మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-92

మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-92

· 92-తోలి సినీ గీతరచయిత ,నటుడు ,గాయకుడు ,శతావధాని ,’’పరాబ్రహ్మ పరమేశ్వర ‘’పాట ఫేం ,సినీవాచస్పతి,ఆంద్ర సూత –చందాల కేశవదాసు -4(చివరిభాగం )

· ఎం. పురుషోత్తమాచార్య కేశవ దాసు గారి గురించి చెప్పిన విషయాలు –

“బలే మంచి చౌక బేరము” పాట వినగానే మనస్సు ఆనందంతో గంతులు వేయడం ప్రతి తెలుగువాడికి అనుభవంలో ఉన్నదే. “పరాబ్రహ్మ పరమేశ్వర’ అని వినపడగానే రంగస్థల స్వరూపం, భగవంతుని త్రిమూర్త్యా త్మికత,నట రాజ తాండవ భంగిమ చప్పున గుర్తుకు వచ్చి మేను పులకరించడం ఆంధ్రులు చేసుకున్న అదృష్టం. ఈ అనుభూతులకు, ఆ పాటల నృష్టికర్త పేరు తెలుసుకోవాలను కోవడానికి సంబంధం అంతగా లేకున్నా ఆ రచయిత ఎవరో తెలుసుకోవాలని కుతూహల పడడం ఒక సంస్కార విశేషంగా పెద్దలు చెబుతారు… పై రెండు పాటలను రచించిన వారు ఖమ్మం జిల్దా వాస్తవ్యులైన మహాకవి అష్టావధాని, హరికథా భాగవతార్‌, నాటక కర్త అయిన శ్రీచందాల కేశవదాసు గారు. వాటిని స్వరపరచినవారు దాసుగారి గురువు గారైన శ్రీ పాపట్ల లక్ష్మీక్రాంతయ్య గారు. వీరిద్దరూ కలిసి యాదగిరి గుట్ట (బ్రహ్మోత్సవాలలో ధార్మిక సంగీత సాహిత్య కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు.

18,19 శతాబ్దాల మధ్య గుంటూరు జిల్తా తెనాలి తాలుకా ‘చందవోలు’ గ్రామం నుంచి ఖమ్మం జిల్లా గంగదేవిపాడుకు వలసవచ్చిన ఒక వైద్య కుటుంబ సభ్యులను ప్రజలందరూ చందోలు వారని నంభావించారు. అదే కాలక్రమంలో “చందాల’ వారయింది. ఆ కుటుంబంలో పాపమ్మ, లక్ష్మీనారాయణ అనే పుణ్యదంపతులకు 1876 జూన్‌ 20న కేశవదాసు జన్నించారు. చిన్న తనంలోనే తండ్రి మరణించగా అన్నగారయిన వెంకట్రామయ్య గారే కేశవదాసును పెంచి పెద్ద చేశారు. తమ్మునికి ఉపాననా విద్యను, రామనామ మంత్రాన్ని ఉపదేశించారు. తన లాగా ఆజన్మ బ్రహ్మచారి కావద్దని, గృహస్థ జీవితం. గడుపుతూ ధార్మిక కార్యక్రమాలు చేవట్టవముని బోధించాడు. కేశవదాసు ఆ మాటలను తు.చ. తప్పకుండా పాటించారు. కేశవదాసు, చిట్టెమ్మ దంపతులకు జన్మించిన పెద్దకొడుకు కృష్ణమూర్తి బదాచలంలో ఉపాధ్యాయుడు. ఆయన ‘పేరు సీతారామయ్య. ఇప్పటికి వీరిద్దరూ కీర్తి శషులయ్యారు. మూడవ సంతానమైన ఆండాళు గారి భర్త శ్రీగంధం నరసయ్యగారు, రిటైర్డ్‌ ఎం.ఇ.వో. వీరి కుటుంబం ఇప్పుడు నల్లగొండ జిల్లా మునగాల గ్రామంలో ఉన్నది. నల్లగొండ జిల్లా కోదాడకు దగ్గరగా ఉన్న తమ్మర గ్రామంలోనీ శ్రీ శ్రీ సీతారామ చంద్రస్వామి దేవాలయం మీద, ఆ దేవుని మోదా దాసుగారికి విపరీతమైన భక్తి కుదిరింది. తాను సంగీత సాహిత్య కార్యక్రమాలద్వారా సంపాదించుకున్న ఆస్తినంతా ఈ దేవాలయ నిర్మాణానికి, సేవలకు, సప్తాహాలకు వినియోగించారు.

