మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు -79 79- డాన్స్ మాస్టర్ –ముక్కు రాజు80-అయిదు భాషల డాన్స్ మాస్టర్ ,,ముగ్గురు ముఖ్యమంత్రుల కొరియోగ్రాఫర్ ,విధి వంచితుడు –సలీం

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు -79

79- డాన్స్ మాస్టర్ –ముక్కు రాజు

ముక్కు రాజు గా ప్రసిద్ధిచెందిన సాగిరాజు రాజంరాజు (1931 – జూలై 31, 2014) తెలుగు సినిమా నటుడు, డాన్స్ మాస్టర్

జీవిత విశేషాలు
వీరు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం దగ్గర కుముదవల్లిలో 1931లో ఒక వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. తండ్రి బాపిరాజు, తల్లి సత్యవతమ్మ. 1941లో క్విట్ ఇండియా ఉద్యమ సందర్భంగా ఈ ఇంగ్లీషు చదువులు మాకొద్దు అంటూ, పుస్తకాలు విసిరేసి చదువు మానేశారు.[2]. ఈయనకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు.

సినిమా ప్రస్థానం
1955లో కె.వి.రెడ్డి దర్శకత్వం వహించిన మాయాబజార్ చిత్రంలోని “మోహినీ భస్మాసుర డాన్స్ డ్రామా”తో సినిమాలలో ప్రవేశించాడు. వివిధ భాషలలో దాదాపు 500 చిత్రాలలో నటించిన వీరు 200 చిత్రాలకు డాన్స్ మాస్టార్ గా, చాలా సినిమాలకు ఫైటర్ గా పనిచేశాడు. మాజీ ముఖ్యమంత్రి మహా నటుడు ఎన్టీఆర్‌ కు తొలిరోజుల్లో వ్యక్తిగత డాన్స్ మాస్టర్. మెగాస్టార్ చిరంజీవి చిత్రరంగ ప్రవేశం కొత్తలో ప్రాణం ఖరీదు, పునాది రాళ్ళు, మనవూరి పాండవులు చిత్రాలకు డాన్స్ మాస్టర్‌గా వ్యవహరించాడు. ఆర్.నారాయణమూర్తి నిర్మించి, నటించిన ఎర్రసైన్యం, అడవి దివిటీలు లాంటి దాదాపు అన్ని చిత్రాలకు నృత్య రూపకల్పనతో పాటు డప్పు పట్టి నటించాడు.[3] “1940 లో ఒక గ్రామం” చిత్రంలో ముక్కురాజు నటనకు ఉత్తమ సహాయ నటునిగా నంది అవార్డు లభించింది[4][5]. టి.వి.నంది పురస్కారాలకమిటీలో 2000 సంవత్సరానికి సభ్యులుగా ఉన్నాడు. హైదరాబాద్ లో నృత్య దర్శకుల సంఘాన్ని ఏర్పాటు చేశాడు.

నటించిన చిత్రాలు
· జీవనవేదం (1993)

· ఆంటీ (1995)

· తెలుగోడు (1998)

· పాపే నా ప్రాణం (2000)

· అడవిచుక్క (2000)

· విజయం (2003)

· నాగప్రతిష్ఠ (2003)

మరణం
2014, జూలై 31వ తేదీ గురువారం తెల్లవారుఝామున ముక్కురాజు కన్నుమూశారు.

సాక్షి పత్రిక కధనం

ప్రముఖ సినీ నృత్యకళాకారుడు, నృత్య దర్శకుడు, నటుడు… సాగిరాజు రాజంరాజు అలియాస్ ముక్కురాజు(83) గురువారం తెల్లవారుజామున పశ్చిమగోదావరి జిల్లా పాలకోడేరు మండలం కుముదవల్లిలో కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారాయన. ముక్కురాజుకి ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు. నృత్య దర్శకుడు శివసుబ్రమణ్యం, ఎడిటర్ భూపతి కృష్ణంరాజు… ముక్కురాజుకు బావమరుదులే. స్వాతంత్య్రోద్యమంలో చురుకైన పాత్ర పోషించారు ముక్కురాజు.

