మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-69
69-జయదేవుని అష్ట పదులకే కాక ‘’చల్లని రాజా ఓ చందమామ ‘’సినీగీతానికీ ఫేం ,సంగీత విద్వాంస దర్శకుడు ,తొలిఫ్రెంచ్ పురస్కార గ్రహీత –పద్మశ్రీ రఘునాద్ పాణి గ్రాహి
రఘునాథ్ పాణిగ్రాహి ప్రఖ్యాత భారతీయ శాస్త్రీయ సంగీత విద్వాంసుడు, సంగీత దర్శకుడు. ఇతడు ఆలపించిన జయదేవుని గీతాగోవిందం ఇతనికి ఎంతో పేరు తెచ్చిపెట్టింది
విశేషాలు
ఇతడు 1935, ఆగస్టు 10న ఒరిస్సాలోని రాయగడ జిల్లా గునుపూర్‌లో జన్మించాడు. ఇతడు తన తండ్రి నుండి సంగీతం నేర్చుకున్నాడు. గీతా గోవిందం ఆలాపనా విధానాన్ని కూడా తండ్రి నుండే పుణికిపుచ్చుకున్నాడు. ఫ్రెంచి ప్రభుత్వ సత్కారం పొందిన తొలి ఒడియా గాయకుడు ఇతడే[1]. 2010లో ఇతడిని భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. ఇతడి భార్య ప్రముఖ ఒడిస్సీ నృత్య కళాకారిణి సంయుక్త పాణిగ్రాహి[1]. ఈమె 1997లో మరణించింది. ఇతడు తన భార్య పేరుతో సంయుక్త పాణిగ్రాహి ట్రస్టును ప్రారంభించి ఒడిస్సి నృత్య కారులకు ఎంతో చేయూతనిచ్చాడు. వారి ద్వారా ఒడిస్సీ నాట్యానికి ప్రపంచ గుర్తింపు తీసుకువచ్చాడు.
సినిమా రంగ౦
ఇతడు 1950వ దశకం నుండి తెలుగు, కన్నడ, ఒరియా సినిమాలకు నేపథ్య సంగీతాన్ని అందించాడు.
ఇతడు పనిచేసిన తెలుగు సినిమాల వివరాలు[2]:
క్రమ సంఖ్య | సినిమా పేరు | పాట పల్లవి | సహ గాయకుడు/ గాయని | సంగీత దర్శకుడు | గేయ రచయిత | సినిమా విడుదలైన సంవత్సరం |
1 | అమర సందేశం | మానస లాలస సంగీతం మధుమయ జీవన | ఎ.ఎం.రాజా | ప్రసాదరావు, కేల్కర్ | 1954 | |
2 | సంఘం | ఆడదంటే అలుసు కాదోయి అవనిలో దేవతోయ్ | ఆర్.గోవర్ధనం | తోలేటి | 1954 | |
3 | సంతోషం | నిలుపరా మదిలోన హరిని నిరామయుని దయాకరుని | ఎమ్మెస్ విశ్వనాథన్, వి.రామ్మూర్తి | సముద్రాల సీనియర్ | 1955 | |
4 | సంతోషం | యువతి మోహన మూర్తి నీ ప్రియసఖి చెరగ రారా | జిక్కి | ఎమ్మెస్ విశ్వనాథన్, వి.రామ్మూర్తి | సముద్రాల సీనియర్ | 1955 |
5 | ఇలవేల్పు | ఏనాడు కనలేదు ఈ వింత సుందరిని | సుసర్ల దక్షిణామూర్తి | 1956 | ||
6 | ఇలవేల్పు | చల్లని రాజా ఓ చందమామ | పి.సుశీల, పి.లీల | సుసర్ల దక్షిణామూర్తి | శ్రీశ్రీ | 1956 |
7 | సంకల్పం | తప్పుడుపనులెప్పుడు మనకోద్దుర బాబు | పిఠాపురం బృందం | సుసర్ల దక్షిణామూర్తి | 1957 | |
8 | సంకల్పం | వెన్నెల తెలికాంతులలో చల్లగాలి దారులలో | సుసర్ల దక్షిణామూర్తి | 1957 | ||
9 | గంగా గౌరీ సంవాదం | భలే భలే పెళ్ళి జరుగదిల మళ్ళి | ఎస్.జానకి, ఎం.ఎస్.రామారావు బృందం | పెండ్యాల | పరశురామ్ | 1958 |
