కోటి లింగ శతకం
కోటిలింగ శతకాన్ని శ్రీ సత్యవోలు అప్పారావు గారు రచించగా 1912లోరాజమండ్రి లోని మనోరమా ,బ్రౌన్ ఇండష్ట్రియల్ ముద్రాక్షర శాలలో ముద్రింపబడింది .వెల-మూడు అణాలు .ఈశతకం రాజమండ్రి లోని ‘’మానవ సేవా ‘’పత్రికలో మొదట ప్రచురించబడింది .పత్రిక సంపాదకులు శ్రీ నాళం కృష్ణారావు గారు ,శ్రీసత్యవోలు అప్పారావు గార్లు .ఈ పత్రిక సంవత్సర చందా 3రూపాయలే .అభిమానులు 5రూపాయలు ,పోషకులు 10రూపాయలు ,రాజపోషకులు వారి వదాన్యత బట్టి చేరవచ్చు .ఈ పత్రిక ప్రచురణలు –కబీరు, బంగాళాదుంప ,అగ్గిపెట్టెల పరిశ్రమ ,లోకపావన శతకం ,కోటిలింగ శతకం ,స్త్రీలకు మనం చేసే పంచ మహాపాతకాలు ,వీరమతి నాటకం ,కవికొండల వెంకటరావు గారు రాసిన ‘’భారతీయ సందేశం’’ భాణ0,భక్తీ తరంగిణి ,.ఇవన్నీ చాలా తక్కువ ధరలకే అందిస్తున్నట్లు ఈ శతకం లో రాశారు .
కోటిలింగ శతకం సీసపద్యాల శతకం .’’కుటిల జనభంగసత్సంగ కోటిలింగ’’మకుటం .’’శ్రీల చెలంగు నీ క్షితి జీవరాసులసతతంబు గాపాడు సామి ఎవరో ‘’అని మొదలుపెట్టి మొదటి పద్యాన్ని –కలిసిమెలసి యుండు నరులకు గష్ఠంబు లుండ కున్నే –కుటిల జనభంగ సత్సంగ కోటిలింగ ‘’అని ముగించారుకవి .అన్ని పదార్ధాలు సమకూర్చి జీవులను కృపామతి చూసే పంట కాపు ,అంధకారాన్ని పోగొట్టే చందమామ ,మనసులో జ్ఞాతేజం కూర్చే ప్రభాకరుడు శాంతాది గుణాలిచ్చే సంప్రదాత,ఉన్నవాడు లేడను కొన్నవాడు మానసోద్యానంలో విహరిన్చేవాడు అని రెండో పద్యం .ధర్మ సత్య శౌచాలు లేకుండా ఎన్ని తపాలు జపాలు చేసినా ప్రయోజనం లేదనీ ,దేహం అస్థిరం అని తెలుసుకోవాలని ,స్నానాలు ఉపవాసాలు చేస్తే మోక్షం రాదు నీటిలో ఉండే చేపలు మోక్షం పొందుతాయా అన్నాడు .సాధువుల వద్ద కుటిలాత్ముల ఆటలు సాగవు ,నడవడి సరిగ్గా లేకపోతె ప్రక్కవారిని మోసం చేస్తారు,పరమపావనులైనా పడతి కనిపిస్తే మదనార్తి పొందుతారు ,తుంటరి వారి వెంట వెళ్ళరాదు.పలుగాకితో ఉండే పండితుడు కోతిచేతిలో పువ్వు ,పాము నోట్లోకప్ప ,చలిచీమల మధ్య పాము ,పాదరసంలో ఈదులాడే బంగారం అని జాగ్రత్తలు చెప్పాడు . అంతాఒక్కటే అనుకొంటే సహనం ,బీదల్ని ఆదరిస్తే పిసినిగొట్టుతనం ,విద్యా బుద్ధులు నేర్పిస్తే గర్వం ,మరులు చిక్కబెడితే ,మన్మధుడు పారిపోతారు పతిలేని భామ అడవి కాసిన వెన్నెల ,ఆడవారిని చులకన చేస్తే నష్ట పోతారు ,కార్యసాధకుడు ఏది లేకపోయినా బాధపడడు ,దూరదేశం వెళ్ళటానికి సందేహించడు .