నటుడిగా, దర్శకుడిగా ఎదిగారు. కనకతార, బలిబంధనం, నాగదాసు చరిత్ర, విరాటపర్వం, క్రేశవశతకం మొదలైన రచనలను 40కి పైగా చేశారు. ఆయనకు బాగా పేరు తెచ్చి పెట్టిన నాటకం కనకతార. ఇది మన రాష్ట్రంలోనే కాక ఇతర రాష్ట్రాలలోనూ, ఇతర దేశాలలోనూ వెయ్యికి పైగా ప్రదర్శనలివ్వబడింది. నటసామ్రాట్‌ అక్కినేని నాగేశ్వరరావు గారు, వుట్టపర్తి సత్యసాయి బాబా వారు తమ చిన్నతనంలో, త్రూ నాటకాలలోని తారపాత్రను పోషించడం చెప్పుకోదగ్గ గొప్పవిశేషం.

1931లో దాసుగారు మద్రాసుకు వెళ్ళి హెచ్‌.ఎం. రెడ్డిగారి దర్శకత్వంలో తయారైన మొట్టమొదటి తెలుగు టాకీ ‘భక్త ప్రహ్లాద’ కోసం క పేరతావభోరంటు. “ తనయా ళన “భీకరంబగునా””అనే మూడు పాటలు రాశారు. సోవురాజు రామానుజరావు గారి ‘సతీసక్కుబాయి’ నాటకం కోసం ఆయన రాసిన “గజ్జెలందియలు’, “రాదేలా కరుణ), వంటి

అయిదు పాటలను “నతీనక్కుబాయి” సినిమాలో ఉపయోగించుకున్నారు. అదేవిధంగా శ్రీ ముత్తరాజు నుబ్బారావుగారి శ్రీకృష్ణ తులాభారం నాటకం కోసం ఆయన రాసిన పాటల్లో ‘బలే మంచి చౌక బేరమూ”, మునివరా తుద కిట్లు, కొట్టుకొట్టండి, అనే పాటలను సినిమాల్లో వాడుకున్నారు. దానరి కోటిరత్నం నటించిన “నతీ అనసూయ” (1935) సినిమాకు దాసుగారు మాటలు, పాటలతో సహా పూర్తి ప్రిప్పను రచించారు. 1936లో కాళ్ళకూరి సదాశివరావు గారి దర్శకత్వంలో విడుదలైన “లంకా దహనం” సినిమాకు కూడా ఆయన స్త్రిప్ట వ్రాశారు. ఆయన గారి ‘కనకతార’ నాటకంలోని రెండు పద్యాలు, రెండు పాటలు ఉపయోగించుకుంటూ, ఆయన కథనే అనుసరిస్తూ 1937లో ‘కనకతార’ సినిమాను “సరస్వతీ టాకీసు *” వారు తీశారు. పానుగంటి వారి “రాధాకృష్ణు నాటకం కోసం దాసుగారు రాసిన పాటలను కొన్నిటిని 1939లో లక్ష్మీసినీ టోన్‌ వారు. తీసిన “రాధాకృష్ణ” సినిమాలో ఉపయోగించుకున్నారు. ఇందులో స్థానం నరసింహా రావుగారు “రాధ” గా అభినయించారు. ఇవే గాక కేశవదాసుగారు సామాన్యప్రజల కోనం వేలు కొలువు పాటలు,ువుంగళ హారతులు, జోలపాటలు, హెచ్చరికలు, మొదలైనవెన్నో రచించారు. 1948లో రజాకార్ల అకృత్యాలకు అట్టుడికిపోయిన తెలంగాణలో భాగమైన జక్కేపల్లి గ్రామంలోని దాసుగారి ఇంటిని దుండగులు దోచుకున్నారు. ఆ దుష్కార్యంలో ఆయనగారి ఆస్తిపాస్తులతో పాటు రచనా సంపదకూడా అగ్నికి ఆహుతి అయ్యాయి. వెంటనే దాసుగారు ఆ వూరి నుండి ఖమ్మం పట్టణానికి మకాం మార్చారు. శిష్యుల, అభిమానుల కోరిక మేరకు 1950లో నాయకన్‌

