మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-74,75

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-74,75

74,75-మాధవ పెద్ది ,పిఠాపురం

74-దాదాపుఅన్ని భారతీయ భాషా గాయకుడు,వివాహ భోజనంబు ,భళిభళి దేవా ఫేం- మాధవపెద్ది సత్యం

మాధవపెద్ది సత్యం (మార్చి 11, 1922 – డిసెంబర్ 18, 2000) తెలుగు సినిమా నేపథ్య గాయకుడు, రంగస్థల నటుడు. ఈయన తెలుగు, తమిళం, కన్నడ, మళయాళం, హిందీ, సింహళ భాషలతో సహా దాదాపు అన్ని భారతీయ భాషలలో 7,000 పైగా పాటలు పాడి ప్రసిద్ధి చెందాడు.
జీవిత విశేష
సత్యం 1922, మార్చి 11 న బాపట్ల సమీపాన బ్రాహ్మణ కోడూరు గ్రామంలో మాధవపెద్ది లక్ష్మీనరసయ్య, సుందరమ్మ దంపతులకు జన్మించాడు. వృత్తిరీత్యా నటుడైన సత్యం చిన్నతనములో ఎనిమిదేళ్ల వయసునుండి రంగస్థల నాటకాలలో నటించేవాడు. తెలుగు రంగస్థలముపై మల్లాది సూర్యనారాయణ నాటక బృందములోని సభ్యునిగా హరిశ్చంద్ర నాటకములో నక్షత్రకుని పాత్రను అద్భుతము పోషిస్తూ పెరుతెచ్చుకున్నాడు. ఈయన ప్రతిభను గుర్తించిన చక్రపాణి సత్యాన్ని తనతోపాటు మద్రాసు తీసుకువెళ్లి, తను నాగిరెడ్డితో కలిసి అప్పడే కొత్తగా స్థాపించబడిన విజయా పిక్చర్స్ పతాకము కింద నిర్మిస్తున్న షావుకారు చిత్రములో నటించే అవకాశము కలుగజేశాడు. ఈయన తొలిసారిగా వెండితెరపై హిందీ, తమిళ ద్విభాషాచిత్రం రామదాసులో కనిపించాడు. ఈ సినిమాకు రెండు భాషల్లోనూ తన పాత్ర యొక్క పాటలు తనే స్వయంగా పాడాడు. మాధవపెద్ది సత్యం షావుకారు సినిమాతో తెలుగు సినిమా రంగములో అడుగుపెట్టాడు. ఈ సినిమాలో సత్యం ఒక గుడ్డివాని పాత్రపోషించి ఆ పాత్రకు ఉన్న మూడు పాటలు పాడాడు. ప్రసిద్ధిమైన పాటలు అయ్యయో జేబులో డబ్బులు పోయెనే, మాయాబజార్ సినిమాలోని వివాహ భోజనంబు వింతైన వంటకంబు (పాట) ఈయన మధురకంఠమునుండి జాలువారినవే. కొన్ని తెలుగు చిత్రాలలో నటించినా మాధవపెద్ది సత్యం ప్రధానంగా గాయకుడే. ఈయన ఆనాటి ప్రసిద్ధ సంగీతదర్శకులైన సాలూరు రాజేశ్వరరావు, ఘంటసాల వెంకటేశ్వరరావు తదితరులందరితో పనిచేశాడు. సత్యం ఎస్వీ రంగారావు, రేలంగి వెంకటరాయయ్య పాటలన్నీ దాదాపు తనే పాడాడు. ఈయన పౌరాణిక చిత్రాలలో పద్యాలు పాడటములో ప్రసిద్ధి చెందాడు.ముఖ్యంగా పిఠాపురం నాగేశ్వరరావు,మాధవపెద్ది సత్యం జొడి కలిసి పాడిన పాటలు తెలుగు వారి నొళ్ళలో ఇప్పటికి నానుతూనే ఉన్నాయి.

75ఏళ్ల్ల వయసులో కూడా కృష్ణవంశీ తీసిన సింధూరం సినిమాలో సంకురాతిరి పండగొచ్చెరో పాటపాడి పలువురి ప్రశంసలందుకున్నాడు.

