనికిని చాటాయి. అలా 40వ దశకంలో నటుడిగా తన గురించి అందరూ మాట్లాడుకునేలా చేసిన రేలంగి, 50వ దశకం ఆరంభంలోనే ‘పాతాళభైరవి’ చేశారు.

పాటలు పాడటంలోనూ ఘనాపాటి

‘పాతాళ భైరవి’ సినిమాలో సూరసేనుడి పాత్రలో ‘వినవే బాలా నా ప్రేమ గోల’ అంటూ రేలంగి చేసిన సందడితో కెరియర్ పరంగా ఇక ఆయన వెనుదిరిగి చూసుకోవలసిన అవసరం లేకుండా పోయింది. అప్పట్లో ఏ స్టేజీ నాటకంలోనైనా ఈ పాట ఉండవలసిందే అనేంతగా ఈ పాట పాపులర్ అయింది. రేలంగికి ఒక పాట పెట్టడమనేది ఈ సినిమా నుంచే మొదలైంది. ‘శివ శివ మూర్తివి గణనాథా .. ‘ .. ‘ధర్మం చెయ్ బాబూ ..’ .. ‘కాశీకి పోయాను రామా హరే .. ‘శివగోవింద గోవిందా .. ‘ఇంగిలీషులోన మ్యారేజీ .. ‘ చక్కనిదానా చిక్కనిదానా ..’ .. ‘సుందరి నీ వంటి దివ్య స్వరూపం .. ‘, ‘సరదా సరదా సిగరెట్టు..’ వంటి కొన్ని పాటలను అందుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు.

రేలంగిపై చిత్రీకరించిన పాటలన్నీ ఆదరణ పొందుతూ, అవి ఆయా సినిమాలకి ప్రధాన ఆకర్షణగా నిలుస్తూ ఆయన కెరియర్ ను మరింత బలంగా ముందుకు నడిపించాయనడంలో ఎలాంటి సందేహం లేదు. అంతకుముందు కమెడియన్ గా ఉన్న కస్తూరి శివరావు .. రేలంగి సహనటుడైన రమణారెడ్డి ఇద్దరూ బక్కపలచగా ఉండి, తమదైన బాడీ లాంగ్వేజ్ తో నవ్వులు పూయించారు. ఆ శరీరాకృతి కారణంగా కామెడీని పండించడంలో వాళ్లు చాలా చురుకుగా ఉండేవారు. వాళ్లతో పోలిస్తే రేలంగి కాస్త మందంగానే ఉండేవారు. నిదానంగా .. భారంగా అడుగులువేస్తూ, కనుబొమలు .. భుజాలు ఎగరేస్తూ గమ్మత్తైన మేనరిజంతో డైలాగ్స్ చెబుతూ ఆయన ముందుకెళ్లారు.

నడకతోనే నవ్వులు పూయించే ఆయన తీరుకి ప్రేక్షకులు పట్టుబడిపోయారు. హాస్య పాత్రల్లో ఒదిగిపోయే విధానానికి ఆనందంతో అభిమానులైపోయారు. తెరపై రేలంగి కనిపిస్తే నిండుదనం .. పండుగదనం అనుకుంటూ ఆత్మీయులైపోయారు. ‘మిస్సమ్మ’ చిత్రంలో ప్రతిచిన్న విషయానికి ‘తైలం .. తైలం’ అంటూ డబ్బులు వసూలు చేసే ‘దేవయ్య’ పాత్రలో ఆయన చేసిన హడావుడిని ప్రేక్షకులు ఎప్పటికీ మరిచిపోలేరు. ఇక ‘వెలుగు నీడలు’లో మాటకి ముందు .. వెనుక ‘శ్రీమతే రామానుజాయ నమః’ అంటూ ఆయన పోషించిన ఉదాత్తమైన పాత్ర కళ్లముందు కదలాడుతూనే ఉంటుంది.

‘అప్పుచేసి పప్పుకూడు’ సినిమా రేలంగి పాత్రపైనే మొదలవుతుంది. ఈ సినిమాలో అప్పులవారి బారి నుంచి తప్పించుకునే ‘భజగోవిందం’ పాత్రలో ఆయన పెట్టిన కితకితలు ఇప్పటికీ తలచుకుని నవ్వుకునేలా చేస్తాయి. ‘పెద్దమనుషులు’ సినిమాలోని ‘తిక్క శంకరయ్య’ పాత్ర రేలంగికి మంచిపేరు తెచ్చిపెట్టింది. పెద్దమనుషుల ముసుగులో అక్రమాలకు పాల్పడుతున్నవారిని ఆటపట్టిస్తూ .. ఆటకట్టించే పాత్రలో ఆయన నటన అభినందనీయమని చెప్పకతప్పదు.

