మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-70

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-70

70-శాస్త్రీయ సంగీత సుస్వరాల లీలాహేల సంగీత దర్శకురాలు  -పద్మ భూషణ్  కలైమామణి-పి.లీల

పొరయత్తు లీల (మే 191934 – అక్టోబరు 312005) దక్షిణ భారత నేపథ్యగాయని. మలయాళ చిత్ర రంగములో ప్రప్రథమ నేపథ్యగాయని. ఈమె తమిళమలయాళతెలుగు భాషల్లో ఆమె 15 వేలకు పైగా పాటలు పాడింది. తెలుగులో లవకుశమాయాబజారుపాండవవనవాసంరాజమకుటంగుండమ్మకథచిరంజీవులు తదితర సినిమాల్లో ఆమె పాడిన ఎన్నో పాటలు అత్యంత ప్రజాదరణ పొందాయి.[1]

లీల మే 191934లో కేరళలోని పాలక్కాడ్ జిల్లాకు చెందిన చిత్తూరులో సంగీతాసక్తి ఉన్న కుటుంబములో జన్మించింది. తండ్రి వి.కె.కుంజన్ మీనన్ ఎర్నాకుళంలోని రామవరం ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయునిగా పనిచేసేవాడు, తల్లి మీనాక్షి. ముగ్గురు అక్కాచెల్లెల్లలో (శారద, భానుమతి, లీల) లీల చివరిది. ఈమె సినిమాలలో రాకమునుపే శాస్త్రీయ సంగీతములో శిక్షణ పొందినది. తండ్రి కుంజన్ మీనన్ కు సంగీతంలో ఉన్న ఆసక్తితో ముగ్గురు కూతుర్లకు సంగీతంలో శిక్షణ ఇప్పించాడు. సంగీతకారుడు టి.వి.గోపాలకృష్ణన్ పెద్దనాన్న త్రిభువన మణిభాగవతార్ ఈమె మొదటి గురువు. ఈమె తన పదమూడో యేట 1947లో విడుదలైన తమిళ చిత్రము కంకణంతో సినీరంగప్రవేశం చేసింది. ఈమె పాడిన మొదటి పాట హెచ్.ఆర్.పద్మనాభశాస్త్రి స్వరపరిచిన శ్రీ వరలక్ష్మీ.. అంటూ మొదలయ్యే స్త్రోత్రం. ఈ తరువాత తెలుగు, కన్నడ చిత్రాలలో అనేక పాటలు పాడింది. 1948లో విడుదలైన నిర్మల చిత్రముతో లీలకు తొలిసారి తన మాతృభాషైన మలయాళంలో పాడే అవకాశం వచ్చింది. తెలుగులో ఈమె తొలి చిత్రం 1949లో విడుదలైన మన దేశం.

జన్మించింది కేరళ రాష్ట్రంలోని ఎర్నాకుళంలో నైనా, సంగీతం మీద పి. లీలకున్న అభిరుచి కారణంగా సంగీతం నేర్పించాలనే తలంపుతో పి. లీల తండ్రి మద్రాసులో మకాం పెట్టారు. ఆది నుంచి తెలుగువారి ప్రోత్సాహం పొందడం వల్ల తెలుగువారన్నా, తెలుగు భాష అన్నా లీలకు చాల ఇష్టం. శాస్త్రీయ సంగీతం నేర్చుకుంటూ తన తొమ్మిదో ఏడాదే సంగీతకచేరి చేసారు పి.లీల. ఆంధ్రమహిళా సభలో తొలిసారి సంగీత కచేరి చేసిన ఆమెకున తెలుగు భాషమీద అభిమానం. ప్రేమ పెరిగింది. ‘భక్త తులసీదాసు’ చిత్రంకి బృందగానంలో ఒకరిగా పాడారు. తరువాత ‘మనదేశం’ చిత్రంలో బాలా త్రిపురసుందరీ….. అనే పాటను ఘంటసాల ప్రోత్సాహంతో పాడారు. అప్పటికి తెలుగు మాట్లాడడం, అర్ధం చేసుకోవడం లీలకు తెలియదు. అందుకే మలయాళంలో ఆ పాట రాసుకుని పాడారట. తెలుగు భాష రాకుండా తెలుగు పాటలు పాడితే బాగుండదని తెలుగు నేర్చుకున్నారు. తెలుగువారి వల్లనే గాయనిగా తనకు ప్రముఖ స్థానం లభించిందని పి. లీల అనేవారు. ఆకాశవాణిలో కూడా పాటలు పాడుతున్న పి.లీలను చూసి తొలుత ‘కంకణం’ తమిళ చిత్రంలో పాడించారు. ఈ చిత్రంలో పాడటానికి ముందుగానే కొలంబియా గ్రామఫోన్‌ కంపెనీ సరస్వతి స్టోర్స్‌ పి. లీల పాడిన ప్రయివేటు గీతాలను రికార్డులుగా విడుదల చేసారు. సంగీత దర్శకుడు సి.ఆర్‌. సుబ్బరామన్‌ సంగీతం సమకూర్చే తమిళ చిత్రాలకు పాటలు పాడుతూ, ఆయన వద్దనూ శాస్త్రీయ సంగీతం నేర్చుకున్నారు లీల.

