మనమరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు -103
103-నాటక ,సినీ నటుడు ,దక్షణభాషా సినీ దర్శక నిర్మాత ,రచయిత,భూకైలాస్ ఫేం-పద్మశ్రీ ఆర్ .నాగేంద్రరావు
28-6-1896 జన్మించి 2-9-1977న 81 ఏళ్ళ వయసులో మరణించిన ఆర్.నాగేంద్రరావు నాటక ,సినీ నటుడు ,దక్షణభాషా సినీ దర్శక నిర్మాత ,రచయిత-పద్మశ్రీపురస్కార గ్రహీత .దక్షిణ భారత సినీ పరిశ్రమలో చాలా ప్రభావమున్న వ్యక్తి .1968లో ఆయన నటించిన హన్నేలే చిగ్రుడిగా సినిమాకు కర్ణాటక స్టేట్ అవార్డ్ పొందాడు .1976 భారత ప్రభుత్వం పద్మశ్రీ ప్రదానం చేసి గౌరవించింది .ఆయన రెండవకుమారుడు ఆర్ ఎన్ కే ప్రసాద్ సినిమాటోగ్రాఫర్ ,మూడక కుమారుడు ఆర్ ఎం జయగోపాల్ స్క్రిప్ట్ రైటర్ .చివరికొడుకు ఆర్ ఎస్ సుదర్శన్ నటుడు .
8వ ఏటనే కన్నడ నాటకాలలో నటిస్తూ నాగేంద్ర సీతా, చంద్రమతి ,డేస్డేమోనా స్త్రీ పాత్రలలో రాణించాడు .తర్వాత పురుష వేషాలలో కన్నడ తెలుగు రా ష్ట్రాలను దున్నేశాడు .1931లో వచ్చిన టాకీ యుగం లో బొంబాయికి వెళ్లి ,రాజా సాండో ‘’పారిజాత పుష్పహరణం, నారద ,కోవలన్ తమిళ సినిమాల లో నూ ,1933లో తెలుగు రామదాసు సినిమాలో నటించాడు .బెంగుళూరు తిరిగి వచ్చి ‘’శ్రీ సాహిత్య సామ్రాజ్య నాటక మండలి ‘’స్థాపించి సుబ్బయ్యనాయుడు అనే ప్రముఖ కన్నడ నటుడితో నాటకాలు వేశాడు .బిజినెస్ మాగ్నెట్ చమన్ లాల్ దోనగాజ్ ను ఒప్పించి కన్నడ సినిమాను వై వి రావు అనే ఎరగుడిపాటి వరద రావు ను డైరెక్టర్ చేసి ,తాను రావణ వేషంవేసి ,సంగీతం కూర్చి , కన్నడం లో మొదటి టాకీ ‘’సతీ సులోచన ‘’తీసి 1934 మార్చి 3వ రిలీజ్ చేశాడు .స్వంత దర్శకత్వం లో మొదటి సినిమా 1943లో సత్యహరిశ్చంద్ర నిర్మించి నటించి విడుదల చేశాడు .
నాగేంద్రరావు రాసిన ‘’భూకైలాస్ ‘’నాటకం మూడు సార్లు తెరకెక్కి రికార్డ్ సృష్టించింది .రెండు సార్లు సుందర్ లాల్ నడకర్ని మూడోసారి కే శంకర్ తీశారు .ఇందులోనే కన్నడ రాజకుమార్ మొదటి సారిగా సినీఅరంగేట్ర౦ చేశాడు నారద పాత్ర పోషణతో .1951లో నాగేంద్రరావు స్వంత పిఎన్ ఆర్ పిక్చర్స్ సంస్థ స్థాపించి ‘’ప్రేమదా పుత్రి ‘’1957లో నిర్మించి,సపోర్టింగ్ రోల్ వేసి డైరెక్ట్ చేశాడు.ఈ సినిమా అయిదవ జాతీయ ఫిలిం అవార్డ్ లలో బెస్ట్ కన్నడ ఫీచర్ ఫిల్మ్ అవార్డ్ పొందింది .1964 దాకా ఈ సంస్థ ఉన్నది .తర్వాత తండ్రి పాత్రలలో స్థిరపడ్డాడు .
1956లో విక్రం ప్రొడక్షన్ బానర్ పై బీస్ రంగా దర్శకత్వం లో వచ్చిన ‘’భక్త మార్కండేయ ‘’సినిమాలో నాగేంద్రరావు యముడు పాత్ర ధరించి బాగా మెప్పించాడు .అపూర్వ సహోదరులు ,ముగ్గురు కొడుకులు ,చండీ రాణి ,జాతకం ,నాగుల చవితి ,ప్రేమే దైవం ,గాలిమేడలు ,బంది పోటు,కలవారి కుటుంబం ,లలో నటించాడు నాగేంద్రరావు .
సశేషం
మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -2-3-22-ఉయ్యూరు