‘మాయాబజార్’ లో చేసిన ‘లక్ష్మణ కుమారుడు’ పాత్ర .. ‘నర్తనశాల’లో చేసిన ‘ఉత్తర కుమారుడు’ పాత్ర దేనికవే వైవిధ్యభరితమైనవి. ఈ రెండు పాత్రలు .. అసమానమైన ఆయన హాస్యరస పోషణకు అద్దం పడతాయి. ఇక ‘లవకుశ’ సినిమాలో అనుమానంతో భార్యను నిందిస్తూ, ఆ సమస్యను తీసుకెళ్లి రాముడికి ముడిపెట్టే సన్నివేశంలో ఆయన నటన అనితర సాధ్యం అనిపిస్తుంది. ‘విప్రనారాయణ’లో వేశ్య కుటుంబానికి చెందిన స్త్రీ మాయలో తన గురువుగారు పడకుండా కాపాడుకునే ‘రంగరాజు’ పాత్ర .. ‘వాగ్దానం’లో హరికథలు చెప్పుకుని జీవించే ‘రామదాసు’ పాత్ర ఆయన సహజ నటనకు సాక్ష్యంగా నిలుస్తాయి. నిజమైన నటనకు నిర్వచనం చెబుతాయి.

ఇలా ఎన్నో విభిన్నమైన కథలు .. విలక్షణమైన పాత్రలు .. విరామమెరుగని విజయాలు రేలంగి ఖాతాలో కనిపిస్తాయి. ఒక్క మాటలో చెప్పాలంటే రేయింబవళ్లు చెప్పుకున్నా తరగని చరిత్రే రేలంగి. ఈ రోజుల్లో కొంతమంది సినిమాల్లో అవకాశాల కోసం కొన్ని రోజుల పాటు ప్రయత్నాలు చేసి, ఇక ఈ కష్టాలు తమవల్ల కాదని నిరాశ చెందుతారు. అవకాశాలు రావడం లేదని దిగాలుపడిపోతారు. అలాంటివారికి ఎప్పటికీ ఎనర్జీని ఇచ్చే పాఠం .. రేలంగి జీవితం. ఆయన పని చేయలేదు .. ఒక యజ్ఞం చేశారు .. ఒక తపస్సు చేశారు. కష్టాలు వచ్చినప్పుడు కన్నీళ్లతో సావాసం చేయకుండా, ఆశల దుప్పటికప్పి నిరాశను నిద్రబుచ్చారు.

కాలానికి ఎదురీదే ఓ వ్యక్తి జీవితంలో ఎంతవరకూ ఎదగగలడు అనే ప్రశ్నకి, తన పేరునే సమాధానంగా చూపిన నటుడు ‘రేలంగి’ ఒకానొకప్పుడు చెన్నైలో అద్దె ఎక్కువగా ఇచ్చుకోలేని కారణంగా ఊరు బయట ఇంట్లో మకాం పెట్టిన రేలంగి, ఆ తరువాత అంచలంచెలుగా ఎదుగుతూ వరుస బంగ్లాలను కట్టించారు. ఏ రోడ్లపై ఎర్రటి ఎండల్లో నడిచారో .. అదే రోడ్లపై ఏసీ కారుల్లో తిరిగారు. తను హాస్య నటుడై వుండి, మరో హాస్యనటుడైన పద్మనాభానికి అవకాశాలు ఇప్పించిన విశాల హృదయం ఆయన సొంతం.

అంకితభావాన్ని మిత్రుడిగా ఆదరించిన ఆయన, అహంభావాన్ని మాత్రం ఎప్పుడూ శత్రువులానే చూశారు. ఆకలితో పాటు ఆత్మాభిమానం కూడా అందరికీ ఉంటుందని భావించిన రేలంగి, ఎవరి మనసులను కష్టపెట్టకుండా మసలుకునేవారు. తనని తాను మైనంలా మలచుకుంటూ ఆయన మేరు పర్వతంలా ఎదిగిపోయారు. తెలుగు తెరపై చెరగని నవ్వుల సంతకంలా మిగిలిపోయారు. ఈ రోజున రేలంగి వర్ధంతి .. ఈ సందర్భంగా ‘ది లియో న్యూస్’ ఆయనను స్మరించుకుంటోంది.

– పెద్దింటి గోపీకృష్ణ

అలాంటి వీలునామా ఎవ్వరూ రాసి ఉండరు..
రేలంగిని ఆప్యాయంగా రేలంగోడు అంటూ సొంతవానిగా అక్కున చేర్చుకుంటారు. సినిమాలో రేలంగి కనపడితే నవ్వులే నవ్వులు. నడక, మాట తీరు, వస్త్ర ధారణ.. అన్నీ హాస్యమే. తెలుగు హాస్యానికి చిరునామా రేలంగి. ఆయనే రేలంగి వెంకట్రామయ్య. హాస్యంతో పాటు వీలునామా కూడా విలక్షణమే.. రేలంగి మనవరాలు గాయత్రి, తన తాతను గుర్తు చేసుకుంటూ, అందమైన సంఘటనలెన్నో సాక్షికి వివరించారు.
మా ముత్తాత రామస్వామి (రేలంగి తండ్రి) హరికథలు చెప్పేవారు. ఆయనకు తాతయ్య ఏకైక సంతానం. ఆగస్టు 13, 1910న రావులపాడులో పుట్టారు. తాతయ్యకు నాన్న ఏకైక సంతానం. నాన్నను సత్యనారాయణబాబు, రేలంగి బాబు అని పిలిచేవారు. నాన్నగారికి మేం ఇద్దరు మగపిల్లలు, నలుగురు ఆడపిల్లలం. తాతయ్యకు ఆడ పిల్లలంటే చాలా ఇష్టం. బంధువుల పిల్లలతో ఇల్లంతా కళకళలాడుతుండేది. యంగ్‌మెన్స్‌ ఆర్టిస్ట్స్‌ క్లబ్‌లో తాతయ్య హార్మోనియం నేర్చుకున్నారు. ఆ రోజుల్లోనే తాతయ్య నాటకాలు వేసేవారు. పి. పుల్లయ్య గారితో కలకత్తా వెళ్లి, ఒక సినిమాలో చేశాక, చెన్నైలో ఎన్నో ఇబ్బందులు పడుతూ చిన్నచిన్న వేషాలు వేశాక, గుర్తింపు వచ్చింది. 1950 – 70 మధ్య హీరోలకు దీటుగా పని చేశారు. తాతయ్యను చూడటానికి బస్సులలో వచ్చిన అభిమానులందరికీ భోజనాలు పెట్టి పంపేవారట.