ఘంటసాల ప్రోత్సాహంతో ఆయన సంగీత దర్శకత్వం వహించిన ‘మనదేశం’ చిత్రంలో బాలా త్రిపుర సుందరి… పాట పాడటంతో తెలుగులో గాయనిగా ఆమె కెరీర్‌ ప్రారంభం అయింది. కీలుగుర్రంలో దిక్కు తెలియదేమి సేతు, గుణసుందరికథలో ‘ఓ మాతా రావా, మొర వినవా…’ ‘ఉపకార గుణాలయవై ఉన్నావు కదే మాతా …,’ కల్పకమ తల్లివై ఘనత వెలిసిన గౌరి…, ‘ఏ ఊరు ఏలినావో…’ శ్రీతులసీ ప్రియ తులసీ పాటలను, ‘పాతాళభైరవి’ చిత్రంలో ‘తీయని ఊహలు హాయిని గొలిపే వసంత గానమె హాయి. కలవరమాయె మదిలో, నా మదిలో, ఎంత ఘాటు ప్రేమయో…, ‘పెళ్ళిచేసి చూడు’లో ‘మనసా నేనెవరో, నీకు తెలుసా…’ ఏడుకొండలవాడా వెంకటరమణా, ఎవరో…ఎవరో, చంద్రహారంలో ‘దయ గనవే తల్లిd…’ కృప గనవా నా మొర వినవా…’ ఏ సాధువులు ఎందు హింసలు బడకుండ… అని సాగే పద్యం, ‘మిస్సమ్మ’లో ‘తెలుసుకొనవె చెల్లిd…’ ‘కరుణించు మేరిమాతా…’ ‘రావోయి చందమామా…’ ‘ఏమిటో ఈ మాయా…’ ‘మాయాబజార్‌’లో ‘నీవేనా నను తలచినది..’ ‘చూపులు కలసిన శుభవేళా…’ ‘విన్నావ యశోదమ్మా..’, ‘లాహిరి లాహిరి లాహిరిలో’, నీ కోసమే నే జీవించునది… పెళ్ళి నాటి ప్రమాణాలులో ‘వెన్నెలలోనే వేడి ఏలకో..’ నీతోనే లోకము, నీతోనే స్వర్గము, లాలి మా పాపాయి ఆనందలాలీ…’ ‘అప్పుచేసి పప్పుకూడు’లో ‘రామనామ శరణం, భద్రాద్రిరామ శరణం’, ‘ఎచట నుండి వీచినో ఈ చల్లని గాలి’, ‘సుందరాంగులను చూసిన వేళల…,’ ‘ఆనందం పరమానందం..’ ‘చేయి చేయి కలుపరావె హాయి హాయిగా…,’ గుండమ్మకథలో ‘వేషము మార్చెను…’ ముద్దుబిడ్డలో జయమంగళ గౌరీదేవీ… ‘పాండవ వనవాసం’లో దేవా దీనబాంధవా… వంటి పాటలు సోలో గీతాలుగాను, యుగళగీతాలుగాను పాడారు లీలగా. తెలుగు చిత్రరంగంలో నిలదొక్కుకోడానికి, తెలుగు గాయని కాబోలు అని అనిపించుకోడానికి ఘంటసాల ప్రధాన కారకులైతే, సి.ఆర్‌, సుబ్బరామన్‌, ఓగిరాల రామచంద్రరావు, విజయా కృష్ణమూర్తి, సుసర్ల దక్షిణామూర్తి, మాస్టర్‌ వేణు, టి.వి.రాజు, ఎస్‌.రాజేశ్వరావు, పెండ్యాల ఇలా పలువురు సంగీత దర్శకులు, విజయా సంస్థ , నిర్మాతలు, దర్శకుల ప్రోత్సాహం మరుపురానిదనేవారు పి.లీల.

తన సినీ జీవితములో అనేక అవార్డులు అందుకొన్న లీలకు 1969లో కేరళ ప్రభుత్వ ఉత్తమ నేపథ్యగాయకురాలు అవార్డు అందుకొన్నది. 1992లో తమిళనాడు ప్రభుత్వం లీలను కళైమామణి పురస్కారంతో సత్కరించింది.

లీలపాడిన పాటల్లో అందమె ఆనందం, ఆనందమె జీవిత మకరందం, ఏమిటో ఈ మాయా…, లవకుశలో సుశీలతో కలిసి పాడిన పాటలు ఎంతో హాయినిస్తాయి.