గూడెం చేరారు. ఎక్కువ నమయాన్ని జవతపాలలోనూ,యోగధ్యానం లోనూ గడిపేస్తూ ఉండిపోయారు. అప్పుడు కూడా అడపాదడపా అష్టావధానాలు చేస్తూనే వున్నారు. బొర్రా కోటయ్య చౌదరి గారి “భారత కర్మాగారము” అనే నాటకాన్ని, సందడి రామదాసుగారి మాధవశతకాన్ని పరిష్కరించి వారిద్దరి రచనా వ్యానంగాన్ని ఎంతగానో ప్రోత్సహించారు. ఆయన క్రమక్రమంగా ఉపాసనాధ్యాన స్థితిలో తాదాత్మ్యం చెందుతూ విజయనామ నంవత్సర వైశాఖి ళుద్ధవంచమి అంటే 14-6-1956నాడు పరమపదం చేరుకున్నారు. తెలుగు సాహితీ రంగానికి, సామాజిక రంగానికి, తెలుగు నీనివూ రంగానికీ కేశవదాసుగారు చేసిన సేవలు వెలకట్టలేని పెన్నిధులు.

పరాబ్రహ్మ

చందాల కేశవదాసుగారి పాటల్లో ప్రధానంగా చెప్పుకోవలసిన ప్రసిద్ధమైనది, నాటక ప్రదర్శనారంభ సమయ ప్రార్థనా పూర్వకమైనది – అయిన ఒక భక్తి గీతం.

కళ్యాణిరాగం-రూపకతాళం

పరాబ్రహ్మ పరమేశ్వర

పురుష్తోత్రను సదానంద

పరంజ్యోతి పరాత్పర

పరాబ్రహ్మ ఇకెన్నటికిని దొరుకబోదు’’ మరి చందాల కేశవదాసుగారి పాటల్లో ప్రధానంగా చెప్పుకోవలసిన సదమలోత్తులనిది మరిమరిని ప్రసిద్ధమైనది, నాటక ప్రదర్శనారంభ సమయ ప్రార్థనా శ్రయము తప్పకను తెలిపితిగా పూర్వకమైనది – అయిన ఒక భక్తి గీతం.

ఆయన కేవలం ఆధ్యాత్మిక కార్యక్రమాలకే పరిమితం కాలేదు. ఆనాటి స్వాతంత్ర్య సమరాన్ని ప్రశంసిస్తూ జయతు జై అనే పాట రాసి ఎస్‌.రాజేశ్వరరావు, ఆకుల నరసింహారావు గారల చేత పాడించి రికార్డు చేయించారు. హుజూర్‌ నగర్‌, జగ్గయ్యపేట, తమ్మర, తిరువూరు, కందిబండ మొదలైన చోట్లలో అష్టావధానాలు చేసి సెబాసనిపించుకున్నారు. పోలంపల్లి, దబ్బాకుపల్లి, జక్కేపల్లి, ఖమ్మం, కోదాడ మొదలైన ప్రాంతాలలో హరికథాగానం