1941 క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని… ఇంగ్లిష్ చదువులు మాకొద్దంటూ.. ఆంగ్ల పుస్తకాలను బహిష్కరించిన చరిత్ర ముక్కురాజుది. సినీ స్వర్ణయుగంలో నృత్య కళాకారునిగా ముక్కురాజు ఓ వెలుగు వెలిగారు. ‘మాయాబజార్’(1955)లోని మోహినీ భస్మాసుర నృత్యరూపకంతో తెరకు పరిచయమయ్యారాయన. దాదాపు అయిదొందల చిత్రాల్లో తన నృత్యాలతో అలరించారు. రెండొందల పైచిలుకు చిత్రాలకు నృత్య దర్శకునిగా పనిచేశారు. ముక్కురాజు నర్తించిన ప్రత్యేకగీతాలు ఆ రోజుల్లో చాలానే ఉన్నాయి.

‘వెలుగునీడలు’(1964) చిత్రంలోని ‘పాడవోయి భారతీయుడా..’ పాటలో ముక్కురాజు నృత్యాభినయాన్ని తేలిగ్గా మరచిపోలేం. ముక్కురాజు కెరీర్‌లో తలమానికం ‘దక్షయజ్ఞం’(1962). ఆ సినిమా పతాక సన్నివేశంలో శివుని పాత్ర పోషించిన ఎన్టీఆర్ చేసిన ప్రళయతాండవం రూపకల్పనలో ముక్కురాజు పాత్ర చాలానే ఉంది. క్లోజప్‌లో ఎన్టీఆర్ కనిపించినా.. దూరం నుంచి ఆ నృత్యాన్ని అభినయించింది ముక్కురాజే. ఎన్టీఆర్‌కి తొలి రోజుల్లో వ్యక్తిగత నృత్య దర్శకునిగా వ్యవహరించారాయన. అలాగే.. చిరంజీవి ‘ప్రాణం ఖరీదు’(1978), పునాదిరాళ్లు(1979), మనవూరి పాండవులు(1978) చిత్రాలకు నృత్య దర్శకునిగా పనిచేశారు. 80ల్లో కూడా పలు చిత్రాలకు నృత్యాలను సమకూర్చిన ముక్కురాజును నటునిగా ప్రోత్సహించినవారిలో ఆర్.నారాయణమూర్తిని ప్రముఖంగా చెప్పుకోవాలి.

నారాయణమూర్తి రూపొందించిన దాదాపు ప్రతి సినిమాలో ముక్కురాజు ఉండేవారు. ముఖ్యంగా ‘ఎర్రసైన్యం’(1994)లో ఆయన నటన ప్రేక్షకులను ఆకట్టుకుంది. అలాగే ‘1940లో ఓ గ్రామం’(2008) చిత్రంలో ముక్కురాజు నటనకు ఉత్తమ సహాయ నటునిగా నంది అవార్డు లభించింది. ‘చండాలిక నృత్యరూపకాన్ని’ ప్రముఖ నృత్య దర్శకులతో కలిసి దేశవ్యాప్తంగా ప్రదర్శనలిచ్చారు ముక్కురాజు. హైదరాబాద్‌లో నృత్య దర్శకుల సంఘం ఏర్పాటు చేసింది కూడా ఆయనే. గత కొంతకాలంగా వృద్ధాప్యం కారణంగా తెరపై అంతగా కనిపించలేదాయన. ముక్కురాజు మరణం పట్ల తెలుగు చలనచిత్ర నటీనటుల సంఘం తీవ్ర సంతాపాన్ని వెలిబుచ్చింది. పశ్చిమగోదావరి జిల్లా చెరుకువాడలో శుక్రవారం ఆయన అంత్యక్రియలు జరుగనున్నాయి.
సీనియర్ నటుడు సాగిరాజు రాజంరాజు (ముక్కు రాజు) మరణించారు. గత కొంత కాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. రాజంరాజు (ముక్కు రాజు) 1000కి పైగా సినిమాల్లో ఆయన నటించారు. కొరియోగ్రాఫర్ గా సినీ రంగంలో ప్రవేశించిన ఆయన, పలు చిత్రాలలో అనేక పాత్రలు పోషించారు. పశ్చిమగోదావరి జిల్లా భీవరం దగ్గర కుముదపల్లిలో 1931లో ఒక వ్యవసాయ కుటుంబంలో ముక్కురాజు జన్మించారు. తండ్రి బాపిరాజు, తల్లి సత్యవతమ్మ. 1941 క్విట్ ఇండియా ఉద్యమం సందర్భంగా ఈ ఇంగ్లీష్ చదువులు మాకొద్దు అంటూ పుస్తకాలు విసిరేసి చదువు మానేసారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గురువారం ఉదయం పాలకొండి మండలం కుమటి గ్రామంలో తుదిశ్వాస విడిచారు. ముక్కురాజు అసలుపేటు సాయిరాజు రాజంరాజు. 2010లో వచ్చిన ‘1940లో ఓ గ్రామం’ అనే చిత్రంలో నటించిన ముక్కురాజుకు జాతీయ స్థాయి అవార్డు లభించింది. 2013 ముక్కురాజు చివరి సారిగా ‘మధసింహం’ అనే చిత్రంలో నటించారు. ఆర్. నారాయణమూర్తి తీసే సినిమాల్లో దాదాపు ప్రతి దాంట్లోనూ ముక్కురాజు కనిపించే వారు. ముక్కురాజు మృతికి పలువురు సినీ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. ఆయన స్వస్థలమైన పశ్చిమగోదావరి జిల్లా ఉండి మండలం చెరుకువాడలో శుక్రవారం నాడు ముక్కురాజు అంత్యక్రియలు జరుగుతాయి. 200 సినిమాలకు డాన్స్ మాస్టర్ గా పని చేసారు. నందమూరి తారక రామారావుకు వ్యక్తిగత డాన్స్ మాస్టర్‌గా కూడా పని చేసారు. చిరంజీవి ప్రాణం ఖరీదు, పునాది రాళ్లు, మనవూరి పాండవులు చిత్రాలకు డాన్స్ మాస్టర్ గా పని చేసారు.