నా పేరు పెట్టొద్దు అన్నారు…
దానధర్మాల్లో తాతయ్యకు మంచి పేరు. ఎవరైనా చదువుకోవటానికి ఆర్థిక సహాయం కోసం వస్తే, ‘మంచి మార్కులతో పాస్‌ అయి చూపించాలి’ అనేవారట. 1967లో వెంకటేశ్వర విశ్వవిద్యాలయం స్థాపించే ముందు, ‘రేలంగి వెంకటేశ్వర యూనివర్సిటీ’ అని పేరు పెడతాం, ఐదు లక్షలు విరాళం ఇవ్వమన్నారట. అందుకు తాతయ్య, ‘నా పేరు పెట్టక్కర్లేదు, నాలుగు లక్షలు ఇస్తాను, మా వాళ్లందరికీ చదువు రావాలని మొక్కుకోండి’ అన్నారట. దానధర్మాలలో ‘నాగయ్యగారి తరవాత రేలంగి గారు’ అన్న పేరు సంపాదించుకున్నారు.

పిల్లల మీద చాలా ప్రేమ..
దక్షిణాది భాషల చిత్రాల షూటింగ్‌లన్నీ వాహిని స్టూడియోలో జరిగేవి. ఆ స్టూడియో పక్కనే ఉన్న విజయా గార్డెన్స్‌ను తాతయ్య 1956లో కొని, అందులో పంటలు పండించారు. ఆ చోటును∙వాహిని వారికి లీజ్‌కిచ్చారు. ఆ స్థలం తాలూకు వీలునామా చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఆడ, మగ తేడా లేకుండా ఎంతమంది మనవలు పుడితే అంతమంది సమానంగా అనుభవించేలా విల్లు రాయించారు. అప్పటికి నాన్నకి ఇంకా వివాహం అవ్వలేదు. నాన్న జీవించినంత కాలం ఆ ఆస్తిని మనవలకు అమ్మే హక్కు లేకుండా రాయించారు. ఆ వీలునామా ఎన్నటికీ మరచిపోలేని విషయం.

తాతయ్యతో చూడలేకపోయాం..
తాతయ్యతో ఎక్కువ సమయం గడపలేక పోయామనే బాధ ఉంది మాకు. ఆయన ఉండి ఉంటే మమ్మల్ని చూసి ఆనందించేవారనుకుంటాం. మాయాబజార్, పాతాళభైరవి వంటి చిత్రాలు తాతయ్యతో కలిసి చూడలేకపోయాం. ఆయన నటించిన సినిమాలన్నీ టీవీలో చూస్తూ, ఎంజాయ్‌ చేస్తాం. తాతయ్య 360కి పైగా సినిమాలు చేశారని తరవాత తెలిసింది. సినిమా పరిశ్రమలో ఉండే రాజకీయాలు తాతయ్యకి తెలుసు. అందుకే నాన్నను సినిమాలలోకి వద్దన్నారు. నాన్న ‘బాలానందం’ అనే ఒకే ఒక్క సినిమాలో నటించారు. తాతయ్య చివరి రోజుల్లో తాడేపల్లిగూడెంలో ఉన్నారు. ఎవరైనా వస్తే ఉండటానికి వీలుగా అక్కడ పోర్షన్స్‌గా కట్టించారు. తాతగారికి మనుషులు కావాలి. నాకు తొమ్మిదేళ్లు వచ్చేసరికే తాతయ్య పోయారు. ఆయన పోయాక కూడా ఆంధ్ర నుంచి తెలుగువారు చెన్నై వచ్చి మా ఇంట్లో ఉండేవారు.

