మనమరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు -103
103-‘’ ,,స్వాతంత్ర్య సమరయోదుడైన ‘’’అనుపమ ‘’నిర్మాత దర్శకుడు,బి.ఎన్.రెడ్డి అవార్డ్ గ్రహీత -కె.బి .తిలక్
కె.బి. తిలక్ (1926 – 2010) పూర్తి పేరు కొల్లిపర బాలగంగాధర్ తిలక్ వీరు స్వాతంత్య్ర సమరయోధుడు, దర్శకుడు, నిర్మాత.[1]
జననం
తిలక్ పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరులో కొల్లిపర వెంకటాద్రి సుబ్బమ్మ దంపతులకు 1926, జనవరి 14న జన్మించాడు. ఆయన తండ్రి వెంకటాద్రి స్వాతంత్య్ర సమరయోధుడు. ఏలూరులో చదివేటప్పుడు తిలక్ స్వాతంత్య్రోద్యమం పట్ల ఆకర్షితులయ్యాడు. చదువు వదిలి 16 ఏళ్ళ వయస్సులోనే క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని 1942లో జైలుకి వెళ్లారు.
సినిరంగ ప్రవేశం
ముదిగొండ జగ్గన్నశాస్త్రి ప్రోత్సాహంతో ప్రజా నాట్యమండలిలో సభ్యునిగా చేరి అనేక నాటకాలను ప్రదర్శించాడు. మేనమామలు ఎల్.వి.ప్రసాద్, అక్కినేని సంజీవిల ప్రోత్సాహంతో తొలుత కొన్ని సినిమాలకు ఎడిటర్‌గా పనిచేసి, జ్యోతి సినిమాతో అనుకోకుండా దర్శకుడిగా మారాడు. తరువాత అనుపమ చిత్ర నిర్మాణ సంస్థను ఏర్పాటు చేశాడు. ఈ నిర్మాణ సంస్థద్వారా అభ్యుదయ భావాలతో అనేక చలన చిత్రాలు నిర్మించారు.
అభ్యుదయ భావాలతో సినిమాలు
- ముద్దుబిడ్డ (1956)
- ఎం.ఎల్.ఏ. (1957)
- అత్తా ఒకింటి కోడలే (1958)
- చిట్టి తమ్ముడు (1962)
- ఉయ్యాల జంపాల (1965)
- ఈడుజోడు (1967)
- పంతాలు పట్టింపులు (1968)
- ఛోటీ బహు, కంగన్ (1971)
- భూమి కోసం (1974)
- కొల్లేటి కాపురం (1976)
- ధర్మవడ్డీ (1982)
విశేషాలు
· 1974లో ‘భూమి కోసం ‘ సినిమాను నక్సలైట్ ఉద్యమంలో మరణించిన తన సోదరుడు కొల్లిపర రామనరసింహారావుకు అంకితమిచ్చాడు.
· జయప్రదను వెండితెరకు పరిచయం చేశాడు.
· యు.విశ్వేశ్వర రావు దర్శకత్వం వహించి, నిర్మించిన నగ్నసత్యం సినిమాలో ఒక పాత్ర ధరించాడు.
అవార్డులు, గుర్తింపులు
· 2008 సంవత్సరపు బి.ఎన్.రెడ్డి అవార్డు లభించింది.
మరణం
కె.బి. తిలక్ గారు 2010, సెప్టెంబరు 23న మరణించాడు.[2]
వామపక్ష భావాలకు తిలక్ పట్టం గట్టారు. ఎం.ఎల్.ఎ, అత్తా ఒకింటి కోడలే, ఉయ్యాల జంపాల, పంతాలు పట్టింపులు, చిట్టి తమ్ముడు, ధర్మవడ్డీ వంటి చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించారు.
అనుపమ పిక్చర్స్ పతాకంపై భూమికోసం, ఎం.ఎల్.ఎ, ధర్మవడ్డీ, కొల్లేటి కాపురం వంటి ఆదర్శవంతమైన చిత్రాలను నిర్మించి దర్శకత్వం వహించిన కె.బి. తిలక్ సినిమా పరిశ్రమలో ప్రజానాట్యమండలి కెరటాన్ని ఎగురవేసి తాను నిర్మించిన చిత్రాల్లో ప్రజానాట్యమండలి వాణిని వినిపించిన సినిమా విప్లవకారుడని వారు పేర్కొన్నారు.
