· మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-99
·
99- నటనా వైదుష్యానికి పరాకాష్ట ,పానుగంటి వారి’’ రాధ ఫేం’’- పారుపల్లి సుబ్బారావు
పారుపల్లి సుబ్బారావు నాటకరంగ, సినిమారంగ కళాకారుడు, సంగీత విద్యాంసుడు. స్త్రీ పాత్రలకు పేరొందిన వాడు.[1]
జీవిత విషయాలు
సుబ్బారావు 1897లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణా జిల్లా, ఘంటసాల మండలంలోని శ్రీకాకుళం గ్రామంలో జన్మించాడు.
నట ప్రస్థానం
1908లో మొట్టమొదట బందరు బాలభారతి సంఘం రసపుత్ర విజయం నాటకంలో విమల పాత్రలో నటించాడు. తమ అన్న పారుపల్లి రామకృష్ణయ్య పంతులు (డా. మంగళంపల్లి బాలమురళీ కృష్ణ గురువు) దగ్గర సంగీతాన్ని నేర్చుకొని, మైలవరం కంపెనీలో అప్పటి సంగీత దర్శకుడు పాపట్ల కాంతయ్య (పరబ్రహ్మ పరమేశ్వర -ప్రార్థనా గీతానికి సంగీతాన్ని సమకూర్చిన) వద్ద మరాఠీ, పార్సీ సంప్రదాయ రీతుల్ని అభ్యసించాడు. ఆ తరువాత మద్రాస్ సుగుణ విలాస సభలోలోనూ, విజయవాడ మైలవరం కంపెనీలోనూ, ఏలూరు మోతే వారి కంపెనీలోనూ నటించి ఎంతో పేరు సంపాదించాడు. స్ఫురద్రూపం, చక్కని గాత్ర మాధుర్యంతో సాత్వికాభినయంలో మేటిగా, స్త్రీ పాత్రధారణకు పేరొందిన సుబ్బారావు పానుగంటి లక్ష్మీనరసింహారావు రచించిన రాధాకృష్ణలో రాధ వేషాన్ని చక్కగా ధరంచేవాడు
నటించిన పాత్రలు
· విమల (రసపుత్ర విజయం)
· రాముడు (లవకుశ)
· సావిత్రి
· లీలావతి
· రాధ
· సుకన్య
· కైక
· చంద్రమతి
· రుక్మిణి
· రత్నాంగి
· కమలాంబ
· దుర్యోధనుడు
· రామదాసు
సీతారామ జననం
సినిమాలు
1934లో ఈస్టిండియా కంపెనీ సి.పుల్లయ్య దర్శకత్వంలో తీసిన ‘లవకుశ’ చిత్రంలో శ్రీరాముని పాత్రలో నటించాడు.
· 1936: సతీ సులోచన (1936 సినిమా)
· ద్రౌపది మాన సంరక్షణము (ధర్మరాజు)[2]
· 1944: సీతారామ జననం (జనకుడు)[3]
· నట ప్రస్థానం
· 1908లో మొట్టమొదట బందరు బాలభారతి సంఘం రసపుత్ర విజయం నాటకంలో విమల పాత్రలో నటించాడు. స్ఫురద్రూపం, చక్కని గాత్ర మాధుర్యం కలిగిన వ్యక్తి. తమ అన్న పారుపల్లి రామకృష్ణయ్య పంతులు (డా. మంగళంపల్లి బాలమురళీ కృష్ణ గురువు) సంగీతాన్ని నేర్చుకొని, మైలవరం కంపెనీలో నాటి ప్రసిద్ధ సంగీత దర్శకుడు (పరబ్రహ్మ పరమేశ్వర -ప్రార్థనా గీతానికి సంగీతాన్ని సమకూర్చిన వారు) పాపట్ల కాంతయ్య వద్ద మరాఠీ, పార్సీ సంప్రదాయ రీతుల్ని అభ్యసించాడు. ఆ తరువాత మద్రాస్ సుగుణ విలాస సభలోలోను, విజయవాడ మైలవరం కంపెనీలోనూ, ఏలూరు మోతే వారి కంపెనీలోనూ నటించి ఎంతో ఖ్యాతి గడించాడు. సాత్వికాభినయంలో మేటి. స్త్రీ పాత్రధారణకు ప్రసిద్ధి. పానుగంటి లక్ష్మీనరసింహారావు రచించిన రాధాకృష్ణలో రాధ వేషం ఈయన నటనా వైదుష్యానికి పరాకాష్ఠ.
· సశేషం
· మీ- గబ్బిట దుర్గాప్రసాద్ -28-2-22-ఉయ్యూరు