హైదరాబాద్: టాలీవుడ్ ప్రముఖ నటుడు, డాన్స్ మాస్టర్ ముక్కు రాజు కన్ను మూసారు. కొంతకాలంలో అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గురువారం ఉదయం పాలకొండి మండలం కుమటి గ్రామంలో తుదిశ్వాస విడిచారు. ముక్కురాజు అసలుపేటు సాయిరాజు రాజంరాజు. దాదాపు 600 సినిమాల్లో ముక్కురాజు నటించారు. అనారోగ్యంతో ఉన్నప్పటికీ ముక్కురాజు సినిమాలు చేస్తునే ఉన్నారు. 2010లో వచ్చిన ‘1940లో ఓ గ్రామం’ అనే చిత్రంలో నటించిన ముక్కురాజుకు జాతీయ స్థాయి అవార్డు లభించింది. 2013 ముక్కురాజు చివరి సారిగా ‘మధసింహం’ అనే చిత్రంలో నటించారు. పశ్చిమగోదావరి జిల్లా భీవరం దగ్గర కుముదపల్లిలో 1931లో ఒక వ్యవసాయ కుటుంబంలో ముక్కురాజు జన్మించారు. తండ్ిర బాపిరాజు, తల్లి సత్యవతమ్మ. 1941 క్విట్ ఇండియా ఉద్యమం సందర్భంగా ఈ ఇంగ్లీష్ చదువులు మాకొద్దు అంటూ పుస్తకాలు విసిరేసి చదువు మానేసారు.

1955లో కెవీ రెడ్డి దర్శకత్వంలో మాయాబజార్ సినిమాలో మోహినీ భస్మాసుర డాన్స్ డ్రామాతో సినీరంగంలోకి ఎంట్రీ ఇచ్చారు. ఇప్పటి వరకు ఆయన దాదాపు 600 చిత్రాల్లో నటించారు. 200 సినిమాలకు డాన్స్ మాస్టర్ గా పని చేసారు. నందమూరి తారక రామారావుకు వ్యక్తిగత డాన్స్ మాస్టర్‌గా కూడా పని చేసారు. చిరంజీవి ప్రాణం ఖరీదు, పునాది రాళ్లు, మనవూరి పాండవులు చిత్రాలకు డాన్స్ మాస్టర్ గా పని చేసారు. ఆర్ నారాయణ మూర్తి సినిమాల్లో ముక్కురాజుకు తప్పకుండా ఒక పాత్ర ఉండేది. ముక్కురాజు భార్య, ఇద్దరు కుమార్తె, ఒక కుమారుడు ఉన్నారు. శుక్రవారం ఉండి మండలం చెరుకువాడలో ముక్కురాజు అంత్యక్రియలుజరిగాయి.

