మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-84
84-తెలుగు సినీ తొలి హాస్య హీరో, బారిష్టర్ పార్వతీశం,చాకలి తిప్పడు ఫేం,తెలుగు,తమిళ మొదటి హాస్య నట దర్శకుడు –లంక సత్యం -2
1968లో ఒక రాత్రివేళ…
మద్రాసు సెంట్రల్ స్టేషను కిటకిటలాడుతున్నవేళ. ఆ రద్దీలో పెద్ద పెద్దలైట్లు, కెమెరా, ట్రాలీ మూవ్మెంట్ట్లూ, సినిమా షూటింగు. సినిమా పేరు “సర్కార్
ఎక్స్‌ప్రెస్”. ప్లాట్‌ఫాం మీద ఆగివున్న
రైల్లోనూ, రైలు దగ్గరా షూటింగు.
విపరీతమైన జనం. కెమెరా ముందు జనం,
రైలు పెట్టె దగ్గర జనం. ఎవరూ కదలరు.
కేకలు, గోలా, పోలీసులూ, (ప్రొడక్షన్
వాళ్ళూ జనాన్ని పక్కకి నెడుతున్నారు. ఓ
పక్క. నెడుతూవుంటే, ఇంకో పక్కనుంచి
తోసుకొస్తున్నారు. సముద్రంలో ఓ కెరటం
పడిపోతే, ఇంకో కెరటం లేచినట్టు.
“పిన్నాడి పోంగయ్య – ఏం మేలమేల
వర్రింగె” అని పోలీసులు, ఓ
యు. కూడా వెనక్కి నెట్టేశారు.
“ఓర్నాయనో, నేని సినిమా డైరక్టర్షయ్యా
బాబూ, నన్ను తోసేస్తున్నారేమిటి?” అని
ముందుకు తోసుకొస్తున్నాయనే లంక
సత్యం. “మీరు సినిమా డైరక్టర్హా లేరు. ఈ
(డ్రస్‌లో వుంటే మాకేం తెలుస్తుంది?”
అన్నాడో పోలీసు తమిళంలో. “తెల్లపంచె,
తెల్ల జుబ్బా వేసుకోవడం నేరంలావుందే!
గొప్ప జోకు. డైరక్టర్నీ పొమ్మన్నారు
పోలీసులు” అన్నారు సత్యం గారు. సర్కార్
ఎక్స్‌ప్రెస్” సినిమాకి ఆధారం మలయాళ
చిత్రం. ఆ చిత్రానికి దర్శకుడైన
కృష్ణనాయరే, తెలుగు కీ డైరక్టరు-సత్యానికి.
అసలు సత్యానికొస్తే – లంక సత్యమే చెశారు
అంతా. అలా ఆ రాత్రి నెట్టుకుంటూ,
తోసుకుంటూ గోలాకేకల మధ్య
జరిగిపోయింది షూటింగు. అప్పట్లో
సెంట్రల్లో షూటింగ్ చేసుకోడానికి,
ఎక్కువ మొత్తంలో డిపాజిట్టు కట్టించుకుని
అనుమతి ఇచ్చేవారు. చాలా కాలంగా ఇవ్వడం లేదు. ఆ విధంగా – చేతిలో సిగరెట్టుతో,
నెమ్మదిగా కబుర్లు చెబుతూ, ‘సింపులోగా
వుండేవారు లంక సత్యం. 1940లో
మొక్కపాటి నరసింహ శాస్త్రి గారి నవల
“బారిష్టర్ పార్వతీశం” సినిమాగా వచ్చింది.
అంతకుముందు చిన్ల చిన్న హాస్య
సినిమాలు వచ్చినా, పూర్తి హాస్యచిత్రంగా
తొలిసారి వచ్చిన సినిమా పార్వతీశమే. ఆ
పార్వతీశం పాత్రధారి లంక సత్యం. అంచేత
ఆయనే తొలి హాస్య హీర్రో “నేనేదో స్టేజి మీద ఆడవేషాలు
వేశానుగాని, హాస్య పాత్ర ఏనాడూ
వెయ్యలేదు. సినిమా మీద మోజు పెరిగి
బొంబాయి పారిపోయి, దర్శకత్వ శాఖలో
పనిచేశాను. 1939లో వచ్చిన “అమ్మకి
నేను సహకార దర్శకుణ్ణి – డైరక్టరు
నిరంజన్పాల్కి తెలుగు రాదు గనక. ఆ
సినిమాలో – చెప్పాలంటే ‘ఏడుపు గొట్టు”
వేషం వేశాను. “అమ్మ” -“అమ్మ!”
