మరాఠీ నవలా మార్గదర్శి – హరినారాయణ ఆప్టే-2
స్కూల్ లో చదువుతూ ఉండగానే హరినారాయణ ఆప్టే ,కాళి దాసభావభూతులను తులనాత్మకంగా పరిశీలించి కాళిదాసు ఘనతను చాటి చెప్పాడు భవభూతి ది కృతక శైలి అన్నాడు .మూల గ్రందాలనుంచి ఎన్నెన్నో ఉదాహరణలు ఇచ్చాడు .అప్పుడే ఆంగ్లకవి లాల్ ఫెలో రాసిన గీతాన్ని జీవితగీతం గా అనువదించాడు .తర్వాత అది ప్రభుత్వ పాఠ్య పుస్తకాలలో చోటు సంపాదించింది .ఒక ఏడాది తర్వాత అగార్కర్ రాసిన షేక్స్ పియర హేమ్లెట్ నాటక అనువాదం ‘’వికార్ విలసిత ‘’పై 72పేజీల అత్యుత్తమ విమర్శనా వ్యాసాన్ని 1882లో రాసి మెప్పు పొందాడు ఆప్టే .అగార్కర్ దీన్ని సహృదయభావంతో అర్ధం చేసుకొన్నాడు .తన శిష్యుడే రాసినందుకు గర్వ పడ్డాడు .
హరి నాయనమ్మ ఆమె పెద్ద కూతురు భర్త్రు విహీన అవటం తట్టుకోలేక పోయింది .హరి పెదతండ్రి మొండి తనమూ ఆమెను బాధించింది .కాలాన్ని భగవధ్యానం లో గడిపేది. హరి పై ఆమెకు మక్కువ ఎక్కువ .మేనత్త కుటుంబాన్ని జాగ్రత్తగా చూసేవాడు హరి .16-5-1879 న హరి వివాహం ముందే అనుకొన్నట్లు దామోదర పంత్ గోఖలే కుమార్తె మధుతో అతని 16వ ఏట జరిగింది .కట్నం తీసుకోలేదు నాయనమ్మ మాట ప్రకారం .అందర్నీ గౌరవంగా సత్కరించారు .వివాహం మాంచి ధూమ్ ధాం జరిగింది .హరిని అందరూ ‘’తాత్యా ‘’అని పిలిచేవారు . అమ్మా వాళ్ళు ఆ ఊర్లోనే ఉంటారుకనుక హరిభార్య గారాబంగా పెరిగిందికనుక సాయంత్రం పుట్టింటికి వెళ్లి ఉదయమే వచ్చేది .అయిదేళ్ళు ఇలాగే గడిచి పొయాయి .తర్వాత క్రమంగా ఇంటి బాధ్యతలు చేబట్టింది .
భార్యకు అక్షరజ్ఞానం లేదు కనుక ఆవిడ విద్యావతి కావాలని హరి భావించాడు .హరి కాలేజీలోనే ఉంటూ శని ఆదివారాలలో ఇంటికి వచ్చి భార్యకు చదువు చెప్పాలని అనుకొన్నాడు .ఆమె సహకరించేదికాదు. తరచుగా కలుసుకొందామని చెప్పినా వినేదికాదు .ఆచారం హద్దులు దాటటానికి హరి సంకోచించే వాడు .పరిస్థితులు వారికి సహకరించక ఇద్దరిలో అసంతృప్తి పెరిగింది .
