



మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు -112
112-హిందీ తమిళ రామదాసు నిర్మాత ,మళ్ళీ పెళ్లి ఫేం ,సుబ్బులక్ష్మిని నారద పాత్రద్వారా పరిచయం చేసిన బహుభాషా చిత్ర నట దర్శకుడు -వై.వి.రాప్
యర్రగుదిపాటి వరదరావు అంటే ఎవరికీ తెలీదుకానీ వివి రావు అంటే అందరికీ తెలుసు . యెర్రగుడిపాటి వరదరావు (వై.వి.రావు) (మే 30, 1903 – ఫిబ్రవరి 14, 1973)[1] తెలుగు సినిమా దర్శకుడు, నిర్మాత, నటుడు.[2]
జీవిత విశేషాలు
వై.వి.రావు 1903 మే 30న నెల్లూరులో జన్మించాడు. నెల్లూరులో చదువుతూన్నప్పుడు నాటకానుభావం యరగుడిపాటి వరదారావును సినిమా రంగానికి చేర్చింది. అప్పుడు మద్రాసులో చలనచిత్ర నిర్మాణం లేదు. 1920 ప్రాంతాల్లో వేషాలు వేశారు. ఆయనది సిరిగల కుటుంబం కాబట్టి, ఆ అనుభవంతో చలనచిత్ర నిర్మాణమునకు నడుము కట్టారు. తానే హీరో, నిర్మాత, దర్శకునిగా చలనచిత్ర నిర్మాణం తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో సాంఘిక, పౌరాణిక,జానపద చిత్రాలను సహితమూ నిర్మించారు.
మద్రాసు విశ్వవిద్యాలయంలో వైద్యవిద్యను వదిలి సినిమాలలో నటించాలనే కోరికతో బొంబాయి వెళ్లాడు. బొంబాయిలో మణీలాల్ జోషీని కలిసి, మెప్పించి మూకీ చిత్రాలలో నటించే అవకాశం పొందాడు. ఈయన కొన్ని రోజులు అర్దేషిర్ ఇరానీ యొక్క రాయల్ ఆర్ట్ స్టూడియోలో కూడా పనిచేశాడు. ఆ తరువాత మద్రాసులోని జనరల్ పిక్చర్స్ లో కళాదర్శకునిగా, నటునిగా చేరాడు. ఈయన ఆర్.ఎస్.ప్రకాష్ యొక్క కొన్ని మూకీ చిత్రాలలో కూడా నటించాడు. .1939లో ఆయన నటించి, దర్శకత్వం వహిస్తూ నిర్మించిన ‘మళ్లీ పెళ్లి’ చిత్రం పెద్ద వివాదం సృష్టించింది. ‘తాసీల్దార్’ మంచి హిట్టయింది. వై.వి.రావు 1939లో తన సొంత చిత్ర నిర్మాణ సంస్థ అయిన చింతామణి పిక్చర్స్ ను స్థాపించాడు. 1950లో శ్రీవరుణ ఫిలింస్ అనే సంస్థను కూడా ప్రారంభించాడు. అప్పట్లో భారతీయ చిత్ర పరిశ్రమలో అన్ని (ఏడు) భాషల చిత్రాలలో పనిచేసిన ఘనత ఈయనకే దక్కినది. వై.వి.రావు పశ్చిమ, దక్షిణ భారతదేశములలోని చిత్రనిర్మాణ కేంద్రాలైన బొంబాయి, కొల్హాపూర్, మద్రాసు, మైసూరులలో పనిచేశాడు. తొలి కన్నడ టాకీ చలనచిత్రం, ఎం.వి.సుబ్బయ్య నాయుడు, ఆర్.నాగేంద్రరావు నటించిన సతీ సులోచన ఈయనే నిర్మించాడు.1930 మలో ‘సారంగధర’ చిత్రాన్ని తానే దర్శకుడై నిర్మించారు. అనంతరం పాండవ నిర్యాణ, పాండవ అజ్ఞాతవాసం, హరిమాయ చిత్రాలను నిర్మించారు. తనకంటూ ఓ స్థానం ఏర్పరచుకున్నారు. తర్వాత ఆయన మకామును బెంగుళూరుకు మార్చారు. బెంగుళూరులో సౌత్ ఇండియా మూవీసను ప్రారంభించి తొలిసారిగా కన్నడంలో ‘సతీసులోచన’ చిత్రాన్ని నిర్మించారు. 1934 లో ఆ చిత్రం కర్ణాటకలో విడుదలై విజయ విహారం చేసింది. 1937 లో ఆయన నిర్మించిన ‘చింతామణి’ చిత్రాన్ని త్యాగరాజ భాగవతార్ బిళ్వమంగళునిగా నిర్మించారు. అది సూపర్ హిట్టయింది. తరువాత ‘స్వర్ణలత’ చిత్రాన్ని నిర్మించారు. 1939 లో వితంతు వివాహాలు కథా ఇతివృత్తంగా, అప్పటి బ్రాహ్మణుల చాదస్త భావాలను గర్షిస్తూ ‘మళ్లీ పెళ్లి’ చిత్రాన్ని నిర్మించారు. అందులో ఆయన నాయక పాత్రధారి కాంచమాల నాయిక. బ్రాహ్మణుల సాంప్రదాయ, సదాచారాలను నిశితంగా విమర్శించడంలో ఆయన బ్రాహ్మణుల్నుంచీ విపరీతంగా తిరుగుబాట్లు నెదుర్కోవలసి వచ్చింది.