ఈయన 78 సంవత్సరాల వయసులో 2000, డిసెంబర్ 18న చెన్నైలో అస్వస్థతతో మరణించాడు. ఈయన భార్య అంతకు సంవత్సరము మునుపే మరణించింది. ఈయనకు ఒక కొడుకు, ఒక కూతురు. ఈయన కుమారుడు మాధవపెద్ది మూర్తి తన తల్లితండ్రుల స్మృత్యర్ధం తెలుగు సినీ రంగములో కృషి చేసిన వారికి మాధవపెద్ది సత్యం అవార్డు, మాధవపెద్ది ప్రభావతి అవార్డును ప్రారంభించాడు[1

గాయకునిగా[మార్చు]
సంవత్సర

చిత్రం

పాట

రిమార్కులు

1954

Bangaru Papa

Thadhimi Thakadhimi

Cast: S. V. Ranga Rao

1957

Maya Bazaar

Vivaha Bhojanambu
Bhali Bhali Bhali Deva

Cast: S. V. Ranga Rao
Sang for Himself

Thodi Kodallu

Nee Shoku Choodakunda

1959

Illarikam

Bhale Chancele

1960

Sri Venkateswara Mahatyam

Vegaraara Prabho

1961

Jagadeka Veeruni Katha

1962

Kula Gothralu

Ayyayyo Jebulo Dabbulu Poyene

Ramana Reddy

1963

Lakshadhikari

Oho Andamaina Chinnadana Bangaru Vannedana

1966

Shri Krishna Pandaviyam

Bhala Bhala Naa Bandi Parugu Teese Bandi

1975

Balipeetam

Yesukundam Buddoda Yesukundamu

· Yashoda Krishna (1975)

· Tata Manavadu (1972)

· Sampoorna Ramayanam (1971)

· Rahasyam (1967)

· Palnati Yudham (1966)

· Antastulu (1965)

· Babruvahana (1964)

· Bobbili Yudham (1964)

· Dr. Chakravarthy (1964)

· Devatha (1964)

· Ramudu Bheemudu (1964)

· Velugu Needalu (1964)

· Narthanasala (1963)

· Tirupathamma Katha (1963)

· Sri Krishnarjuna Yudham (1963)

· Chaduvukunna Ammayilu (1963)

· Mahamantri Timmarasu (1962)

· Dakshayagnam (1962)

· Iddaru Mitrulu (1961)

· Sabash Raja (1961)

· Sahasra Siracheda Apoorva Chinthamani (1960)

· Jayabheri (1959)

· Krishna Leelalu (1959)

· Appu Chesi Pappu Koodu (1958)

· Mangalya Balam (1958)

· Bhagya Rekha (1957)

· Dongallo Dora (1957)

· Panduranga Mahatyam (1957)

· Sarangadhara (1957)

· Jayam Manade (1956)

· Penki Pellam (1956)

· Kanyasulkam (1955)

· Pitchi Pullaiah (1953)

· Palletooru (1952)

· Malliswari (1951)

· Navvite Navaratnalu (1951)

· Shavukaru (1950)

· Laila Majnu (1949)

· Ramadasu (1946)

రంగస్థల అనుభవం ఆయన్ని తీర్చిదిద్దింది
పద్యం ఆయన గళంలో వయ్యారాలు పోయింది

దుర్యోధనుడు, రావణుడు, ఘటోత్కచుడు….
ఇలా ఎన్నో పాత్రలకు ఆయన కంఠం జీవం పోసింది

ఎస్వీరంగారావు, రేలంగి, రమణారెడ్డి ……
ఇలా ఎందఱో నటులకు ఆయన కంఠం అమరి పోయింది

పాట ఆయన గొంతులో ఒదిగిపోయింది
పాడుతున్నది పాత్రలేమోననిపిస్తుంది
పాడుతున్నది పాత్రదారులేమోననిపిస్తుంది
వారిలో ఆయన స్వరం పరకాయ ప్రవేశం చేస్తుంది

ఆయన పద్యంలో భావం తొణికిసలాడుతుంది
ఆయన పాటలో రాగం అలవోకగా అమరిపోతుంది
ఆయన కంఠంలో గాంభీర్యం నాట్యమాడుతుంది
ఆయన కంఠంలో హాస్యం గిలిగింతలు పెడుతుంది

