పెదకాకాని మల్లేశ్వర క్షేత్ర మహాత్మ్యం
పెదకాకాని మలేశ్వర క్షేత్ర మహాత్మ్యం ను దేశభక్త విజయధ్వజి ,దేశ హిత ప్రబోధక , ఓలేటి సుబ్రహ్మణ్య శర్మ గారు స్థలపురాణ౦గా రచించగా ,గుంటూరు విజయలక్ష్మీ పవర్ ప్రెస్ లో 1960లో ప్రచురించారు వెల-కేవలం 75నయాపైసలు .తెనాలి అడ్వోకేట్ ఆవుల గోపాల కృష్ణమూర్తి గారు పరిచయ వాక్యాలు రాస్తూ శర్మగారి రచనలలో చారిత్రిక,సాంఘిక ,పౌరాణిక పరిశీలనలు ఉంటాయని ఆయన్ను బాగా ప్రోత్సహించమని కోరారు .ప్రచురణ బాధ్యత దేవస్థానం వహించింది .
విజయనగర ప్రభువు శ్రీ కృష్ణ దేవరాయలు ఇక్కడికి 1518లో రాకపూర్వం ,ఇప్పుడు మల్లేశ్వర స్వామి మూల విరాట్ ఉన్న చోట ,శివ భక్తాగ్రేసరుడైన ఒక మహా భక్తుని సమాధి ఉండేది .దానినే శివస్వరూపంగా ఆరాధించేవారు .ఒకసారి పార్వతీ పరమేశ్వరులు ఆకాశ విహారం చేస్తూ ,ఇక్కడ తనభక్త సమాధిని తన పేర పూజించటం గమనించి కిందికి దిగి వచ్చి ‘’శ్రీ మల్లేశ్వర స్వామి ‘’గా వెలసినట్లు ప్రతీతి .తర్వాత కధలోకి వెళ్ళారు
శ్లోకం –కాకాని నాధ కరుణా రస పూర్ణ సింధో –భక్తార్తి భంజన ,నిరంజన దీన బంధో
దేవేంద్ర మౌళి మణి మండిత పాదయుగ్మ –శ్రీ మల్లికేశ్వర పరాత్పరవై నమస్తే ‘’అని స్వామిని స్తుతించి స్కాంద పురాణం లో ఉన్న ఈ క్షేత్ర మహాత్మ్యాన్ని వివరించారు .శివుడు శ్రీశైలం లో మల్లికార్జునుడుగా కాకానిలో మల్లెశ్వరస్వామిగా అర్చింపబడుతున్నాడు .పూర్వం అనేక పాపాలు చేసిన ఒక బ్రాహ్మణుడు మల్లెశ్వరస్వామిని దర్శించి పాపాలు పోగొట్టుకొని పిశాచత్వం నుంచి విముక్తి పొందినట్లుపద్మ పురాణం లో ఉంది .స్కాంద పురాణం లో ఈ లింగాన్ని దర్శించి ,పూజించి తరించిన వారి చరిత్రలెన్నో ఉన్నాయి .ఇక్కడి స్వామి గంగా సమేత మల్లేశ్వరుడు .పూజలు ఉత్సవాలు ఈపేరుతోనే జరుగుతాయి .శివరాత్రి ఉత్సవాలు అయిదు రోజులు మహా వైభవంగా నిర్వహిస్తారు .
ఒక సారి కైలాసం లో శివ పార్వతులలో అందమైన వారు ఎవరు అనే చర్చ జరిగి,సభాసదులను తేల్చమన్నారు .విశ్వకర్మను వారికి మేకప్ చేయమని కోరితే అద్భతంగా వారి సోయగాన్ని తీర్చి దిద్దాడు .దంపతులు అద్దం లో చూసుకొని ముచ్చటపడి విశ్వకర్మను సత్కరించాలను కొని పిలిపించి ఏం కావాలో కోరుకొనమని శివుడు అన్నాడు .విశ్వకర్మ తాను కల్పించలేనిది లోకం లో ఉండదు .నీకేం కావాలో కోరుకో అన్నాడు .దరిద్ర దేవత ను వరిన్చమన్నాడు .పేరు చెప్పమంటే వరించమని చెప్పావు నీ సౌందర్య గర్వం ఇది .కనుక లింగాకృతి పొందు అన్నాడు విశ్వకర్మ .పార్వతి ప్రార్ధిస్తే భిక్షాపాత్ర విభూతి ధారణా కపాలమాల తో వర్ధిల్లి లోకాలకు దారిద్ర్య విచ్చిత్తి చేయి .విశ్వ సృట్ పేరుతొ పిలువబడుతావు ‘’అన్నాడు .కనక ఈ మల్లెశ్వరుడే బ్రహ్మ విష్ణువు వులకంటే అధిక మహిమాన్వితుడుగా పేర్కొనబడ్డాడు .
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -25-2-22-ఉయ్యూరు