శతాధిక బెంగాలీ గ్రంథ కర్త –బుద్ధ దేవ బోస్ -4(చివరిభాగం )
కవిత్వానికీ ,కాల్పనికసాహిత్యానికి మధ్య విభజన రేఖ బాగా తెలిసినవాడు బుద్ధ దేవ్ .నవలను సాహితీ మిశ్రమం అంది వర్జీనియా ఉల్ఫ్.ఇది బుద్ధ దేవ్ కు సరిగ్గా సరిపోతుంది .విశ్వజనీన సంఘటనాత్మక సమన్వయము తో నూతన సంప్రదాయాన్ని సృష్టించుకొన్నాడు .తన నవలను ‘’నవ్యోపన్యాస’’అన్నాడు .ఈతని నవలలు పటిష్టంగా ఉంటాయి .సంఘటనతో పాటు మనో విశ్లేషణకు ప్రాధాన్యమిస్తాడు .18వ శతాబ్ది ఇంగ్లీష్ నవలనుంచి ఎన్నో సూక్ష్మాలు గ్రహించాడు .లేఖాత్మకం గా ,స్మృతి రేఖాత్మకంగాపాత్రల ఆ౦తరంగిక స్వభావాలను వ్యక్తం చేస్తూ రాశాడు .నేచరలిజాన్ని నిరసించాడు .అతడి మానవమూర్తి సర్వ సాధారణ కళానైశిత్యమున్నవాడు .ఇతి వృత్తం కళాకారుని మూర్తి మత్వమే .అతనిది స్థానిక హద్దుల్ని దాటే ప్రాపంచిక దృష్టి .ఆడెన్ చెప్పినట్లు పరిపూర్ణ అస్తిత్వం మృత్యువు లోనే ఉంటుంది .మన్మధుని స్త్రీరూపావతారం అని అనటం అసంబద్ధ అతిశయోక్తి అంటాడు .సదానవల తర్వాత ,హృదయాన్ని ఇచ్చిపుచ్చుకో నవల రాశాడు .ఇందులో వ్యంగ్యోక్తులు గుప్పించాడు .సూర్యముఖి, రూపాళీసఖి ,పరస్పర ,లాల్ మేఘ ,శోభనం గది వగైరాలన్నీ జీవన గాధలే .బిసార్ పిల్ ,వనశ్రీ లలో బయటి అంశాలను సవివరంగా రాశాడు .’’మొగాళ్ళు అలసినప్పుడు పెళ్లాడితే ,ఆడాళ్ళు కుతూహలం తో పెళ్లాడుతారు ‘’అంటాడు ఆస్కార్ వైల్డ్ లాగా .ఒకనవల నాటకంగా మలిచాడు .ఆయన గొప్పనవల 1949లో రాసిన ‘’తిథి రార్’’.మధ్యతరగతి జీవిత చిత్రణ ఉంది .ఇ.ఎం.ఫారేష్టర్ పధ్ధతి అనుసరించాడు .మనముందు ఒక పటిష్టమైన ఆకారం ఉందనే భ్రాంతి మరువకూడదు .దీని చుట్టూ కథ తిప్పాలి అనేది అతని భావన .ఇందులో 18వ శతాబ్ది ఇంగ్లీష్ స్టైల్ ఉంది .ఇతనినవల చదువుతుంటే జేమ్స్ జాయిస్ నవల’’పోర్ట్రైట్ ఆఫ్ ఎ యాంగ్ మాన్ ‘’ గుర్తుకొస్తుంది .నాగరకతకు ,కళకు ఉన్న తేడాను స్పష్టంగా వ్యక్తీకరించాడు .అందుకే బెంగాలీసాహిత్యం లో మకుటం లేని నవలారాణి అయింది ఈనవల .
బుద్ధ దేవ్ కథలూ ఇదే ప్రణాళికలో ఉంటాయి .చలిత్ భాషలో గ్రామీణ పాత్రలు మాట్లాడతాయి .నవలగా నాటకం గా భాసి౦చేట్లు కధలు రాశాడు .కధలన్నీ గొప్ప పేరు పొందినవే .అమరాతిన్జన్ కథ ఇంగ్లీష్ జర్మన్ భాషలలోకిఅనువాదం పొందింది .ఆనంద నిలయం, నువ్వు బాగున్నావా లు జర్మన్ లోకి అనువాదాలైనాయి .బాలకథలూ అత్యంత ఆదరణ పొందాయి .’’పిల్లల కోసం ఉత్తమ కథలు ‘’సంకలనం నిర్వచనానికే హై లైట్ అయింది .
సహజ భావకవి కనుక నాటకం పై మొదట్లో దృష్టిపోలేదు .అతని దృష్టిలో హృదయం పొందిన నాగరకతే అత్యంత విలువైనది .కాలేజిరోజుల్లో ‘’అమ్మాయి కోసం ‘’అనే ఏకాంకిక రాశాడు.మొదటి పౌరాణిక నాటకం ‘’రావణ ‘’.శుద్ధ వ్యావహారికం లో రాశాడు .ప్రదర్శనకు నోచుకోలేదు .అనేకరకం అనే నాటకం లో ఫిక్షన్ కు నాటకానికి ఉన్న బంధం తెగకొట్టి సాహిత్యం కేవలం వినోదం కోసమేకాదు అని తెలియజేశాడు.అతడి రేడియో నాటికలూ బాగా క్లిక్ అయ్యాయి .సృజనాత్మక ప్రక్రియలద్వారా బుద్ధ దేవ బోస్ సంపూర్ణ వ్యక్తిత్వాన్ని ప్రదర్శించి ,భారతీయసాహిత్య నిర్మాతలలో ఒకడుగా గుర్తింపు పొందాడు .
ఆధారం –అలోక్ రంజన్ దాస్ గుప్త ఇంగ్లీష్ లో రాసిన దానికి డా ఆవంత్స సోమసుందర్ అనువాదం చేసిన –‘బుద్ధ దేవ బోస్ ‘’.
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -13-2-22-ఉయ్యూరు