మద్రాసు పాండీబజార్‌లో…
తాతయ్య బాగా డబ్బు సంపాదించిన రోజుల్లో, మద్రాసు పాండీ బజారులో థియేటర్‌ కడదామనుకున్నారు. కాని తాతగారి బంధువులంతా తాడేపల్లిగూడెంలో ఉండటంతో, ‘మన పేరు తెలిసేచోట కడితే, మనల్ని పదికాలాల పాటు గుర్తు చేసుకుంటారు’ అని తాడేపల్లి గూడెంలో 1962లో ‘రేలంగి చిత్ర మందిర్‌’ కట్టారు. నాటి తమిళనాడు ముఖ్యమంత్రి కామరాజు థియేటర్‌ ప్రారంభించారు. అందులో విడుదలైన మొదటి సినిమా లవకుశ. ఇప్పుడు అది బాగా పాతబడిపోవటంతో ‘పద్మశ్రీ వెంకట్రామయ్య మాల్‌’ గా మారుస్తున్నాం.

మనవలంటే ప్రాణం…
తాతయ్యకు మనవలంటే మహా ఇష్టం. మాతో చాలా స్నేహంగా ఉండేవారు. నానమ్మతో మా గురించి చెప్పుకుంటూ మురిసి పోయేవారట. మేమంతా మద్రాసులోనే పుట్టి పెరిగాం. తాతయ్య సినిమాలలో బిజీగా ఉండటం వల్ల ఇంటి విషయాలన్నీ నానమ్మ చూసుకునేది. మా బంధువులలో చాలామందికి తాతయ్యే పెళ్లిళ్లు జరిపించారు.

తాతగారి డాడ్జ్‌ కారు నెంబరు ఎంఎస్‌ఆర్‌ 1722. అప్పట్లో పెళ్లిళ్లకు వెళ్లినప్పుడు కారు నెంబరుతో పిలిచేవారు. అలా వినటం వల్ల నెంబరు గుర్తుండిపోయింది. ఆయనకు వీలు కుదిరినప్పుడల్లా అందరినీ బయటకు తీసుకువెళ్లేవారు. పద్మశ్రీ అవార్డు వచ్చినప్పుడు కూడా చాలామందిని తనతో ఢిల్లీ తీసుకువెళ్లారు. ఇంట్లో నిశ్శబ్దంగా ఉండేవారు. సినిమాలలో బిజీగా ఉండటం వల్ల, మాతో ఎక్కువ సమయం గడపేవారు కాదు. కాని మా బాధ్యతలన్నీ తన భుజాల మీద వేసుకున్నారు. షైన్‌ వేలాంకణి స్కూల్‌లో చేర్పించారు. అందువల్ల మాకు చదువులో మంచి ఫౌండేషన్‌ పడింది.

అందరూ చక్కగా ఉన్నారు…

తాతగారి వైపు బంధువులంతా వృద్ధిలోకి వచ్చారు. తాతగారి దగ్గర పనిచేసిన మేనేజర్, మా నాన్నగారి దగ్గర కూడా చేశారు. అప్పట్లో మేం తాతాజీ సినిమాలు చాలా తక్కువ చూశాం. తాతాజీతో ఒకటిరెండు ప్రివ్యూలకు వెళ్లాం. ఆయనతో ఎక్కువ సమయం గడపలేకపోయామని బాధపడతాం. ఆయన ఉండి ఉంటే మమ్మల్ని చూసి ఆనందించేవారనుకుంటాం.

మరచిపోలేని అదృష్టాలు…
తాతాజీతో బీచ్‌కి వెళ్లినరోజులు ఇప్పటికీ మరిచిపోలేం. మద్రాసు బీచ్‌లో కారు ఆపుకుని, సముద్రం వరకు నడిచేవాళ్లం. తాతాజీకి ఫోల్డింగ్‌ చైర్‌ తీసుకువెళ్లేవాళ్లం. ఆయన అందులో కూర్చునేవారు. చాలాసేపు అక్కడే ఆడుకునేవాళ్లం. మేం ఏం కొనుక్కోవాలన్నా నానమ్మకే చెప్పేవాళ్లం. ఇంటి విషయాలన్నీ నానమ్మకు వదిలేశారు. తాతాజీ సంపాదనంతా నానమ్మకి ఇచ్చేవారు. నానమ్మ తన దగ్గర నగలన్నీ ఎవరికి కావాలంటే వారికి పెట్టేసేది. అందరికీ పెట్టగలిగేంత బంగారం ఉండేది. ఇంట్లో చాలామంది భోజనాలు చేసేవారు. నేను తాతాజీ వాళ్ల అమ్మలా ఉంటానని, నన్ను ‘అమ్మ’ అని పిలిచేవారు. పిల్లలకు పెళ్లిళ్లు అయ్యి, అత్తవారిళ్లకు వెళితే ఎలా అని బెంగగా ఉండేవారు. తాతాజీ తన చేతుల మీదుగా ఒక్క మనవరాలికి మాత్రమే కన్యాదానం చేశారు. ఇంకా కొంతకాలం ఉండి ఉంటే, మాకు కూడా చేసేవారేమో.

అందరి ఫంక్షన్లు బాగా ఘనంగా చేశారు. అది లోటే మాకు. జకార్తా వెళ్లినప్పుడు వాచ్‌ తెచ్చారు. స్ట్రాప్స్, బెల్టులు మార్చుకోవచ్చు. ఇప్పుడు పనిచేయకపోయినా, ఆయన గుర్తుగా ఉంచుకున్నాను. మా అక్కను అపురూపంగా చూసేవారు. కారులోనే స్కూల్‌కి వెళ్లేది. అక్క చిన్నప్పటి నుంచి సుకుమారం.