అనిపించలేదు – “అమ్మో” అని
పడిపోయింది. పాల్గారు “నువ్వు మెడ్రాస్
పోరా. ప్రకాష్ దగ్గర చేరు” అని ఉత్తరం
ఇస్తే ఆర్.ఎస్. (ప్రకాష్ దగ్గర చేరాను. –
సహకార దర్శకుడిగానే. నాకు సరదాగా,
నవ్విస్తూ మాట్టాడ్డ వ్విస్తూ మాట్టాడ్డం
సరదా. జోకులు
చెప్పడం సరదా. ఆ
సరదా చూసి
పార్యతీశం వేషం
నాచెత వేయించాలని
‘ప్రకాష్‌గారు సరదా
పడ్డారు. నావల్ల
కాదన్నాను. నాకు
హాస్యం రాదు
మొ(ర్రోమన్నాను.
“నేనున్నాను వెయ్యి’
అన్నారాయన. వేశాను. ఆయనే
అంతా చేసి
చూపించేవారు. నేను అలాగే చేశాను. ఆ
విధంగా నేను హాస్య పాత్రధారిగా తయారు
చెయ్యబడ్డాను”. అని సతంగారు
చెప్పారోసారి. ఐతే ‘పార్వతీశం’ సినిమా,
అప్పుడొచ్చే పౌరాణికాలంత పెద్ద నిడివి గల
సినిమా కాదు. అంత నిడివి వుంటే గాని,
ప్రేక్షకులకి సయించదు. అంచేత, ‘బొండాం
పెళ్ళి’ చదువుకున్న భార్య’ అన్న మరో
రెండు చిన్న సినిమాలు కలిపి, విడుదల
చేశారు.
“ఆ సినిమా అయిన తర్వాత నన్నుచూసి – కామిక్ యాక్టర్రో –
అనేవాళ్ళు, అప్పుడు కామిక్కేక్టర్లనే
అనేవాళ్ళు – హాస్యం చేసినవాళ్ళని.
హేళనగా కూడా అనేవాళ్ళు. శివరావు,
రేలంగి వచ్చిన తర్వాతనే హాస్య నటులకి
విలువ, విశిష్టతా పెరిగాయి” అని చెప్పారు
సత్యంగారు. ఆయనకింకో రికార్డు కూడా
వుంది. హాస్య నటుల్లో కొందరు
డైరక్టర్లయ్యారు. ,వాళ్ళలో మొదటివాడు
కూడా ఆయనే. 1947లో వచ్చిన జెమిని
వారి ‘జీవన్ముక్తి’కి ఆయనే డైరక్టరు.
అందులో వేషం వేశారు, హాస్యమే చేశారు.
ఆయనకి మంచిపేరు తెచ్చిన సినిమా “బాల
నాగమ్మ. అందులో చాకలి తిప్పడుకి
మంచి రెస్సాన్స్ వచ్చింది. బాగా
ఆకర్షించింది. ఇంకో విశేషం చెప్పేవారు
సత్యంగారు. “జోక్‌లా వుంటుంది –
వినడానికి. జెమినివారు ‘మదన కామరాజు”
అని తమిళంలో తీశారు. ఆ తమిళ
సినిమాలో నేనూ సూరిబాబూ కలిసి తెలుగు
పాట పొడాం – నటిస్తూ. “ఏం పిల్లో సింకిరి
బొంకిరిగున్నావు” అన్న పాట అది” మాయలోకం, మాయపిల్ల, ఇద్దరు మిత్రులు,
జగదేక వీరుని కథ, గులే బకావళి కథ,
రహస్యం మొదలైన సినిమాల్లో సత్యం హాస్య
పొత్రలు ధరించారు.
“కొంత కాలానికి నా అసలు
పళ్ళుపోయి, డబ్బు పెట్టి కొనుక్కున్న
పళ్ళొచ్చాయి. అప్పుడు డాక్టరుగారు
“జాగ్రత్తగా వాడకోండి పళ్ళు” అన్నారు.