1945లో ‘శ్రీవల్లి’ చిత్రాన్ని తీస్తూ రుక్మిణి (ఈనాటి లక్ష్మి తల్లి)ని పరిచయం చేశారు. అటు తరువాత ప్రేమ ప్రేమికుల కథాగమనంగల ‘లవంగి’ చిత్రాన్ని నిర్మించడం ఈ చిత్ర సన్నివేశాల్లోలా రావూ – రుక్మిణిల ప్రేమించుకున్నారు. 1946లో వై.వి.రావు, నర్తకి నుంగంబాక్కం జానకి కుమార్తె, తమిళ సినిమా నటీమణి రుక్మిణిని వివాహం చేసుకున్నాడు. తెలుగు సినీనటి లక్ష్మి (జీన్స్ చిత్రంలో బామ్మ) ఈయన కూతురే.[3]హిందీలో, తమిళంలో, ‘రామదాసు’ చిత్రాన్ని తీశారు. తాను తానీషా, రుక్మిణి తానీషా భార్య, ఆర్థికంగా ఆ చిత్రం గిట్టుబాటు కాలేదు. తమిళంలో ఆయన నిర్మించి దర్శకత్వం వహించిన చిత్రం ‘సావిత్రి’ హిందీ మరాఠీ చిత్రాల తార శాంతా ఆప్టేను సావిత్రిగా నటింపజేశారు. ఆమె కూడా తమిళం నేర్చుకుని తన మాటల్ని తానే చెప్పింది. సావిత్రి చిత్రంలోనే సుప్రసిద్ధ కర్ణాటక సంగీత విద్వన్మణి ఎం.ఎస్. సుబ్బులక్ష్మిని రావుగారు నారద పాత్రలో తెరకు పరిచయం చేశారు[4].
చిత్ర సమాహారం
· ఒక నారి – వంద తుపాకులు (1973) నిర్మాత
· హెన్నిన బాలు కన్నెరు (1963)
· నాగార్జున (1961/I)
· శ్రీకృష్ణ గారడి (1958/I , II)
· మంజరి (1953)
· మానవతి (1952)
· లవంగి (1946) (1950)
· రామదాస్ (1948)
· తాసీల్దార్ (1944) (నటుడు, కథా రచయిత, నిర్మాత , దర్శకుడు)
· సత్యభామ (1942) (నటుడు, నిర్మాత , దర్శకుడు)
· సావిత్రి (1941 సినిమా) (1941)
· విశ్వమోహిని (1940) (నటుడు, కథా రచయిత , దర్శకుడు)
· మళ్ళీ పెళ్ళి (1939) (నటుడు, కథా రచయిత , దర్శకుడు)
· భక్త మీరా (1938)
· స్వర్ణలత (1938)
· కృష్ణ తులాభారం (1935)
· నాగానంద్ (1935/I , II)
· సతీ సులోచన (1936 సినిమా) (1936/II) (నటుడు , దర్శకుడు)
· హరి మాయ (1932)
· పాండవ అజ్ఞాతవాసం (1930)
· సారంగధర (1930)
· శ్రీ సుబ్రహ్మణ్యం (1930)
· ఎంతటి వైవిధ్యభరిత పాత్రలను సినీ రంగం లో వై.వి. రావు పోషించాడో చూస్తె పరమాశ్చర్యమేస్తుంది .ఏదో ఒక భాషలో అనుకొంటే పరవాలేదు అన్ని రకాల భాషల్లో పౌరాణిక జానపద సాంఘికాల లోనూ ఆయన అద్వితీయుడని పిస్తాడు రచన ఉంది.నటన ఉంది .మంచి పర్సనాలిటి ఉన్నది .అంతేకాదు ఒక నటి రుక్మిణి భర్త .ఒకమహానటి లక్ష్మి తండ్రి అవటం మనకు గర్వకారణం .చిరస్మరణీయుడు రావు .
·
· సశేషం
· మీ గబ్బిట దుర్గాప్రసాద్ -5-3-22-ఉయ్యూరు