కేశవదాసు ప్రాథమిక విద్యను తండ్రి వద్ద నేర్చుకున్నాడు. కాగా చిన్నతనాననే ఆయన మరణించడంతో తన అన్నగారైన వెంకటరామయ్య పోషణలో పెరిగారు. వెంకటరామయ్య బ్రహ్మచర్యం పాటిస్తూ ఆధ్యాత్మిక చింతనలో గడిపేవారు. ఆయన ఉపాధ్యాయునిగా పని చేసేవారు. అన్నగారి వద్దనే ఛందస్సు, అవధానం వంటి వివిధ ప్రక్రియల్లో ప్రవేశం పొందారు. అమరకోశాన్ని కంఠస్థం చేశారు. అన్నగారి వీధి బడిని తాను నడుపుతూ అందులోని విద్యార్థులనే పృచ్ఛకులుగా నియమించుకుని సమస్యాపూరణం వంటి వివిధ రంగాలతో అష్టావధానాన్ని సాధన చేసి తనను తాను తీర్చిదిద్దుకున్నారు. సిరిపురంలో జమీందారు పిల్లలకు కొంత కాలం చదువు కూడా చెప్పారాయన.
కేశవదాసు మొదటిసారి అష్టావధాన ప్రక్రియను భద్రాచలంలో ప్రదర్శించారు. ఆ తర్వాత హుజూర్‌నగర్‌, జగ్గయ్యపేట, తమ్మర, తిరువూరు, కందిబండ మొదలైన చోట్ల అష్టావధానాలు చేసి పండితులతో ప్రశంసలందుకున్నారు. ఇక హరికథలు చెప్పడంలో కేశవదాసుది ఎదురులేని ప్రావీణ్యం. పొలంపల్లి, దుబ్బాకుపల్లి, ఖమ్మం, జక్కేపల్లి, కోదాడ, తమ్మర వంటి లెక్కలేనన్ని చోట్ల హరికథలు చెప్పి కీర్తి, ధనం సంపాదించారు. అష్టావధానిగా, హరిదాసుగా నాటి తెలుగు సమాజంలో కేశవదాసుది ఒక ప్రత్యేక స్థానముండేది. ఒకసారి కృష్ణా జిల్లాలో పర్యటిస్తున్న సందర్భంలో జగ్గయ్యపేటలో లక్ష్మీకాంతయ్య ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అష్టావధానం చేశారు. అందులో ఆయన సాహితీ పాండిత్యాన్ని, భాషామార్దవాన్ని, భావసౌందర్యాన్ని, ధారాశుద్ధిని మెచ్చుకుని తమ నాటక సమాజంలో చేరి రచయితగా, నటునిగా పని చేయవలసిందిగా కోరారు లక్ష్మీకాంతయ్య.