ఆయనే కబీర్ పాత్రలో 1946 లో వచ్చిన ‘ రామదాసు ‘ తమిళ-హిందీ ద్విభాషా చిత్రంతో నటుడిగా చిత్రసీమలో అడుగుపెట్టి గాయకుడిగా స్థిరపడి సుమారు మూడు దశాబ్దాలు తెలుగు ప్రేక్షక శ్రోతలను అలరించిన మాధవపెద్ది సత్యం. ఆయన నటుడిగా స్థిరపడిపోతే మనం గర్వంగా చెప్పుకోగలిగే మంచి గాయకుడిని కోల్పోయేవాళ్ళమేమో ! ఆది తెలుగు జాతి చేసుకున్న అదృష్టం. పాత్ర స్వభావాన్ని, పాత్రధారుని సంభాషణా చాతుర్యాన్ని అంత చక్కగా స్వంతం చేసుకుని పాడే గాయకుడు బహుశాః మాధవపెద్ది సత్యం గారొక్కరేనేమో!

డా .ఆరవల్లి జగన్నాధ స్వామి మాటలలలో –

పాటల ‘పెద్ది’… మాధవపెద్ది

‘వివాహ భోజనంబు వింతైన వంటకంబు’ పాట చాలు ఆయన గాత్రమాధుర్యాన్ని, గంభీరతను చెప్పడానికి. అన్నం ఉడికిందో లేదో చెప్పడనికి అంతా పట్టిచూడనక్కర్లేదంటారు కదా? అలానే భోజనం గీతం చాలదూ!

మాధవపెద్ది సత్యనారాయణ అనే సత్యం రంగస్థల అనుభవంతో సినిమా నటుడుకాబోయి నేపథ్య గాయకుడయ్యారు. అయినా నటించారు. నటనపై ఆసక్తితో బొంబాయి చేరుకుని నిర్మాత వై.వి.రావు సంస్థలో నెలజీతంపై పనిచేస్తూ,రామదాసు తదితర చిత్రాలలో నటించారు. కొంతకాలనాకి మనసు మారింది. సొంతూరు గుంటూరు జిల్లా బ్రాహ్మణకోడూరు వచ్చి నాటక ప్రదర్శనలు ఇవ్వాలనుకున్నారు. పన్నెండో ఏట నుంచే రంగస్థలంతో పరిచయం ఉన్న ఆయన చిన్నికృష్ణుడు,వికర్ణుడు లాంటి వేషాలతో ఆరంభించి ప్రధాన పాత్రలూ పోషించారు. మంచి రూపం, నటన, వాచకం తన సొంతం కనుక రంగస్థలమే ఉత్తమమనుకున్నారు.అయితే వేషాల మాట ఎలా ఉన్నానీ గొంతు బాగుంటుంది..బాగాపాడతావు…మద్రాసు వచ్చేయ్.. సినిమాల్లో పాడుకోవచ్చు అని అప్పుడే పరిచయమైన సంగీత దర్శకుడు సీఆర్ సుబ్బరామన్ సలహా చెప్పారు.తాను సంగీత దర్శకత్వం వహించిన ’లైలామజ్ను‘ (1949)లో అవకాశం కూడా ఇచ్చారు. మనుచుగాతా ఖుదా తోడై‘ అనే పాటను ఘంటసాల, ఫిఠాపురం నాగేశ్వరరావులతో కలసి పాడారు. విజయ ప్రొడక్షన్స్ వారు ఆ మరుసటి ఏడాది తీసినషావుకారు` చిత్రంలోలో పిచ్చన్నతాత వేషం వేయించడంతో పాటు ఆ పాత్రకు తత్వాలు పాడించారు. గాయకనట రెండు పాత్రలలో పేరు సంపాదించారు.