సావిత్రి దర్శకత్వంలో రూపొందిన ‘చిన్నారి పాపలు’ చిత్రానికి సంగీత దర్వకత్వం నిర్వహించారు.

సినిమా సంగీతంలో వచ్చిన మార్పులు, మెలొడీకి, సాహిత్యానికి ప్రాధాన్యత తగ్గి వాయిద్యాల హోరు పెరిగి పోవడంతో పాటలు తగ్గించారు పి. లీల. పాట పాడకుండా ఉండలేని స్థితి కారణంగా జమునారాణి, ఎ.పి. కోమల ప్రభృతులతో కలసి సినిమా పాటల కచేరి, శాస్త్రీయ సంగీత కచేరీలు నిర్వహించేవారు.

 • SIతన సినీ జీవితములో అనేక అవార్డులు అందుకొన్న లీల 1969లో కేరళ ప్రభుత్వ ఉత్తమ నేపథ్యగాయకురాలు అవార్డు అందుకొన్నది. 1992లో తమిళనాడు ప్రభుత్వం లీలను కళైమామణి పురస్కారంతో సత్కరించింది.

తెలుగు సినిమారంగం

ఈమె 1949 నుండి 1984 వరకు అనేక తెలుగు సినిమాలో పాటలు పాడింది. చిన్నారి పాపలు అనే చిత్రానికి సంగీతాన్ని సమకూర్చింది[2].

పి.లీల తెలుగు చిత్రాలలో పాడిన సినిమ పాటల పాక్షిక జాబితా:

క్రమ సంఖ్యసినిమా పేరుపాట పల్లవిసహ గాయకుడు/ గాయనిసంగీత దర్శకుడుగేయ రచయితసినిమా విడుదలైన సంవత్సరం
1మనదేశంబాలత్రిపురసుందరీఘంటసాల1949
2కీలుగుర్రందిక్కుతెలియదేమిసేతు దేవదేవా కావరావా దిక్కు నీవనుచు నమ్మిఘంటసాలతాపీ ధర్మారావు నాయుడు1949
3కీలుగుర్రంనిదురబో నాయన్న నిదురబో నా చిన్న నిదురబో నాయయ్య నిదురబోఘంటసాలతాపీ ధర్మారావు నాయుడు1949
4గుణసుందరి కథఉపకార గుణాలయవై ఉన్నావు కదే మాతా అపరాధములన్ని మరచిఓగిరాల రామచంద్రరావుపింగళి1949
5గుణసుందరి కథఓ మాతా రావా నా మొరవినవా నీవు వినా దక్కెవరే ఓ రాజరాజేశ్వరిఓగిరాల రామచంద్రరావుపింగళి1949
6గుణసుందరి కథకల్పగమ తల్లివై ఘనత వెలసిన గౌరి కల్యాణ హారతినిఓగిరాల రామచంద్రరావుపింగళి1949
7గుణసుందరి కథచిటి తాళం వేసినంటే చిట్టంటుడు చేసినంటేకస్తూరి శివరావుఓగిరాల రామచంద్రరావుపింగళి1949
8గుణసుందరి కథశ్రీతులసి ప్రియతులసి జయమునీయవే జయమునీయవేఓగిరాల రామచంద్రరావుపింగళి1949
9లైలా మజ్నుఅందాల చిన్నదాన బంగారు వన్నెదానా పిలుపుకె.జమునారాణిసి.ఆర్.సుబ్బరామన్సముద్రాల సీనియర్1949
10శ్రీ లక్ష్మమ్మ కథఇది నా విధికృతమా గతిమాలిన జన్మ యిల బాధలకేనాసి.ఆర్.సుబ్బరామన్1950
11శ్రీ లక్ష్మమ్మ కథచిన్నారి బంగారు చిలకవే నా తల్లి చిగురుమావులలోనబృందంసి.ఆర్.సుబ్బరామన్1950
12శ్రీ లక్ష్మమ్మ కథజీవితమే వృధాయౌనో సుఖించే ఆశలు మాసెనోబృందంసి.ఆర్.సుబ్బరామన్1950
13అగ్నిపరీక్షవసంత రుతువే హాయి మురిపించి మించెనోయిగాలిపెంచలకె.జి. శర్మ1951
14పాతాళ భైరవిఎంత ఘాటు ప్రేమయో ఎంత తీవ్ర వీక్షణమో కన్నుకాటుఘంటసాలఘంటసాలపింగళి1951
15పాతాళ భైరవికలవరమాయే మదిలో నా మదిలో కన్నులలోన కలలేఘంటసాలఘంటసాలపింగళి1951
16పాతాళ భైరవితీయని ఊహలు హాయిని గొలిపే వసంత గానమే హాయి వసంతబృందంఘంటసాలపింగళి1951
17పాతాళ భైరవిహయిగా మనకింక స్వేచ్ఛగాఘంటసాలఘంటసాలపింగళి1951
18సర్వాధికారిఅందాల నారాజు నన్నేలే రతిరాజు ముద్దు మురిపాలుసుసర్ల దక్షిణామూర్తి1951
19చిన్నమ్మ కథకనుపించినావు రావో రాకున్న విడువనోయీవేలూరు కృష్ణమూర్తి1952
20పెళ్ళి చేసి చూడుఎవరో ఎవరో ఈ నవనాటక సూత్రధారులు.. ఎవరా ఎవరాఘంటసాలఘంటసాలపింగళి1952
21పెళ్ళి చేసి చూడుఏడుకొండలవాడా ! వెంకటారమణా! సద్దు శాయక నీవుఘంటసాలపింగళి1952
22పెళ్ళి చేసి చూడుప్రియా ! ప్రియా! హా ప్రియా! ప్రియా యుగపిఠాపురం,
రామకృష్ణ
ఘంటసాలపింగళి1952
23పెళ్ళి చేసి చూడుమనసా నేనెవరో నీకు తెలుసా నీకు తెలుసా తెలుసా మనసాఘంటసాలపింగళి1952
24మిస్సమ్మఏమిటో ఈ మాయా ఓ చల్లని రాజా వెన్నెల రాజాఎస్.రాజేశ్వరరావుపింగళి1955
25మిస్సమ్మకరుణించు మేరీమాత శరణింక నీవే మేరీమాతఎస్.రాజేశ్వరరావుపింగళి1955
26మిస్సమ్మతెలుసుకొనవె చెల్లి అలా నడచుకొనవే చెల్లీ మగవారికి దూరముగాఎస్.రాజేశ్వరరావుపింగళి1955
27మిస్సమ్మరాగసుధారస పానము చేసి రాజిల్లవే ఓ మనసాసి.కృష్ణవేణిఎస్.రాజేశ్వరరావుపింగళి1955
28మిస్సమ్మరావోయి చందమామ మా వింత గాథ వినుమాఎ.ఎం.రాజాఎస్.రాజేశ్వరరావుపింగళి1955
29చరణదాసిఈ దయ చాలునురా కృష్ణా కాదనకీరా నాకో వరముఎస్.రాజేశ్వరరావు1956
30చింతామణితగునా నను నీట ముంచ తగునా కన్నీట ముంచ తగునాఅద్దేపల్లి రామారావు,
టి.వి.రాజు
1956
31చిరంజీవులుఅల్లవాడే రేపల్లెవాడే అల్లిబిల్లి పిల్లంగొవిఘంటసాల బృందంఘంటసాలమల్లాది రామకృష్ణశాస్త్రి1956
32చిరంజీవులుఎందాక ఎందాక ఎందాక అందాక అందాకఘంటసాలఘంటసాలమల్లాది రామకృష్ణశాస్త్రి1956
33చిరంజీవులుఏనాటికైనా నీ దాననే ఏనాటికైనా నీ దాననేఘంటసాలమల్లాది రామకృష్ణశాస్త్రి1956
34చిరంజీవులుకనుపాప కరవైన కనులెందుకో తనవారే పరులైనఘంటసాలఘంటసాలమల్లాది రామకృష్ణశాస్త్రి1956
35చిరంజీవులుచికిలింత చిగురు సంపంగి గుబురు చినదాని మనసుఘంటసాలఘంటసాలమల్లాది రామకృష్ణశాస్త్రి1956
36చిరంజీవులుతెల్లవార వచ్చె తెలియక నా సామి మళ్ళి పరుండేవు లేరాఘంటసాలమల్లాది రామకృష్ణశాస్త్రి1956
37భలే రాముడుఓహో మేఘమాలా నీలాల మేఘమాలా చల్లగ రావేలా మెల్లగ రావేలఎస్. రాజేశ్వరరావుసదాశివబ్రహ్మం1956
38హరిశ్చంద్రఏలమ్మా ఈ వర్షధార లోకమేనిండి కల్లోలమైపోయె ఏలమ్మసుసర్ల దక్షిణామూర్తిజంపన1956
39దొంగల్లో దొరవిన్నావా చిన్నదాన అదో ఆ దూర తీరాల అనురాగ రాగాలఘంటసాలఎం.ఎస్.రాజునారపరెడ్డి1957
40మాయాబజార్చూపులు కలసిన శుభవేళా ఎందుకు నీకీ కలవరముఘంటసాలఎస్.రాజేశ్వరరావుపింగళి1957
41మాయాబజార్దయచేయండి దయచేయండిఘంటసాల,
పి.సుశీల