మకరందాన్ని చిమ్మే మల్లెపువ్వును గొంగళి పురుగు కొరికినట్లు క్రోమ్మావి పండ్లను చిన్నచీమలుకొరికినట్లు ,కమలాల మకరందాన్ని తేనే టీగలు ఇష్ట మోచ్చినట్లు జుర్రినట్లు ‘’పరమ పావనులగు వారి పజ్జ జేరి సద్గుణంబుల గ్రహియింప జాలని దుర్జనులు ‘’అన్నాడు .విత్తమార్జించే వేళ మావాడని బంధువులు మూగుతారు,భాగ్యం ఉంటె పరమపావనుడు అని పొగుడుతారు ,లేమికలిగితే దగ్గరకు కూడా రారు పలకరించరు.భాగ్య వంతులమని గొప్పలు చెబుతారుకానీ పిల్లికి బిచ్చం పెట్టరు .కాషాయం రుద్రాక్ష మాలలు ధరిస్తే మనసులోని చెడు తొలగిపోదు .బాల్యం లోఆటలపై ,యవ్వనం లో తరుణులపై కౌమారం లో కడగండ్లు ,.బ్రతికి ఉన్నప్పుడు బ్రహ్మ౦ గురించి ఆలోచించరు ,దారిద్ర్య దేవతను తరమాలంటే చేతి పనులు నేర్వాలి .బ్రహ్మా౦డమంతా ప్రజ్వరిల్లుతూ మానస వీధిలో ఉండేది ,అణురూపంపొంది అనవరతం చావు పుట్టుక లేక జరిగేది ,పుత్ర మిత్రాదుల రూపంలో దేహం లో తిరిగేది ఆదిమధ్యాంత శూన్యమైనది అయిన పరమాత్మ నిత్యం అని బోధ చేశాడు .చివరగా 100వ పద్యం లో –
‘’కస్తూరికార్ణవ గర్భ వీచిమ తల్లి కడుపార నెవ్వాని గన్నతల్లి –దీన జనంబుల సీమ మానససీమ లెవ్వడు ఫలియింప గ జేయు కాపు పంట
విద్యార్ధి వత్సల వెత దీర్చి ఎవ్వాడు పరితుష్టి నొందించు పాడి మొదవు –ఆర్తజనంబుల ననిశంబు నెవ్వాడు కరుణమై కాపాడు కల్ప శాఖి
యతడు వెలుగొందు రామరావనగ బుధులు –కరము నొగడగ గొ౦గు బంగారమౌచు
వానికిది పూలహారమై వరలుగాక –కుటిల జనభంగసత్సంగ కోటి లింగ’’
ఆ రామారావు ఎవరో చెప్పలేదు .కోటిలింగం శతకమే కానీ ఏ లింగాన్నీ పేర్కొనలేదు .శతకమంతా మానవ విలువలగురించి చెప్పాడు కవి .కవిత్వం ఉరకలు వేసింది .మనసును తాకే పద్యాలే ఇవిచదివిఆచరిస్తె మానవత్వం వికసించి జగతి గొప్ప అభి వృద్ధి చెందుతుంది .ఈశాతకమూ ఈకవిపేరు మన వాళ్ళు ఎవరూ ఎక్కడా ముచ్చటించిన దాఖలాలు లేవు .నాళం కృష్ణారావు గారి గురించి లోకానికి బాగా తెలుసు .ఈ శతకం ,ఈ కవినీ పరిచయం చేసే భాగ్యం నాకు కలిగింది
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -14-2-22-ఉయ్యూరు