ఆ వీలునామాలో ముందుజాగ్రత్త…
‘‘మాది రైతు కుటుంబం కనుక, తాతగారి పొలం ఆడ, మగ తేడా లేకుండా నా కొడుకు పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికీ సమానంగా ఇవ్వాలి. వారంతా నా పేరు చెప్పుకుని కడుపు నిండా తినాలి’’ అన్నారట తాతయ్య. అప్పటికి మా నాన్న వయసు పందొమ్మిది సంవత్సరాలు. ఇంకా పెళ్లి కూడా కాలేదు. తాతయ్య పెద్దగా చదువుకోకపోయినా ఎంతో దూరదృష్టితో ఈ పని చేసి ఉంటారనుకుంటాం. మనవలు అమ్మకుండా, డబ్బు పాడవ్వకుండా ఆ రోజుల్లో అంత బిగింపుగా వీలునామా రాశారంటే తాతయ్య నిజంగా చాలా గొప్పవారనిపిస్తుంది.

మా కుటుంబం
తాతాజీకి మేం ఆరుగురు మనవలం. పెద్దక్కయ్య చాముండేశ్వరీ దేవి, అన్నయ్య తిరుమలబాబు, మూడు నేను గాయత్రీ దేవి, నాలుగు రాజ్యలక్ష్మి, ఐదు శ్రీదేవి (నానమ్మ పేరు, తాతగారు నానమ్మని శ్రీదేవమ్మ అని పిలిచేవారు), ఆరు హేమంత్‌కుమార్‌. మేమంతా నానమ్మను అమ్మ అనేవాళ్లం. తాతయ్యను తాతాజీ అనేవాళ్లం. మా నాన్నగారు కూడా అలాగే పిలిచేవారు. ఏం కొనాలన్నా వాళ్ల సలహా తీసుకునేవాళ్లం. నాన్నగారు ఆరు సంవత్సరాల క్రితం, అమ్మ రెండు సంవత్సరాల క్రితం పోయారు. తాతాజీ, నానమ్మలే కాకుండా మా అమ్మనాన్నలు కూడా లేకపోవటం మాకు ఎంతో పెద్ద నష్టం అనిపిస్తుంది. 1975లో తాతాజీ కన్నుమూశారు.
– గాయత్రీ దేవి, రేలంగి మనవరాలు

నా డైరీలోని బహిరంగ రహస్యాలు…..

● రావులపాడు అనే గ్రామంలో పుట్టానుట. అక్కడే పుట్టాను అని నాకు తెలీదు… పెద్దలు చెప్పారు. పెద్దలు అబద్ధం ఆడరు. అయినా సరే, “ట”
అన్నాను.

● పదో ఏట నాటకంలో వేషాలు వేశాను. నాటకం బృహన్నల. అందులో మనం బృహన్నల! ఇంతకంటే అప్పుడు ఇంకా అందంగా వుండేవాణ్ణి – మీకేం తెలును!

● చదువు మీద ఉత్సాహం కలగలేదు. నాలుగో ఫారంలో “చదువు” నన్ను విడిచి పెట్టి పారిపోయింది!

● పది హేనూ ఏళ్ళపాటు అలా అనేక నాటకాల్లో వేషాలు వేసి, వేసి, వేశాక – సినిమా ఛాన్సు తగిలింది. 1935 లో, హార్మోనిస్టు దూని శాస్త్రి గారూ వాళ్ళంతా కలకత్తా బయల్దేరుతున్నారు. నన్ను రమ్మవలేదు. కాని నేనే వాళ్ళ వెంటబడి కలకత్తా వెళ్ళాను. వెళ్ళాను గదా అని నా చేత కొన్ని వేషాలు వేయించుకున్నారు. ఆ చిత్రం ‘కృష్ణతులాభారం. నిజానికి సినిమా నాకు దొరకలేదు. ఆ విధంగా నేనే దొరికిపించుచుకున్నాను !

● అప్పుడు మనం రౌడీ. ఏదేదా చిన్న పేచీ వస్తే ఎదటివాడిని కొట్టి వాణ్ణి.. ఏదో మాట వస్తే అసిస్టెంటు డైరెక్టర్ని కొట్టాను. దాంతో “చెడ్డ రేలంగి” అన్న బిరుదు ఇచ్చారు. బిరుదు పొందడం అదే మొదటిసారి.

● కొంతకాలం సి పుల్లయ్యగారి దగ్గర చేరాను. పది హేనేళ్ళు ఆయనతో వాసం చేశాను. ఆ శ్రీరామచంద్రుడు పద్నాలుగేళ్ళ వనవాసం చేశాడు. నేను అతనికంటే గొప్పవాణ్ణి కాబోలు – పది హేమ సంవత్సరాలు పట్నవాసం చేశాను. అనేక మంది తారలను, నా చేతిమీదిగా బుక్ చేశాను ! హె……

● 1947 లో ‘గొల్లభామ’ విడుదలయింది. అప్పటికి నాకు హాస్యనటుడిగా కాస్త పేరొచ్చింది. కాని అన్ని సంవత్సరాలు పరిశ్రమలో నిలబడి వున్నా – తర్వాత నిలబడలేక పోయాను. నిలబడ్డం కష్టమైంది. ఇంటి వెళ్ళి, కూచుందామా అనుకున్నాను. కాని.. పట్టుదల….. ఆగాను.