ధ్వన్యనుకరణ

సత్యంగారికి చిన్నప్పడే ధ్వన్యనుకరణను సాధనం చేశారు. ఎస్వీ రంగారావులా పాడడానికి అదే ఉపకరించిందని చెప్పేవారు.అలనాటి అగ్రనటులు నందమూరి, అ అక్కినేనిలకు ఘంటసాలలా,ఎస్వీఆర్ కు మాధవపెద్ది స్థిరపడిపోయారు. మాయాబజార్లో ఘటోత్కచుడి పాత్ర పద్యానికి ముందు వచ్చే ఎంతమద మెంతకావరమెంత పొగరు మాటలు మాధవపెద్దివే అంటే ఆశ్చర్యం కలుగుతుంది. సత్యం!నా పలుకులు నేను కూడా అలా పలకలేనయ్యాఅని ఎస్వీఆర్ అనడంలోనే ఆ గాత్రం గొప్పదనం తెలుస్తుంది.1957నాటి వివాహ భోజనం పాటను వయస్సు మళ్లిన తరువతా అదే గాంభీర్యంతో ఆలపించడం ఆయన ప్రత్యేకత.ఎస్వీ రంగారావుకు పాటలు, పద్యాలు పాడినట్లే, రేలంగి, రమణా రెడ్డిలకూ నప్పించారు. నాలుగు దక్షిణాది భాషల్లో, హిందీలోనూ పాడారు.

వేలాది పాటలు పాడిన ఎంతటి గాయనీ గాయకులకైనా ఎక్కడో దగ్గర ఎప్పుడో ఒకప్పుడు ఏ చిన్న అపస్వరమైనా వినిపించడానికి అవకాశం ఉంది కానీ,సత్యం గారికి మాత్రం ఎక్కడా ఎప్పడూ అలాంటిది జరగలేదుఅని గానగంధర్వ బిరుదాంకితుడు (దివంగత) ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సందర్భం వచ్చినప్పుడల్లా చెప్పేవారు.

తప్పిపోయిన `దర్శకత్వం

నేపథ్యగాయకుడిగా స్థిరపడిన తరువాత సంగీత దర్శకత్వంపై ఆయనకు ఆసక్తి కలిగింది. అవకాశం వచ్చినట్లే వచ్చి జారిపోయింది. నిజం చెబితే నమ్మరుఅన చిత్రానికి నాలుగు పాటలకు దర్శకత్వం వహించారు. ఆ తర్వాత సాగలేదు.దాంతో ఇక ఆ ప్రయత్నంచేయలేదన్నారనిరావి కొండలరావు చెప్పేవారు. అయితే తన కోరికను అన్నగారి అబ్బాయి సురేష్ లో చూసుకున్నారు. ’నేనెలాగూ సంగీత దర్శకుడిని కాలేకపోయాను.నువ్వు తప్పక మంచి సంగీత దర్శకుడివి కావాలిఅనే వారట.బాబాయ్ ప్రోత్సాహమే నన్ను సంగీత దర్శకుడిని చేసింది‘ అంటారు మాధవపెద్ది సురేష్. ప్రసిధ్ద గాయని ఎస్.జానకీ ఆయన అభిమానిగా చెబుతారు. రాజమహేంద్రవరంలో సత్యం గారి వివాహ వేడుకలో ఆమె పాడినప్పుడు అభినందించి ప్రోత్సహించారట.ఆమె గాయని అయిన తరువాత ’కోడెకారు చిన్నవాడా` లాంటి పాటలు కలసి పాడారు.

గాయకత్రయం

తెలుగు సినిమా పరిశ్రమలో ఘంటసాల, మాధవపెద్ది, ఫిఠాపురం గాయకత్రయంగా ప్రఖ్యాతులు. ప్రత్యేకించి పౌరాణిక చిత్రాలలో ఘంటసాల, మాధవపెద్ది గాత్రాల నుంచి వెలువడిన పద్యాలు అజరామరం.ముగ్గురు కలసి అనేక పాటలు పాడారు. ఘంటసాలతో కలిసి పాడిన మా ఊళ్లో ఒక పడుచుందిలాంటి పాటలను సంగీత విభావరుల్లో పాడేవారు. ఘంటసాల కన్నుమూతతో ఆ పాటలను పిఠాపురంతో కలసి కచేరీలలో పాడేవారు. మాధవపెద్ది ఘంటసాల అంటే అమిత గౌరవాభిమానాలు. ఆయన సంగీత దర్శకత్వంలో అనేక పాటలు పాడారు. మహానుభావుడు. అంత గొప్పగాయకుడైనా మా కోసమే కొన్ని పాటలు కేటాయించేవారుఅని మాధవపెద్ది గుర్తుచేసుకునేవారు. వాస్తవానికి ఘంటసాల కంటే మాధవపెద్ది ఎనిమిది నెలలు పెద్దయినా ఆయనకు ఇచ్చిన గౌరవం అది. సినీ నేపథ్య గానంలో తనకంటూ ఒక శైలి సృష్టించుకున్న ఆయన 2000 డిసెంబర్ 18న సెలవంటూ వెళ్లిపోయారు

