ఆధునిక గుజరాత్ కవిత్వ కోట –నానాలాల్ -2
నానాలాల్ తండ్రి దలపత్ రాం పాతకోత్తకవిత్వ వారధి .కవిరాజు బిరుదున్నవాడు .పూర్వకాల సంస్కృత పాండిత్యం ,వ్రజభాష ,మధ్యయుగ గుజరాతీ కవిత అలంకార ఛందస్శాస్త్రాలలో నిధి .శిష్టాచారాలతో పెరిగినవాడు .నూతనకవితా వికాసంతోనూ కొంత పరిచయమున్నది .సమకాలీనకవి నర్మద్ లాగా సంఘ సంస్కరణ అవసరం గుర్తించినవాడు .నర్మాద్ తనభావాలను తర్వాత మార్చుకోన్నాడుకానీ దలపత్ మారలేదు .అన్నీ పద్యం లోనే చెప్పాడు .శ్రోతల్ని కవిత్వంతో ఆనదింప జేశాడు .బొమ్బాయినగరం లోని దర్జీలు ,పార్శీలు,ఇతర ప్రముఖులపై పై ఆయన ‘’గర్భీలు ‘’రాశాడు .పిప్పల వృక్షాన్ని గురించి రాసిన బపానీ పిప్పర్ లో గ్రీష్మర్తు వర్ణన ఉంది .ఇది నవ్యసృష్టి .తర్వాత అగ్నిమాపక దళం ,విదేశీయానం ,నల్లులు ఎలుకలు పొగాకు చెప్పులుకుట్టేరాయి ,ఎగ మొండికేసిన దున్న ,కుర్చీ లపైనా కవితలల్లాడు .అరిష్టోఫేన్ రూపకాలు ధోరణి లో మొదాంత నాటకాలు రాశాడు .మొట్టమొదటి స్మృతిగీతం రాశాడు విజ్ఞానబోదనలో హాస్య ధోరణిలో వీటికి మించినవి లేవు .
సంలీనతా యుగం
1852నుంచి గుజరాత్ కవిత్వం లో కొత్తమార్గామేర్పడింది .దేశంలోని పునరుజ్జీవ ఉద్యమం మొదటిదశ్శలోనే గుజరాత్ లో నవీన కవితోద్యమం మొదలైంది .పాశ్చాత్య ధోరణిపై పూర్తీ అనుకరణ ,ఆకర్షణతో కవిత్వాలు రాశారుకవులు .తర్వాత విచాక్షణాత్మక దశలో ప్రాతయ పాశ్చాత్య మేలికలయికలతో ,కొత్త పాతలకలయికతో కవిత్వం రాశారు .ఈమార్పు సాహిత్య సాన్ఘికాది విషయాలలోనూ వచ్చింది .దీన్ని దలపతిరాం నర్మాద్ ,,నరసింహారావు దివితియ ,కాంత్ ,కలాపి మార్గదర్శనం చేశారు .వచనం లో గోవర్ధనరావు త్రిపాఠీ,రచనలలో ఆయన విశిష్టరచన ‘’సరస్వతీ చంద్ర ‘’లో అపూర్వ సాంస్కృతిక సమ్మేళనం కనిపిస్తుంది .ఈబాధ్యతను నానాలాల్ భుజాలపైకి ఎత్తుకోన్నాడు .
19వ శతాబ్ది చివర ,20వ శతాబ్ది మొదట్లో గుజరాత్ జీవితం సాహిత్యాలలో ‘’సంలీనత ‘’రాజ్యమేలింది .’’అన్ని దిక్కుల్నుంచి సర్వ సద్భావాలు మమ్మల్ని సమీపించుగాక ‘’అనే వేదస్తుతి మళ్ళీ స్మరణీయం అయింది .దీనికి తోడూ గాంధీ చెప్పిన ‘’సమస్త దేశ సంస్కృతులు నా ఇంటి చుట్టూ ఎటువంటి అడ్డంకి లేకుండా స్వేచ్చగా వీచటమే నేను ఆశిస్తాను.ఏ గాలీ నాపాదాలను తొట్రుపడజేసి ,నేను కొట్టుకుపోవటం మాత్రం నేను సహించను.’’ కూడా చేర్చుకొన్నారు .నానాలాల్ తో సహా కవులంతా ఈ దృక్పధాన్నే పాటించారు .ఇదే వశీకరణ వాగ్ నినాదం.ఈ రకమైన సంలీనతా తత్వాన్ని కవితలో పాటలలోరూపకాలలో రాగభరిత౦ గా ,లయాత్మకంగా వ్యవస్ధీ కరించిన వారిలో మన నానాలాల్ అగ్రగణ్యుడు .
పద్య కృతులు
శత సంపుట రచయిత నానాలాల్ లయాత్మక శైలిలోవైవిధ్యం తో గద్య ,పద్య కృతులు అల్లాడు .కధనాత్మకకావ్యాలైన వసంతోత్సవ ,ద్వారికా ప్రళయ ,పాటలు భావగీతాలు ,రాసలీలలు చాలా సంపుటాలు గా రాశాడు .వీటిలో విస్తృత మహాకావ్యం ‘’కురుక్షేత్ర ‘’12భాగాలు .ఇందుకుమార్ ,జయజయంత్ ,జహంగీర్ ,నూర్జహాన్ ,షహంషా అక్బర్ ,విశ్వగీత మొదలైన నాటకాలు 12పైగా రాశాడు .నవలలుగా ఉష ,సారధి రాశాడు .పంఖాడి వంటి కధలు,ఉద్బోధన్ ,సంసార మంధన్ పేర్లతో 8సంపుటాలుగా బహిరంగ ఉపన్యాసాలు ,సాహితీ విమర్శలు ,కవీశ్వర్ దలపతిరాం ‘’పేరిట తండ్రి జీవిత చరిత్ర నాలుగు భాగాలుగా రాశాడు .శకుంతల ,మేఘదూత ,భగవద్గీత అను వాదాలు చేశాడు .సుదీర్ఘమైన తన అర్ధ శతాబ్ది సాహిత్య జీవితాన్ని ‘’హరి సంహిత ‘’అనే అసంపూర్ణ కావ్యం పరి సమాప్తి చేశాడు నానాలాల్ .తన సాహిత్య జీవితాన్ని ‘’హరిలీలామృతం ‘’అనే దీర్ఘ కావ్యం తో సమాప్తి చేసి ధన్యుడయ్యాడు .
సశేషం
మీ-గబ్బిటదుర్గాప్రసాద్ -19-2-22-ఉయ్యూరు —