ఘంటసాలపింగళి1957
42మాయాబజార్నీకోసమె నే జీవించునదిఘంటసాలఎస్.రాజేశ్వరరావుపింగళి1957
43మాయాబజార్నీవేనా నను తలచినదిఘంటసాలఎస్.రాజేశ్వరరావుపింగళి1957
44మాయాబజార్లాహిరి లాహిరి లాహిరిలోఘంటసాలఎస్.రాజేశ్వరరావుపింగళి1957
45మాయాబజార్విన్నావటమ్మా ఓ యశోదమ్మాపి.సుశీల,
స్వర్ణలత
ఘంటసాలపింగళి1957
46వినాయక చవితిఆలించరా మొరాలించరా లాలించి నను పరిపాలించరాఘంటసాలసముద్రాల సీనియర్1957
47వినాయక చవితితనూవూగే నా మనసూగె నునుతొలకరి మెరపుల తలపులతోఘంటసాలసముద్రాల సీనియర్1957
48వినాయక చవితిరాజా ప్రేమ జూపరా నా పూజల చేకోరాఎం.ఎస్.రామారావు బృందంఘంటసాలసముద్రాల సీనియర్1957
49సతీ అనసూయఓ నాగ దేవతా నా సేవగొని దయసేయుమయా ఓ నాగదేవతాఘంటసాలసముద్రాల జూనియర్1957
50సారంగధరజయ జయ మంగళ గౌరి జయ జయ శంకరి కౌమారిఘంటసాలసముద్రాల సీనియర్1957
51అప్పుచేసి పప్పుకూడుఎచటినుండి వీచెనో ఈ చల్లని గాలి తీవెల పైఘంటసాలఎస్.రాజేశ్వరరావుపింగళి1959
52పెళ్ళి సందడిఅప్పటికి ఇప్పటికి ఎంతో తేడా అది తెలిసి మసలుకో బస్తీ చిన్నోడాఘంటసాలసముద్రాల జూనియర్1959
53సతీ సుకన్యఅందాల సొగసులు చిందెనే కనువిందేనే మది పొంగేనే ఔనేఘంటసాలశ్రీరామచంద్1959
54భక్త రఘునాథ్హేశివశంకరా నమ్మినవారి కావగలేవా మమ్మిటుచేయుట న్యాయమాఘంటసాలసముద్రాల సీనియర్1960
55మహాకవి కాళిదాసురసికరాజమణిరాజిత సభలో యశము గాంచెదవే సోదరిరత్నంపెండ్యాలపింగళి1960
56శాంతి నివాసంకలనైనా నీ వలపే కలవరమందైనా నీ తలపేఘంటసాలసముద్రాల జూనియర్1960
57శాంతి నివాసంసెలయేటి జాలులాగ చిందేసే లేడిలాగ సరదాగ గాలిలోనఎ.పి.కోమల బృందంఘంటసాలసముద్రాల జూనియర్1960
58జగదేకవీరుని కథజలకాలాటలలో కలకల పాటలలో ఏమి హాయీలే హలాపసుశీల బృందంపెండ్యాలపింగళి1960
59ఋష్యశృంగఆనందమీనాడే పరమానంద మీనాడేటి.వి.రాజుసముద్రాల జూనియర్1961
60సీతారామ కళ్యాణంఓ సుకుమారా నినుగని మురిసితిరా నిను వలచేరఘంటసాలగాలిపెంచలసముద్రాల సీనియర్1961
61శ్రీకృష్ణ కుచేలనీ దయ రాదయా ఓ మాధవా కడువేదన పాలైన మాపైనఘంటసాలఘంటసాలపాలగుమ్మి పద్మరాజు1961
62గుండమ్మ కథవేషము మార్చెనూ భాషను మార్చెను మోసము నేర్చెను అసలు తానే మారెనుఘంటసాలఘంటసాలపింగళి1962
63మహామంత్రి తిమ్మరుసుజయవాణీ చరణకమల సన్నిధి మన సాధన రసికసభా రంజనగాఘంటసాలపెండ్యాలపింగళి1962
64ఆప్తమిత్రులుపవనా మదనుడేడా మరలిరాడా తెలుపరా వేగఎ.పి.కోమలఘంటసాలసముద్రాల జూనియర్1963
65రాణీ సంయుక్తఓ వెన్నెలా ఓ వెన్నెలా వేగ మురిపించవా వెన్నెలాఘంటసాలఎం.రంగారావుఆరుద్ర1963
66లవకుశజగదభి రాముడు శ్రీరాముడే, రఘుకుల సోముడు ఆ రాముడేఘంటసాల, పి.సుశీల, వైదేహి, పద్మామల్లిక్ఘంటసాలసముద్రాల సీనియర్1963
67లవకుశరామకథను వినరయ్యా ఇహపర సుఖముల నొసగే సీతా రామకథను వినరయ్యాపి.సుశీలఘంటసాలసముద్రాల సీనియర్1963
68లవకుశరామసుగుణధామ రఘువంశ జలధిసోమ సీతామనోభిరామా సాకేత సార్వభౌమపి.సుశీలఘంటసాలసముద్రాల సీనియర్1963
69లవకుశలేరు కుశలవుల సాటి సరి వీరులు ధారుణిలోపి.సుశీలఘంటసాలసముద్రాల సీనియర్1963
70లవకుశవినుడు వినుడు రామాయణ గాథా వినుడీ మనసారాపి.సుశీలఘంటసాలసముద్రాల సీనియర్1963
71లవకుశశ్రీరాముని చరితమును తెలిపెదమమ్మా ఘనశీలవతి సీతకథ వినుడోయమ్మాపి.సుశీలఘంటసాలసముద్రాల సీనియర్1963
72సోమవార వ్రత మహాత్మ్యంఅడిగితినని అలుసా నిన్నడగనులే పోనీ నీ నోటి పసిడిమాస్టర్ వేణునార్ల చిరంజీవి1963
73పతివ్రతరావో రాధామోహనా నమ్మినానోయి రాధాకృష్ణాఎం.రంగారావుఅనిసెట్టి1964
74పతివ్రతనీ చెలికనవో నీ చెలి గనవా చలించవామాధవపెద్దిఎం.రంగారావుఅనిసెట్టి1964
75పతివ్రతలేత లేత వయసులో జాతి మేలు కోరుతు దేశభక్తిబృందంఎం.రంగారావుఅనిసెట్టి1964
76పతివ్రతసా సా సా సా పాడమ్మా .. మోహన మూర్తివి నీవోపి.బి.శ్రీనివాస్ఎం.రంగారావుఅనిసెట్టి1964
77బభ్రువాహనఏలరా మనోహరా త్రిలోక మోహనా ఏలరా మనోహరాపామర్తిసముద్రాల సీనియర్1964
78రహస్యంశ్రీలలిత శివజ్యోతి సర్వకామదా శ్రీగిరినిలయా గిరిరామాయా సర్వమంగళాఘంటసాలమల్లాది1967
79శ్రీకృష్ణ మహిమకృష్ణా నా ముద్దు కృష్ణా నిదురించు నిర్మలవదనాఎ.పి.కోమలఘంటసాలఅనిసెట్టి1967
80శ్రీకృష్ణావతారంవిన్నారా విన్నారా వన్నెల కృష్ణుని వరాల పాటలుబృందంటి.వి.రాజుసి.నా.రె.1967
81తారాశశాంకమునీకే మాకే తగురా మా కౌగిళ్ళలో పసపి.సుశీలటి.వి.రాజుసముద్రాల సీనియర్1969
82మా ఇలవేల్పుగౌరీ మాహేశ్వరి మము కన్న తల్లి పరమేశ్వరిజిక్కిజి.కె.వెంకటేష్సి.నా.రె.1971