విలువలను వీడకుండా ఓ సంకల్పంతో సినిమాలు తెరకెక్కించినవారు అరుదుగా కనిపిస్తారు. అలాంటి వారిలో కొల్లిపర బాలగంగాధర తిలక్ ఒకరు. ఇలా అంటే ఎవరికీ తెలియదు కానీ, కె.బి.తిలక్ అనగానే సినీ అభిమానులు ఇట్టే గుర్తు పట్టేస్తారు. తన ప్రతి సినిమాలోనూ ఏదో ఓ వైవిధ్యం చూపించాలని తపించేవారు తిలక్. ఆ తపనే ఆయనను ప్రత్యేకంగా నిలిపింది.
కె.బి.తిలక్ 1926 జనవరి 14న పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరులో జన్మించారు. ప్రఖ్యాత దర్శకనిర్మాత ఎల్.వి.ప్రసాద్ స్వయాన అక్క కుమారుడే తిలక్. వీరి అక్కనే మళ్ళీ ఎల్వీ ప్రసాద్ వివాహమాడారు. అలా ఎల్వీ ప్రసాద్, తిలక్ కు మేనమామ, బావ కూడా అవుతారు. ప్రసాద్ స్ఫూర్తితోనే తిలక్ చిత్రసీమలో అడుగు పెట్టారు. అంతకు ముందు అభ్యుదయ భావాలతో తిరిగేవారు. ప్రజానాట్యమండలిలో చురుగ్గా పాల్గొనేవారు. కమ్యూనిస్టు పార్టీ కార్యకలాపాలలోనూ ఉత్సాహంగా పాల్గొని సాగేవారు. ఎల్.వి.ప్రసాద్ వద్ద కొన్ని చిత్రాలకు అసోసియేట్ గా పనిచేసిన తిలక్, 1956లో ‘ముద్దుబిడ్డ’ చిత్రాన్ని స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. జగ్గయ్య, జమున నటించిన ఈ సినిమా మంచి పేరు సంపాదించి పెట్టింది. అప్పటికే యన్టీఆర్, ఏయన్నార్ టాప్ హీరోస్ గా సాగుతున్నందున్న తిలక్, తన మిత్రుడు జగ్గయ్యతోనే సినిమాలు తీస్తూ ఆయననూ ఓ ప్రముఖ కథానాయకునిగా నిలిపారు. జగ్గయ్య, సావిత్రితో తరువాత తిలక్ తీసిన ‘ఎమ్.ఎల్.ఏ.’ సైతం జనాన్ని ఆకట్టుకుంది. ‘అత్తా ఒకింటి కోడలే’ చిత్రాన్ని తమిళంలోనూ ‘మామియరుమ్ ఒరు వీట్టు మరుమగలే’ రూపొందించి, రెండు చోట్లా ఆదరణ సంపాదించారు. జగ్గయ్య హీరోగా, ఆరుద్ర రచన, పెండ్యాల సంగీతంతో సాగారు తిలక్. “ఈడు-జోడు, ఉయ్యాల-జంపాల, పంతాలు – పట్టింపులు” వంటి చిత్రాలు తెరకెక్కించారు. “ఛోటీ బహు, కంగన్” వంటి హిందీ చిత్రాలనూ రూపొందించారు.
తిలక్ రూపొందించిన ‘భూమికోసం’ చిత్రంతోనే జయప్రద పరిచయమయ్యారు. కృష్ణ, ప్రభ జంటగా తిలక్ తెరకెక్కించిన ‘కొల్లేటి కాపురం’ కూడా అలరించింది. ఆయన దర్శకత్వంలో రూపొందిన చివరి చిత్రం ‘ధర్మవడ్డీ’. సినిమా రంగంలో చోటు చేసుకున్న పరిణామాలు, అన్నిటా పెరిగిపోయిన వేగం ఆయనకు నచ్చలేదు. దాంతో 1982 తరువాత నుంచీ సినిమాలకు దూరంగా ఉన్నారాయన. 2008లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం తిలక్ ను బి.యన్.రెడ్డి జాతీయ అవార్డుతో గౌరవించింది. 2010 సెప్టెంబర్ 23న తిలక్ కన్నుమూశారు. ఈ నాటికీ తిలక్ చిత్రాల్లోని కథావస్తువును, సంగీతసాహిత్యాలను అప్పటి సినీ ఫ్యాన్స్ నెమరువేసుకుంటూనే ఉన్నారు.