అక్కడ్నించి వారి జీవనశైలి అనేక మలుపులు తిరుగుతూ వచ్చింది. రచయితగా, నటునిగా, దర్శకునిగా పరిణతిచెంది ‘కనక్తార’ (1911), ‘బలిబంధనం’ (1935) తదితర నాటకాలు రాశారు. ఇంకా కేశవదాసు ‘రుక్మాంగద’, ‘పాదుకా పట్టాభిషేకం’, ‘సీతా కళ్యాణం’, ‘భక్త అంబరీష’ తదితర నాటకాలను కూడా రాసినట్లు ఆంధ్ర నాటకరంగ చరిత్రలో మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి పేర్కొన్నారు. కాగా ఈ రచనలేవీ అందుబాటులో లేకపోవడం దురదృష్టకరం.
కాగా, నాటక రంగంలో చందాల కేశవదాసు ఎదురులేని పేరు ప్రఖ్యాతులతో ఒక వెలుగు వెలిగిపోతున్న సమయంలో సినిమా రంగం ఆహ్వానం పలికింది. అప్పటి దాకా భారతదేశమంతటా మూగ సినిమాలు ఆడేవి. 1931 మార్చి 15న దేశంలో తొలిసారిగా ‘ఆలం ఆరా’ అనే మాటలతో కూడిన సినిమా వచ్చింది. ఇదే తొలి భారతీయ టాకీ. అదే యేడాది తెలుగులో కూడా టాకీ చిత్రం తీయాలనుకుని ”భక్త ప్రహ్లాద” చిత్రం (1931-32)న ప్రారంభించారు. ఆ చిత్రంలో పాటలు రాయడానికి మన చందాల కేశవదాసును ఆహ్వానించడంతో ఆయన సినీ జీవితం మొదలైంది. ఈ చిత్ర దర్శకుడు హెచ్‌.ఎం.రెడ్డి. ఈయన కూడా హైదరాబాదుకు చెందిన వాడేనన్న వాదనలున్నవి. ఈయన హైదరాబాదు సంస్థానంలో పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌గా పని చేశారు. హైదరాబాదులో ప్లేగు వ్యాధి వచ్చినప్పుడు ఆయన కుటుంబం బెంగుళూరుకు వలస వెళ్లింది. ఈ చిత్రంలో ప్రహ్లాదునిగా కృష్ణాజిరావు షిండే, హిరణ్యకశ్యపునిగా మునిపల్లె సుబ్బయ్య, లీలావతిగా సురభి కమలాబాయి నటించారు. ఈ చిత్రంలో ఈమె పాడిన ”పరితాప భారంబు భరియింప తరమా” పాటనే చందాల కేశవదాసు సినిమాకు రాసిన తొలిపాట. ఇదేగాక ఈమెనే పాడిన ”తనయా ఇటులన్‌ తగుపలుకు”, మునిపల్లె సుబ్బయ్య పాడిన ”భీకరమగు నా ప్రతాపంబునకు భీతిలేక ఇటు చేసెదవా” రెండు పాటలు కూడా చందాల వారు రాశారు. అయితే చిత్రంలో రంభ పాడిన ”వింతాయెన్‌ వినన్‌ సంతసమాయెనుగా దేవేంద్రా” అనే పాట కూడా వొకటుంది. ఇది ధర్మవరం వారు ”భక్త ప్రహ్లాద” నాటకం రాసినపుడే రాయగా ఈ పాటను నాటకాన్ని సినిమాగా తీసినపుడు కూడా అట్లానే ఉంచేశారు. దీంతో తొలి సినిమా పాట రచయిత కూడా ధర్మవరం వారేననే వాదన ఒకటి ప్రారంభించారు ఆ మధ్య. కనీసం ధర్మవరం వారి పాటను తొలి సినిమా పాటగా, చందాల వారిని తొలి తెలుగు సినీ కవిగా పరిగణించాలని రాశారు కూడా. కానీ కేవలం సినిమా కోసం రాసిన పాటనే సినిమా పాటగా భావించాల్సి ఉంటుంది గనుక చందాల కేశవదాసు గారే తొలి తెలుగు సినీ కవిగా చరిత్ర కెక్కారు. అందుకే ఆయన తెలుగు సినిమా వాచస్పతిగా చరిత్రకెక్కారు.
‘భక్త ప్రహ్లాద’ (1931-32) తరువాత కేశవదాసు గారు రచయితగా పని చేసిన సినిమా ‘సతీసక్కుబాయి’ (1935). భారతలక్ష్మీ ఫిలింస్‌ వారి ఈ చిత్రంలో ‘కృష్ణా పోబోకురా’, ‘రాదేల కరుణా’, ‘ఆటలాడు కోరా’, ‘పాలుమీగడ పలుమార్లు భుజియించి’, ‘పాషాణ మెటులైతివో’, ‘జాగేలా కావగ రారుగా’ పాటలు రాశారాయన. చిత్రంలోని శ్రీకృష్ణుని పాత్రధారి తుంగల చలపతిరావు, సక్కుబాయి పాత్రధారిణి దాసరి కోటిరత్నం ఈ పాటలు పాడారు. ఆ రోజుల్లో ప్లే బ్యాక్‌ పద్ధతి లేదు. నటీనటులు ఎవరి పాటలు వారే పాడుకునేవారు. 1935లోనే సి.