80-అయిదు భాషల డాన్స్ మాస్టర్ ,,ముగ్గురు ముఖ్యమంత్రుల కొరియోగ్రాఫర్ ,విధి వంచితుడు –సలీం

ఆ రోజుల్లో డాన్స్ మాస్టర్ సలీమ్ పేరు తెరపై కనిపించగానే థియేటర్లలో ఈలలు మారుమోగి పోయేవి. తెలుగువాడు కాకపోయినా సలీమ్ తెలుగు చిత్రసీమలోని అగ్రశ్రేణి కథానాయకులందరికీ నృత్యరీతులు సమకూర్చి అలరించారు. తెలుగు, తమిళ, కన్నడ, మళయాళ, హిందీ భాషల్లో కలిపి దాదాపు 300 పైచిలుకు చిత్రాలకు సలీమ్ డాన్స్ కంపోజ్ చేశారు. మళయాళ సీమలో కన్ను తెరచిన సలీమ్ బాల్యం నుంచీ పచ్చని పొలాల మధ్య చిందులు వేస్తూ గడిపాడు. అతని డాన్సుల్లో ఈజ్ ను గమనించిన కొందరు స్థానికులు చిత్రసీమకు వెళ్ళి ఎవరి దగ్గరనైనా అసిస్టెంట్ గా పనిచేయమని సలహా ఇచ్చారు. దాంతో చెన్నపట్టణం చేరిన సలీమ్, నాటి మేటి నృత్య దర్శకుల వద్ద సహాయకునిగా పనిచేశారు. పసుమర్తి కృష్ణమూర్తి, వెంపటి చినసత్యం వద్ద శాస్త్రీయ నృత్యంలో మెలకువలు తెలుసుకున్నారు సలీమ్. ఆ తరువాత తంగప్పన్, హీరాలాల్ వంటి నృత్య దర్శకుల వద్ద పనిచేశారు. 1965లో ఎమ్జీఆర్ హీరోగా రూపొందిన ‘పోర్ సిలై’ చిత్రం ద్వారా సలీమ్ సోలోగా డాన్స్ కొరియోగ్రాఫర్ కాగలిగారు. ఆ తరువాత నుంచీ ఎమ్జీఆర్ ప్రోత్సాహంతో పలు చిత్రాలకు నృత్య దర్శకునిగా పనిచేశారు.

తెలుగులో యన్టీఆర్ హీరోగా పీతాంబరం ‘అన్నదమ్ముల అనుబంధం’ నిర్మించారు. ఆ చిత్రానికి సలీమ్ నృత్యరీతులు సమకూర్చారు. ఆ చిత్రంలోని “ఐ లవ్ యూ సోనీ…” పాటలో సలీమ్ కనిపిస్తారు కూడా. ఆ తరువాత యన్టీఆర్ నటించిన అనేక చిత్రాలకు సలీమ్ నృత్యరీతులు సమకూర్చారు. ముఖ్యంగా ‘అడవిరాముడు’లో “ఆరేసుకోబోయి పారేసుకున్నాను…” పాటలో యన్టీఆర్ ఇమేజ్ ను, పర్సనాలిటీని దృష్టిలో పెట్టుకొని సలీమ్ డాన్స్ కంపోజ్ చేయించిన తీరు అందరినీ ఆకట్టుకుంది. యన్టీఆర్ ‘వేటగాడు’ లోనూ సలీమ్ ఆరంభంలోనే కనిపిస్తారు. “కొండమీన చందమామ…” పాటలో నర్తించేది సలీమ్ మాస్టరే! య‌న్టీఆర్ సూప‌ర్ హిట్ మూవీస్ అడ‌విరాముడు, డ్రైవ‌ర్ రాముడు, వేట‌గాడు, స‌ర్దార్ పాపారాయుడు, గ‌జ‌దొంగ‌, కొండ‌వీటి సింహం, జ‌స్టిస్ చౌద‌రి, బొబ్బిలిపులి వంటి చిత్రాల‌లోని హిట్ సాంగ్స్ అన్నీ కూడా స‌లీమ్ డాన్స్ తో కంపోజ్ అయిన‌వే! ఇక ఏయ‌న్నార్ ఆల్ టైమ్ హిట్ ప్రేమాభిషేకంలోని పాట‌ల్లోనూ స‌లీమ్ మాస్ట‌ర్ డైరెక్ష‌న్ క‌నిపిస్తుంది.