10 | జయభేరి | మది శారదాదేవి మందిరమే | ఘంటసాల, పి.బి.శ్రీనివాస్ | పెండ్యాల | మల్లాది రామకృష్ణశాస్త్రి | 1959 |
11 | మైరావణ | మెల్ల మెల్లగా మేను తాకకోయీ చల్లగా చల్లగా | ఎస్.జానకి | ఎస్.రాజేశ్వరరావు | ఆరుద్ర | 1964 |
మరణ౦
ఇతడు తన 80వ యేట 2013, ఆగస్టు 13వ తేదిన గుండెపోటుతో భువనేశ్వర్ లోని స్వగృహంలో మరణించాడు[1
జయభేరి సినిమాకి పెండ్యాల నాగేశ్వరరావు సంగీత సారధ్యం వహించాడు. పాటలు ప్రధానంగా మల్లాది రామకృష్ణశాస్త్రి రాయగా, ఒక్క పాటను మాత్రం శ్రీశ్రీ రాశాడు.[1] ప్రధాన పాత్రల వృత్తులు, ప్రవృత్తులు, కథ అంతా సంగీతం చుట్టూ తిరగడంతో సినిమాలో సంగీతానికి ప్రత్యేకమైన ప్రాధాన్యత ఏర్పడింది. దీనివల్ల సినిమాలో 14 పాటలు, పద్యాలు ఉన్నాయి.[2]
· రసికరాజ తగువారము కామా: రాజసభలో కథానాయకుడు తన ప్రతిభకు పరీక్షాఘట్టం ఏర్పడినప్పుడు పాడే సందర్భం ఈ పాటది.[3] రాజసన్మానానికి అర్హమైన స్థాయిలో పెండ్యాల స్వరపరచగా, ఘంటసాల ఆలపించాడు.[4][5] కానడ,[6] చక్రవాక రాగాలను మేళవించి రూపొందించిన విజయానంద చంద్రిక అనే రాగంలో దీన్ని స్వరపరిచాడు పెండ్యాల. కానడ-చక్రవాక రాగాలను కలిపి, రిషభ గాంధారాలు మూడు స్థాయిల్లో వచ్చేలా కొత్తగా రూపకల్పన చేసిన ఈ రాగానికి సినిమాలో సందర్భపరంగా మహారాజు పేరు మీదుగా విజయానంద చంద్రిక అన్న పేరు పెట్టారు. పాటలో స్వరప్రస్తారం అధిక భాగం సావేరి ఛాయల్లో సాగితే, 28 సెకన్ల పాట కొత్త రాగ లక్షణాలను బోధపరిచే ఆలాపన సాగుతుంది.[4] రసికరాజ తగువారము కామా పాటను ఘంటసాల పదిరోజుల సమయం తీసుకుని, వంద సార్లకు పైగా రిహార్సల్స్ చేసుకుని మరీ పాడాడు.[7] ప్రత్యేకించి మంద్రస్థాయిలో జంట స్వరాలను అత్యంత నిపుణంగా ఆలపించేందుకు ఇంత గట్టి సాధన చేశాడు. రాగస్వరూపం బోధపడేలా సాగాల్సిన ఆలాపన శాస్త్రీయ సంగీత సభల్లో గంట సేపు సాగితే, సినిమా అవసరం కోసం అరనిమిషానికి దాన్ని కుదిస్తూనే శ్రోతకు ఆ అనుభూతి అందించాల్సిన అత్యంత సంక్లిష్టమైన స్థితిని సంగీత దర్శకుడు పెండ్యాల, గాయకుడు ఘంటసాల సాధించడం విశేషం.[4]మది శారదాదేవి మందిరమే: ఘంటసాల, పి.బి.శ్రీనివాస్, రఘునాథ్ పాణిగ్రాహి ఈ పాటను ఆలపించారు. వీరిలో రఘునాథ్ పాణిగ్రాహి సినిమాలోనూ ఈ పాట పాడుతున్న వ్యక్తిగా కనిపించాడు.[2] మల్లాది రామకృష్ణశాస్త్రి ఈ పాటను రాయగా, పెండ్యాల నాగేశ్వరరావు కళ్యాణి రాగంలో స్వరపరిచాడు. కృతి గాయనం ఘంటసాలతో, స్వరకల్పన పి.బి.శ్రీనివాస్‌తో, ముక్తాయింపు రఘునాథ్ పాణిగ్రాహితో· ఇప్పించాడు పెండ్యాల