● తర్వాత కొంత కాలానికి “వింధ్యరాణి’లో మంచి పాత్ర లభించింది. జి. వరలక్ష్మి, నేను హాస్య జంటగా పాల్గొన్నాం. ఆ చిత్రంలో నేను బాగా చేశానని పేరొచ్చింది. ‘కీలుగుర్రం’ లో మరో మంచి వేషం దొరికింది.

● గుణసుందరి కథ, పాతాళ భైరవి తో రేలంగి, రేలంగి”గా, రేలంగిలా నిలబడ్డాను. తర్వాత చాలా చిత్రాల్లో నటించాను.

● తారల జాబితాలో చేరాను. చాలా చిత్రాల్లో ముఖ్య హాస్య పాత్రలు ధరించాను. అభిమానుల ఆదరాభిమానాలు పుష్కలంగా లభించసాగాయి.

● అనేక చోట్ల సన్మానాలు జరిగాయి. ఆంధ్ర నాటక కళాపరిషత్తు హైదరాబాదులో (1955) నాకు ఘనమైన సన్మానం జరిగింది.

● మద్రాసులో నాకు ఘనమైన సన్మానం జరిగింది. ఆంధ్రా ఫిల్ము ఆర్నలిస్టులు నన్ను ఏనుగు మీద కూచో పెట్టి పూరేగించారు. ఏనుగెక్కటం చాలా చాలా గొప్పట. (మావటి ఎప్పుడూ ఎక్కుతూనే వుంటాడుగదా అంటే… చొప్పదంటు ప్రశ్నలు వెయ్యొద్దన్నారు).

● విజయా గార్డెన్స్‌లో సాటి, తోటి నటీనటులందరూ కలిసి నన్ను సన్మానించారు. నటీనటులందరూ కలిసి, ఇంకో నటుని సన్మానించడం అన్నది – అదే మొదటిసారి. ఆ ఘనత నాకు దక్కింది. ఆ తర్వాత అలాంటిది మళ్ళీ జరగలేదు.

● శ్రీ వెంకటేశ్వర యూనివర్శిటీకి పాతిక వేలు విరాళం ఇచ్చాను. సెనేట్ సభ్యుడినయ్యాను.

● ఆంధ్రప్రదేశ్ సంగీత నాటక అకాడమి వారు ఫెలోషిప్ ఇచ్చి గౌరవించారు.

● బండారులంక, రాజమండ్రి, కొవ్వూరు మొదలైన పూళ్ళలో నాకు కనకాభిషేకాలు జరిగాయి (బంగారం కంట్రోలు వున్నా)

● నర్తనశాల చిత్రంతో డెలిగేట్గా జకార్తా వెళ్ళాను. అందులో వేసిన ఉత్తర కుమార్డు దక్షిణం మీదగా తూర్పు దిశకు వెళ్ళాడు.

● ఎన్నో పరిషత్తులూ, సంస్థలు సన్మానిస్తూనే వున్నాయి. వీటన్నిటికి కారణం ఎవరు?… ఎవరు ?.. మీరు.. మీరే..

చిత్తగించవలెను
మీ
రేలంగి వెంకట్రామయ్య

పాత బంగారం: రేలంగి.. సైకిలుతో స్నేహం,జర్నలిస్ట్ పై కోపం!
రేలంగి ప్రారంభ రోజుల్లో మద్రాసులో కాలినడకన మైళ్ళకొద్దీ నడిచేవాడు. అది గుర్తు పెట్టుకుని తను స్టూడియో నుంచి ఇంటికి వెళుతూ ఎంతోమందికి లిఫ్ట్‌ ఇచ్చేవారు. అలాగే ఆ రోజుల్లో తను స్టూడియోలకు,షూటింగ్ స్పాట్స్ లకు తిరగటానికి అండగా నిలిచిన పాత సైకిల్‌ని భద్రంగా దాచుకున్నారు.

రేలంగి సినిమాల్లోకి వచ్చి వృధ్ది అయ్యినా తన గతాన్ని మర్చిపోవటానికి ఇష్టపడేవాడు. తన అప్పటి కష్టాలను, కష్టాలలో ఆదుకున్న స్నేహితులను మరచిపోలేదు. సినిమా ట్రైల్స్ రోజుల్లో తిండితిప్పలు ఇబ్బంది పడినవాడు కనుక, తను భోజనం చేసేటప్పుడు కనీసం పాతికమందికి భోజనం పెట్టేవారు. అలాగే తనకు చదువు అబ్బలేదు కనుక చదువుకోసం ఆర్దికసహాయం అర్దించే వాళ్లకు చేయూత ఇచ్చేవారు. రేలంగి ఏనాడూ ధనమదంతో విర్రవీగలేదని ఆయన్ను ఎరిగున్న వాళ్లు చెప్తారు.