య‌న్టీఆర్, ఏయన్నార్, కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజు, చంద్రమోహన్, మురళీమోహన్ వంటి హీరోలందరికీ వారి బాడీ లాంగ్వేజ్ ను బట్టి స్టెప్స్ వేయించి మురిపించారు సలీమ్. ఇక ‘అన్నదమ్ముల అనుబంధం’లోనే బాలకృష్ణతో డాన్స్ చేయించిన సలీమ్ మాస్టర్ వద్దే బాలయ్య చిత్రసీమలో అడుగుపెట్టే సమయంలో నృత్య భంగిమలను అభ్యాసం చేశారు. ఆ తరువాత అనేక చిత్రాలలో బాలయ్యకు సలీమ్ మాస్టర్ డాన్స్ కంపోజ్ చేశారు. చిరంజీవిని స్టార్ గా నిలిపిన ‘ఖైదీ’లో కూడా సలీమ్ మాస్టర్ పనితనంతోనే అందులోని పాటలు జనానికి నయనానందం పంచాయి. ఇలా నాలుగు తరాల హీరోలకు నృత్యరీతులు సమకూర్చి తనకు తానే సాటి అనిపించుకున్నారు సలీమ్ మాస్టర్.

ఈ రోజున ఎంతోమంది నృత్య దర్శకులుగా రాణిస్తున్న వారి గురువులకే గురువు సలీమ్ మాస్టర్. ఆయన వద్ద శిష్యరికం చేసిన శివశంకర్, శివ-సుబ్రహ్మణ్యం వంటి వారు తరువాతి రోజుల్లో గురువుకు తగ్గ శిష్యులు అనిపించుకున్నారు. డాన్స్ కొరియోగ్రాఫర్ గా తిరుగులేని విధంగా సాగిన సలీమ్ చెన్నైలో ఓ అందమైన నివాసాన్ని ఏర్పరచుకున్నారు. ఆ ఇంటిని యన్టీఆర్ చేతులు మీదుగానే ప్రారంభించారు. అలాగే ఓ షాపింగ్ కాంప్లెక్స్ నూ కట్టారు. అందులో ఇద్దరు సోదరులు హార్డ్ వేర్ బిజినెస్ చేసేవారు. వారికి ఆ షాప్ కలిసొచ్చింది. సలీమ్ కొన్ని కారణాల వల్ల వారిని ఖాళీ చేయమన్నారు. వారు ఖాళీ చేయడానికి నిరాకరించారు. కోర్టు నోటీసులు ఇచ్చినా, ఖాళీ చేయకపోవడంతో ఆ సోదరుల మీదకు సలీమ్ మందితో వెళ్ళి దాడి చేశారు. ఆ దాడిలో ఆ అన్నదమ్ములు తీవ్రంగా గాయపడి, ఆసుపత్రికి చేర్చేలోపు కన్నుమూశారు. ఆ కేసులో సలీమ్ తో పాటు 15 మందిని అరెస్ట్ చేశారు. చిత్రసీమలో తిరుగులేని కొరియోగ్రాఫర్ గా బతికిన సలీమ్, జైలులో ఉన్నప్పుడే తాగుడుకు బానిసయ్యారు. ఆ తరువాత బెయిల్ పై బయటకు వచ్చి, విపరీతమైన తాగుడుతో తడిసిముద్దయ్యారు. కుటుంబసభ్యులు సైతం అసహ్యించుకొని గెంటేశారు. చివరకు హైదరాబాద్ చేరి కృష్ణానగర్ లో ఓ చిన్న గదిలో ఉండేవారు. మళ్ళీ చెన్నైకి వెళ్ళి అక్కడే ఆయన కన్నుమూశారు.

ఏది ఏమైనా తెలుగు చిత్ర‌సీమ‌లో స‌లీమ్ మాస్ట‌ర్ బాణీ ప్ర‌త్యేక‌మైన‌ది. ఆ తీరున సూప‌ర్ స్టార్ డ‌మ్ చూసిన డాన్స్ మాస్ట‌ర్ మ‌రొక‌రు కాన‌రారు. ఆయ‌న కంటే ముందు ఎంతోమంది గొప్ప నృత్య‌ద‌ర్శ‌కులు ఉన్నారు. కానీ, ఈ స్థాయిలో స్టార్ డ‌మ్ చూసిన వారు లేరు.