జయభేరి సినిమా సంగీతం విస్తృతంగా ప్రజాదరణ, ప్రత్యేకించి సంగీతాభిమానుల ఆదరణ పొందింది. ఈ సినిమా సంగీతం అత్యున్నత ప్రమాణాలను అందుకున్నదని విశ్లేషకుల ప్రశంసలు, సంగీతపరంగా “ఆల్ టైం హిట్” అన్న పేరు సంపాదించుకుంది.[9][2]
“రసికరాజ తగువారము కామా” పాట ఇటు పెండ్యాల సంగీత సారధ్యంలోనూ,[9] అటు ఘంటసాల ఆలపించిన పాటల్లోనూ అత్యుత్తమమైన పాటల్లో ఒకటిగా పేరు సంపాదించుకుంది.[10] దశాబ్దాల పాటు, వందలాది పాటలు పాడిన ఘంటసాల సినిమా కెరీర్లో, అందునా ప్రత్యేకించి పెండ్యాల నాగేశ్వరరావు ఘంటసాలతో పాడించుకున్న వందల పాటల్లో మరచిపోలేని రెండు పాటల్లో ఒకటిగా విశ్లేషకుడు విష్ణుభొట్ల లక్ష్మన్న పేర్కొన్నాడు.[6] “మది శారదా దేవి మందిరమే” పాట సినిమాలో విజయవంతమైన పాటల్లో ఒకటిగా నిలవడమే కాక కళ్యాణి రాగంలో వచ్చిన గొప్ప తెలుగు సినిమా పాటల్లో ఒకటిగానూ పేరు సంపాదించుకుంది.[4] “నందుని చరితము వినుమా” పాట 16 ఎం.ఎం. ప్రింట్ తీసుకుని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సాంఘిక సమానత్వం, కులనిర్మూలన అంశాలపై ప్రచారం కోసం వినియోగించుకుంది.[5] ఇలా ప్రభుత్వం ప్రచారం కోసం సినిమా గీతాలను వాడుకోవడం ఈ పాటతోనే మొదలు.[2]
ప్రళయపయోధిజలే – బాలమురళి – పాణిగ్రాహి – లీల
ఘంటసాల గారు పాడిన “జయజగధీశ హరే” అనే జయదేవులవారి అష్టపది అందరికీ విదితమే. రఘునాధ పాణిగ్రాహి గారి పేరు వినగానే మనకు గుర్తుకు వచ్చే పాట “చల్లని రాజా ఓ చందమామ”. ఇవాళ జయదేవులవారి అష్టపది “జయజగధీశ హరే” మంగళంపల్లి వారి, పాణిగ్రాహి గారి, లీల గారి గళాల్లో విడివిడిగా ఆస్వాదిద్
‘చల్లని రాజా’ ఇక లేరు
భువనేశ్వర్: ప్రముఖ సంగీత దర్శకుడు, గాయకుడు పండిట్ రఘునాథ్ పాణిగ్రాహి(80) తుదిశ్వాస విడిచారు. ఆయనకు ఇద్దరు తనయులు. గత కొద్దినెలలుగా గొంతు కేన్సర్‌తో బాధపడుతున్న రఘునాథ్ భువనేశ్వర్‌లోని తన నివాసం వద్ద చికిత్స పొందుతున్నారు. ఆదివారం ఉదయం 11.30 గంటలకు గుండెపోటు రావడంతో కుటుంబీకులు ఆయనను ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అయితే అప్పటికే మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. 1934, ఆగస్టు 10న ఒడిశాలోలోని కోరాపుట్ జిల్లా గుణుపూర్‌లో జన్మించిన రఘునాథ్ చిన్న వయసులోనే శాస్త్రీయ సంగీతంలో రాణించారు. గాయకుడిగా మంచి పేరు తెచ్చుకున్నారు. ఒరియా, తమిళం, తెలుగు, కన్నడ చిత్రాల్లో అనేక పాటలు పాడి అభిమానులను అలరించారు. ‘ఇలవేల్పు’ చిత్రంలో తన 19వ ఏటనే రఘునాథ్ పాటలు పాడటం విశేషం. ఆ సినిమాలో ఆయన పాడిన ‘చల్లని రాజా.. ఓ చందమామ..’ పాట ప్రేక్షకుల ఆదరణ పొందింది.