కేబి తిలక్ సుమారు నలభె ఏళ్లకు పూర్వం హైదరాబాద్ లో ఒక కార్యక్రమం నిర్వహిస్తే ,నేనూ మా బావమరది ఆనంద్ వెళ్లాం .తిలక్ రూపురేఖలకు అంకిత భావానికి ఫిదా అయ్యాం .ఆసభలో గద్దర్ ను, ఒక ముస్లిం కవయిత్రి మహీజాబెన్ ను కూడా చూసి మాట్లాడాం .విప్లవ వీరుడు కొండపల్లి సీతారామయ్య గారి భార్యశ్రీమతి కోటేశ్వరమ్మ కూడా ఆసభలో ఉన్నారు ఆమెతోనూ మాట్లాడాం .భేషజం లేని మనిషి తిలక్ .
తెలుగు చలన చిత్ర సీమకు అనుపమ కళాతిలకం.ఎం ఎల్ ఎ సినిమాలో ఆరుద్ర రాసిన ‘’గుండెల్లో గునపాలూ గుచ్చారే నీవాళ్ళూ ‘’అనే పాట విని కళ్ళ వెంబట నీరు కారింది నాకు .ముద్దుబిడ్డ ప్రతి సీన్ టచింగ్ గా ఉంటుంది .అత్తా ఒకింటి కోడలే ఒక శివరాత్రినాడు బెజవాడలో చూసిన జ్ఞాపకం .చాలా లైటర్ వీన్ లో తీసి ,నీతినీ బోధించాడు .జోడు గుళ్ళ పిస్తోలు ఠా-నేను ఆడీ తప్పని వాణ్ణి జీహా ‘’అని ఆరుద్ర రాసిన పాటకు జగ్గయ్య యాక్షన్ అదుర్స్ .ఈ సినిమా చాలాసార్లు చూశాను.చిట్టితమ్ములో రాజసులోచన కేవీస్ శర్మ లనటన హైలైట్ .’శర్మ ఆస్కార్ వైల్డ్ రాసిన కధలో సెల్ఫిష్ జెయింట్ లా అనిపిస్తాడు .’ఏస్కో నారాజా ‘’పాట సూపర్ .ఈడూ –జోడు ,ఉయ్యాల –జంపాల పెండ్యాల స్వరకల్పనలతో ,ఆరుద్ర గీతాలతో సంగీత ఊయలలే ఊగిస్తాయి .పంతాలు పట్టింపులు మరాటీ కధ .దానిలోనూ దీనిలోనూ కళారంజనిగా లీలా రంజని నటించింది .తాగు బోతు గుమ్మడిని చూడలేం .విషాదం నషాళానికి అంటి భయమేస్తుంది .భూమికోసం లో శ్రీ శ్రీ తోపాటు పీపుల్స్ వార్ గ్రూప్ స్థాపకుడు కళాసాగర్ అనే సత్యమూర్తి స్క్రిప్ట్ ,పాటలూ రాశాడు .జయప్రద మొదటి పరిచయం .పెండ్యాల మ్యూజిక్ లో ‘’ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురుచూసి ఎదురు చూసి మోసపోకుమా ‘’పాట ఆల్ టైం రికార్డ్ .అశోక్ కుమార్ కూడా నటించాడు .కొల్లేరు సరస్సుపై సాహసించి తిలక్ మొదటి సారిగా ‘’కొల్లేటికాపురం ‘’తీశాడు .ధర్మవడ్డీ లో జగ్గయ్య నటన అద్భుతం .తిలక్ అంటే ‘’అనుపమ ,జగ్గయ్య జమున ,పెండ్యాల ,ఆరుద్ర’’విడరాని బంధం గుర్తుకొస్తుంది .విలువలతో తీసిన చిత్రాలకు కేరాఫ్ కేబి తిలక్ .
సశేషం
మహాశివరాత్రి శుభాకాంక్షలతో
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -1-3-22-ఉయ్యూరు