మరణం

లీల అక్టోబర్ 31 2005 న చెన్నైలోని రామచంద్ర ఆసుపత్రిలో అస్వస్థతతో చికిత్స పొందుతూ మరణించింది. బాత్రూంలో జారిపడి తలకు దెబ్బ తగలడంతో ఆసుపత్రిలో చేరిన లీల మొదడులో రక్తం గడ్డకట్టిందని వైద్యులు నిర్ధారించారు. దానికై శస్త్రచికిత్స పొంది కోలుకుంటుండగా న్యుమోనియా సోకింది. అంతకు ముందునుండే లీలకు ఆస్థమా వ్యాధి ఉండటం వల్ల పరిస్థితి విషమించింది.[3]

ఈమెకు భారత ప్రభుత్వం 2006 సంవత్సరంలో మరణానంతరం పద్మ భూషణ పురస్కారం బహుకరించింద

 మధుర గాయని లీల –విశాలాంధ్ర

సంగీతం వింటే మానసిక ప్రశాంతత కలుగుతుంది. అలసిన మనసుకు మానసిక ప్రశాంతత, విశ్రాంతిని ఇచ్చే సాధనం సంగీతం. సంగీతమంటే కచ్చేరీల్లో పాడే కీర్తనలు, రాగాలే కానక్కరలేదు. జానపదగీతాలు కావచ్చు, సినీ పాటలు కూడా కావచ్చు. కాకుంటే అవి భావయుక్తమై, రాగప్రధానమై, ఎటువంటి రణగొణధ్వనులు లేకుండా ఉంటేచాలు. అమ్మఒడిలోని పాప జోలపాటకు ఏడుపునాపి హాయిగా నిద్దరొయినట్లు సంగీత ప్రధానమైన పాటలను వింటున్నప్పుడు మనసుకు కలిగే ఆనందం, విశ్రాంతి అనుభవించేవారికే తెలుస్తుంది. మానసిక ఒత్తిడిని తగ్గించే మార్గాల్లో సంగీతం, సంగీతంతో కూడిన పాటలు వినడం ఒక మార్గం. అటువంటి వాటిలో సినిమా పాటలు కూడా ఒకటి. 50 యేళ్ళక్రితం నిర్మించగా విడుదలైన సినిమాల్లోని పాటలను సైతం నేటికీ విని ఆనందిస్తున్నామంటే ఆ పాటల్లోని భావం, వాటి సంగీతం, పాడిన గాయనీగాయకుల గొప్పతనమే అనిచెప్పకతప్పదు. అలా పాతతరంనాటి ఎన్నో సినిమాల్లో అద్భుతమైన పాటలకు ప్రాణప్రతిష్టచేసి నేటికి పాడుకునేలా చేయగలిగిన గాయనీమణుల్లో పి.లీల ఒకరు.

