మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు -111
111-షిర్డీ సాయిబాబా మహాత్మ్యం ,ప్రాణం ఖరీదు ,ఆడపడుచు ఆదర్శకుటుంబం దర్శక ఫేం కోట ను పరిచయం చేసిన –కే వాసు
కొల్లి వాసు అసలుపేరు కొల్లి శ్రీనివాసరావు .ప్రత్యగాత్మ కుమారుడు .1-7-1951న హైదరాబాద్ లో ని ఖైరతాబాద్ లో జన్మించాడు .తల్లి సత్యవతి తలిదంద్రులిద్దరు కమ్యూనిస్ట్ వాదులే .చిన్నతనం నుంచి సినిమా పిచ్చి లో పడి,చదువు పదవ తరగతి తో ఆపేశాడు .బాబాయ్ డైరెక్టర్ హేమాంబరధరరావు తన దగ్గర అసిస్టెంట్ గా పెట్టుకొన్నాడు . ఆడపడుచు లో నటిస్తున్న ఎన్టి.రామారావు తో బాగా పరిచయమేర్పడి సినిమా మెలకువలన్నీ గ్రహించాడు .డైరెక్టర్ కావాలన్న తపనతో ఎన్నెన్నో సినిమాలు నిశితంగా చూసి అర్ధం చేసుకొన్నాడు .మద్రాస్ ఫిలిం క్లబ్ మెంబర్ గా చేరాడు .
తమ్ముడు హేమాంబరధరరావు దగ్గర అసిస్టెంట్ గా ఉన్న కొడుకు వాసును తండ్రి ప్రత్యగాత్మ తాను డైరెక్ట్ చేస్తున్న ‘’ఆదర్శకుటుంబం ‘’సినిమాకు అసోసియేట్ డైరెక్టర్ చేశాడు .ఆయనదగ్గరే మనసు మాంగల్యం ,పల్లెటూరి బావ సినిమాలకు పని చేశాడు విజయచందర్ చంద్రమోహన్ నటించిన షిర్డీ సాయిబాబా మహాత్మ్యం కు దర్శకత్వ బాధ్యతలు వహించి సర్వాంగ సుందరం గా ,సకల జన మనో రంజకంగా తీర్చి దిద్దాడు .ఆత్రేయ స్క్రిప్ట్ ,ఇలయ రాజాసంగీతం ఆ సినిమాను క్లాసిక్ స్థాయి చేకూర్చింది .అందరూ అత్యద్భుతంగా నటించి మెప్పించారు
దర్శకత్వం వహించిన సినిమా –షిర్డీ సాయి మహామ్యం
ఇంట్లో శ్రీమతి వీధిలో కుమారి
ప్రేమ చిత్రం పెళ్లి విచిత్రం
రేపటి రౌడి
జోకర్ మామా సూపర్ అల్లుడు
ఆడపిల్ల
దామిట్ కధ అడ్డం తిరిగింది
అమెరికా అల్లుడు
బాబులు గాడి దెబ్బ
అల్లుళ్ళు వస్తున్నారు
కలహాలకాపురం
గువ్వలజంట
పక్కింటి అమ్మాయి
తోడుదొంగలు
దేవుడు మామయ్య
కోతలరాయుడు
ప్రాణం ఖరీదు
స్క్రీన్ ప్లే –అమెరికాల్లుడు
అసోసియేట్ గా చేసిన సినిమాలు :
ఆడపడుచు ,
ఆదర్శ కుటుంబం ,
మాంగల్య బలము ,
పల్లెటూరి బావ .
గుణ చిత్ర నటుడు కోట శ్రీనివాసరావు ను ప్రాణం ఖరీదు సినిమాలో వాసు మొదటి సారిగా నటించే అవకాశం కల్పించాడు .ఈ సినిమాఅత్యద్భుతంగా ఉంటుంది జాలదిపాతలు హైలైట్ .జయ సుధా ,చంద్రమోహన్ ,సత్యనారాయణ ,రావు గోపాలరావు నూతనప్రసాద్ ల నటనకు హాట్సాఫ్ .చిరంజీవి నటుడుగా స్థిరపడిన సినిమా .
సశేషం
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -5-3-22-ఉయ్యూరు