రేలంగి ప్రారంభ రోజుల్లో మద్రాసులో కాలినడకన మైళ్ళకొద్దీ నడిచేవాడు. అది గుర్తు పెట్టుకుని తను స్టూడియో నుంచి ఇంటికి వెళుతూ ఎంతోమందికి లిఫ్ట్‌ ఇచ్చేవారు. అలాగే ఆ రోజుల్లో తను స్టూడియోలకు,షూటింగ్ స్పాట్స్ లకు తిరగటానికి అండగా నిలిచిన పాత సైకిల్‌ని భద్రంగా దాచుకున్నారు. ఆ సైకిలు అంటే ఆయనకు చాలా మక్కువ. అప్పుడప్పుడూ తన ప్రెండ్స్ తో…ఎప్పుడైనా నాకు వేషాలు లేక, సినిమా ఇండస్ట్రీని వదిలేసి వెళ్లే పరిస్దితి కనుక వస్తే… యీ ఆస్తిపాస్తులన్నీ ఎక్కడివక్కడ వదిలేసి, ఈ సైకిలు తొక్కుకుంటూ తన ఊరైన తాడేపల్లిగూడెం వెళ్లిపోతాను’ అని అనేవారు. అలా ఆ సైకిలు ఆయన తోడుగా జీవితాంతం ఉంది.

రేలంగి కోపం..

జీవితంలో చిన్న స్దాయి నుంచి వచ్చి పైకి ఎదిగిన రేలంగికి మద్యపానం, ధూమపానం వంటి వ్యసనాలు లేవు. కానీ అప్పట్లో సంచలన వార్తలకు, అవాస్తవమైన రాతలకు, ఎల్లో జర్నలిజానికి పెట్టింది పేరైన ‘కాగడా’అనే పత్రిక ఉండేది. ఆ పత్రికకి హోల్ అండ్ సోల్ ప్రొప్రైటర్ కమ్ ఎడిటర్ శర్మ. ఆ పత్రికలో అన్ని ఇప్పుడు యూట్యూబ్ లో వస్తున్న తరహాలో సంచలనం కోసం క్రియేట్ చేయబడ్డ వార్తలు వస్తూండేవి. ఒకసారి తన పత్రికలో సెన్సేషన్ క్రియేట్ చేయటం కోసం ‘రేలంగి తాగి తందానా లాడతాడు’ అంటూ చాలా దారుణంగా.. అసభ్యమైన భాషలో రాశాడు.

ఆ పత్రిక మార్కెట్ లోకి వచ్చిన మరుసటిరోజు స్టూడియోలో షాట్‌ బ్రేక్‌లో కాగడా శర్మ రేలంగికి ఎదురయ్యాడు. వెంటనే రేలంగి అతడి చెంప చెళ్లు మనిపించాడు. దాంతో రేలంగిపై తనను కొట్టాడని పోలీసు కేసు పెడతానని అన్న కాగడా శర్మను తోటి జర్నలిస్టులు మందలించి చీవాట్లు పెట్టారు. అప్పటినుంచి కాగడా శర్మ…రేలంగికు చాలా దూరంగా ఉండేవాడు.తన పత్రికలో కూడా రేలంగి ఊసు ఎత్తేవాడు కాదు.

BAPU

“మికు బాగా నచ్చిన వాటిలో బెస్ట్‌ జోక్‌ ఏమిట?” అని ఒక మితుడు అడిగితే, ఏముందీ, “లెఫ్‌, అనగా జీవితం” అన్నాడు రేలంగి వంకటరామయం. రాళ్లూ రప్పులూ తిని హరాయించుకోగల రోజున మరమరాలు కూడా దొరకవు; తిరా వృజాలూ వైడూర్యాలూ పోగేసుకొన్నాక మరమరాలు కూడా అరగవు… రేలంగీ, వెంకటరామయ్యా తెరమదా జీవితం మీదా షిళారు వెళ్తూన్నుపుడు తరుచు ఈ మాట చెప్పుకుని పగలబడి నవ్వుకుంటూ ఉంటారు. దొరక్క వీడూ, అరక్క వాడూ అనుకుంటూ ఉంటారు. నవ్వడం, నవ్వించడం, నవ్వుకోవడం రేలంగికి ఈనాటి విద్య కాదు; కాకినాడ యంగ్‌ మన్స్‌ హాప్‌ క్లబ్‌లో చేరిన “అన్‌ హాపీ మెంబర్లోతో కలిసి తిరిగిన నాడు కూడా నవ్వడం నవ్వించడమే