దక్షిణ భారత భాషలైన తెలుగు, తమిళం, కన్నడం, మళయాళం భాషచిత్రాల్లో వేల సంఖ్యలో పాటలు పాడారు. అలాగే బెంగాలీ, సింహాళ చిత్రాలలో కూడా పాటలు పాడారు. కేవలం సినీపాటలే కాదు భక్తిగీతా లను సైతం అద్బుతంగా ఆలపించారు. భారతదేశం గర్వించదగ్గ సంగీతసరస్వతులు ఎం.ఎస్‌. సుబ్బలక్ష్మి, ఎం.ఎల్‌. వసంతకుమారి, డి.కె. పట్టామ్మాళ్‌ వంటి వారి సమకాలీకురాలు కావడం ఆమెకు సంగీతంపై మక్కువకు కారణంకావచ్చునేమో. కేరళ, పాలక్కడ్‌ లోని చిట్టూర్‌లో 1934 సంవత్సరంలో పుట్టారు పొరయాతు లీల.లీలతో పాటు ఆమె తల్లిదండ్రులకు ముగ్గురు ఆడపిల్లలు. తల్లితండ్రులు సంగీతప్రియులు కావడంతో లీలకు స్వతహాగానే సంగీతంపై మక్కువ ఏర్పడటం గమనించి ఆమెకు కర్నాటక సంగీతం నేర్పించారు తల్లిదండ్రులు. ఆమె గొంతు కొద్దిగా లావుగా ధ్వనించేదని విమర్శించినా అదే పాటకు నిండుదనం తెచ్చిందని చెప్పాలి. అద్భుతమైన గాత్రం ఆమెకు ఓ వరం. ఎందరో ప్రముఖ విద్వాంసుల వద్ద సంగీతాన్ని అభ్యసించారు. మరింత సాధనకోసం, సంగీతం కోసం మద్రాసు చేరింది లీల కుటుంబం. మద్రాసులో ప్రముఖ సంగీత విద్వాంసుల సంగీతం వినడం, నేర్చుకోవడం ద్వారా సంగీతంలో మరింతగా రాణించి పలు పోటీల్లో పాల్గొని బహుమతులు కూడా సాధించారు.