పుల్లయ్య దర్శకత్వంలో వచ్చిన కాశీ ఫిలింస్‌ వారి ”శ్రీకృష్ణ తులాభారం’తో కేశవదాసు సినీ కవిగా ఉన్నత స్థానానికి చేరుకున్నారు. ఈ చిత్రంలో రాసినవి మూడు పాటలు. అవి ”భలే మంచి చౌకబేరము”,”మునివరా తుదికిట్లు నానున్‌ మోసగింతువా”, ”కొట్టు కొట్టండి బుర్ర పగలు గొట్టండి”. వీటిలో ”భలే మంచి చౌకబేరము” పాట బహుళ జనాదరణ పొందింది. అయితే ఈ మూడు పాటలను ఆ తరువాత మరో రెండుసార్లు ”శ్రీకృష్ణ తులాభారం” చిత్రాన్ని 1955, 1966ల్లో నిర్మించినపుడు కూడా వాడుకున్నారు. అది మన కేశవదాసు గారి కవితా వైభవానికి నిదర్శనం. 1966లో డి.రామానాయుడు తీసిన చిత్రంలో దాసుగారి పాటలు వాడుకుని వారి పేరును సినిమాలో గాని, పాటల పుస్తకంలో గాని వేయలేదు. ఇది గమనించిన వారి కుటుంబ సభ్యులు 1970లో ఖమ్మం కోర్టులో కేసు వేయగా దిగివచ్చిన నిర్మాతలు సినిమా టైటిల్స్‌లో ఆయన పేరు వేశారు.
కేశవదాసు గారు 1935లో మూడు సినిమాలకు రచయితగా పని చేశారు. ఆ మూడో సినిమా ”సతీ అనసూయ” ఈ సినిమాకు స్క్రిప్టుతో సహా మాటలు, పాటలు రాశారాయన. అలా కేశవదాసు పూర్తి స్థాయిలో రచయితగా పని చేసిన చిత్రం ఇది. ఈ సినిమా పాటల పుస్తకంలో ”అనసూయ” స్క్రిప్టు పట్టుకుని ఉన్న దాసుగారి ఫొటోను ప్రచురించడం విశేషం. అలాంటి సందర్భం సినీ చరిత్రలో ‘నభూతో న భవిష్యతి’గా చెప్పుకోవచ్చు. ”దేవుని దయ ఉంది ఐలెసో”, ”ప్రహ్లాదుగావ స్తంభమునందు నృహరివై”, ”మాత”యని మాట విని, ”కురుతే గంగా సాగర గమనం” వంటి పాటలు సతీ అనసూయలో దాసుగారు రాసినవే.
ఆ తరువాత దాసుగారికి సినిమా అవకాశాలు వరుస కట్టినవి. 1936లో ”లంకా దహనం” చిత్రానికి పని చేశారు. వాస్తవానికి రంగ స్థలంపై ఆయనకు ఎనలేని పేరు ప్రఖ్యాతులు తెచ్చిన ”కనక్తార’ నాటకం విజయం వల్లనే చందాల వారికి సినిమా అవకాశాలు వెదుక్కుంటూ వచ్చినవి. ”ద్రౌపదీ వస్త్రాపహరణం” తీసిన సరస్వతీ టాకీస్‌ వారు కనక్తార సినిమాను హెచ్‌.వి.బాబు దర్శకత్వంలో నిర్మించారు. దొమ్మేటి సూర్యనారాయణ, కన్నాంబ, ఆరణి సత్యనారాయణ, కడారు నాగభూషణం, గంగారత్నం ప్రధాన పాత్రధారులు. రంగస్థలంపై ‘కనక్తార’గా చెలామణి అయినా నాటకం వెండి తెర మీదికి వచ్చేసరికి ”కనకతార” అయింది. ”దప్పిచే నాలుక తడిపొడి లేక” పద్యం, ”ఎంత బాగుండది సక్కని గుంటారాయే నా”, ”యేంటి అబ్బో నా వొల్లు మంటెత్తుతాది” పాటలు బహుళ జనాదరణ పొందినవి. ఇదే సినిమాను 1956లో మరోసారి తీసినపుడు కూడా దాసుగారి పాటలను యధాతథంగా వాడుకున్నారు. ఆ తరువాత ‘రాధాకృష్ణ’ (1939)లో గతంలో దాసుగారు రాసిన ‘రాధాకృష్ణ’ నాటకంలోని కొన్ని పాటలు వాడుకున్నారు. ఇంకా ‘లంకా దహనం’ (1936), బాలరాజు (1948) చిత్రాలకు పాటలు రాశారాయన.
సినిమాలకు దూరమైన తరువాత కలకత్తా నుండి తిరిగివచ్చి జక్కేపల్లిలో హరికథలు చెప్పనారంభించారు. కాని సినిమా రంగంలోకి వెళ్లి రావడం వల్ల అవకాశాలు ఎక్కువగా రాలేదు. ఇంతలో తెలంగాణ ప్రాంతంలో నిజాం వ్యతిరేక ఉద్యమం తీవ్ర రూపు దాల్చుకున్నది. 