మాధవపెద్ది.jpg
75-మాఊళ్ళో ఒక పడుచుంది ,మాయాసంసారం తమ్ముడు ,అయ్యయ్యో జేబులో డబ్బులు

అప్పడనే తిప్ప డండీపులిమామ్గోరూ –పాటల ఫేం,ఆంధ్రా రఫీ జనతాసి౦గర్,గాన గ౦ధర్వ -పిఠాపురం నాగేశ్వరావు

పిఠాపురం నాగేశ్వరరావు (మే 5, 1930 – మార్చి 5, 1996) ప్రముఖ సినీ సంగీత దర్శకులు.

తెలుగు సినీ జగత్తులో మాధవపెద్ది – పిఠాపురం లను జంట గాయకులు అంటారు. పిఠాపురం నాగేశ్వరరావు, తూర్పు గోదావరి జిల్లా పిఠాపురంలో 1930 మే 5 న జన్మించారు. ఆయన తల్లిదండ్రులు విశ్వనాధం – అప్పయమ్మ గార్లు. అసలు వీరి ఇంటిపేరు పాతర్లగడ్డ, కానీ, ‘చిత్తూరు’ నాగయ్య లాగా, నాగేశ్వరరావుగారు కూడా తమ ఊరిపేరునే తన ఇంటిపేరు చేసుకున్నారు

బాల్యం
పిఠాపురం నాగేశ్వరరావు అసలు పేరు పాతర్లగడ్డ నాగేశ్వరరావు. పిఠాపురం నుంచి వచ్చాడనో ఏమో, అందరూ పిఠాపురం నాగేశ్వరరావు అనేవారుగాని, అసలు ఇంటిపేరు కలిపేవారుకారు. పిఠాపురంలో ఆర్.ఆర్.బి.హెచ్.ఆర్.ప్రభుత్వోన్నత పాఠశాలలో ఎస్.ఎస్.ఎల్.సి.వరకు చదువుకున్నారు. ఇతనికి రంగస్థలంపై మమకారం తండ్రి నుంచి వారసత్వంగా వచ్చింది. ఆయన తండ్రి, ఆ రోజులలో మంచి రంగస్థల నటుడు. గాత్రశుద్ధి బాగావున్న నాగేశ్వరరావు, స్నేహితుల ప్రోద్బలంతో, తండ్రి ప్రోత్సాహంతో 1944 నుంచి నవ్యకళాసమితి వారి నాటకాలైన శ్రీకృష్ణతులాభారం, బాలనాగమ్మ, కృష్ణార్జునయుద్ధం, దేవదాసు, ఏకలవ్య, లోభి, చింతామణి, రంగూన్‌రౌడీ వంటి నాటకాలలో అర్జునుడు, శ్రీకృష్ణుడు, దుర్యోధనుడు, సుబ్బిసెట్టి పాత్రలను ధరించి ప్రేక్షకుల మెప్పు పొందారు. విశేషమేమిటంటే, పాడుకోలేని ఇతర నటీనటులకు తెర వెనుక నుండి పాటలు, పద్యాలు, శ్లోకాలు పాడే విధానానికి ఆయన శ్రీకారం చుట్టారు. ఆ అనుభవంతో, సినిమాలలో పాడాలనే ఆశతో, ఇంట్లో చెప్పకుండా మద్రాసు పారిపొయివచ్చారు. తెలిసినవారందరిళ్ళలో తలదాచుకోని తన అదృష్టన్ని పరీక్షించుకున్నారు[1].

