మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు -67,68

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు -67,68

67,68-పుష్పవల్లి ,సూర్య ప్రభ సోదరీ మణులు

67- సంగు ఫేం,వెండి తెర పాలవెల్లి -పుష్పవల్లి

పెంటపాడు పుష్పవల్లి, అలనాటి తెలుగు సినిమా నటి, జెమినీ గణేశన్ భార్య, ప్రముఖ హిందీ సినిమా నటి రేఖ యొక్క తల్లి.

విశేషాలు
ఈమె తాడేపల్లిగూడెం దగ్గరలో ఉన్న పెంటపాడు గ్రామంలో 1926, జనవరి 3వ తేదీన కందాళ తాతాచారి, రామకోటమ్మ దంపతులకు జన్మించింది. ఈమె ఐదవ తరగతి వరకు చదివింది. ఈమె అసలు పేరు కందాళ వెంకట పుష్పవల్లి తాయారు.[1] ఈమెకు పిన్నవయసు నుండే సినిమాలంటే ఆసక్తి ఉండేది. ఈమె తన పన్నెండవ యేట కుటుంబ సన్నిహితుడు అచ్యుతరామయ్య ప్రోద్బలంతో మొట్టమొదటి సారి సంపూర్ణరామాయణం సినిమాలో సీత వేషం వేసింది. తరువాత దశావతారములు సినిమాలో మోహిని, మాయ శశిరేఖ పాత్రలు ధరించింది[2]. ఆ తర్వాత ఈమెకు అనేక సినిమాలలో నటించే అవకాశం లభించింది. జెమిని సంస్థలో పర్మనెంటు ఆర్టిస్టుగా నెలకు 200 రూపాయల జీతంతో చేరి 18 ఏళ్ళపాటు ఆ సంస్థ నిర్మించిన తమిళ, తెలుగు, హిందీ సినిమాలలో విరివిగా నటించింది. ఈమె చెల్లెలు సూర్యప్రభ కూడా సినిమా నటిగా రాణించింది. ఆమె వేదాంతం రాఘవయ్యను వివాహం చేసుకుంది. పుష్పవల్లి జెమినీ గణేశన్ను ప్రేమించి పెళ్ళి చేసుకుంది. అప్పటికే జెమినీ గణేశన్‌కు పెళ్ళి అయింది. ఈమె కూడా ఈ పెళ్ళికి ముందు రంగాచారిని వివాహం చేసుకుంది. అయితే ఆ పెళ్ళి మూడునాళ్ల ముచ్చట అయ్యింది. జెమినీ గణేశన్‌కు ఈమెకు బాబ్జీ, భానురేఖ, రమ, రాధ, ధనలక్ష్మి అనే సంతానం కలిగారు. వీరిలో భానురేఖ రేఖ పేరుతో హిందీ సినిమా రంగంలో ఒక తారగా వెలుగునొందింది. పుష్పవల్లి జెమినీ గణేశన్‌ల వైవాహిక జీవితం సాఫీగా సాగలేదు. ఈమె 1992 మే 11న మరణించింది.

కొన్ని వివాదాల గురించి రూపవాణి పత్రికకు పుష్పవల్లి వ్రాసిన ఒక లేఖను ఇక్కడ చూడవచ్చు

చిత్ర సమాహారం
· పెంపుడు కొడుకు

· వరవిక్రయం

· సంపూర్ణ రామాయణం (1936 సినిమా) – సీత

· దశావతారములు – మోహిని, మాయా శూర్పణఖ

· విశ్వమోహిని

· వింధ్యరాణి

· చూడామణి

· పాదుకా పట్టాభిషేకం

· చల్ మోహనరంగా

· మోహినీ భస్మాసుర – మోహిని

· మాలతీ మాధవం

· సత్యభామ (1942) – సత్యభామ

· బాలనాగమ్మ – సంగు

· సుడిగుండాలు

· తారాశశాంకం (1941)

పుష్పవల్లి అనగానే ఎవరన్నది వెంటనే బుర్రలో వెలగకపోవచ్చు. బాలీవుడ్ వెండితెర మీద ఎవర్ గ్రీన్ హీరోయిన్ రేఖ తల్లి- పుష్పవల్లి అని చెబితే తెలుస్తుందేమో. అలనాటి ఆ అందాల పాలవెల్లి పుష్పవల్లి పుట్టినరోజు ఈ రోజు (జనవరి 3).