1947లో భారతదేశానికి స్వాతంత్య్రం రావడంతో హైదరాబాదు సంస్థానాన్ని కూడా ఇండియన్‌ యూనియన్‌లో విలీనం చేయాలనే డిమాండ్‌ వచ్చింది. నిజాం పాలనలో దోపిడీపీడనలకు వ్యతిరేకంఆ ఉద్యమాలు ఉధృతమయ్యాయి. ఈ పోరాటాల్ని అణచి వేయడానికి రజాకార్లతో ప్రజలపై దాడులు చేయించాడు నిజాం నవాబు. ఆ రజాకార్లు జక్కేపల్లిలో కేశవదాసు ఇంటిపై దాడి చేసి ధ్వంసం చేశారు. ఆ దాడిలో ఆయన ఆస్తిపాస్తులు, ధనమే గాక అంతకన్న విలువైన ఆయన సాహిత్య సంపద కూడా నాశనమైనది. ఆ తరువాత జక్కేపల్లి నుండి ఖమ్మంకి తన మకాంను మార్చారాయన. ఇది జరిగింది 1948 చివరి నాటికి. అటు నుండి కొడుకు కృష్ణమూర్తి వైద్య వృత్తి నిమిత్తం వారి కాపురం 1950లో నాయకన్‌గూడెంకు మారింది. కేశవదాసు గారు చివరి రోజులను నాయకన్‌ గూడెంలోనే గడుపుతూ అక్కడే 1956 మే 14న చివరి శ్వాస విడిచారు.
కేశవదాసు గారి రచనలో ప్రామాణికతలు సార్వకాలీనతలను చాటుతాయి. తొలి చిత్రం ” భక్త ప్రహ్లాద” (1931-32)కు రాసిన పాటలు, 1942లో తీసిన ”భక్త ప్రహ్లాద”లోనూ వాడుకున్నారు. ”శ్రీకృష్ణ తులాభారం” (1935)లో రాసిన పాటలు ఆ తరువాత 1956, 1966లోనూ, ”కనకతారకు” రాసిన కథ, పాటలు 1937, 1956లోనూ యధాతథంగా వినియోగించుకోవడం కేశవదాసు గారి రచన విశిష్టతకు నిదర్శనం.
వ్యక్తిగా కూడా ఉన్నతమైన విలువలు, ఆదర్శాలకు కట్టుబడి జీవించాడు. ఏనాడూ కుల వివక్షను పాటించని వారాయన. హెచ్చు తగ్గులు మన సంస్కారాన్ని బట్టిగాని, కులాన్ని బట్టికాదనే వారు. ఎవరైనా దీనిని వ్యతిరేకిస్తే వాదించి మెప్పించేవారు. జక్కేపల్లికి దగ్గరలో ఉన్న రాజపేటకు చెందిన వెంకయ్య అనే దళితుడు దాసుగారి హరికథలు విని మురిసి పోయేవారు. ఆయన వీరాభిమాని. ఇదంతా గమనించిన దాసుగారు ఒకనాడు అతని బీదరికాన్ని చూసి తరచూ తన ఇంటిలో భోజనం పెట్టించి పక్కనే కూర్చుని విసనకర్రతో గాలి విసిరేవారు. ఈ వొక్క సంఘటన కేశవదాసు గారి వ్యక్తిత్వం ఎంత గొప్పదో తేట తెల్లం చేస్తుంది. ఆయన జాతీయవాదిగా పలు దేశభక్తి రచనలు చేశారు. వాటిలో కొన్నింటిని బెంగుళూరులోని గ్రామ ఫోను కంపెనీ వారు రికార్డులుగా విడుదల చేసింది. మోతీలాల్‌ స్మృతిలో రాసిన పాటలు వాటిలో కొన్ని. ఇవి మాత్రమే గాదు. కేశవదాసు గారి సాహిత్య జీవితంలో శాశ్వతంగా నిలిచిపోదగినది వొకటుంది. అదే తెలుగు సమాజంలో ఏ నాటకానికైనా ప్రారంభానికి ముందు పాడే ‘పరబ్రహ్మ పరమేశ్వర – భళిరా హరి మహిమం బెరుగగ బ్రహ్మాదులు తరమా’ అనే ప్రసిద్ధ కీర్తన. ఈ కీర్తన మన చందాల వారి కలం నుండి జాలు వారినదే. తన అర శతాబ్ద కాలంలో చేసిన సాహిత్య సేవలకు గుర్తింపుగా ‘కలియుగ దశరథ’, ‘నటకావతంస’, ‘ఆంధ్రసూత’ వంటి బిరుదులతో సత్కారాలు పొందారు.
బహుముఖ సాహితీ ప్రాజ్ఞుడుగా చందాల కేశవదాసు తెలంగాణ సాహితీ చరిత్రలో ఒక ధ్రువతారగా నిలిచిపోయారు. నూతన తెలంగాణ రాష్ట్రంలో ఆయన స్మారకార్థం రాష్ట్ర ప్రభుత్వం, ప్రసిద్ధ సాహిత్య సంస్థలు విస్తృతమైన కార్యక్రమాలు చేపట్టడమేగాక ఆయన విగ్రహాన్ని రాచకొండలో నిర్మించబోయే ఫిలింసిటీలో ఏర్పాటు చేయాలి. అదే కేశవదాసు గారికి నిజమైన నివాళి కాగలదు.

  • నహెచ్‌.రమేష్‌బాబు
    9440 925 814

సశేషం

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -25-2-22-ఉయ్యూరు

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in సినిమా and tagged . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.