సినీ జీవితం
1946 లో విడుదలైన మంగళసూత్రం అనే సినిమాలో తొలిసారిగా పాడి, సినిరంగంలో కాలుమోపారు. అప్పటికాయన వయస్సు కేవలం పదహరేళ్ళే . జెమినివారి ప్రతిష్ఠాత్మక సినిమా చంద్రలేఖలో పాడే అవకాశం రావటంతో సినిపరిశ్రమలో నిలదొక్కుకున్నారు. అప్పటినుంచి, సుమారు పాతికేళ్ళు అనేక సినిమాల్లో పాడి తనసత్తా నిరుపించుకున్నారు. అది సోలో అయినా, యుగళగీతమైనా సరే, ఆయన పాడినవన్ని దాదాపు హస్యగీతాలే. ఘంటసాల వారితో కలిసిపాడిన “మా ఊళ్ళో ఒక పడుచుంది” (అవేకళ్ళు) పాట, మాధవపెద్దిగారితో కలిసిపాడిన ” అయ్యయో! జేబులోడబ్బులుపొయనే ” (కులగోత్రాలు) పాట, పిఠాపురం గారికి ఎనలేని పేరుతెచ్చాయి. ఈనాటికి ఆ పాటలు అందరినోళ్ళలో నానుతాయంటే అతిశయోక్తికాదు. ఆయన చివరిసారిగా “చల్లని రామయ్య – చక్కని సీతమ్మ” అనే పాట 1978లో బొమ్మరిల్లు సినిమాకోసం పాడారు. 1996 మార్చి 5 న మృతి చెందిన హస్యగీతాల గోపురం శ్రీ పిఠాపురం.

పాడిన పాటలు
పిఠాపురం తెలుగు లోనెగాక, తమిళ, కన్నడ, హిందీ, సింహళ భాషలలో సుమారు 7వేల పాటలు పాడారు. అందులో ఆయన పాడిన కొన్ని హుషారైన పాటలు:

· రాజు వెడలె సభకు (మాయలమారి – 1951)

· పెళ్ళి చేసి చూపిస్తాం మేమేపెళ్లి పెద్దలనిపిస్తాం (పెళ్లి చేసి చూడు – 1952)

· ఏం చేస్తే అది ఘనకార్యం మనమేం చేస్తే అది ఘనకార్యం (చంద్రహారం-1954)

· పట్నమెల్లగలవా ఓ భామా (పెద్దమనుషులు – 1954)

· నిసగమపా లోకం మోసం పమగరిసా (జయసింహ-1956)

· రా, మాతోటి గెలిచే (సువర్ణసుందరి – 1957)

· మందుకాని మందు (ఇంటిగుట్టు – 1958)

· తడికో తడికో (అత్తా ఒకింటి కోడలే – 1958)

· మాయాసంసారం తమ్ముడూ (ఉమాసుందరి-1956)

· పదవే పోదాము గౌరీ (శ్రీ వెంకటేశ్వర మహత్యం-1960)

· అయ్యయో! జేబులోడబ్బులుపొయనే (కులగోత్రాలు – 1962)

· డివ్వీ డివ్వీ డివ్వట్టం నువ్వంటేనే నాకిష్టం (దాగుడుమూతలు-1964)

· పరమగురుడు చెప్పిన వాడు పెద్ద మనిషి కాడురా (పరమానందయ్య శిష్యుల కథ-1966)

· సోడా సోడా ఆంధ్రా సోడా! (లక్ష్మీనివాసం – 1967)

· అబ్బబ్బచలి (భలే రంగడు-1969)

· మా ఊళ్ళో ఒక పడుచుంది (అవేకళ్ళు)

· అప్పుడునే తిప్పడండి పులి మాంగోరు (బాలనాగమ్మ)

బిరుదులు ]
· ఆంధ్రా రఫీ

· జనతా సింగర్

· గానగంధర్వ

· తెలుగు వెలుగులో

పుట్టిన ఊరు నే ఇంటి పేరుగా మార్చుకున్న పిఠాపురం (పాతర్లగడ్డ} నాగేశ్వరరావు జయంతి సందర్భంగా నా చిత్ర నివాళి.