శ్రీకృష్ణుడిని కీర్తిస్తూ సంస్కృత కవి జయదేవుడు రాసిన ‘గీత గోవిందం’ గీతాల ద్వారా అశేష భక్తజనవాహినిని తన గానామృతంలో ఓలలాడించారు. ఈ గీతాలు ఒడిస్సీ సంగీత చరిత్రకే తలమానిక ంగా నిలిచాయి. దేశవిదేశాల్లో రఘునాథ్‌కు గుర్తింపు తెచ్చిపెట్టాయి. ‘గీతా గోవింద్’ ఆలపించినందుకు 70వ దశకంలో ఫ్రెంచ్ ప్రభుత్వం ఆయనను సత్కరించింది. ఈ సత్కారం పొందిన తొలి ఒడిశా గాయకుడు రఘునాథ్ కావడం గమనార్హం. సంగీతంలో ఆయన సేవలకుగాను భారత ప్రభుత్వం 2010లో పద్మశ్రీ పురస్కారంతో గౌరవించింది. రఘునాథ్ భార్య ప్రముఖ ఒడిస్సీ నృత్యకళాకారిణి సంజుక్త పాణిగ్రాహి. ఆమె 1997, ఆగస్టు 24న మరణించారు. శనివారం ఆమె వర్ధంతి. ఆ మరుసటి రోజే రఘునాథ్ మరణించడం విషాదం. మృదు స్వభావి, జంతు ప్రేమికుడైన రఘునాథ్.. తాను నివసిస్తున్న అశోక్‌నగర్‌లో వీధి కుక్కలను ఆదరించేవారు. శునకాలు జబ్బు పడినా గాయమైనా వాటిని ఆయన ప్రేమగా దగ్గరికి తీసుకుని సంరక్షించేవారు. రఘునాథ్ మృతి పట్ల ఒడిశా గవర్నర్ ఎస్సీ జమీర్, ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ సంతాపం తెలిపారు.
ఇల వేలుపు సినిమాలో రఘునాధ పాణి గ్రాహి శ్రీ శ్రీ రాసిన ‘’చల్లని రాజా ఓ చందమామ ‘’పాడినపాట దాదాపు రెండు మూడు దశాబ్దాలు ప్రతి ఇంట్లోనూ మారు మోగింది ఆ చల్లని వెన్నెలను మనసారా నింపుకొని గళం లో మధువు ల్లోలికెట్లు పాడాడు .సుసర్ల వారి సంగీతం అద్భుతం .విలన్ ఆ నటించే ఆర్ .నాగేశ్వరరావు ఇందులో సాఫ్ట్ కార్నర్ పాత్ర ఆశ్రమం లో ‘’నాన్నగారు గా గా నటించి బాగా మెప్పించాడు .లాగే జయభేరిలో ‘’రసిక రాజ ‘’పాటలో తనకిచ్చిన భాగాన్ని అద్భుతంగా నటిస్తూ గానం చేసి మెప్పించాడు పాణిగ్రాహి .ఆయన ‘’సంగీత రస పాణి గ్రాహి ‘’అనిపిస్తాడు .
‘’చల్లని రాజా ఓ చందమామ –నీ కధలన్నీ తెలిశాయి ఓ చందమామ –నా చందమామా
పరమేశుని జడలోన చామంతివి –నీలి మేఘాల నానేటి పూబంతివి –నిను సేవిన్చాగా దయచూడుమా
ఓ వెన్నెల నా వెన్నెల చందమామా
నిను చూసిన మనసెంతో వికసించుగా –తోలి కోరికలెన్నో చిగురిమ్చుగా –ఆశలూరించునే –చెలి కనిపించునే
చిరునవ్వుల వెన్నెల కురిపించునే
నను చూడవు పిలచిన మాటాడవు –చినదానాను అబలను ప్రియురాలను
నిన్నే కోరేనురా నన్న కరుణి౦చరా – ఈ వెన్నెల కన్నెతో విహరించరా.
సశేషం
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -14-2-22-ఉయ్యూరు