ఈ సందర్భంలో కొలంబియా రికార్డింగ్‌ కంపెనీవారు తాము విడుదల చేసే పాటలకు పాటలు పాడే గాయనీ కోసం వెతుకుతుండగా లీలగారి గురించి తెలిసి ఆమెను గాయనిగా ఎంచుకున్నారు. అది ఆమె సినీరంగ ప్రవేశానికి మార్గమయిందని చెప్పొచ్చు. అయితే ఆమెకు తెలుగు, తమిళ భాషల్లో పట్టులేని కారణంగా కీర్తనలను మళయాళంలో రాసుకుని సాధనచేసి పాడేవారట. ఆ తర్వాత ట్యూటర్‌ను నియమించుకుని భాషపై పట్టును సాధించారు. గాయనీగాయకులకు ఉండవలసిన లక్షణాలలో ఒక లక్షణం భాషపై పట్టు సాధించడం. ఇది నేటితరం గాయనీ గాయకులు ఆదర్శంగా తీసుకోవాలి.1948 సంవత్సరంలో తొలిసారిగా తమిళంలో పాడిన పాటతో సినీ రంగ ప్రవేశం చేశారు. అప్పటికి ఆమె వయసు 14 సంవత్సరాలు. ఆ సినిమాలో హీరోయిన్‌కు అన్నిపాటలు ఆవిడే పాడారు. అలా తమిళంలో పాడుతూ, 1949 సంవత్సరం తెలుగులో పాడే అద్భుత అవకాశం వచ్చింది. నాగయ్యగారు నటించిన మనదేశం చిత్రంలో ఘంటసాలమాస్టారి సంగీతదర్శకత్వంలో పి.లీలను తొలిసారిగా తెలుగువారికి గాయనిగా పరిచయం చేస్తూ అందులో పాటలు పాడించారు. ఆ చిత్రం ద్వారానే ఆంధ్రుల ఆరాధ్యనటుడు స్వర్గీయ ఎన్‌.టి.ఆర్‌. పరిచయమయ్యారు. ఆ యేడాది విడుదలైన మనదేశం, కీలుగుర్రం, గుణ సుందరికథ చిత్రాల్లో ఆమె పాటలు పాడగా ఆ మూడు చిత్రాలు కూడా అద్భుత విజయం సాధించి ఆమెకు మంచిపేరు తెచ్చిపెట్టడమే కాదు తెలుగులో గాయనిగా స్థిరపడ్డారు. అంతేకాదు వాహిని, విజయా సంస్థలు నిర్మించే చిత్రాల ఆస్థానగాయనిగా పేరుపడ్డారావిడ. ఆ తర్వాత మిస్సమ్మ, షావుకారు, పాతాళభైరవి, సువర్ణ సుందరి, పెళ్ళినాటి ప్రమాణాలు, శాంతినివాసం, చిరంజీవులు, బాలనాగమ్మ, మాయాబజార్‌, జగదేకవీరునికథ, పెళ్ళిచేసిచూడు, గుండమ్మకథ, అప్పుచేసి పప్పుకూడు సంపూర్ణరామాయణం, బభ్రువాహన, తిరుపతమ్మ కథ, మహామంత్రి తిమ్మరసు, దక్షయజ్ఞం, శ్రీసీతారామకళ్యాణం, దీపావళి, శ్రీ వేంకటేశ్వరమహాత్మ్యం, పెళ్ళి సందడి, పాండురంగ మహాత్మ్యం, సారంగధర, భలేరాముడు, జయం మనదే, పరమానందయ్య శిష్యులకథ, నవ్వితే నవరత్నాలు, పల్లెటూరు, అనార్కలి వంటి చిత్రాల్లో అద్భుతమైన పాటలు పాడారు. సుశీల, జిక్కి, వంటి గాయనీమణులతో కూడా కలిసి ఎన్నో చక్కని గీతాలను కూడా ఆలపించారు. కేవలం సినీ గీతాలే కాకుండా ప్రైవేటుగా భక్తిగీతాలు, శ్లోకాలు, పద్యాలు కూడా పాడారు. లవకుశ చిత్రంలో ఆమె పాడిన పాటలు నేటికీ సినీప్రియులు పాడుకుంటూనే ఉంటారు. భావప్రధానంగా, రాగయుక్తగా పాడటం ఆమెకే చెల్లు. ఉత్తమగాయనిగా ఆంధ్ర, కేరళ, తమిళనాడు ప్రభుత్వాల నుండి అవార్డులను అందుకున్నారు. ఎన్నో బిరుదులు, సత్కారాలు పొందారు. ఆమె పాడిన పాటల్లో గుణసుందరికథలో ‘శ్రీ తులసి జయతులసి జయమునియ్యవే..’, బ్రతుకుతెరువు చిత్రంలో ‘అందమే ఆనందం, ఆనందమే జీవిత మకరందం.’ జయసింహ చిత్రంలో ‘ఈనాటి ఈరేయి కలకాదోరు నిజమోరు,’ మిస్సమ్మ చిత్రంలో ‘కరుణించుమేరిమాత,’ ‘తెలుసుకొనవే యువతి’, ‘యేమిటో ఈ మాయ, చల్లనిరాజా వెన్నెల రాజా’, వంటి పాటలు, చిరంజీవులు చిత్రంలో ‘తెల్లవారగ వచ్చే తెలియక నాస్వామి మళ్ళీ పరుండేవు లేరా’, మాయాబజార్‌ చిత్రంలో ‘చిన్నారి శశిరేఖ వర్ధిల్లవమ్మ,’ ‘విన్నావా యశోదమ్మ’, జగదేకవీరుని కథలో ‘నను దయగనవా నా మొరవినవా..’, లవకుశ చిత్రంలోసుశీలగారితో ‘రామకథను వినరయ్య,’ ఊరకే కన్నీరు నింప,’, ‘వినుడు వినుడు రామాయణగాథ, ‘ శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మ’ వంటి పాటలు కలిసి పాడారు. పాండవవనవాసం చిత్రంలో ‘దేవా దీనబాంధవా’, రహస్యం చిత్రంలో ‘శ్రీలలిత శివజ్యోతి సర్వకామద’ గీతాలాలపించారు. హుషారు, విషాదం, భక్తి ఇలా అన్నిరకాల పాటలు పాడారు. ‘చిన్నారిపాపలు’ అనే చిత్రానికి సంగీత దర్శకత్వం వహించారు. దక్షిణభారతదేశంలో అద్భుత పాటలకు ప్రాణప్రతిష్ట చేసిన గాయనీ మణుల్లో ప్రముఖురాలిగా సినీ ప్రియులచే అభిమానించబడిన పి.లీల 2005 అక్టోబరులో చెన్నైలో మరణించారు. ఆమె మరణించినా ఆమె పాడిన పాటలు సినీ ప్రియుల మదిలో సజీవమై ఉన్నంతకాలం ఆమె పాటలరూపంలో బ్రతికే ఉంటారు.

  అవును పాటలలో చిరంజీవిగా నిలిచారు లీల

 సశేషం

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -14—2-22-ఉయ్యూరు 

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in సినిమా and tagged . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.