తెలుగు సినిమా రంగంలో జంట గాయకులుగా పేరు తెచ్చుకున్న మాధవపెద్ది – పిఠాపురంను సంగీత ప్రియులు ఎప్పటికీ మరువలేరు. తెలుగు సినీ స్వర్ణ యుగంలో హాస్య పాత్రధారులకూ హాయిని గొల్పే పాటలను రచయితలు రాసేవారు, దర్శకులు చిత్రీకరించే వారు. మరి వారి హావభావాలకు తగ్గట్టుగా పాటలు పాడే గాయనీ గాయకులూ ఎంతోమంది అలనాడు చిత్రసీమలో ఉన్నారు. ఆ కోవలే హాస్య గీతాల గాయనీ గాయకులుగా మాధవపెద్ది – పిఠాపురం పేరు తెచ్చుకున్నారు. బాల్యంలోనే తండ్రి ప్రోత్సాహంతో నటన పట్ల ఆకర్షితులైనా, స్టేజ్ మీద పాడలేని వారికి నేపథ్యం గానం అందించే అలవాటు యుక్తవయసులోనే ఆయనకు అబ్బింది. అదే ఆ తర్వాత ఆయనకు జీవనోపాధిగా మారిపోయింది. 1946లో ‘మంగళసూత్రం’ సినిమాతో ఆయన నేపథ్య గాయకునిగా సినిమా రంగంలోకి అడుగుపెట్టారు. పదహారేళ్ళ ప్రాయంలోనే ‘చంద్రలేఖ’ చిత్రంలో పాట పాడే అవకాశం రావడంతో ఇక వెనుదిరిగి చూసుకోలేదు. వివిధ భాషలలో వేలాది పాటలను పిఠాపురం పాడారు. ఘంటసాలతో కలిసి ‘అవేకళ్ళు’ చిత్రంలో పాడిన ‘మా ఊళ్ళో ఒక పడుచుకుంది’, మాధవపెద్ది తో కలిసి ‘కులగోత్రాలు’ కోసం పాడిన ‘అయ్యయ్యో… జేబులో డబ్బులు పోయెనే’ ఇంకా ‘వెంకటేశ్వర మహత్యం’ చిత్రం లో ‘పదవే పోదాము గౌరీ పరమేశ్వరుని చూడ..’ వంటి పాటలు పిఠాపురానికి మంచి పేరు ప్రతిష్ఠలు తెచ్చిపెట్టాయి. వీరు మంచి రంగస్థల నటుడు కూడా. చివరగా 1978లో ‘బొమ్మరిల్లు’ సినిమాలో ఓ పాట పాడారు. పిఠాపురం నాగేశ్వరరావు 1996 మార్చి 5న కన్నుమూశారు. అయితే తెలుగు సినిమా పాట ఉన్నంత కాలం ఆయన సంగీత ప్రియుల గుండెల్లో చిరంజీవి!

“విజయనగరం పనిమీద వెళ్ళినప్పుడు తప్పకుండా సుశీలమ్మ నాన్నగార్ని కలిసేవారు పిఠాపురం. సుశీలమ్మ టాలెంట్ ను గమనించి పెండ్యాలకు చెప్పేరు. పెండ్యాల నాకు ఆ అమ్మాయి తెలుసు పాడిద్దాం అని చెప్పి సుశీలమ్మకు కన్నతల్లి సినిమాలో పాడించాడు. ఆ తరువాత జరిగింది చరిత్రే. అందుకే ఈరోజుకీ సుశీలమ్మ పిఠాపురం కుటుంబం అంటే ఎంతో ఆప్యాయంగా ఉంటుంది.

అలాగే ఉమాసుందరి సినిమాలో మాష్టారితో పాడిన పాట “నమ్మకురా ఇల్లాలు పిల్లలు” పాటకి మాష్టారు ముగ్ధులైపోయారు. ఎంతగానో పిఠాపురంను అభినందించారు.”

· సశేషం

· మీ- గబ్బిట దుర్గాప్రసాద్ -16-2-22-ఉయ్యూరు

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in సినిమా and tagged . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.