“ఎందుకు వాడుకోనూ! అవంటే ఉచితంగా
వచ్చాయి. ఇవి డబ్బుపోసి కొన్నవి కదా”
అని జోక్ చేశాను. ఆయనా నవ్వారు. ఈ
పళ్ళని కూడా ఓ సినిమా వాడుకుంది. “ఇద్దరు మిత్రులు’లో చిన్నవేషం. “పళ్ళు
రాలగొడతాను జాగ్రత్త” అని అక్కినేని
నాగేశ్వరరావు అంటారు నన్ను. వెంటనే
కట్టుడు పళ్ళుతీసేసి – “ఏదీ, ఎలా
రాలగొడతావో రాలగొట్టు”
అంటానన్నమాట. మంచి జోకు”.
రాలగొట్టమనే సన్నివేశంలో రమణారెడ్డి, అక్కినేని నాగేశ్వరరావుతో – లంక సత్యం
సత్యంగారు – ఆయనే, చెపి నట్టు అటు
యస నయము
డైరక్టరూ కాదు, ఇటు హాస్య నటుడూ కాదు.
‘మోహిని కీలు గుర్రం” (తమిళం నుంచి డబ్
అయిన తెలుగు చిత్రం పేరిది) “బెంగుళూరు
మెయిలు” (కన్నడం) చిత్రాలు ఆయన డైరక్టు
చేశారు. “దాంతో ఎందులోనూ స్థిర పడలేక ఏదీ
కాకుండా – అంటే పూర్తిగా – అయి పోయాను”
అన్నారాయన.
ఈ హాస్య నటుడి జీవితంలోనూ
విషాదాంతం అన్నంత వింత సంఘటన
జరిగింది. కొన్నేళ్ళ (క్రితం కాజీపేట దగ్గర
వంతెన మీదనుంచి రైలు పడిపోయి, చాలామంది
ఘోరమరణం పొందారు. ఆ ప్రమాదంలో సత్యం
గారు మరణించినట్టుగా వార్త వచ్చింది. పత్రికల్లో
మృతుల పేర్లలో ఆయన పేరూ వుంది. అది
చూసి బంధుమిత్రులు శోకం పట్టలేకపోయారు.
ఐతే ఆ మర్నాడు ఆయన ఆనందంగా
నవ్వుకుంటూ విజయవాడ చేరుకున్నారు.
జరిగిందేమిటి? సత్యం గారు విజయవాడ
వెళ్ళాలని ఆ మెడ్రాసుబండి ఎక్కారు
హైద్రాబాదులో. అప్పుడు ఒకటో తరగతి
(ప్రయాణికుల పేర్లే రైల్వేవారి దగ్గర వుండేవి.
బండి బయలళ్టేరిన తర్వాత, ఘటకేశ్వర్
అనేవూళ్ళో కాబోలు సత్యం గారి మిత్రులు
ఆయన పరిస్థితి చూసి, అక్కడ దింపేసి
తీసుకెళ్ళారు. ఆయన “అతినిషా”లో వున్నారు.
ఆ సంగతి ఎవరికీ తెలీదు. ఆ రాత్రి రైలు
(ప్రమాదం జర ేర్ల ప్రకారం లంక సత్యం
కూడా మరణించినట్టుగా వార్త రావడం
జరిగాయి! ఆ సంఘటన తర్వాత,
మృత్యుంజయుడనీ, సత్యం జయుడనీ మిత్రులు
ఆయన్ని అభినందించారు. “దాన్నే దైవలీల
అంటాం. ఆయువుంది గనక, దేవుడే నన్ను అలా
తప్పించాడు. ఆయువు లేనప్పుడు నేనింకా
వుంటానన్నా, దేవుడు ఉండనీయడు” అన్నారు
సత్యంగారు – నవ్వుతూ. వేసినవి తక్కువ
పాత్రలే కావచ్చు, అవి గుర్తుండే పాత్రలు.
బారిస్టర్లు ఇవాళ లేకపోయినా సత్యంగారు
లేకపోయినా, ‘పార్వతీశం’ సినిమా ప్రింటు
దొరక్కపోయినా, ‘పార్వతీశం’ చదివినప్పుడు
మాత్రం ఆ తొలి హాస్య హీరో గుర్తురాక మానరు.
సశేషం
తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -21-2-22 –ఉయ్యూరు