“పెళ్లైన వాడు ప్రేమలో పడితే అది పెళ్లికి పరీక్షో… ప్రేమకు పరీక్షో! ఇది నిజం సావిత్రి, నా గతం నిజం, నా ప్రేమ నిజం,” అంటాడు జెమినీ గణేషన్, సావిత్రితో (మహానటి సావిత్రి బయోపిక్ ‘మహానటి’ సినిమాలో)“మనసులో నువ్వే ఉన్నావు అమ్మాడి. పెళ్లి నాకు కావాలనుకొని జరగలేదు, ప్రేమ నేను ఆపాలనుకున్నా కుదరలేదు. ఇంకో జన్మలో ఒకటౌతామని హామీ ఇస్తే నేను ఇప్పుడే సంతోషంగా చచ్చి… మళ్లీ పుడతా”నంటాడు జెమినీ. ‘మనలాంటి ప్రేమ అందరికీ దొరకదు…’ అని తెలుగులో చెబుతాడు రీల్ లో; రియల్ గా ఏ భాషలో ఏమిచెప్పాడో గానీ, సావిత్రిని 1952లో పెళ్లి చేసుకున్నాడు జెమిని. కానీ, అప్పటికే పుష్పవల్లితో రిలేషన్ లో ఉన్నాడు.ఎవరీ పుష్పవల్లి? జెమినీకి ఎప్పుడో పెళ్లయ్యిందని తెలిసి కూడా అతనితో ఎలా సహజీవనం చేసింది? సావిత్రితో పెళ్లయ్యాక జెమినితో పిల్లలు కూడా ఎలా కన్నది? ఎవరైనా పూనుకొని తీస్తే పుష్పవల్లి జీవితం కూడా ప్రేమ- తెగువ- త్యాగాల మయమే.
పుష్పవల్లిగా ప్రసిద్ధమైన కందాళ వెంకట పుష్పవల్లి తాయారు – తాడేపల్లిగూడెం దగ్గరలో ఉన్న పెంటపాడు గ్రామంలో 1926, జనవరి 3వ తేదీన కందాళ తాతాచారి, రామకోటమ్మ దంపతులకు జన్మించింది. చదివింది ఐదవ తరగతి వరకే అయినా, చిన్న వయసు నుంచే అభినయం, నాట్యం, ఇంకా సినిమాల మీద ఇష్టం ఉండేది. తన పన్నెండవ యేట కుటుంబ సన్నిహితుడు అచ్యుతరామయ్య ప్రోద్బలంతో మొట్టమొదటి సారి ‘సంపూర్ణరామాయణం’ సినిమాలో సీత వేషం వేసిందామె. తరువాత ‘దశావతారములు’ సినిమాలోమోహిని, మాయ శశిరేఖ పాత్రలు వేసింది. ఆ తర్వాత ఆమెకు అవకాశాలు పెరిగాయి. జెమిని సంస్థలో పర్మనెంటు ఆర్టిస్టుగా నెలకు 200 రూపాయల జీతంతో చేరి 18 ఏళ్ళపాటు ఆ సంస్థ నిర్మించిన తమిళ, తెలుగు, హిందీ సినిమాలలో విరివిగా నటించింది.

చెల్లెలు సూర్యప్రభ కూడా సినిమా నటిగా రాణించింది. ప్రముఖ దర్శకుడు వేదాంతం రాఘవయ్యను సూర్యప్రభ వివాహం చేసుకుంది. జెమినీ గణేశన్ ను ప్రేమించడానికి ముందు పుష్పవల్లికి రంగాచారి అనే వ్యక్తితో వివాహం అయ్యింది. అతనితో విడిపోయాక, జెమినీతో సహజీవనం చేసి, జెమినీ సావిత్రిని పెళ్లి చేసుకున్నాక కూడా పిల్లల్ని కన్నది. పిల్లల ఆలనాపాలనా జెమినీ పట్టించుకోకపోయినా, ఐదుగురు సంతానం బాబ్జీ, భానురేఖ (బాలీవుడ్ నిన్నటి తరాల హీరోయిన్ రేఖ), రమ, రాధ, ధనలక్ష్మిలను తీర్చిదిద్దింది. ప్రేమకోసం సినిమా కెరీర్ ని, పిల్లల కోసం జీవితాన్ని ఫణంగా పెట్టిన ఆ అమృతవల్లి – పుష్పవల్లి 1992 మే 11న, తన 66 వ ఏట కన్నుమూసింది.
పుష్పవల్లి 9 సంవత్సరాల వయస్సులో చిత్ర పరిశ్రమలో తన కెరీర్‌ను ప్రారంభించింది. ఆమె సంపూర్ణ రామాయణం (1936)లో సీత పాత్రను పోషించింది. పుష్పవల్లి మొదటి జీతం మూడు రోజుల షూట్ కోసం రూ. 300. ఆ సమయంలో ఆమె అగ్ర నటి. షూటింగుల వల్ల ఆమె ప్రాథమిక విద్య మాత్రమే పూర్తి చేశారు.

రేఖ తల్లి 1940లో IV రంగాచారి అనే న్యాయవాదిని వివాహం చేసుకుంది. తరువాత వాళ్ళు విడిపోయినట్లు వార్తలు వచ్చాయి. పుష్పవల్లి 1947లో ‘మిస్ మాలిని’ సెట్స్‌లో జెమినీ గణేషన్‌ను కలిశారు. ఆ తర్వాత చక్రధారి (1948) సినిమాలో కూడా కనిపించారు. తరువాత వీరిద్దరూ వివాహం చేసుకోకుండానే కలిసి ఉన్నారు. కొన్నేళ్ల తరువాత ఇద్దరూ విడిపోయారు.