1883లో పూనా దక్కన్ కాలేజి లో హరి చేరాడు .అన్ని సౌకర్యాలున్న కాలేజి .అక్కడి లైబ్రరి అతడిని ఆకర్షించి ఆంగ్లకవుల రచనలు చదివి అవగాహన చేసుకొన్నాడు .రైనాల్డ్స్ రాసిన మి ష్టరీస్ ఆఫ్ కోర్ట్ ఆఫ్ లండన్ ,ది సోల్జేర్స్ వైఫ్ చదివాడు .కాలేజిలో చేరిన వెంటనే రోమియో అండ్ జూలియాట్ పై ‘’నిబంధన చంద్రిక ‘’వ్యాసం రాశాడు .హాలం రాసిన బ్రిటిష్ చరిత్ర ,ఇష్టంగా చదివాడు లెక్చరర్లు సర్వసమర్ధులు .స్కాలర్షిప్ పొందాడు . డిబేట్స్ లో పాల్గొనేవాడు .గోల్డ్ స్మిత్ రాసిన ‘’ షి స్టూప్స్ టు కాంకర్ ‘’నాటకం లో టోనీ లంప్కిన్ పాత్ర ధరించి మెప్పించాడు .టెన్నిస్ బాగా ఆడేవాడు .మొదటి ఏడాది పరీక్షలలో లెక్కల్లో తప్పాడు .
ఫెర్గూసన్ కాలేజిలో చేరి తిలక్ ,అగార్కర్ వామన్ శివరాం ఆప్టే వంటి ఉద్దండులవద్ద ఆసక్తిగా విద్య నేర్చాడు .ఆచార్య కేల్కర్ ఆంగ్లబోధన అత్యుత్సాహంగా ఉండేది .వీరిద్దరూ జీవితాంతం సాహిత్య మిత్రులుగా గడిపారు .రైనాల్డ్స్ రాసిన అన్తఃపురరహస్యాలు లోని మొదటి రెండు అధ్యాయాలను హరి అనువదించాడు .దీన్ని’’మాధలీస్థితి ‘’పేరుతొ పూనా వైభవ పత్రికలో సంతోషంగా స్వీకరించి ముద్రించారు .అన్ని పత్రికాలు ఆ వ్యాసాన్ని కర్తను విపరీతంగా శ్లాఘించాయి .అప్పుడే హరి ‘’ విక్టోరియాయుగపు నవల ఆదర్శం ‘’అనే వ్యాసం కూడా పత్రికలో రాశాడు .మహారాష్ట్ర అంతా ఈ వ్యాసం తో హరిపేరు మారుమోగిపోయింది .హరి ఇది రాశాడని అతని కుటుంబం వారికి తెలీదు .పేరు వచ్చింది కానీ చదువులో వెనకపడ్డాడు .పెత్తండ్రి ఆజ్ఞపై మళ్ళీ దక్కన్ కాలేజిలో చేరి చదివి పాసయ్యాడు .యూనివర్సిటి పరీక్ష రాశాడు కానీ మళ్ళీ లెక్కల్లోనే బోల్తాపడ్డాడు .మళ్ళీ మళ్ళీ ప్రయత్నించినా గట్టేక్కలేదు విసుగొచ్చి కాలేజీ యూని వర్సిటి చదువులపై వైముఖ్యం కలిగింది .మానకుండా ఉండటానికి పెదనాన్న చాలా రకాల ప్రయత్నాలు చేసినా హరి కాలేజి మానేశాడు .
1883లో హరికి పెదతండ్రి ఇంట్లో బొంబాయి ప్లీడర్ కనిత్కర్ తో పరిచయం కలిగింది .హరికంటే 12ఏళ్ళు పెద్ద అయినా సారస్వత మిత్రులయ్యారు .తర్వాత ఆయన సబ్ జడ్జి అయి బదిలీ అయ్యాడు కానీ స్నేహం 1917వరకు సాగింది .హరి రాసిన ‘’గన్ పతి రావు ‘’నవలలో కనిత్కర్, దంపతులనే ఆదర్శంగా తీసుకొని రాశాడు .కనిత్కర్ భార్య ‘’రంగ్ రావ్ ‘’నవల రాస్తూ ,తానూ హరిలా రాయలేనని నిరుత్సాహపడితే తెలిసి రాయమని ప్రోత్సహించాడు హరి .