తెలుగు తమిళ అగ్రస్శ్రేని హీరోలు హీరోయిన్ లు సలీం మాస్టారు కోరియోగ్రఫీ తమకు చేయాలని కోరేవారు .మద్రాస్ టి నగర్లో నార్త్ ఉస్మాన్ రోడ్ లో ఉండేవాడు .అక్కడే ఒక బిల్డింగ్ కొని హార్డ్ వేర్ షాప్ కు అద్దె కిచ్చాడు అదే ఆయన పతనానికి దారి తీసింది . కదక్ నాట్యాచార్యుడు గోపీ కృష్ణ శిష్యుడు సలీం మాస్టార్ ,నటీ నటుల బాడీ లాంగ్వేజ్ బట్టి డాన్స్ కూర్చటం ఆయన ప్రత్యేకత .ముగ్గురు ముఖ్యమంత్రులు ఎమ్జి ఆర్ ఏంటి ఆర్ జయలలిత లకు కోరియోగ్రఫీ చేసిన ఘనత ఆయనది .సలీం కొడుకు పుట్టిన రోజు ప౦ డుగకఈ ముగ్గురు సి ఎం లు హాజరయ్యారంటే అవాక్కైపోతాం .పకడ్బందీ అయిన బందోబస్తు ,రోడ్లన్నీ బ్లాక్ .మధ్య కొడుకు పుట్టిన రోజు అంగరంగ వైభవం జరిపాడు సలీం భాయ్ .కాఫీ ,టీ,మంచి నీళ్ళల్లో మూలికల పొడి కలిపి తాగేవారు తాగించేవారు .రంగు వేరే అయినా రుచికరంగా ఆరోగ్యంగా ఉండేది .అడవి రాముడు షూటింగ్ సమయం లో తమకు ఏర్పాటు చేసిన భోజనం కాదని మైసూర్ తీసుకొని వెళ్లి అక్కడ పేదరాశి పెద్దమ్మ లాంటి హోటల్ లో భోజనాలు తిపించేవాడు పత్రికా విలేకరులకు అ భోజనం అచ్చంగా మన ఇంటి భోజనం లాగా ఉండేదని వారు సలీం ను మెచ్చుకొనేవారు .జీవితం లో ప్రతిదీ ఒకప్రత్యేకటగా చూడాలని ఆయన ఫిలాసఫీ .

ముగ్గురు ముఖ్య మంత్రులతో డాన్స్ ఆడించిన సలీం మాస్టారిని విధి వక్రించిఒక ఆటాడిం చింది .ఆయన అద్దెకిచ్చిన హార్డ్ వేర్ షాప్ ఓనర్ అద్దె చాలా బాకీ ఉండటం తో ఒక రోజు అడగటానికి మందీ మార్బల౦ తో వెళ్ళగా ఇద్దరిమధ్య తీవ్ర వాగ్వివాదం జరిగి అతడు అలీం ను ఏదో అనరాని మాట అంటే తీవ్రకకోపం తో అక్కడే ఉన్న ఇనుప సుత్తి అతడిపై విసిరేయగా అది ఆయన తలకు తగిలి కుప్ప కూలిపోయి చనిపోయాడు .ఇంతలో పోలీసులు వచ్ఛి అరెస్ట్ చేసి హత్యానేరం మీద జైలులో పెట్టారు .ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా విడుదలకాలేకపోయాడు .పెద్ద శిక్షే పడింది .ఎవ్వరూ సాయం చేయటానికి ముందుకు రాలేదు .మొత్తం మీద విడుదలయ్యాడు .ఈలోపు బంధువులు ,మిత్రులు దొరికింది దొరికినట్లు ఆస్తి అంతా దోచేశారు .అడిగితె మొహం చాటేసేవారు. క్రిమినల్ అనే ముద్ర వెంటాడుతోంది .చిత్ర పరిశ్రమకూడా చేతు లెత్తేసింది .పోపొట్ట గడవ టానికి చేతిలో చిల్లి గవ్వలేదుపాపం.

మద్రాస్ వదిలి , హైదరాబాద్ చేరాడు సలీం భాయ్ ఇక్కడా అదే పరిస్థతి ఎదురైంది .మళ్ళీ మద్రాస్ వెళ్లి చిన్న గదిలో అద్దెకు ఉంటూ ‘’ఇక్కడ డాన్స్ నేర్పబడును ‘’అని బోర్డ్ పెట్టుకొని వచ్చిన వారికి నేర్పే ప్రయత్నం చేశాడు .ఎవరూ రాకపోయేసరికి అద్దె చెల్లించటం కష్టమై మూసేశాడు. ఆయన దీనస్థితికి జాలిపడినా ఎవరూ ముందుకు వచ్చి సాయం చేసేవారు కాదు .వాళ్ళను చూసి తనలో తాను కుమిలి పోయేవాడు .బాధలు మర్చిపోవటానికి మందుకు బానిసయ్యాడు .పిచ్చివాడిలా రోడ్లు పట్టుకు తిరిగేవాడు .క్షణికావేశం లో చేసిన పని ఆయనను పతనావస్థకు తెచ్చింది ఇదే అందరికి గునపాఠం .

సశేషం

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -18-2-22-ఉయ్యూరు

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in సినిమా and tagged . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.