రేలంగి ఉద్యోగం. సినిమా పేటలలో వేషాల వేట సాగించినపుడు, హేళన మాటలు పడినపుడు, జార్జిటవున్‌లో ఉల్ఫాగా సెనిమా చూసి నిశిరా్నాతివేళ, ఆరుమైళ్ళ దూరాన ఉన్న ఆళ్వారుపేటకి రాజబాట కొలుస్తూ వచ్చి బార్హీగంజి తాగి కళ్లు మూసుకు పడుకున్నపుడు, ఉచ్చస్థితిక వెళ్ళి జారిపడినపుడు, తననిచూసి, తనని చూసి నవ్విన వాళ్ళని చూసీ కూడా నవ్వుతూనే వచ్చాడు. నవ్వుకుంటూనే వచ్చాడు, అతను కష్టాలుపడా దుఃఖం ఎరగడు. ఖభోజనంలేక శోషవస్తే నిద నటించి జీవితంతోనే సరసమాడి దాన్ని నవ్వించాడు. మెప్పుంచాడు. లొంగదీ్‌నుకు శువారీ చేస్తున్నాడు. ఈ విధంగా ఎంతసేపూ తన కష్టాలు తలుచుకు కమిలిపోయి తనమీద తనే జాలిపడుతూ కూర్చున్నవాడుకాడు కాబట్టి తనచుట్రూ ఊన్న వాళ్ళ కష్టసుఖాలు చూడగలిగాడు. అలా హలాహలంలోంచి అమృత ఖాండాలను, వాధథలను చిలికచిలికి తీసిన అతని నవు; ఆతని హాస్యం, సినిమాలో ఆతను పలికే మాటలు కొన్ని వెలితిమాటలఅయినా ఆతనినోట వచ్చినపుడు నిండుగా ఉండడానికి ఒక కారణం ఇదే.

పాత “చింతామ౭ి” చ్మితం నుంచి నేటివరకూ నూటికి మెబజ్జు చితాలలో నటించినా హాస్యం మటుకు పాత చింతకాయ పచ్చడి లా తయారవకుండా శంక అతను చేసిన కృషి అపారం. సినిమాలో వేషానికి సాథారణుంగా రచయితా దర్శకుడూ పకల్పన చేయడం నిజమే అయినా, రేలంగి అందులో జీవం పూరించి ఏదో కొత్తదనం తేవడానికి, సమకాలిక జీవితానికి దగ్గర కావడానికి కృషచేస్తూవచ్చాడు. కొత్తల్లో చేసిన ఆ కృషవల్లనే పాతల బదులు రేలంగే (పజాదరణు పొందాడు. “రేలంగి ఉంటే చాలండీి అనే జనం పెరిగారు. చిపరికి, కేలంగి తత్వాన్నిబట్టి, జీవితంపట్ల ఆయన దృక్పథాన్ని బట్టి ఆయన ధరించే పాతలకు రూపకల్చ్బన చేయడం, చేషభాషలు నిర్ణయించడం జరిగింది. సినిమా ఏదైనాసరే- కథ ఏవైనా సరే రేలంగి హస్వానికి ఒక వ్యవస్థ అనిపి పెంచుకున్నాడు, తెలుగు సినిమాలో ఒక శకం నెలకొల్పాడు. తతో ఒక నటుడుగా వ్యక్తిగా ఆయన ఘనతకు ఇది జోహారు చేయడమే కావచ్చుకాని, సినీవిపణవివీధిలో ఇది బాక్సాఫీసు సూత్రమైపోయింది. దుమ్ముకొట్టింది

(ఈమంగా రెలంగి పేరునే తవ్ప (పజ్ఞని వాడుకోడం మర్చిపోతున్నారు సినిపారి శామికులు, రేలంగి కూడా కొంత పరాకు చిత్తగించడం, కొంత మొహమాటాలకు లొంగడం జరిగిందని ఆయన విమర్శకులు అంటారు. ఇలాటివి మిశపర్మిశమలో తప్పవు. అయితే ఇలాటివి వచ్చినా రేలంగి ఓడిపోడు. పదేళ్ళనాడు పెకివస్తున్న రెలంగిని కిందకి కొట్టింది అదృష్టం; రెట్టించిన జవసత్వాలతో బంతిలా పైకి ఎగిరాడు తను. అదీ అతని తరహా. తెరమీద రేలంగి ఎంత సందడయినవాడొ జీవితం మీద ఎంకటరామయ్యగారూ అంత సందడయిన మనిషీను, సినిమాలో పాతలు మన సొమ్మేం పోయిందన్నట్లు దయాదాక్షిణ్యాలు వెదజల్లితే, జీవితంలో రేలంగి అంతకన్న దర్జాగా ఉదారంగా ధారాళంగా మంచి పనులు చేస్తాడు. కష్టాలను, కష్టాలలో ఆదుకున్న మిత్రులను

మరచిపోలేడు. తిరుపతి విశ్వవిద్యాల యూానికిచ్చిన విరాళం వంటివి కాక, గుప్రదానాలు ఎన్నో చేశాడు. పెళ్ళిళ్లు చేయించి అళ్ళు నిలబెట్టడం అతని సరదా. ఎప్పుడూ దిగులు తన జోలికిరాకుండా చుట్రూరా పది మందిని కూర్చోబెట్టుకుని కబుర్తాడుతూ తిని తిరగడం సరదా. తన యింట్లో రోజూ పాతిక ముప్పై విస్తళ్లు లేవగా చూడడం సరదా. నిత్యకల్యాణం పచ్చతోరణం అన్నట్టుగా జీవించడం. సందడిగా జీవించడం సరదా,

సశేషం

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -11-2-22-ఉయ్యూరు

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in సినిమా and tagged . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.