సాహిత్య ప్రవేశం
1886జులైలో కనిత్కర్ హరి వంటి మిత్రులతోకలిసి ‘’మనో రంజన్ ‘’పత్రిక ప్రారంభించాడు .భార్య నవల, హరి నవల రెండూ ఇందులో ధారావాహికంగా వచ్చాయి .మొదటి సంచిక చూసిన అగార్కర్ కనిత్కర్ హరిలను బాగా అభినందించాడు .మహారాష్ట్ర సాహిత్య పితామహుడు విష్ణు శాస్త్రి శివ లూణ్ కర్ జ్ఞాపకార్ధం ,ఆయన పత్రిక ‘’నిబంధమాల ‘’జ్ఞాపకార్ధం 1883లో ప్రారంభించిన ‘’నిబంధ చంద్రిక ‘’-ది ఎస్సే యిష్ట్’’ పత్రికతో హరికి సంబంధం ఉండేది .ఆతర్వాత హరిసూచన మేరకు రెండు పత్రికలను1887లో కలిపేశారు.1892వరకు ముద్రించారు .ఆప్టే ‘’జయధ్వాజ్ ,శ్రుతకీర్తి చాణాక్ష్పణాచకలన్ ,సుమతీ విజయ నాటకాలు రాశాడు .ఇవి హ్యూగో షేక్స్పియర్ నాటాకాలు ఆధారంగా రాసినవే .అహ్మద్ నగర్ లో సేవాసే లో కనిత్కర్ సబ్ జడ్జి గా ఉంటూ ,ఆరువారాలు ఆప్టే కుటుంబంతో కలిసి సాహిత్య మధనం చేశాడు .
కులకర్ణి అండ్ కో ముద్ర ణాలయం స్థాపించిన వారిలో ఆప్టే ఉన్నాడు .రిక్రియేషన్ అనే వార పత్రిక ప్రచురించాలని హరికి కోరిక ఉండేది .అగర్కర్ గారి ‘’సుదారాక్ ‘’పత్రిక ఆకొరత తీరుస్తున్దనుకొన్నాడు హరి .ఆప్టే ప్రచురణ సంస్థ స్థాపించటం పెత్తండ్రి కి ఇష్టం లేదనీ తానేమీ సహాయం చేయనని రాస్తే ,ఆత్మాభిమానమున్న హరి ఆయన సహాయం తనకు అక్కరలేదని మర్యాదగానే తెలియజేశాడు .ఆ ఇంట్లోంచి వచ్చేసి ఒక చిన్నగదిలో అద్దేకున్నాడు హరి .24వయసులో ‘’కరమణూక్’’వారపత్రిక స్థాపించాడు హరినారాయణ ఆప్టే .జీర్ణ దశలో ఉన్న సంఘం బాగుపడాలని ఆయన తపన .ప్రధమ సంచిక విజయదశమినాడు 31-10-1890న విడుదల చేశాడు .ప్రతిశనివారం ప్రచురించేవాడు .మొదటిపేజీలో ఒక సంస్కృత శ్లోకం ఉండేది –దీని అర్ధం ‘’ఇతరుల వ్యవహారాలలో తర్కబద్ధంగా వాదించినా శుష్క వాక్కులు పలికినా ,మేము మాత్రం మధురమైన మాటలనే ఉపయోగిస్తాము .’’