1995లో పుష్పవల్లి భాగస్వామి జెమినీ గణేశన్ ప్రముఖ నటి సావిత్రిని వివాహం చేసుకున్నారు. ఆ సమయంలో మహిళలకు విడాకులు అనుమతించబడని కారణంగా పుష్పవల్లి జెమినిని వివాహం చేసుకోలేకపోయింది. కానీ అదే ఆమెకు మంచిది అయ్యింది. ఎందుకంటే సావిత్రి పరిస్థితి ఏమయ్యిందో తెలిసిందే కదా ! లేదంటే సావిత్రి పరిస్థితిలో పుష్పవల్లి ఉండేదేమో… ఆమె చివరి చిత్రం 1969లో వచ్చిన ‘బంగారు పంజరం’. ఈ చిత్రంలో పుష్పవల్లి చాలా చిన్న పాత్రలో నటించారు. పుష్పవల్లికి మొత్తం 5 మంది పిల్లలు… అందులో ఇద్దరు జెమిని కుమార్తెలు. ఆమెకు ఒక కుమారుడు బాబ్జీ, కుమార్తెలు రమ, ధనలక్ష్మి, రేఖ, రాధ. పుష్పవల్లి 1992లో మధుమేహం కారణంగా మద్రాసులో మరణించింది.

1967లో బి ఎన్ రెడ్డి గారి దర్శకత్వం లో వచ్చిన రంగులరాట్నం సినిమాలో కాకరాల కు అక్కగా పుష్పలత నెగటివ్ షేడ్ కారెక్టర్ పోషించింది

68-స్వతంత్రా వారి చిత్ర ఎంబ్లెమ్ -సూర్య ప్రభ

సూర్యప్రభ భారతీయ సినిమా నటి. ఆమె తెలుగు, తమిళ చిత్రాలలో నటించింది.సినిమా నటి పుష్పవల్లి ఈమెకుఅక్క . దర్శకుడు వేదాంతం రాఘవయ్య ఈమె భర్త. ఈమెకు ఏడుగురు సంతానం. 6 మంది కూతుళ్ళు ఒక కుమారుడు. వారిలో శుభ సినిమా నటిగా రాణించింది

జీవిత విశేషాలు
ఆమె పెంటపాడులో 1930లో జన్మించింది. ఆమె తండ్రి కందాళ తాతాచారి. ఆమె అక్క పుష్పవల్లి సినిమా నటన వృత్తిగా స్వీకరిచడం సూర్యప్రభ జీవితంలో ముఖ్య పరిమాణం తీసుకొచ్చింది. చిన్నతనంలోనే అక్కతొ బాటు మద్రాసుకు వెళ్ళింది.

నటనలో సూర్యప్రభ మొదటి అనుభవం రంగస్థలం మీదే. 1944 వ సంవత్సరంలో ఆంధ్ర మహిళా సభ వారు “అనార్కలి” అనే నాటకాని ప్రదర్శించారు. ఆ నాటకంలో ఆమె రాణి పాత్ర పోష్ంచింది.

ఆంధ్ర మహిళ సభలోనే ఆమె సామ్రాజ్యం వద్ద నాట్యం చేర్చుకోవడం ప్రారంభించింది. తర్వాత వేదాంతం రాఘవయ్య వద్ద నేర్చుకుంది.

ఆమె ప్రారంభంలో తమిళ సినిమాలో నటించింది. “మిస్ మాలిని” ఆమె మొదటి చిత్రం. అక్క చెల్లెళ్ళు ఇద్దరూ ఈ చిత్రంలో నటించారు[1]. తర్వాత చిత్రం “చక్రధారి”. తెలుగు సినిమాలో మొదటి సారి స్వతంత్రా వారి “ద్రోహి”లో కనిపించింది. ఆ చిత్రంలో ఆమె నటించలేదు. కంపెనీ ఏంబ్లంగా నిలబడ్డది. ఆమె మొదటి చిత్రం ప్రతిభావారి “లక్ష్మమ్మ”. తిలోత్తమలోనూ, వినోదా ప్రొడక్షన్స్ వారి చిత్రంలోనూ, “మంగళ” లోనూ ఆమె నటించింది[2].

చిత్రసమాహారం
· మిస్ మాలిని(తమిళం) – 1947[4]

· చక్రధారి (తమిళం)[5]

· అపూర్వ సహోదరులు

· శ్రీ లక్ష్మమ్మ కథ

· లావణ్య (తమిళం)

· మంగళ – 1951

· తిలోత్తమ -1951

· స్త్రీ సాహసము – 1951

· రూపవతి -1951

· 1961లో సూర్య కళ రాజరాజేశ్వరి వారి ఉషా పరిణయం సినిమాలో ఉషకు చెలికత్తెగా నటించి ఉషా అనిరుద్ధుల వివాహానికి ముఖ్య కారకురాలైంది .

· దర్శకుడు కడారు నాగభూషణం .సంగీతం సాలూరు హనుమంతరావు .జమున ,కాంతారావు రంగారావు ముఖ్య పాత్రధారులు .పాటలన్నీ సూపర్ హిట్

సాహిత్యం సదాశివ బ్రహ్మం .

సశేషం

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -13-2-22-ఉయ్యూరు

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in సినిమా and tagged . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.