ఆప్టే నవల ‘’పణ్ లక్ష్యాత్ కోణ్ ఘేతే’’ ధారావాహికంగా ఈ వారపత్రికలో ప్రచురితమైంది .మొదటి సంచిక నుంచి అన్ని సంచికలలోనూ ప్రముఖకవి కేశవ్ సుత రాసిన పద్యాలు ప్రచురి౦ప బడినాయి .కేల్కర్ ,రామాబాయ్ రెనడే వంటి గొప్పవారి అభినందనలుపొందింది ఈ వారపత్రిక .ఆ తర్వాత 12 సంవత్సరాలలో ఆప్టే రాసిన ‘’మీ ‘’,భయంకర్ దివ్య ,,జగ్ హో ఆనే ఆహా ‘’,మహాశూర్ చా వాఘ్ –అంటే టిప్పు సుల్తాన్ ,రూప నగర్ ,చీరాజ్ కన్యా ,కేవల్ స్వరాజ్యా సాథీ’’నవలలు ధారావాహికలుగా ప్రచురిచితాలు .మిగిన అన్ని రకాల నవలలు నాటకాలు కూడా 1917వరకు నాన్ స్టాప్ గా చోటు చేసుకొన్నాయి .ఎందఱో మహిళలు తమ రచనలను ఈపత్రికలో చూసి ఆనదించారు .సంవత్సర సంచికలు అత్యద్భుతంగా,ఆకర్షణీయంగా వెలువడేవి .
కుటుంబ పోషణకు ఉపాధ్యాయ వృత్తి చేబట్టాడు.అదీ ఆశాజనకం గా లేదు .పెత్తండ్రి కోరిక మేరకు జగదీశ్వర్ ప్రెస్ లో పని నేర్చుకోవటానికి చేరాడు .మళ్ళీ పరీక్ష తుస్ .పెత్తండ్రి ఆర్ధిక అసాయం చేస్తానని ముందుకు వచ్చినా వద్దన్నాడు హరి .హరి సాహిత్య సంపద అతని సంస్కృత జ్ఞానాన్ని వృధా కాకుండా కాపాడాలని ‘’ఆన౦దాశ్రమం ‘’స్థాపించి సాయం చేయాలని పెదతండ్రి భావించాడు .అయిదు వేలరూపాయలతో పట్టణం మధ్య స్థలం కొని ప్రింటింగ్ ప్రెస్ ,సన్యాసులకు భోజన వసతి సౌకర్యాలతో భవనం శివాలయం ఏర్పరచాలని లక్ష్యం .1888 కార్తీక శుద్ధ పాడ్యమి శాస్త్రోక్తంగా మహాదేవ్ ఆప్టే ముద్రణాలయం ప్రారంభించాడు .నిర్వహణ బాధ్యత హరికి అప్పగించాడు .నెలకు 30రూపాయల గౌరవ వేతనం .ఇలా పూనాలో ఆయన ఒక ఒక కుటుంబ యజమాని అయ్యాడు .’’గణపతి అధర్వ శీర్షం ‘’సంస్కృత ప్రచురణ ప్రారంభమైంది .దేవాలయ నిర్మాణం జరిగి స్వామి అభిషేకజలం పెత్తండ్రి సమాధి మీదుగా పోవటానికి ఏర్పాటు జరిగింది .ప్రభుత్వ అనుమతికూడా లభించింది .1890నుంచి పెత్తండ్రి ఆరోగ్యం దెబ్బతిన్నది .1894లో బాపట్ విచారణ సంఘం విషయం లో బరోడాకు తరచుగా వెళ్ళటం వలన ఆయన ఆరోగ్యం దెబ్బతింది .టైఫాయిడ్ వచ్చి కొద్దిగా కోలుకొన్నా అక్టోబర్ 22న మరణించాడు. మరణానికి ముందే సన్యాసం తీసుకొన్నాడు .హరి బొంబాయి పరిగెత్తిపెత్తండ్రి ఆఖరు శ్వాస వరకు ప్రక్కనే ఉన్నాడు.సన్యాసికి జరగాల్సిన కార్యక్రమాలన్నీ జరిపించి ,అంత్యక్రియలు పూర్తీ చేసి సమాధి నిర్మించారు .త్వరలోనే ఆనందాశ్రమం అభి వృద్ధి చెందింది .సంస్కృతానికి మహాదేవ్ చిన్ నానాజీ గొప్ప కృషి చేశాడు .
సశేషం
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -4-3-22-ఉయ్యూరు